
భూటాన్, నేపాల్‌కు వెళ్లే సరుకుకు మాత్రం మినహాయింపు
తక్షణమే అమల్లోకి వచ్చిన ఆదేశాలు
స్పష్టం చేసిన కేంద్ర వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్‌టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్ మీదుగా నేపాల్, భూటాన్ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్‌కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింకులు, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్ యాన్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది.
చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ యూనుస్ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్‌లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్‌కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది.
🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.
Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025