
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంలో నౌక ప్రమాదం కలకలం రేపింది. మెక్సికన్ నేవీకి చెందిన ఒక శిక్షణ నౌక ‘కువౌటెమోక్’ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల మేరకు.. ప్రయాణ సమయంలో కువౌటెమోక్ నౌకకు ఏర్పాటు చేసిన మూడు అడుగుల తెర భాగం బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. దీంతో నౌకకు ఏర్పాటు చేసిన తెరతోపాటు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2
— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025
మెక్సికోకు చెందిన ఈ నౌక సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంది. శిక్షణ కోసం వినియోగించిన ఈ నౌక బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీ కొట్టడంతో ప్రయాణం ఆగిపోయింది.
Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2
— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025
ఈ నౌక ప్రతి సంవత్సరం శిక్షణ ముగిశాక ప్రపంచ పర్యటనలో భాగంగా పలు పోర్ట్‌లకు వెళ్లుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్ట్ నుంచి ప్రయాణం మొదలైంది. 277 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ నౌక 15 దేశాల్లోని 22 పోర్ట్‌లను సందర్శించాలని ప్రణాళిక వేసుకుంది. ఇందులో కింగ్‌స్టన్ (జమైకా), హవానా (క్యూబా), కోసుమెల్ (మెక్సికో), న్యూయార్క్ (అమెరికా), రేక్‌జావిక్ (ఐస్లాండ్), బోర్డో, సేంట్ మాలో, డంకిర్క్ (ఫ్రాన్స్), అబెర్డీన్ (స్కాట్లాండ్) ఉన్నాయి. మొత్తం 254 రోజుల ప్రయాణంలో 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంది.