హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు | Gadgets For Hitech Homes | Sakshi
Sakshi News home page

హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు

May 18 2025 3:17 PM | Updated on May 18 2025 3:32 PM

Gadgets For Hitech Homes

ఇంటి అందాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుండే అలంకరణ వస్తువులు.. ఎప్పుడో అప్‌డేట్‌ అయ్యాయి. ఇప్పుడు మీరు కూడా ఈ టెక్‌ డెకర్‌ ఐటమ్స్‌ ఉపయోగించి మీ ఇంటిని హైటెక్‌ హోమ్‌గా మార్చేయండి.

క్యూట్‌ చార్జర్‌
రంగురంగుల వెలుగులతో ప్రకాశించే ఈ ల్యాంప్, ఒట్టి లైట్‌ మాత్రమే కాదు, ఇదొక వైరెలెస్‌ చార్జర్, బ్లూటూత్‌ స్పీకర్, స్లీప్‌ ల్యాంప్, సన్‌రైజ్‌ అలారం.. ఇలా మరెన్నో చెప్పుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ డివైజ్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు రెండు నుంచి మూడు గంటల వరకు నిర్విరామంగా మ్యూజిక్‌ ప్లే చేస్తుంది. అలాగే, రంగురంగుల లైట్లతో పార్టీ థీమ్‌ మూడ్‌లోకి కూడా తీసుకురాగలదు. ఇందులోని ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఉపయోగించి క్షణాల్లో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జ్‌ చేసుకోవచ్చు. ధర రూ. 849.

ఇంటికొచ్చే చందమామ
ఇంట్లో ఊహల లోకం కావాలనుకుంటున్నారా? అయితే, ఒక్కసారి నిద్రపోయే ముందు ఈ త్రీడీ మూన్‌ ల్యాంప్‌ను ఆన్‌ చేయండి. వెంటనే గోడలపై వెలుగుల పూలు, సీలింగ్‌పై తారల మెరుపులతో గదంతా ఒక ఫెయిరీ టేల్‌ సినిమా మూడ్‌లోకి మారిపోతుంది. ఏ టూల్స్‌ అవసరం లేకుండా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ మోడ్‌లో ఇది పనిచేస్తుంది. పిల్లలకు ఎంతో బాగా నచ్చే దీని ధర రూ. 499. ఆన్‌లైన్‌లో మరెన్నో ఇలాంటి త్రీడీ ల్యాంప్స్‌ ఉన్నాయి. అభిరుచిని బట్టి కొనుగోలు చేయవచ్చు.

ఫొటోలు మార్చే ఫ్రేమ్స్‌
ఇదివరకు గోడకు వేలాడదీసే ఫ్రేమ్‌లో ఏదో ఒక ఫొటో మాత్రమే ఉండేది. రకరకాల ఫొటోలను ఒకేసారి చూపిస్తుంది ‘స్మార్ట్‌ డిజిటల్‌ ఫొటో ఫ్రేమ్‌’. ఫొటోను ప్రింట్‌ తీయటం, వాటిని ఫ్రేమ్స్‌లో అతికించడం ఇలాంటి పనులేం చేయనక్కర్లేదు. ఇది మీ ఇంట్లో ఉంటే. త్రీడీ డిస్‌ప్లే, కలర్‌ కేలిబ్రేట్‌తో రూపొందించిన ఈ ఫ్రేమ్, ఫొటోలను అత్యంత సహజంగా కనిపించేలా చేస్తుంది. దీనిని మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలను మార్చుకోవచ్చు. ఫ్రేమ్‌కు తగ్గట్లు ఫొటోలను ఇదే అటోమేటిక్‌గా క్రాప్‌ చేసి, బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్‌ కూడా చేస్తుంది. ధర రూ. 12,595.

పైకెగసే నీటిబొట్లు
పైకి విసిరిన ప్రతిదీ కింద పడాల్సిందే! కానీ, ఇక్కడ మాత్రం నీటి బొట్లు పైకి ఎగురుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చూడటానికి డెకర్‌ ఐటమ్‌లా కనిపించే ఈ ‘స్మూత్‌ సెయిలింగ్‌ యాంటీగ్రావిటీ లైట్‌’లో ఎన్నో అబ్బురపరచే ఫీచర్స్‌ ఉన్నాయి. దీనిని నైట్‌ లైట్, టేబుల్‌ క్లాక్‌లాగే కాదు, అంతకు మించి దీని పనితనం ఉంటుంది. ఇది ఇందులో నింపిన నీటిని ఉపయోగించి, చల్లని గాలిని అందిస్తూ ఒక మినీ కూలర్‌లాగా కూడా పనిచేస్తుంది. లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్, వర్క్‌డెస్క్‌లకు ఇది ఒక చక్కటి డెకర్‌ ఐటమ్‌. ధర రూ. 1,899.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement