
నెల మొత్తం పనిచేసినా జీతాలు సరిగ్గా ఇవ్వని సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే నెలకు కేవలం వారం రోజులు మాత్రమే పనిచేస్తూ.. ఓ వ్యక్తి ఏడాదికి 66 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నేను సంవత్సరానికి రూ. 66 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఉద్యోగం విషయంలో చాలా ఖచ్చితంగా, సమర్థవంతంగా ఉంటాను. అయితే నెలకు వారం రోజులు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన సమయం మొత్తం టీవీ షోలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వంటివి చూడటం వంటివి చూస్తానని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నాడు.

నేను ఉద్యోగంలో చేరినప్పుడు చాలా వెనుకబడి ఉండేవాడిని. ఆ తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. పనిచేయడం వేగంగా నేర్చుకున్నాను. నేను నిమిషానికి 75 పదాలు టైప్ చేయగలిగాను. ఎటువంటి తప్పులు లేకుండా పనిచేయగలిగాను. నా పనికి సంబంధించి ఎవరూ కంప్లైంట్స్ చేయలేదు. నేను మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయిగా నిలిచాను. క్లయింట్‌లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనిని నేనే పూర్తి చేస్తాను. అయితే వారం రోజులు మాత్రమే పనిచేస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేసాడు.
నేను కూడా ఒకప్పుడు చాలా చదివేవాడిని. ఒక సంవత్సరంలో 200 పుస్తకాలు చదివాను. నాకు ఇష్టమైన ప్రతి అంశంపై లోతుగా పరిశోధన చేసాను. మరి ఇప్పుడు.. నాకు బోర్ కొడుతోంది. ప్రతిదీ సరిగ్గా చేయడం మంచిదని నేను అనుకున్నాను. తక్కువ పనిలోనే ఎక్కువ సాధిస్తున్నాను. అయితే ఏదో ఒక విధంగా నేను కష్టపడుతున్నప్పుడు కంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉన్నాను. ఇది సరైనది కాదని చెప్పాడు.
ఇదీ చదవండి: రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. ఇంకొందరు పనిలో తీరిక లేకుండా పోతోందని నిరాశను వ్యక్తం చేశారు.