Top Stories
ప్రధాన వార్తలు

పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.

వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు?

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

మందు బాబులకు బిగ్‌షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 పెంచింది.కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది.

ఇండియా ఇంత బలహీనమైనదా?
⇒ ప్రభుత్వం ప్రజలకు చెప్పకముందే, కాల్పుల విరమణ తనవల్లే జరిగినట్టుగా చెప్పి ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి దౌత్య అనైతికతను ఈ దేశం ఎదిరించలేదా? ⇒అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల జీవితాలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేశారు. అయినా భారత ప్రభుత్వం అమెరికాను నిలదీసింది లేదు. ⇒ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదు. అమెరికా మద్దతు లేకపోతే భారత దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది?ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్ 22న అమా యక భారతీయులను కశ్మీర్లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్ ప్రకటనలు పాక్ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయు ధాల అమ్మకపు మార్కెట్ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్ట్రంప్ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఉండ గానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆ యా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆ యా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్ దేశాలు కూడా ఇండియా–పాక్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్‌కు 2.3 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావా దేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వా మ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించ లేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్ గ్లోబల్ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడుప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్

పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీనది పుష్కరాలు ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షి ణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా)

మీ పెట్టుబడి బంగారం గాను!
ఒకవైపు ఈక్విటీలు, క్రిప్టోలు అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ నీరసించింది. ఇదే కాలంలో బంగారం సైలెంట్‌గా ర్యాలీ చేయడం చూశాం. ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అన్ని కాలాల్లోనూ అత్యుత్తమైన పెట్టుబడి సాధనం ఏదంటే..? అది బంగారమే. ఈ అర్థంలోనే దీన్ని ‘గోట్ అసెట్’గా చెబుతారు. గడిచిన రెండేళ్లలోనే కాదు.. గత రెండు దశాబ్దాల్లోనూ ఈక్విటీలకు మించి రాబడులను అందించిన పసిడిని ప్రతీ ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం మంచి నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు రిస్క్ తగ్గించుకుని, వైవిధ్యం కోసం, రాబడుల స్థిరత్వం కోసం తప్పకుండా పుత్తడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటున్నారు.భారతీయుల్లో ఎక్కువ మంది బంగారాన్ని ఆభరణంగా, విలువైన సాధనంగానే చూస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడుల పరంగానూ బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అస్థిరతల్లో సురక్షిత సాధనంగా పసిడికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది కాదు. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే సెంట్రల్ బ్యాంక్‌లు (ఆర్బీఐ, ఇతరత్రా) రిజర్వ్ అసెట్‌గా బంగారానికి ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగిపోవడం.. అంతర్జాతీయ వాణిజ్యం పరంగా రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో పసిడి మరింత బలాన్ని సంతరించుకుంది. కనుక ప్రతి ఒక్కరి పెట్టుబడులకు పుత్తడి వన్నెతెస్తుందనేది నిపుణుల మాట. రాబడుల చరిత్ర.. గత 25 ఏళ్ల కాలంలో పసిడి ఎస్అండ్పీ 500తోపాటు నిఫ్టీ–50ని మించి రాబడులను ఇచ్చినట్టు ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ చెబుతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే బంగారం డాలర్ మారకంలో 10 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ఎస్అండ్పీ 500 రాబడులు నాలుగున్నర రెట్లుగా ఉన్నాయి. రూపాయి మారకంలో చూసినా బంగారం గత 25 ఏళ్లలో 20 రెట్లు పెరగ్గా.. సెన్సెక్స్ ఇదే కాలంలో 16 రెట్లు ప్రతిఫలాన్నిచ్చింది. ఇక గత 15 ఏళ్లలో చూస్తే బంగారం ఏటా 12 శాతం రాబడులను సగటున ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ రాబడి ఏటా 10–11 శాతం మధ్య ఉందన్నది ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ విశ్లేషణ. ‘‘2000 నుంచి నిఫ్టీ కంటే బంగారమే అధిక రాబడిని ఇచ్చింది. గోల్డ్ సీఎఫ్‌డీలు (ఫ్యూచర్ కాంట్రాక్టులు) 2,000 శాతం పెరగ్గా.. నిఫ్టీ–50 సూచీ రాబడి 1470 శాతంగా ఉంది’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్‌లో వివరించారు. పెట్టుబడిలో పుత్తడికి వాటా పెట్టుబడుల్లో వైవిధ్యం దృష్ట్యా కొంత మొత్తాన్ని పసిడిలోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా సూచించారు. పసిడే కాదు, వెండి కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేస్తుందని స్టాక్స్‌కార్ట్ (డిస్కౌంట్ బ్రోకర్) సీఈవో ప్రణయ్ అగర్వాల్ అభిప్రాయం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5–8 శాతం వరకు పసిడి, వెండికి కేటాయించుకోవచ్చని సూచించారు. ‘‘బంగారం ఒక ప్రత్యామ్నాయ సాధనం. కొత్త రిజర్వ్ కరెన్సీ అని, డాలర్లను భర్తీ చేస్తుందని ఎక్కడో చదివాను. అదే జరిగితే రూ.90,000 ధరకు అర్థమే లేదు’’ అని మార్కెట్ నిపుణుడు సునీల్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రిజర్వ్ కరెన్సీగా మారితే అప్పుడు బంగారం ఇంకా పెరగొచ్చన్నది ఆయన ఉద్దేశం. ఆర్బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2024 సెప్టెంబర్ చివరికి 9.32 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేంద్ర బ్యాంక్‌లు ఇదే మాదిరి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.అన్ని కాలాల్లోనూ అత్యుత్తమం ఎందుకు? సురక్షిత సాధనం: ఆర్థిక సంక్షోభాలు, అనిశి్చతులు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇందులోకి అధిక పెట్టుబడులు రావడంతో పసిడి మరింత విలువను సంతరించుకుంటుంది. అలాంటి సంక్షోభాల్లో ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటాయి. తాజా డిమాండ్ వెనక్కి వెళుతుంది. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ: పసిడిని బీరువాలో ఉంచినా.. బ్యాంక్ లాకర్లో ఉంచినా కొంత కాలానికి దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే దీనికి స్టోర్ ఆఫ్ వ్యాల్యూ గుర్తింపు. అదే మిగిలిన పెట్టుబడులకు ద్రవ్యోల్బణం సెగ ఉంటుంది. పరిమిత సరఫరా: బంగారం ఉత్పత్తి ఏటేటా పెరిగేది కాదు. బంగారం మైనింగ్ అత్యంత సంక్లిష్టమైనది. దీని సరఫరా స్థిరంగానే ఉంటుంది. కానీ, డిమాండ్ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఈ డిమాండ్ పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది. వైవిధ్యం: పెట్టుబడులు అన్నీ ఒకే చోట ఉంటే.. ఆ విభాగంలో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడితే.. విలువకు నష్టం కలుగుతుంది. అందుకే పెట్టుబడులకు వైవిధ్యం కూడా అవసరమే. ఈ విషయంలో పుత్తడి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం. చిటికెలో రుణం: బంగారం కాయిన్లపై (బ్యాంకుల్లో కొనుగోలు చేసిన వాటికే ఇవ్వాలన్నది ఆర్బీఐ తాజా ప్రతిపాదన), ఆభరణాలపై 9–10 శాతం మేర వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి సులభంగా రుణం లభిస్తుంది. పెట్టుబడి సాధనాలు.. బంగారంలో పెట్టుబడి భౌతికం కంటే డిజిటల్‌గానే సౌకర్యంగా ఉంటుంది. డిజిటల్ సాధనాల్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఎంఎంటీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ ట్రేడ్ అవుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలే వీటిని నిర్వహిస్తుంటాయి. షేర్ల మాదిరే ఏ పనిదినంలో అయినా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం. ఇందులో పెట్టుబడి విలువపై ఫండ్ సంస్థకు ఎక్స్పెన్స్ రేషియో, కొనుగోలుపై బ్రోకర్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక గోల్డ్ ఈటీఎఫ్ ధర గ్రాము బంగారం మార్కెట్ ధరను ప్రతిఫలిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇప్పుడు చాలా సంస్థలు 0.01 గ్రాముల కింద ఆఫర్ చేస్తున్నాయి. కనుక రూ.90 నుంచి వీటిలో ఫ్రాక్షన్ యూనిట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లను నిర్వహించే సంస్థలు వాటి ఇష్యూ పరిమాణంకు అనుగుణంగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరుచుకోవడం తప్పనిసరి.గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డీమ్యాట్ ఖాతాలేకపోయినా గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలత. బ్రోకర్ల సాయం లేకుండా ఫండ్స్ సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నందున బ్రోకరేజీ చార్జీలు పడవు. కాకపోతే ఇందులోనూ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణల పరిధిలోకి వస్తాయి. కనుక పెట్టుబడులు సురక్షితం. ఉదాహరణకు ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో గత పదేళ్లలో రాబడి వార్షికంగా 12.66 శాతంగా ఉంది. నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లు గత పదేళ్లలో 8.5–9.5 శాతం మధ్య రాబడిని ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను బాధ్యత → బంగారం కాయిన్లు, బిస్కెట్లు, ఆభరణాలు తదితర భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్ల తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం అవుతుంది. దీనిపై 12.5% పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఈ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి తమ మొత్తం ఆదాయానికి వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆభరణాన్ని కొత్త ఆభరణంతో మార్చుకుంటే అప్పుడు పాత బంగారాన్ని విక్రయించినట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక పాత ఆభరణంపై వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. → డిజిటల్ గోల్డ్‌కూ భౌతిక బంగారానికి మాదిరే పన్ను రేట్లు వర్తిస్తాయని ట్యాక్స్‌మ్యాన్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా తెలిపారు → గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌కు సైతం భౌతిక బంగారం నిబంధనలే వర్తిస్తాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లను ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన స్వల్పకాల మూలధన లాభం వార్షిక ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సమీప కాలంలో ధరలు ఎలా ఉండొచ్చు..? బంగారాన్ని స్వల్పకాల దృష్టితో కొనుగోలు చేయడం సూచనీయం కాదు. తమ అవసరాలు, పెట్టుబడుల కోణంలోనే దీర్ఘకాలానికి నిర్దేశిత పరిమితులకు లోబడి కొనుగోలు చేసుకోవాలి. కానీ, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సయోధ్య, ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలకు సానుకూల త నేపథ్యంలో ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఔన్స్‌కు అంతర్జాతీయంగా 3,510 డాలర్ల వరకు వెళ్లిన బంగారం ధర 3,180 డాలర్లకు తగ్గింది.ఇప్పటికీ దీర్ఘకాలానికి బంగారం పట్ల నిపుణులు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 30–40 రోజుల్లో ఔన్స్ బంగారం ధర 3,150 డాలర్ల స్థాయికి రావొచ్చన్నది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమాని అంచనా. దేశీయంగా 10 గ్రాములకు (24 క్యారెట్లు) రూ. 90,00–91,000 వరకు దిగిరావొచ్చన్నారు. 2,900–3,000 డాలర్ల స్థాయికి సైతం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గొచ్చని, కొంత కాలం స్థిరీకరణ చెందొచ్చన్న విశ్లేషణులు వినిపిస్తన్నాయి.భౌతిక బంగారం కొందరికి డిజిటల్ బంగారంలో పెట్టుబడి నచ్చకపోవచ్చు. భౌతికంగా చూసుకోవడమే ఇష్టం. అలాంటి వారు ఆభరణాలకు బదులు బ్యాంక్‌లు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం అయితే జాగ్రత్త పరుచుకోవడం కొంత రిస్‌్కతో కూడినది. కనుక మొదటి ప్రాధాన్యం డిజిటల్ బంగారానికే ఇవ్వాలి. కాయిన్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే ఆభరణాలు అయితే జీఎస్టీకి అదనంగా తయారీ చార్జీల రూపంలో మరో 5–15 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరిగి అవే ఆభరణాలను మార్చుకోవాలనుకుంటే, వాటిని గతంలో కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన తయారీ చార్జీలు, జీఎస్టీ మేర నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు పాత ఆభరణాలను కొత్త వాటితో మారి్పడి చేసుకున్నప్పటికీ.. కొత్త ఆభరణం బరువు ప్రకారమే విలువపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చుకున్న పాత బంగారం మేర జీఎస్టీకి మినహాయింపు లేదు. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం తదితర సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, మిగిలిన డిజిటల్ బంగారం సాధనాలు మాదిరిగా ఇవి సెబీ నియంత్రణలో పనిచేయవు. పైగా వీటి కొనుగోలు, విక్రయంపై చార్జీల విషయంలో పారదర్శకత లేదు. బంగారాన్ని ఇప్పుడు ఆభరణం కంటే ఎక్కువగా చూస్తున్నారు. సురక్షితమైన లిక్విడ్ అసెట్‌గా, అత్యవసరాల్లో హెడ్జింగ్‌గా పరిగణిస్తున్నారు. – పృద్వీ రాజ్ కొథారి, రిద్ధిసిద్ధి బులియన్స్ ఎండీభారతీయ గృహిణి అత్యంత తెలివైన ఫండ్ మేనేజర్ అనడానికి కాలక్రమంలో బంగారంపై రాబడే నిదర్శనం.– ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ – సాక్షి, బిజినెస్‌డెస్క్

విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2.

ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్‌పై అప్డేట్లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది.
రైజర్స్ గాడిన పడేనా!
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నేడు స్థానిక సంస్థల ఎన్నికలు
IPL 2025: గుజరాత్ దర్జాగా...
ఐదుగురు చిన్నారులు జలసమాధి
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
చిన్నారుల ఉసురు తీసిన కారు
మరో ఘోర అపచారం గుడిలో ధ్వంస రచన
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పిల్లిలా మారిన ఓ పులి కథ ఇది!
రైజర్స్ గాడిన పడేనా!
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నేడు స్థానిక సంస్థల ఎన్నికలు
IPL 2025: గుజరాత్ దర్జాగా...
ఐదుగురు చిన్నారులు జలసమాధి
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
చిన్నారుల ఉసురు తీసిన కారు
మరో ఘోర అపచారం గుడిలో ధ్వంస రచన
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పిల్లిలా మారిన ఓ పులి కథ ఇది!
సినిమా

ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి)
న్యూస్ పాడ్‌కాస్ట్

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత
క్రీడలు

ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్

కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్

రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
బిజినెస్

హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు
ఇంటి అందాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుండే అలంకరణ వస్తువులు.. ఎప్పుడో అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు కూడా ఈ టెక్ డెకర్ ఐటమ్స్ ఉపయోగించి మీ ఇంటిని హైటెక్ హోమ్‌గా మార్చేయండి.క్యూట్ చార్జర్రంగురంగుల వెలుగులతో ప్రకాశించే ఈ ల్యాంప్, ఒట్టి లైట్ మాత్రమే కాదు, ఇదొక వైరెలెస్ చార్జర్, బ్లూటూత్ స్పీకర్, స్లీప్ ల్యాంప్, సన్‌రైజ్ అలారం.. ఇలా మరెన్నో చెప్పుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ డివైజ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు నుంచి మూడు గంటల వరకు నిర్విరామంగా మ్యూజిక్ ప్లే చేస్తుంది. అలాగే, రంగురంగుల లైట్లతో పార్టీ థీమ్ మూడ్‌లోకి కూడా తీసుకురాగలదు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉపయోగించి క్షణాల్లో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. ధర రూ. 849.ఇంటికొచ్చే చందమామఇంట్లో ఊహల లోకం కావాలనుకుంటున్నారా? అయితే, ఒక్కసారి నిద్రపోయే ముందు ఈ త్రీడీ మూన్ ల్యాంప్‌ను ఆన్ చేయండి. వెంటనే గోడలపై వెలుగుల పూలు, సీలింగ్‌పై తారల మెరుపులతో గదంతా ఒక ఫెయిరీ టేల్ సినిమా మూడ్‌లోకి మారిపోతుంది. ఏ టూల్స్ అవసరం లేకుండా ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్‌లో ఇది పనిచేస్తుంది. పిల్లలకు ఎంతో బాగా నచ్చే దీని ధర రూ. 499. ఆన్లైన్లో మరెన్నో ఇలాంటి త్రీడీ ల్యాంప్స్ ఉన్నాయి. అభిరుచిని బట్టి కొనుగోలు చేయవచ్చు.ఫొటోలు మార్చే ఫ్రేమ్స్ఇదివరకు గోడకు వేలాడదీసే ఫ్రేమ్‌లో ఏదో ఒక ఫొటో మాత్రమే ఉండేది. రకరకాల ఫొటోలను ఒకేసారి చూపిస్తుంది ‘స్మార్ట్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్’. ఫొటోను ప్రింట్ తీయటం, వాటిని ఫ్రేమ్స్‌లో అతికించడం ఇలాంటి పనులేం చేయనక్కర్లేదు. ఇది మీ ఇంట్లో ఉంటే. త్రీడీ డిస్ప్లే, కలర్ కేలిబ్రేట్తో రూపొందించిన ఈ ఫ్రేమ్, ఫొటోలను అత్యంత సహజంగా కనిపించేలా చేస్తుంది. దీనిని మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలను మార్చుకోవచ్చు. ఫ్రేమ్‌కు తగ్గట్లు ఫొటోలను ఇదే అటోమేటిక్‌గా క్రాప్ చేసి, బ్రైట్నెస్ను అడ్జస్ట్ కూడా చేస్తుంది. ధర రూ. 12,595.పైకెగసే నీటిబొట్లుపైకి విసిరిన ప్రతిదీ కింద పడాల్సిందే! కానీ, ఇక్కడ మాత్రం నీటి బొట్లు పైకి ఎగురుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చూడటానికి డెకర్ ఐటమ్లా కనిపించే ఈ ‘స్మూత్ సెయిలింగ్ యాంటీగ్రావిటీ లైట్’లో ఎన్నో అబ్బురపరచే ఫీచర్స్ ఉన్నాయి. దీనిని నైట్ లైట్, టేబుల్ క్లాక్లాగే కాదు, అంతకు మించి దీని పనితనం ఉంటుంది. ఇది ఇందులో నింపిన నీటిని ఉపయోగించి, చల్లని గాలిని అందిస్తూ ఒక మినీ కూలర్లాగా కూడా పనిచేస్తుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్, వర్క్డెస్క్లకు ఇది ఒక చక్కటి డెకర్ ఐటమ్. ధర రూ. 1,899.

24 గంటల్లో 8000 బుకింగ్స్.. ఒకేరోజు 150 కార్ల డెలివరీ
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇటీవల.. 'విండ్సర్ ప్రో' పేరుతో పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ కారు.. కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే.. బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి విండ్సర్ ప్రో డెలివరీలు చేసింది.ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లను పొందిన ఎంజీ విండ్సర్ ప్రో.. ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారుసెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఎంజీ విండ్సర్ ప్రో.. 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది.

కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్బీఐ నిర్ణయం
మొబైల్ వాడకం కోవిడ్–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది. ఇప్పటికే మైనర్లు పరిమితులతో కూడిన మొబైల్ వాలెట్స్, పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్, యూపీఐ సర్కిల్‌ను విరివిగా వాడుతున్నారు. 10 ఏళ్లకుపైబడిన మైనర్లు వారి సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను వ్యక్తిగతంగా తెరిచి, నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అనుమతించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు మరింత ఊపందుకుంటాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్–2024 (అసర్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని 14–16 ఏళ్ల వయసున్న 75 శాతంపైగా పిల్లలు డిజిటల్ హోమ్ వర్క్‌ను పూర్తి చేయడానికి స్మార్ట్ఫోన్లను విజయవంతంగా వినియోగిస్తున్నారు. విద్య, వినోద అంశాలతోపాటు, యూపీఐ పేమెంట్లకు కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఈ వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు డిజిటల్ పేమెంట్స్ రంగంలో కొత్త మార్కెట్‌కు తెరలేపింది. భవిష్యత్ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు బ్యాంకులకు మార్గం ఏర్పడింది. మైనర్లను బ్యాంకింగ్ వైపునకు తీసుకురావడానికి ఫిన్ టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.తల్లిదండ్రులు/సంరక్షకుల ద్వారా మైనర్లకు బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే మైనర్లు వ్యక్తిగతంగా ఖాతాను నిర్వహించడం వల్ల గతంలో లేని పలు అదనపు ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి. సొంత ఖాతా ఉంటే యూపీఐ చెల్లింపులు సులభం అవుతాయి. అంతేకాదు, తరచూ చిన్నపాటి కొనుగోళ్లు జరిపే 14–18 ఏళ్ల పిల్లలు ఈ మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. స్కూల్ లేదా ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి చేరేందుకు బైకులను యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం, క్యాంటీన్లో ఆహారం, స్టేషనరీ కొనుక్కోవడం.. ఇలాంటి వాటికి వీలవుతుంది. దీనివల్ల మైనర్లు చేసే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయనేది సుస్పష్టం. కాగా, యువత రుణం అందుకోవడం, పెట్టుబడుల విషయంలో డిజిటల్ వేదికలు పెను మార్పులు తెచ్చాయి. చిన్నచిన్న రుణాలకు యువ కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిన్ టెక్ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల తలుపు తడుతున్నారు.ఇప్పటికే మైనర్ల కోసం..బ్యాంకులు ఇప్పటికే.. తల్లిదండ్రులతో కలిసి సంయుక్తంగా నిర్వహించే మైనర్ ఖాతాలకు అనుసంధానించిన డెబిట్ కార్డులు, మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. అలాగే 13–18 ఏళ్ల వయసున్న వారి కోసం గూగుల్ పే వాలెట్స్ వంటి పరిమితులతో ఉపయోగించే మొబైల్ వాలెట్స్, బ్యాంక్ ఖాతా అవసరం లేని జూనియో, ఫ్యామ్‌పే, ఫైప్ తదితర పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్ కూడా మైనర్ల కోసం కొలువుదీరాయి. ప్రాథమిక యూపీఐ వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారు లావాదేవీలు నిర్వహించవచ్చు. ద్వితీయ వినియోగదారుకు స్వంత బ్యాంక్ ఖాతా లేకపోయినా.. ప్రాథమిక వినియోగదారు తరపున చెల్లింపులు చేయవచ్చు. పరిమితులు, అనుమతులను నిర్ధేశించడం ద్వారా ప్రాథమిక వినియోగదారుడు ఈ లావాదేవీలను నియంత్రించవచ్చు.ఆర్థిక అక్షరాస్యతలో..ఆర్బీఐ 2023లో చేపట్టిన సర్వేలో పెద్దవారితో పోలిస్తే 30 ఏళ్లలోపు వారిలో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉందని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే–2019 ప్రకారం 18–29 ఏళ్ల వయసువారిలో 30 శాతం మందికి మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది. 10 ఏళ్లకు పైబడ్డ మైనర్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి అనుమతించడం ఆర్థిక అక్షరాస్యత పెంచే కార్యక్రమాల్లో ఒకటిగానే చూడాలన్నది నిపుణుల భావన. సొంత ఖాతాకు, ఆర్థిక లావాదేవీలకు చిన్నతనంలోనే యాజమాన్య హక్కులు దక్కడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంతోపాటు డబ్బులు దాచుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది.

కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ దక్కాలంటే.. 5 సూత్రాలు
రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది.👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండిరైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్లో అంతరాయం కలిగితే టికెట్ బుకింగ్ ఆలస్యమై కన్ఫర్మ్ టికెట్ దక్కే అవకాశం ఉండదు.👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలితత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండిఐఆర్సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.👉 యూపీఐ పేమెంట్తత్కాల్ బుకింగ్ సమయంలో టికెట్ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.👉 రైళ్లను ఎంచుకోవడంబుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి.
ఫ్యామిలీ

సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసంవేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్‌ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్‌లా పనిచేస్తాయని జపాన్‌లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది. ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్‌ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.అలవాటుగా మార్చుకోవాలివేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్‌తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్‌షాప్‌లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది. బలపడే బంధాలువేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్‌గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు. పెరిగే సృజనాత్మకతవేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్‌తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్‌ఫుల్‌నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్‌కు కేటాయించండి. మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి. వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.ప్రతీ సీజన్లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి. ఒక కొత్త స్కిల్‌ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌కు డెడ్‌లైన్స్, గోల్స్ పెట్టుకోండి. సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్ను శక్తిమంతం చేయండి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?)

ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..)

వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!)
ఫొటోలు


తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు


అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)


పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు


చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)


ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)


బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)


చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 18-25)


Miss World 2025 : రామోజీఫిల్మ్ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)


Miss World 2025: అందాల భామల ఆటవిడుపు (ఫోటోలు)
అంతర్జాతీయం

అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

‘86 47’ సంకేతం వెనుక ఏముంది?
వాషింగ్టన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ బాస్ జేమ్స్ కొమీ సోషల్ మీడియాలో పెట్టిన ‘86 47’సంకేత పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టామని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ గురువారం వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో ఇదో భాగమని భావిస్తున్నట్లు ఆమెతోపాటు పలువురు రిపబ్లిక్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అంతకుముందు కోమీ ఇన్‌స్టా పోస్ట్‌లో ‘బీచ్‌లో నడుస్తుండగా నత్త గుల్లలు ‘86 47’ఆకారంలో కనిపించాయి’అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులోని 86ను తొలగించడం, వదిలించుకోవడం అనే అర్థమొచ్చేలా వాడుతారు. 47ను ట్రంప్‌ను సూచిస్తూ వాడిన రహస్య సంఖ్య. ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడు. మొత్తమ్మీద అధ్యక్షుడిని హత్య చేసేలా ప్రేరేపించడమే దీని వెనుక అర్థమని ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై డీహెచ్ఎస్, సీక్రెట్ సరీ్వస్ దర్యాప్తు చేపట్టి తగు రీతిలో స్పందిస్తాయని నోమ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా తన తండ్రిని చంపాలని పిలుపునిస్తూ కొమీ ఈ పోస్ట్ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ తెలిపారు. పశి్చమాసియాలో అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను చంపాలని ఉగ్రవాదులకు ఈ సంకేతం ద్వారా కొమీ ప్రేరేపించారని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జేమ్స్ బ్లయిర్ ఆరోపించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సి గబ్బార్డ్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈ పోస్ట్‌ను తీసిపారేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోస్ట్. అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి’అని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై జేమ్స్ కొమీ స్పందించారు. ‘రాజకీయ ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌పై హింసను ప్రేరేపించేలా ఉందంటూ కొందరు విపరీతార్థాలు తీస్తారని నేను ఊహించలేదు. హింసకు నేను పూర్తిగా వ్యతిరేకిని’అంటూ ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. 2013–2017 మధ్య కాలంలో జేమ్స్ కొమీ ఎఫ్‌బీఐ చీఫ్‌గా పనిచేశారు.

కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం
న్యూయార్క్: కోవిడ్–19 సృష్టించిన విలయం మర్చిపోలేనిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ తాజాగా ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదికను విడుదల చేసింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను సైతం దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవిత కాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టంచేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు... → కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం ఆరు వారాలు పడిపోయింది. → ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కొంత ప్రగతి నమోదైనప్పటికీ, సాధించాల్సింది ఇంకెంతో ఉంది. → పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. → మరోవైపు అత్యవసర వైద్య సేవలు పొందడం వేగంగా మెరుగుపడడం లేదు. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలు పొందగలుగుతున్నారు. → మాత, శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40 శాతం తగ్గాయి. → ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలను తగనన్ని నిధులు కేటాయించడం లేదు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. → ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. → ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ కారణమవుతున్నాయి. → చైల్డ్‌హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్‌కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీనివల్ల బాలలకు ముప్పు పొంచి ఉంది.

యుద్ధ ఖైదీల మార్పిడి
ఇస్తాంబుల్: సర్వత్రా ఆసక్తి రేపిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలు ఆశాజనకంగా మొదలయ్యాయి. వెయ్యి మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ ఈ మేరకు వెల్లడించారు. వాటిమధ్య దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద ఖైదీల మార్పిడి కానుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు శుక్రవారం ఇస్తాంబుల్‌లో సమావేశమై తమ తమ డిమాండ్లు వినిపించారు. 2022లో యుద్ధం మొదలయ్యాక వాటి మధ్య ఇది తొలి ముఖాముఖి కావడం విశేషం. ఉక్రెయిన్ ప్రతినిధి వర్గానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు మెడిన్స్కీ సారథ్యం వహించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ చర్చలను ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇరు పక్షాలను కోరారు. తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ముఖ్యమన్నారు. ‘‘కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాం. పుతిన్, జెలెన్స్కీ భేటీ ఏర్పాటు చేయాలన్న ఉక్రెయిన్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పాం. చర్చలను కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది’’ అని మెడిన్స్కీ వెల్లడించారు. కీలకాంశాలను పరిష్కరించుకుని, చర్చల్లో పురోగతి సాధించాలని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రష్యా ముందెన్నడూ ప్రస్తావించని డిమాండ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవాలంటే ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యాలను ఉపసంహరించాలన్నది అందులో ఉన్నట్టు చెప్పారు. రెండు గంటల్లోపే చర్చలు ముగిసినట్టు తుర్కియే పేర్కొంది.పుతిన్‌కు ఆసక్తి లేదు: జెలెన్స్కీచర్చల పురోగతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెదవి విరిచారు. కాల్పుల విరమణకు కూడా అంగీకారం కుదరలేదంటే దౌత్య మార్గంపై పుతిన్‌కు విశ్వాసం లేదని అర్థమన్నారు. అల్బేనియా రాజధాని టిరానాలో 47 యూరప్ దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. చర్చల్లో రష్యా ప్రతిపాదనలు అంగీకారయోగ్యంగా లేవని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ పేర్కొన్నారు. ‘‘చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్స్కీ ఫోన్లో చర్చించారు. ఈ విషయంలో మేమంతా సహకారంతో సాగుతాం. సమష్టి బాధ్యత వహిస్తాం. ట్రంప్‌తో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ కూడా ఆమోదించాయి’’ అని వెల్లడించారు.త్వరలో పుతిన్‌తో భేటీ: ట్రంప్రష్యా ఉక్రెయిన్ చర్చలపై ట్రంప్ స్పందించారు. పుతిన్‌తో తాను అతి త్వరలో భేటీ అయ్యే అవకాశముందన్నారు. ‘‘మా భేటీతో యుద్ధం ముగియవచ్చు, ముగియకపోవచ్చు. అయితే యుద్ధం కొనసాగితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ చర్చలకు తాను వెళ్లని కారణంగానే పుతిన్ కూడా హాజరవలేదని ట్రంప్ గురువారం పేర్కొనడం తెల్సిందే. తన కుమార్తె టిఫానీకి కొడుకు పుట్టిన కారణంగానే ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అందమైన నా మనవడిని చూడాలనుంది’ అని పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్ భేటీకి వేళైందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా అన్నారు. వారి శిఖరాగ్రానికి ఏర్పాట్లకు సమయం పడుతుందని చెప్పారు.
జాతీయం

అంబేడ్కర్ భావజాలమే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావజాలమే నాకు ఆదర్శం. ఆయన మార్గమే నన్ను సీజేఐగా నిలబెట్టింది’’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ తెలిపారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఘనంగా సన్మానించింది. యువ న్యాయవాది నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగేదాకా తన న్యాయ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నతనంలో నాకు ఆర్కిటెక్ట్ కావాలనే కోరిక ఉండేది. కానీ అంబేడ్కర్ ఆశయ సాధన, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకతను తండ్రి సూచించడంతో న్యాయ వృత్తిని ఎన్నుకున్నా. న్యాయమూర్తిగా అవకాశం వచి్చనప్పుడు స్వీకరించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. న్యాయవాదిగానే కొనసాగితే ఎంతో డబ్బు సంపాదించవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. అది నిజమే అయినా న్యాయమూర్తిగా అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి సామాజిక, ఆర్థిక న్యాయ సాధనకు కృషి చేయొచ్చని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలకు కట్టుబడి న్యాయమూర్తిగా మారాను. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడెంతో సంతోషిస్తున్నా’’అని చెప్పారు. ఖాళీలను భర్తీ చేయాలి న్యాయ నియామకాల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని జస్టిస్ గవాయ్ నొక్కిచెప్పారు. ఆ పదవులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి మహిళలను వీలైనంత ఎక్కువగా సిఫార్సు చేయాలని హైకోర్టులకు సూచించారు.‘‘ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడా మాట్లాడాను. జడ్జి నియామకాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు వారి హైకోర్టుల్లో లేని పక్షంలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిభావంతుల నుంచి ఎంపిక చేసుకోవాలని సూచించాను. ఈ విషయంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాం కూడా’’అని వెల్లడించడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు. వాగ్దానాలు నా నైజం కాదు సీజేఐ అయ్యాక చాలా మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు జస్టిస్ గవాయ్ చెప్పారు. ‘‘కానీ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచీ మీడియాకు దూరంగానే ఉండేవాడిని. మీడియా అంటే నాకేమీ భయం లేదు. కానీ నాకు సిగ్గు చాలా ఎక్కువ’’అని చెప్పి నవ్వులు పూయించారు. ‘‘అదీగాక ముందుగానే వాగ్దానాలు చేయడం నాకిష్టముండదు. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అన్ని చెప్పాడు, చివరికి వాటిలో ఒక్కటీ చేయలేదని మీడియా మిత్రులే విమర్శించే ప్రమాదముంది. కనుక ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు నన్ను వాళ్లు క్షమిస్తారనే ఆశిస్తున్నా’’అంటూ చమత్కరించారు.ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ జస్టిస్ త్రివేదికి సీజేఐ వీడ్కోలు → చాంబర్‌కు వెళ్లి మరీ తోడ్కొని వచ్చారు → వెల్లడించిన జస్టిస్ విశ్వనాథన్ జస్టిస్ గవాయ్ వినమ్రత, నాయకత్వ లక్షణాలు సాటిలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.వి.విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం రిటైరైన సహచర న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదికి ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిన మరీ ఘనంగా వీడ్కోలు పలికిన తీరే అందుకు గొప్ప నిదర్శనమన్నారు. ‘‘ప్రొటోకాల్ ప్రకారం ధర్మాసనం కార్యకలాపాలు ముగిశాక మధ్యాహ్నం 1.30 సమయంలో ఇతర న్యాయమూర్తులంతా సుప్రీంకోర్టు ఆవరణలోకి వచ్చి రిటైరయ్యే న్యాయమూర్తికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ త్రివేది విషయంలో మాత్రం సీజేఐ ఎవరూ ఊహించని పని చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్ నుంచి రెండు అంతస్తులు ఎక్కి మరీ స్వయంగా జస్టిస్ త్రివేది చాంబర్లోకి వెళ్లి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో మేం కూడా ఆయన్ను అనుసరించాం. సీజేఐ సారథ్యంలో అందరమూ కలిసి ఆమెను కోర్టు ప్రాంగణం దాకా సాదరంగా తోడ్కొని వచ్చాం. గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘనంగా వీడ్కోలు పలికాం. ఇది నా దృష్టిలో అత్యంత అర్థవంతమైన వీడ్కోలు’’అని చెబుతూ జస్టిస్ విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు.

ISRO: ఆకాశంలో నిఘా నేత్రం
సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్ర దాడి, అందుకు ప్రతీకారంగా పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ ద్వారా దాన్ని కక్ష్యలోకి చేర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగం జరగనుంది. 17 నిమిషాలకు ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ (ఎస్ఎస్పీఓ)లో ప్రవేశపెడతారు. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుందని ఇస్రో తెలియజేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రేణిలో ఇది 63వ ప్రయోగం. కాగా ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్‌ను కూడా రోదసిలోకి పంపుతున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ శనివారం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయించారు. సరిహద్దులపై డేగకళ్లు మేఘాలు, దట్టమైన చీకటి కమ్ముకున్నా, తుఫాన్ల వంటివి చెలరేగినా చాలా ఉపగ్రహాలు మూగవోతాయి. కానీ ఈఓఎస్–09 అలా కాదు. అన్ని రకాల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రేయింబవళ్లూ బ్రహా్మండంగా పని చేస్తుంది. సాధారణ ఆప్టికల్ శాటిలైట్లకు అడ్డుగోడలుగా నిలిచే మేఘాలు, వర్షాలు, దుమ్మూధూళి, పొగమంచు వంటివాటి గుండా కూడా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అత్యాధునిక సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో ఒక మీటర్ పరిధిలోని వస్తువులను కూడా కచి్చతత్వంతో ఫొటోలు తీస్తుంది. → రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పూర్తి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)–1కు ఈఓఎస్–09 నిఘా ఉపగ్రహం కొనసాగింపు. → చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తీవ్రవాదుల ఉనికిని గుర్తించగలదు. వాహనాల కదలికలను కూడా అత్యంత స్పష్టంగా, కచ్చితంగా చిత్రించడం దీని ప్రత్యేకత. → ఇందుకోసం దీనికి హెచ్ఆర్ఎస్ (హై రిజల్యూషన్ స్పాట్లైట్), మీడియం రిజల్యూషన్ స్కాన్ (ఎస్ఏఆర్) వంటి అత్యాధునిక హంగులు అమర్చారు. → వ్యవసాయం, అడవుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇది కీలకమైన సేవలు అందించనుంది. → దీని డేగకళ్లు పాక్ నుంచి చైనా దాకా మన 15 వేల కి.మీ. విస్తారమైన సరిహద్దులను, 7,500 కి.మీ. పొడవైన సముద్రతీరాన్ని అణువణువూ కాపు కాస్తాయి. ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా ఇట్టే పట్టేస్తాయి. → వరదల వంటి ప్రాకృతిక విపత్తుల వేళ మేఘాలను చీల్చుకుంటూ ఈఓఎస్–09 అందించే రియల్ టైం చిత్రాలు, డేటా నష్ట తీవ్రతను తక్షణం అంచనా వేయడంలో దోహదపడతాయి.

నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే
చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఢిల్లీ: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌లో ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్ పవన్ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్‌సింగ్ నగర్ఫేస్–1లో నివాసముంటున్నారు. ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్‌తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్‌ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్ పవన్‌న్ పరారీలో ఉండగా గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు.

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.
వీడియోలు


అనంతపురం జిల్లాలో భారీ వర్షం


నందిగం సురేష్ అరెస్ట్


లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు


పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది


స్పిరిట్ లో కల్కి జోడి..


ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!


కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్


కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు


రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్