
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇటీవల.. 'విండ్సర్ ప్రో' పేరుతో పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ కారు.. కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే.. బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి విండ్సర్ ప్రో డెలివరీలు చేసింది.
ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లను పొందిన ఎంజీ విండ్సర్ ప్రో.. ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు
సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఎంజీ విండ్సర్ ప్రో.. 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది.