బెర్క్‌షైర్‌ హాత్‌వేను వీడనున్న వారెన్‌ బఫెట్‌: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే? | Warren Buffett To Retire From Berkshire Hathaway | Sakshi
Sakshi News home page

బెర్క్‌షైర్‌ హాత్‌వేను వీడనున్న వారెన్‌ బఫెట్‌: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?

May 4 2025 3:15 PM | Updated on May 4 2025 4:29 PM

Warren Buffett To Retire From Berkshire Hathaway

శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్‌ బఫెట్‌' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్‌ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.

బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా గ్రెగ్ అబెల్‌ పేరును ప్రస్తావించగానే.. గ్రెగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. గ్రెగ్‌ను సీఈఓగా నియమించాలనే నిర్ణయం తన కుటుంసభ్యులకు తప్ప, గ్రెగ్‌కు కూడా తెలియవని బఫెట్‌ పేర్కొన్నారు.

కంపెనీని నడిపించడానికి.. రెండు దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న గ్రెగ్ అబెల్‌ సరైన వ్యక్తి అని కొందరు భావించినప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బఫెట్ సమాధానమిస్తూ.. గ్రెగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నా సంపద మొత్తానికి కంపెనీలో పెట్టుబడిగా పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. నా సారథ్యంలో కంటే.. గ్రెగ్ సారథ్యంలో కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన బఫెట్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మంచంలో సగం అద్దెకు: కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్న మహిళ

ఎవరీ గ్రెగ్ అబెల్?
62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. రెండు దశాబ్దాలకు పైగా బెర్క్‌షైర్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన అబెల్ చిన్నప్పుడు బాటిల్స్ సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో ఉన్నతమైన విలువలను పొందారు. 1984లో ఆల్బెర్టా యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివారు. బెర్క్‌షైర్ హాత్వేలో చేరిన తరువాత దినదినాభివృద్ధి చెందిన.. కీలకమైన పదవులను అలంకరించారు. ఇప్పుడు ఈయనను సీఈఓ పదవి వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement