నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్‌ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో | strangest showers in the world firebath video goes viral | Sakshi
Sakshi News home page

నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్‌ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో

Published Tue, Jun 18 2024 12:05 PM | Last Updated on Tue, Jun 18 2024 12:05 PM

 strangest showers in the world firebath video goes viral

షవర్‌ బాత్‌ తెలుసు.. ఐస్‌ బాత్‌ గురించి విన్నాం...కానీ మీరెపుడైనా ఫైర్‌ బాత్‌ గురించి విన్నారా?  అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి,  నీళ్లు, నిప్పుతో కలిసి బాత్‌ చేస్తున్న వీడియో  ప్రస్తుతం  నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఒక పైప్‌   నుంచి   నీళ్లతోపాటు, అగ్ని కూడా సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. లావాలా ఉబికి వస్తున్న ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి ఎంచక్కా షవర్‌ బాత్‌ చేస్తున్నాడు. అచ్చం పైనుంచి జాలువారే జలపాతం వద్ద ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా. ఈ వీడియోపై నెటిజనులు విభిన్నంగా స్పందించారు. అతని ఆరోగ్యంపై కొందరు ఆందోళనవ్యక్తం చేశారు. ఇలాంటి ఫీట్స్‌ ప్రమాదకరమని కొందరు, ఇలా చేస్తే కేన్సర్‌ బారిన పడటం ఖాయమని కొందరు వ్యాఖ్యానించారు.

 సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని  కమెంట్స్‌ ఎక్కువగా కనిపించాయి. అలాగే చాలా చల్లగా ఉంటుంది కానీ దుర్వాసన కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని, ఇలాంటి ఘటనలు రష్యాలోనే మాత్రమే చోటు చేసుకుంటాయంటూ మరికొందరు  కమెంట్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement