
భారతీయ వ్యాపార రంగంలో పర్యావరణ అనుకూల మార్పులు తీసుకురావడానికి రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ReSL) ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ‘ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్’ (ISS) పేరుతో ప్రారంభించిన ఈ వేదిక, నెట్ జీరో, ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, పాలన), సర్క్యులర్ ఎకానమీ వంటి లక్ష్యాలను చేరుకోవడానికి భారతీయ పరిశ్రమలకు అన్ని విధాలా సహాయం చేస్తుంది.
పర్యావరణ, సుస్థిరత్వ పరిష్కారాల సంస్థగా ఉన్న రీ సస్టైనబిలిటీ, వ్యాపారాలు తమ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి విధానాలలో సుస్థిరత్వాన్ని పూర్తిగా కలిపేలా ఈ వేదికను రూపొందించింది. గతంలో సమర్థవంతమైన సుస్థిరత్వ అమలుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను ఐఎస్ఎస్ సమర్థవంతంగా పరిష్కరిస్తుంది.
ఇకపై వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు సంస్థలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా, వ్యాపారాలు తమ సుస్థిరత్వ ప్రణాళికను అమలు చేయడానికి ఒకే నమ్మకమైన భాగస్వామిపై ఆధారపడవచ్చు. ఈ వేదిక ద్వారా ప్రాథమిక వ్యూహ రచన, చట్టపరమైన సమస్యల పరిష్కారం నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల పునరుద్ధరణ, కార్యకలాపాల నిర్వహణ, ఈఎస్‌జీ నివేదికల తయారీ వరకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. 11 దేశాలలో 99 కంటే ఎక్కువ కార్యాలయాలు, దేశంలోని అతిపెద్ద పర్యావరణ నిపుణుల బృందం ISSకు సహకారం అందిస్తున్నాయి.
అందించే ముఖ్యమైన సేవలు..
* సుస్థిరత్వం, ఈఎస్‌జీకి సంబంధించిన సలహాలు, అనుమతులు
* పర్యావరణపరమైన అంశాల పూర్తి స్థాయి పరిశీలన, పరిష్కార సేవలు
* పర్యావరణ మౌలిక సదుపాయాల ఏర్పాటు పరిష్కారాలు
* కార్యకలాపాలు, నిర్వహణలో సహాయం
* కర్బన ఉద్గారాల తగ్గింపు
* వనరుల పునరుద్ధరణ, సర్క్యులర్ ఎకానమీ పరిష్కారాలు
* సుస్థిరత్వ నివేదికల తయారీ
* అందుబాటులో డిజిటల్, విశ్లేషణ సాధనాలు
* పర్యావరణ అనుకూల పెట్టుబడులు, అమలు నమూనాలు
ఈ సందర్భంగా రీ సస్టైనబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ మసూద్ మాలిక్ మాట్లాడుతూ... అనేక కంపెనీలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత కార్యక్రమాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ISS అనే ఈ కొత్త వేదిక వారికి ఒకే చోట సమగ్రమైన సలహా, అమలు, పర్యవేక్షణ సేవలను అందిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా కంపెనీలు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చనన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ.. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.