ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం | Albanian PM Greet Italian PM Giorgia Meloni | Sakshi
Sakshi News home page

ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం

May 17 2025 9:37 AM | Updated on May 17 2025 1:54 PM

Albanian PM Greet Italian PM Giorgia Meloni

టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్‌ కార్పెట్‌ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్‌ సిస్టర్‌’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్‌ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement