
మాస్కో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ వివాహిత టీచర్.. విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించింది. 11 ఏళ్ల బాలుడితో హద్దులు దాటి ప్రవర్తించింది. సదరు బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసి.. తన శారీరక అవసరాలను తీర్చుకుంది. ఈ విషయం బాలుడి తల్లికి తెలియడంతో.. ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెకు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ దారుణ రష్యాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ది న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.
వివరాల ప్రకారం.. రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్‌లో పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి(11)తో ఆమె అనుచితంగా ప్రవర్తించారు. ఆమె శారీరక అవసరాల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించారు. క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరాన్ని తాకే విధంగా ప్రవర్తించింది. అతడి పెదవులను సైతం ముద్దాడింది. అంతేకాకుండా సదరు విద్యార్థికి వాట్సాప్‌లో ఆమె నగ్న చిత్రాలను పంపించింది. మెసేజ్‌లు చేయడం, వీడియోలు పంపించడం చేసింది. దీంతో, బాలుడు.. ఆమె చేసే పనులను అడిక్ట్ అయిపోయాడు.
ఒకానొక సమయంలో బాలుడు.. ఇంట్లో ఉండగా వింతగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఫోన్ చెక్ చేయడంతో టీచర్ బండారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెను పేరెంట్స్ నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు టీచర్‌పై తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు టీచర్ ప్లాక్సుక్‌కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సంవత్సరం పాటు బోధించకుండా నిషేధం విధించింది.
Shocking: Anna Plaksyuk, a 27-year-old married primary school teacher from Toksovo, Russia, sentenced to 9 years for sexually abusing an 11-year-old boy. The “dream teacher” sent naked selfies, exposed by the victim’s mother.
Justice served! pic.twitter.com/SXv0WrZHxs— Make Europe Great Again - M.E.G.A (@ScaryEurope) May 16, 2025