
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్‌టెల్ తాజాగా వెల్లడించింది.
చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్‌ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్‌టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది.