ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 18-05-2025 To 24-05-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

May 18 2025 1:24 AM | Updated on May 18 2025 11:59 AM

Weekly Horoscope In Telugu From 18-05-2025 To 24-05-2025

మేషం...
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని  దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి ఎట్టకేలకు  బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం...
ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం...
సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.  శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా, సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో  అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. వారం ప్రారంంభంలో  కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం....
ముఖ్య పనులు విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు.  శివాష్టకం పఠించండి.

సింహం...
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య...
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం.  గణపతి స్తోత్రాలు పఠించండి.

తుల...
ముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త  హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం  అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలలో తగినంత  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం మద్యలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు...
ముఖ్య పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.  కొన్ని సమస్యలు వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. కళారంగం వారికి చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం....
కొన్ని నిర్ణయాలు మిత్రులను ఆశ్చర్యపరుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది.  వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కుంభం...
మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో  బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం...
కొన్ని పనుులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.  ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు.  దుర్గాస్తోత్రాలు  పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement