
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా త్వరలోనే దేశీయ మార్కెట్లో సరికొత్త ఎంపీవీ 'ఎం9' లాంచ్ చేయనుంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం రూ. 51000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.
లాంచ్‌కు సిద్దమవుతున్న ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు.. పరిమాణం పరంగా కియా కార్నివాల్ & టయోటా వెల్‌ఫైర్ వంటి వాటికంటే పెద్దదిగా ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్న ఈ ఎంపీవీ మార్చి ప్రారంభంలోనే లాంచ్ కావాల్సి ఉంది. కానీ లాంచ్ వాయిదా పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. దీని ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: 24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రో
రెండు సన్‌రూఫ్‌లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌లతో పవర్డ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, ఫోల్డ్ అవుట్ ఒట్టోమన్ సీట్లు, పవర్డ్ రియర్ స్లైడింగ్ డోర్లు, రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు వంటి వాటితో పాటు.. లెవల్ 2 ADAS కూడా ఈ కారులో ఉండనుంది. బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.