ఎల్‌ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్‌ నుంచే.. | LIC Launches WhatsApp Premium Payment Facility | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్‌ నుంచే..

May 10 2025 7:55 AM | Updated on May 10 2025 8:41 AM

LIC Launches WhatsApp Premium Payment Facility

ప్రభుత్వ రంగ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు మరింత సులభతరంగా మారాయి. పాలసీల ప్రీమియంను వాట్సాప్‌ నుంచే సులభంగా చెల్లించే సదుపాయాన్ని ఎల్‌ఐసీ ప్రారంభింంది. ఎల్‌ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న పాలసీదారులు.. 8976862090 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా తమ పాలసీలకు సంబంధిం చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుసుకోవచ్చు.

అక్కడి నుంచే నేరుగా యూపీఐ/నెట్‌బ్యాంకింగ్‌/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయొచ్చని ఎల్‌ఐసీ ప్రకటించింది. రశీదును సైతం పొందొచ్చని పేర్కొంది. కొత్త సదుపాయం ద్వారా పాలసీదారులు ఉన్న చోట నుంచే చెల్లింపులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి తెలిపారు. ఎల్‌ఐసీ పోర్టల్‌పై ఇప్పటి వరకు 2.2 కోట్ల మంది పాలసీదారులు రిజిస్టర్‌ చేసుకుని ఉండగా, వీరందరికీ నూతన సేవ సౌకర్యాన్ని ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement