న్యూఢిల్లీ: అమెరికన్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ గ్రోక్‌తో దేశీ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీల ప్రాసెసింగ్, రిస్క్ అసెస్‌మెంట్, మోసాలను గుర్తించడంలాంటి అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకునేందుకు గ్రోక్‌క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. దేశీయంగా అత్యంత అధునాతనమైన, ఏఐ ఆధారిత పేమెంట్, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.


