
సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.
సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టైలిష్ డిజైన్ అంశాలతో మిళితం చేసి సుజుకి యాక్సెస్ స్కూటర్ కొత్త ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ ఎనేబుల్డ్, ఫుల్ కలర్ 4.2 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త ఎడిషన్ ముఖ్యమైన ఫీచర్. ఇందులో డిస్‌ప్లే రైడర్‌కు క్లీనర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
కొత్త కలర్
కాగా యాక్సిస్ వాహనాలకు ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్లకు అదనంగా కొత్త ఎడిషన్ "పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్" రంగును పరిచయం చేస్తుంది. మ్యాట్ ఫినిష్ స్కూటర్ కు ఆధునిక, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీంతోపాటు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే మరో నాలుగు కలర్ షేడ్స్‌లోనూ యాక్సిస్ కొత్త ఎడిషన్ లభిస్తుంది.
సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఎడిషన్ ఇప్పుడు భారతదేశంలోని డీలర్‌షిప్‌లలో రూ .1,01,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లభిస్తుంది. స్మార్ట్ టెక్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ కలర్ స్కీమ్ జోడించడంతో కొత్త వేరియంట్ పోటీ 125 సీసీ స్కూటర్ విభాగంలో యాక్సెస్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.