
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ (ఋతుస్రావ సెలవు) Policy-2025ను ఆమోదించింది. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వస్త్ర పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలు, ఐటీ సంస్థలు మరియు ఇతర ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే శ్రామిక మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రుతు సెలవును పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది శ్రామిక మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్‌కె పాటిల్ తెలిపారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన నేపథ్యంలో తాము కూడా దీనిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. దీనిపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం అనధికారిక రంగంలో సవాలే అయినప్పటికీ, విస్తృత ఆరోగ్య సాధికారతకు కీలకమైన పునాది వేస్తుందనీ, మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుంది, రాష్ట్ర సమగ్ర వృద్ధిని ప్రోత్సహిందంటూ సంతోషం వ్యక్తం చేశారు మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే.మహిళల నిజమైన ఆరోగ్య అవసరాలను గుర్తించడంలో ప్రశంసనీయమైన అడుగు అని కొనియాడారు.
Our Government stands committed to dignity and wellbeing at work.
Through the Menstrual Leave Policy 2025, women employees across Karnataka will now receive one paid leave day every month - a step towards a more humane, understanding, and inclusive workplace.#MenstrualLeave… pic.twitter.com/HmxCHutJv0— Siddaramaiah (@siddaramaiah) October 9, 2025
తాజా నిర్ణయంతో పీరియడ్ అమలు అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది. వేతనంతో కూడిన రుతు సెలవులను అమలు చేసిన ఇతర రాష్ట్రాలలో బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం ఉన్నాయి. విధానం ఉన్నా లేకపోయినా, ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థ దీనిని అమలు చేయవచ్చు. జీతంతో కూడిన రుతు సెలవులను ప్రకటించిన వాటిలో జొమాటో, స్విగ్గీ, లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి), బైజూస్ మరియు గోజూప్ ఉన్నాయి.
ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!