
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో సుమారు 1.2 శాతం వాటా విక్రయించినట్లు సింగ్‌టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ సింగపూర్ డాలర్లని (దాదాపు 1.5 బిలియన్ డాలర్లు/రూ.13 వేల కోట్లు) పేర్కొంది. అసెట్ పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకోవడం, వాటాదారులకు మరింత మెరుగైన రాబడులు అందించడం కోసం ఈ లావాదేవీ చేపట్టినట్లు వివరించింది.
డీల్ అనంతరం ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ వాటా 28.3 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కి ప్రస్తుత షేర్‌హోల్డర్లు, కొత్త ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన
లభించిందని సింగ్‌టెల్ తెలిపింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ వ్యూహాత్మక ఇన్వెస్టరుగా కొనసాగుతోంది. బీఎస్‌ఈలో భారతి ఎయిర్‌టెల్ షేరు 2.8% క్షీణించి రూ. 1,814 వద్ద క్లోజయ్యింది.