
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.
ఈ దేశం బంగారు భూమి
ఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.
అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.
👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..
టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలు
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది.
దేశం | బంగారం ఉత్పత్తి (టన్నులు) | |
1 | చైనా | 378.2 |
2 | రష్యన్ ఫెడరేషన్ | 321.8 |
3 | ఆస్ట్రేలియా | 293.8 |
4 | కెనడా | 191.9 |
5 | యునైటెడ్ స్టేట్స్ | 166.7 |
6 | ఘనా | 135.1 |
7 | ఇండోనేషియా | 132.5 |
8 | పెరూ | 128.8 |
9 | మెక్సికో | 126.6 |
10 | ఉజ్బెకిస్తాన్ | 119.6 |