
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది ప్రధానంగా మంగళవారం కురిసిన వర్షానికి అక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే ముంబైలోని చెంబూర్-భక్తిపార్క్ మధ్య నడిచే మోనో రైలు ఒకటి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై నిలిచిపోయింది. మెట్రో కంటే తక్కువ పరిమాణంతో పాటు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైల్లో చిన్నపాటి విద్యుత్ అంతరాయ ఏర్పడటంతో మంగళవారం సాయంత్రం సమయంలో ట్రాక్‌పైనే ఉన్నపళంగా ఆగిపోయింది.
సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయిన మోనో రైలు ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అక్కడకు చేరుకుని ప్రయాణికుల్ని క్రేన్ల సాయంతో కిందకు దించింది. అయితే పవర్ సప్లైలో చిన్నపాటి అంతరాయం కారణంగానే ఆ ట్రైన్ నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ ట్రైన్ మరమ్మత్తు చర్యలను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు.
అయితే ట్రైన్ ఉన్నపళంగా ట్రాక్‌పైనే నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అదే సమయంలో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఎవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు.
#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg
— ANI (@ANI) August 19, 2025