
ప్రముఖ్ ఐటీ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కాంటర్ బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యూయబుల్ గ్లోబల్ బ్రాండ్స్ 2025 నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా 100 అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. న్యూయార్క్‌లో కాంటార్ నిర్వహించిన స్పెషల్ 20వ ఎడిషన్ వేడుకలో.. టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 57.3 బిలియన్ డాలర్లకు (రూ. 4.89 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది గత ఏడాదికంటే 28 శాతం ఎక్కువని తెలుస్తోంది.
మొమెంటమ్ ఐటీఎస్ఎంఏ నిర్వహించిన స్వతంత్ర బ్రాండ్ ఆడిట్లో ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు టీసీఎస్ బ్రాండ్‌ను గుర్తించారని తేలింది. పరిశ్రమ రంగాలలో ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్‌లను కలిగి ఉన్న జాబితాలో.. TCS ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది. ఇది కంపెనీ వేగవంతమైన వృద్ధిని సూచిస్తుంది. బ్రాండ్ విలువ, ఈక్విటీలో ఈ పెరుగుదల కంపెనీ నిరంతర బ్రాండ్ నిర్మాణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.
ఈ సందర్భంగా కాంటర్ బ్రాండ్‌జెడ్ హెడ్ మార్టిన్ గెరిరియా అధిపతి మాట్లాడుతూ.. సరైన పెట్టుబడి, వ్యూహాత్మక దృష్టితో.. బ్రాండ్లు తమ యజమానులకు మంచి వృద్ధిని అందించగలవు. టీసీఎస్ ఈ ఏడాది చూపిన పనితీరు, ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా వినియోగించుకోవడం వంటికి దీని వృద్ధికి దోహదపడ్డాయి. టీసీఎస్ చేపడుతున్న కార్యక్రమాలే సంస్థ బలమైన గుర్తింపుకు కారణమైందని ఆయన అన్నారు.
ప్రపంచ టాప్ 50 బ్రాండ్లలో టీసీఎస్ ఒకటిగా చేరిన సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్‌జెడ్ ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లను గుర్తించింది. పరిశ్రమలో మాకు ఉన్న బ్రాండ్ నాయకత్వంతో పాటు.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్‌లలో TCS బ్రాండ్‌కు ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. సంస్థ వృద్ధికి దోహదపడిన నా సహోద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.