చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మ బార్బీ. అమ్మాయి బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. పుట్టింది మార్చి 19, 1959న న్యూయార్క్‌లో. అప్పట్నించి అనేక రూపాల్లో ఆకట్టుకుంటూ వస్తోంది. ఐకానిక్ ఫ్యాషన్ డాల్ కెన్ మగ బార్బి ఎక్కడ పుట్టింది? ఈ కెన్ పూర్తి పేరు ఎంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.
ఐకానిక్ ఫ్యాషన్ డాల్ కెన్ 65 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కెన్ పూర్తి పేరుకు సంబంధించిన వివరాలు ఇన్నాళ్ల తరువాత ప్రపంచానికి తెలిసాయి. ఐకానిక్ కెన్ డాల్స్ వెనుక క్రేజ్ మామూలుదికాదు. మాట్టెల్ ప్రియమైన సృష్టి ఒక కీలక మైలు రాయిని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి, కంపెనీ అతని పూర్తి పేరు కెన్నెత్ సీన్ కార్సన్ అని వెల్లడించింది. టైమ్ మ్యాగజైన్ ప్రకారం, మాట్టెల్ సహ వ్యవస్థాపకులు రూత్ ,ఎలియట్ హ్యాండ్లర్ కుమారుడు కెన్నెత్ హ్యాండ్లర్ పేరు మీద అతనికి పేరు పెట్టారు.
ఇదీ చదవండి: HR మేనేజర్‌ను ముక్కలు చేసి, గోనె సంచిలో కుక్కి ; తలకోసం గాలింపు
ఐకానిక్ కెన్ డాల్స్ వెనుక క్రేజ్
బార్బీ తోడుగా మగ బార్బీ ‘కెన్’ అరంగేట్రం చేసిన రెండేళ్లకు 1961 మార్చిలో అమ్మకాల్లోకి వచ్చింది. , "ఇదంతా డ్యాన్స్‌తో మొదలైంది. మాట్టెల్‌కు చెందిన ప్రసిద్ధ టీనేజ్ ఫ్యాషన్ మోడల్ బొమ్మ బార్బీ, ఇదొక స్పెషల్ నైట్‌గా భావించింది. ప్రియుడు కెన్‌తో కలిసి నడుస్తారని బార్బీకి తెలుసు." అంటూ ఒక ప్రకటన ద్వారా మగ బొమ్మను పరిచయం చేసింది కంపెనీ. సాటిలేని నాణ్యత గల పరిపూర్ణమైన దుస్తులతో కూడిన పూర్తి వార్డ్‌రోబ్‌తో వీరిని మీ ముందుకు తీసుకువస్తుంది మాట్టెల్. కెన్ బార్బీ పాఠశాలలో భోజనం కోసం కలుస్తారు, పార్టీలకు వెళతారు , కలిసి విశ్రాంతి తీసుకుంటారు. డేట్‌లకెళ్లడం, ప్రతి ఒక్కరినీ సరిగ్గా దుస్తులు ధరించడం ఎంత సరదాగా ఉంటుందో ఆలోచించండి. బార్బీ కెన్ ఇద్దరినీ తీసుకెళ్లండి , ప్రేమ ఎక్కడికి తీసుకెడుతుంతో చూడండి" అంటూ ప్రకటించింది. ఈ యాడ్‌లో కెన్ స్విమ్ ట్రంక్‌లలో మరియు టవల్‌తో పోజులివ్వడం విశేషం.
బొమ్మల చరిత్రలో అత్యంత ప్రసిద్ధ జంటలలో ఒకరిగా ఉన్నప్పటికీ, కెన్ బార్బీల బంధంలో ఒడిదుడుకులు లేకుండా లేవు. 2004లో, మాట్టెల్ వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ విడిపోవడం బార్బీ ప్రేమ జీవితం గురించి ఊహాగానాలకు దారితీసింది, ఆమె మనోహరమైన ఆస్ట్రేలియన్ సర్ఫర్ బొమ్మ బ్లెయిన్‌కి వెళ్లిందనే పుకార్లు వెలువడ్డాయి. అయితే, బార్బీ - కెన్ మధ్య ప్రేమ 2011లో మళ్లి పుట్టింది.
ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?
కెన్ కొత్త ప్రయాణం
కెన్ ఇప్పుడు కొత్త ప్రయాణంలో ఉన్నాడు. ఈ బొమ్మ ప్రపంచవ్యాప్తంగా 65 సాహసాలకు ఎక్స్‌పీడియా సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. సృజనాత్మకత , స్వీయ వ్యక్తీకరణకు చిహ్నంగా, కొత్త అభిరుచిని సృష్టించేలా ప్రతిభతో తన సాంస్కృతిక ప్రభావాన్నివిస్తరిస్తున్నాడని కెన్ బొమ్మ వైభవాన్ని వెల్లడించింది. బొమ్మల శ్రేణిని అధిగమించి, సరికొత్త కొలాబరేషన్స్, ఉత్తేజకరమైన సాహసాలతో కెన్ కొత్త ఎరాలోకి అడుగు పెట్టబోతున్నాడనికంపెనీ ప్రకటన పేర్కొంది.


