
భారీగా తగ్గిన బంతిపూల ధరలు
కిలో పది రూపాయలే
గిట్టుబాటు కాక రోడ్డుపై పడేస్తున్న రైతులు
పూల రైతుకు మిగిలింది కన్నీరే
కోలారు: బెంగళూరులోని కోలారు ప్లవర్ మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 ధర పలికిన బంతిపూల ధరలు మళ్లీ పాతాళానికి దిగజారాయి. దీంతో గిట్టుబా టుకాక రైతులు తాము పండించిన బంతి పూలను రోడ్డుపై పారబోసి వెళుతున్నారు.
శ్రావణ మాసంలో వరుసగా పండుగలు రావడంతో పూల ధరలు ఆశాజనకంగా ఉండే వి. అనంతరం ఆశ్వీయుజ మాసంలో దనరా పండుగ కారణంగా బంతిపూలకు మంచి ధరలే లభించాయి. అయితే దసరా అనంతరం డిమాండ్ బాగా తగ్గింది. కిలో బంతిపూలు రూ.10, చేమంతులు కిలో రూ.40, గులాబీలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. మంగ ళవారం మార్కెట్కు తీసుకు వచ్చిన పూలకు సరైన ధరలు లభించక రైతులు వాటిని బంగారుపేట-కోలారు రోడ్డు పక్కనే పారబోసి వెళ్లారు.
పూలు విడిపించడానికి, మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా మిగ లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు పూల కోతకోయకుండా పాలంలో అలాగే వదిలేస్తున్నారు. కాగా అక్టోబర్ నెలలో పెద్ద ప్రమాణంలో బంతి పూల కోతకు రావడంతో డిమాండ్ తగ్గి ధరలు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.