కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన | RBI Announces New Rs 20 Denomination Banknotes With New RBI Governor Signature, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన

May 17 2025 2:05 PM | Updated on May 17 2025 4:02 PM

RBI announces new Rs 20 denomination banknotes with new RBI Governor signature

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.

రాబోయే రూ .20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి.

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ .20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement