
కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపైనా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హెల్త్‌కో తాజాగా బీమా సర్వీసుల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించేందుకు అనుబంధ సంస్థ అపోలో 24/7 ఇన్సూరెన్స్ సరీ్వసెస్‌కు అనుమతులు రావడంతో వచ్చే రెండు నెలల్లో తమ ప్లాట్‌ఫాం ద్వారా ఆరోగ్య, జీవిత, జనరల్ బీమా పథకాలను విక్రయించనున్నట్లు పేర్కొంది.
ఇందుకోసం ఇప్పటికే ఎనిమిది బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో నాలుగింటితో సంప్రదింపులు జరుగుతున్నాయని అపోలో హెల్త్‌కో సంస్థ సీఈవో మధివణన్ బాలకృష్ణన్ తెలిపారు. తొలి ఏడాది రూ. 80–100 కోట్ల ప్రీమియంను అంచనా వేస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ఒక దిగ్గజ సంస్థతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించుకునేలా ప్రోత్సహించే క్రమంలో అలి్టమేట్ హెల్త్ చాలెంజ్‌ను ప్రవేశపెట్టినట్లు బాలకృష్ణన్ చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్లు తేలితే వైద్యపరీక్షల ఫీజులను పూర్తిగా వాపసు పొందవచ్చని వివరించారు.