ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్‌ అడ్వెంచర్‌! | San Duong Cave Is The Largest In The World And Facts | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్‌ అడ్వెంచర్‌!

Aug 10 2026 11:10 AM | Updated on Aug 10 2026 11:13 AM

San Duong Cave Is The Largest In The World And Facts

సాన్‌ డూంగ్‌ కేవ్‌

ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్‌ డూంగ్‌ కేవ్‌లోకి ఎంటర్‌ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్‌ నా కే బ్యాంగ్‌ నేషనల్‌ పార్క్‌లో సాన్‌ డూంగ్‌ కేవ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్‌ కేవ్‌గా ప్రసిద్ధి పొందింది.

ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్‌ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయి. నేచర్‌ తన కళతో క్రియేట్‌ చేసిన మాస్టర్‌ పీస్‌ అని చెప్పడం అతిశయం కాదు.

ఎందుకు స్పెషల్‌ ?
సాన్‌ డూంగ్‌ గుహను 1991 లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు  పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్‌ అయ్యే వాతావరణం, అండర్‌గ్రౌండ్‌ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.

హైదరాబాద్‌ నుండి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్‌ లేదా హో చి మిన్‌ సిటీ కి కనెక్టింగ్‌ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌లో డాంగ్‌ హోయ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. డాంగ్‌ హోయ్‌ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్‌ నా విలేజ్‌కి ట్యాక్సీ లేదా షటిల్‌ బస్‌లో చేరుకోవచ్చు. సాన్‌ డూంగ్‌ కేవ్‌కి గవర్నమెంట్‌ అప్రూవ్డ్‌ గైడ్‌ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ తప్పనిసరి.

బడ్జెట్‌ ఎంత అవుతుంది? 
అఫిషియల్‌ సాన్‌ డూంగ్‌ ఎక్స్‌పిడిషన్‌ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్‌ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్‌ని సాన్‌ డూంగ్‌ ఎక్స్‌పిడిషన్‌ లేకుండా ఫోంగ్‌ నా రీజియన్‌  వరకు ΄్లాన్‌ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్‌లో కంఫర్టబుల్‌గా పూర్తి చేయవచ్చు.

ఏం తినాలి?
వియత్నాం ఫుడ్‌ లవర్స్‌కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్‌ సూప్, బాన్‌ మీ శాండ్విచ్, ఫ్రెష్‌ స్ప్రింగ్‌ రోల్స్, కామ్‌ టామ్‌ చాలా ఫేమస్‌. శాఖాహారుల కోసం వెజ్‌ ఆప్షన్స్‌ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్‌ కాఫీని మాత్రం మిస్‌ అవ్వకండి.

దగ్గర్లో చూడాల్సినవి
సాన్‌ డూంగ్‌ కేవ్‌తో పాటు ఫోంగ్‌ నా కేవ్, ప్యారడైజ్‌ కేవ్, డార్క్‌ కేవ్, మూక్‌ స్ప్రింగ్‌ ఎకో ట్రెయిల్, బొటానిక్‌ గార్డెన్‌ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్‌ బ్యూటీ కనిపిస్తుంది.

సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్‌ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్‌ డూంగ్‌ కేవ్‌ని లైఫ్‌లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్‌ ΄్లాన్‌ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement