
ప్రముఖ టెక్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్‌పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.
భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.
కాగా హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్. HCL గ్రూప్‌లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ.