రుబియో జామ్‌నగర్ పర్యటన.. సంకేతాలు ఏమిటి? | Marco Rubio Jamnagar Visit Rise of Corporate Diplomacy Global Geopolitics | Sakshi
Sakshi News home page

రుబియో జామ్‌నగర్ పర్యటన.. సంకేతాలు ఏమిటి?

Oct 23 2026 10:15 AM | Updated on Oct 23 2026 10:36 AM

Marco Rubio Jamnagar Visit Rise of Corporate Diplomacy Global Geopolitics

ప్రపంచ భౌగోళిక రాజకీయ (జియోపాలిటిక్స్) సమీకరణాలు వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు, ఎంఎన్‌సీ సంస్థల మధ్య సంబంధాల స్వభావం మారుతోంది. కేవలం సంప్రదాయ దౌత్యానికే పరిమితం కాకుండా ఆర్థిక ప్రయోజనాలు, వాణిజ్యం, అత్యాధునిక సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు జోరందుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఉన్నతాధికారి మార్కో రూబియో ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పర్యటించడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ పరిణామం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సరికొత్త చర్చకు తెరలేపింది.

దేశాల మధ్య సంబంధాలు బలపరిచేలా..

గతంలో ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశాలతో, కార్పొరేట్లు కేవలం వ్యాపార ప్రయోజనాలతో వేర్వేరు మార్గాల్లో పయనించేవి. కానీ, మారుతున్న ప్రపంచీకరణ, అవసరాల నేపథ్యంలో ఈ రెండింటి మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. జాతీయ, సరఫరా గొలుసుల భద్రత, సెమీకండక్టర్లు, ఇంధన భద్రత వంటి కీలక రంగాల్లో ప్రభుత్వాలు కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రిలయన్స్ వంటి సంస్థలు కేవలం వ్యాపార విస్తరణకే పరిమితం కాకుండా దేశాల మధ్య వ్యూహాత్మక వంతెనలుగా మారుతున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, స్టేట్‌క్రాఫ్ట్(ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి అవసరమయ్యే వ్యూహాలు) జోడై సాగుతున్న ఈ ప్రయాణం భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేస్తోంది.

కార్పొరేట్‌ కంపెనీలతో దౌత్య విధానమే కీలకం

ఈ కొత్త కోణంలో చూస్తే మారుతున్న వాణిజ్య విధానాలకు అనుగుణంగా దేశాలు, బహుళజాతి సంస్థలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. రక్షణ, ఇంధన పరివర్తన (ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌), అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, గ్లోబల్ మార్కెట్లలో పోటీతత్వాన్ని నిలుపుకోవడానికి ఈ వ్యూహాత్మక బంధం కీలకం కానుంది. రాబోయే రోజుల్లో ఏ దేశమైనా ఆర్థికంగా పురోగమించి అంతర్జాతీయంగా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలంటే కార్పొరేట్ శక్తులతో కూడిన దౌత్య విధానం ప్రధానంగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:  ద్రవ్యోల్బణంపై ఐఎంఎఫ్ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement