'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్‌ | Vijay Sethupathi and Rukmini Starrer Ace Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

Ace Telugu Trailer: 'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్‌

May 18 2025 7:01 PM | Updated on May 18 2025 7:01 PM

Vijay Sethupathi and Rukmini Starrer Ace Telugu Trailer Out Now

కోలీవుడ్ స్టార్ విజయ్‌ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్‌'. అరుముగ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై అరుముగ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే తమిళ ట్రైలర్‌ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఏస్ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్‌ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్‌ బ్యానర్‌పై బి.శివప్రసాద్‌ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్‌ చూసేయండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement