హైదరాబాద్‌లో డిజిలాజిక్‌ ప్లాంటు | digilogic systems hyderabad plant fy26 revenue rs 78 crore | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డిజిలాజిక్‌ ప్లాంటు

May 31 2026 7:40 AM | Updated on May 31 2026 7:44 AM

digilogic systems hyderabad plant fy26 revenue rs 78 crore

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెస్టింగ్, సిమ్యులేషన్స్‌ సేవలందించే హైదరాబాద్‌ సంస్థ డిజిలాజిక్‌ సిస్టమ్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో రూ. 78.27 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ. 10.43 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 72.19 కోట్లు కాగా, లాభం సుమారు 7.79 కోట్లుగా నమోదైంది.

జనవరిలో బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో లిస్టయిన డిజిలాజిక్‌.. సుమారు రూ. 70 కోట్లు సమీకరించింది. హైదరాబాద్‌లోని టీజీఐఐసీ హార్డ్‌వేర్‌ పార్క్‌ ఫేజ్‌ 2లో ఈఎంఎస్‌ తయారీ, ఈఎస్‌ఎస్‌ స్క్రీనింగ్‌ మొదలైన వాటికి సంబంధించి రూ. 52 కోట్లతో ప్రాజెక్ట్‌ ఉడాన్‌ పేరిట ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇది 2027 మే నాటికి అందుబాటులోకి రానుంది.

అలాగే, డిఫెన్స్, ఏరోస్పేస్‌ సంబంధ కార్యకలాపాల విస్తరణ కోసం అభేద్య సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ. 31 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఉండగా, రూ. 110 కోట్ల టెండర్లకు కోట్‌ చేసినట్లు కంపెనీ సీఈవో శశాంక్‌ వర్మ జెట్టి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement