
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఒకటే ఎయిర్ పోర్టుల్లోకి నో ఎంట్రీ వార్త. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశంపై నిషేధం విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక పోస్ట్ చేసింది. "ఫేక్ న్యూస్ అలర్ట్. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఆ వార్తులు ఫేక్. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు" అని పేర్కొంది.
ఎయిర్‌పోర్టులకు ముందే చేరుకోవాలి
భద్రతా తనిఖీల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని పలు విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల కారణంగా, ప్రయాణానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాాశ ఎయిర్ లైన్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్పైస్ జెట్ కూడా ఇదే విధమైన అడ్వైజరీని జారీ చేసింది.
🛑 Fake News Alert
Social media posts are claiming that entry to airports across India banned#PIBFactCheck:
❌ This claim is #FAKE
✅ Government has taken no such decision pic.twitter.com/MoaUcQqO2d— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025