ఎపిటోరియా ఫార్మా ‘ఆరో అస్త్ర’ కోర్సు ప్రారంభం | Apitoria Pharma Pvt Ltd Launches Auro Astra | Sakshi
Sakshi News home page

ఎపిటోరియా ఫార్మా ‘ఆరో అస్త్ర’ కోర్సు ప్రారంభం

May 17 2025 2:39 PM | Updated on May 17 2025 2:54 PM

Apitoria Pharma Pvt Ltd Launches Auro Astra

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తమ అనుబంధ సంస్థ ఎపిటోరియా ద్వారా ‘ఆరో అస్త్ర – పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేషన్ ఇన్‌ లీడర్‌షిప్ (సీఎల్‌పీ)’ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీతో (ఐఎంటీహెచ్‌) జట్టు కట్టింది.

ఈ కోర్సు ఆరు నెలల పాటు ఉంటుంది. ఆరు మాడ్యుల్స్‌ కింద 13 రోజుల పాటు క్లాస్‌రూమ్‌ సెషన్లు ఉంటాయి. స్వీయ, బృంద, వ్యాపార అభివృద్ధికి సహాయపడుతూ, వృత్తి నిపుణులను నాయకులుగా తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి పెట్టే విధంగా ఈ కోర్సు ఉంటుందని అరబిందో ఫార్మా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూఎన్‌బీ రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement