
హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్
న్యూఢిల్లీ: టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్‌లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్‌లు, డీగ్లోబలైజేషన్‌లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు.