రియల్‌ టు రీల్‌.. 'ఎవరీ విఠాబాయి'? | Who Was Vithabai Narayangaonkar? The Untold Story Of Maharashtra's Legendary Folk Artist In Telugu | Sakshi
Sakshi News home page

రియల్‌ టు రీల్‌.. 'ఎవరీ విఠాబాయి'?

Jun 26 2026 9:02 AM | Updated on Jun 26 2026 9:42 AM

The Life Story Of Vithabai Narayan Gaonkar Solapur Maharashtra

రియల్‌ టు రీల్‌

తమాషా సామ్రాజ్ఞి

సినిమా నటులు ఎన్నో పాత్రలు పోషిస్తుంటారు. అయితే నిజజీవిత పాత్రలు పోషించడం అనేది వారికి నిజంగానే సవాలు. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్‌ అందాల నటి శ్రద్ధా కపూర్‌కు ఎదురైంది. ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్‌ డ్రామా ఫిల్మ్‌లో విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ పాత్రను శ్రద్ధా కపూర్‌ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ రిలీజ్‌ అయిన నేపథ్యంలో...

‘ఎవరీ విఠాబాయి?’ అనే ఆసక్తి మొదలైంది. విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌లో జన్మించిన ప్రసిద్ధ జానపద కళాకారిణి. చిన్న వయసులోనే నాటకరంగంలోకి వచ్చింది. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో ప్రేక్షకులను అలరించింది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలిచింది.

ఉత్సాహానికి, పట్టుదలకు మారుపేరు అయిన విఠాబాయి ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న రోజుల్లో కూడా వేదికపై ప్రదర్శన ఇచ్చింది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా ప్రసిద్ధురాలైన విఠాబాయిపై సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement