
భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.
విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో ఉన్న ఈ కొత్త డీలర్‌షిప్ 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల కెపాసిటీ ఉన్న ఈ షోరూమ్‌లో.. ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్‌సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్‌ఎంఎం) వాహనాలన్నీ లభిస్తాయి.
ఈ కొత్త డీలర్‌షిప్ ద్వారా కేవలం సేల్స్ మాత్రమే కాకుండా.. సర్వీస్, వాహనాలకు అవసరమైన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. టెక్నాలజీని ప్రతిబింబించేలా.. ఆకర్షణీయమైన డిజైన్ పొందిన ఈ షోరూమ్ 61 కొత్త సర్వీస్ బేలు కలిగి ఉంది. ఇవి ఏడాదికి 28000 మందికి సేవలను అందించగలవు.
అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్ ప్రారంభంతో.. ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్‌పాయింట్‌లను నిర్వహిస్తోంది.
FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది.