సెకీతో రిలయన్స్‌ న్యూ సన్‌టెక్‌ ఒప్పందం | Reliance New Suntech Signs Deal With Seci | Sakshi
Sakshi News home page

సెకీతో రిలయన్స్‌ న్యూ సన్‌టెక్‌ ఒప్పందం

May 4 2025 9:22 PM | Updated on May 4 2025 9:24 PM

Reliance New Suntech Signs Deal With Seci

ముంబై: రిలయన్స్‌ పవర్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ న్యూ సన్‌టెక్‌ తాజాగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ)తో పాతికేళ్ల దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది.

ఒప్పందం ప్రకారం వచ్చే 24 నెలల్లో సమీకృత సోలార్‌ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం (బీఈఎస్‌ఎస్‌) ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై రూ. 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కేడబ్ల్యూహెచ్‌కి రూ. 3.53 ఫిక్సిడ్‌ రేటు చొప్పున విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement