
న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్ ఫార్మసీ చెయిన్ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.
అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును రూపే, మాస్టర్‌కార్డ్ ప్లాట్‌ఫామ్స్‌పై తీసుకొచ్చారు. ఈ కార్డ్ ద్వారా ఎంపిక చేసిన హెల్త్, వెల్‌నెస్ ఉత్పత్తుల కొనుగోలుపై 25 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. అలాగే అపోలో 24|7 యాప్, రిటైల్ స్టోర్లలో కొనుగోలుపై రివార్డ్స్ పాయింట్స్‌గా 10 శాతం, హెల్త్ క్రెడిట్స్ రూపంలో 15 శాతం వరకూ తిరిగి పొందవచ్చు. అలాగే వెల్‌కమ్ గిఫ్ట్ కింద రూ.1,500 విలువ చేసే ఇ–గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.
అపోలో 24|7 యాప్, ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్‌లలో డిజిటల్‌గా ఈ అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేసిన అపోలో ఫార్మసీ స్టోర్లలో వ్యక్తిగతంగానూ వీటిని తీసుకోవచ్చు. ఈ కార్డ్ వార్షిక ఫీజు రూ.1499. దీనికి ట్యాక్స్‌లు అదనం.సంవత్సరానికి రూ.3 లక్షలకు మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు పొందవచ్చు.