
4% వాటా అమ్మిన యాంట్ గ్రూప్
ఫిన్‌టెక్ చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ తాజాగా దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 4 శాతం వాటా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండ్ కంపెనీలో వాటాను షేరుకి రూ. 823–826 ధరల శ్రేణిలో దాదాపు రూ. 2,104 కోట్లకు అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.55 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది.
ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
బీఎస్‌ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం గోల్డ్‌మన్ శాక్స్(సింగపూర్) 37.35 లక్షల షేర్లు(0.59% వాటా) కొనుగోలు చేసింది. షేరుకి రూ. 823 సగటు ధరలో ఇందుకు రూ. 307.4 కోట్లు వెచ్చించింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీల తదుపరి పేటీఎమ్‌లో యాంట్ గ్రూప్ వాటా 9.85% నుంచి 5.85%కి తగ్గింది. బల్క్ డీల్స్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు నిన్న బీఎస్‌ఈలో 1.1 శాతం నష్టంతో రూ. 857 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 864–823 మధ్య కదలాడింది.