
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి రా.2.26 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.48 వరకు, తదుపరి శ్రవణం,వర్జ్యం: రా.7.49 నుండి 9.25 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: ఉ.9.11 నుండి 10.50 వరకు, తిరిగి తె.5.24 నుండి 7.02 వరకు (తెల్లవారితే సోమవారం).
సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.
కర్కాటకం: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.
కుంభం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మీనం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.