
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ మెట్‌లైఫ్ తాజాగా హైదరాబాద్, పుణెలో టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసింది. ఇవి సొల్యూషన్స్ డెలివరీని మెరుగుపర్చడంతో పాటు సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ మేగ్రైషన్, ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణ మొదలైన అంశాల్లో తోడ్పాటు అందిస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ రెండింటితో పాటు నోయిడా, జైపూర్‌లో ఇప్పటికే ఉన్న హబ్‌లతో కలిపి భారత్‌లో తమ కార్యకలాపాల విభాగాన్ని మెట్‌లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (ఎంజీసీసీ)గా వ్యవహరించనున్నట్లు వివరించింది. కంపెనీ వృద్ధికి దోహదపడటంతో ఉద్యోగులకు అవకాశాలను మెరుగుపరచే సాంకేతికత ఆధారిత సర్వీసులు, పరిష్కారాలపై తమ దృష్టి నిరంతరం ఉంటుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఆశిష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.