breaking news
Roshni Nadar Malhotra
-
టారిఫ్లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు. -
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. మహిళల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. రూ.3.5 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.నాన్న గిఫ్ట్హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, తన తండ్రి శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటా బదిలీ కావడంతో ఆమె ర్యాంకింగ్స్లో ఎదిగారు. ఈ బదిలీతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ), హెచ్సీఎల్ కార్ప్ నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ దిగ్గజానికి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రోషిణి నాడార్ మల్హోత్రా చేతిలోకి వచ్చాయి.ఈ బదిలీతో రోష్ని నాడార్ మల్హోత్రా ఇప్పుడు వామా ఢిల్లీ 44.17 శాతం వాటా, హెచ్సీఎల్ టెక్నాలజీస్లో హెచ్సీఎల్ కార్ప్ 0.17 శాతం వాటా, వామా ఢిల్లీ 12.94 శాతం వాటా, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లో హెచ్సీఎల్ కార్ప్ 49.94 శాతం వాటాపై ఓటింగ్ హక్కులపై నియంత్రణ కలిగి ఉన్నారు.వాటాల బదిలీకి ముందు శివ్ నాడార్ కు వామా ఢిల్లీ, హెచ్ సీఎల్ కార్పొరేషన్ రెండింటిలోనూ 51 శాతం వాటా ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రాకు ఈ రెండు సంస్థల్లో 10.33 శాతం వాటా ఉండేది. 2020 జూలైలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్స్గా రోషిణి నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్ కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు.