జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పటిష్ట పనితీరు | Zee Entertainment Q4 results: Net profit soars to Rs 188 crore | Sakshi
Sakshi News home page

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పటిష్ట పనితీరు

May 9 2025 5:46 AM | Updated on May 9 2025 7:45 AM

Zee Entertainment Q4 results: Net profit soars to Rs 188 crore

రూ.188 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.

ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్‌ను కారణాలుగా తెలిపింది. సబ్‌్రస్కిప్షన్‌ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. 
బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement