Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్ | Reliance Withdraws Trademark Application For Operation Sindoor Title | Sakshi
Sakshi News home page

Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్

May 8 2025 6:36 PM | Updated on May 8 2025 7:20 PM

Reliance Withdraws Trademark Application For Operation Sindoor Title

ఆపరేషన్ సిందూర్ కోసం రిలయన్స్ కంపెనీ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసిందని వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. ''ఆపరేషన్ సిందూర్'' అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశ్యం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్ అనుమతి లేకుండా ఒక జూనియర్ వ్యక్తి అనుకోకుండా దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్.. దాని వాటాదారులందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదం అనే దుష్టత్వానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న రాజీలేని పోరాటమే ఈ ''ఆపరేషన్ సిందూర్" అని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదన

ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.

ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తులు
మే 7న ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య, 'ఆపరేషన్ సిందూర్' కోసం నాలుగు వేర్వేరు ట్రేడ్‌మార్క్ దాఖలు అయ్యాయి. ఇందులో రిలయన్స్‌ మాత్రమే కాకుండా.. ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్, ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అయితే ఇప్పుడు ట్రేడ్‌మార్క్ దాఖలు రిలయన్స్ కంపెనీ ఉపసంహరించుకుంది. మిగిలినవాళ్లు ఉంసంహరించుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement