breaking news
Suzuki Access
-
సుజుకి ఈ-యాక్సెస్ vs హోండా యాక్టివా ఈ: రేంజ్ & ధరలు
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఈ-యాక్సెస్'ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కథనంలో ఈ రెండు స్కూటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.స్పెసిఫికేషన్స్రెండు స్కూటర్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్లు. కాబట్టి ఇవి చాలా సింపుల్ డిజైన్ పొందుతాయి. యాక్టివా ఈ స్కూటర్ 6 కిలోవాట్ మోటార్ మోటారుతో శక్తినిస్తుంది. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం.సుజుకి ఈ యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.072 కిలోవాట్ లిథియం ఫాస్పెట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 కిమీ/గం.ఫీచర్స్సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్.. ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 765 మిమీ ఎత్తైన సీటు, 122 కేజీల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బ్లూటూత్/యాప్ కనెక్టివిటీతో పాటు 4.2 ఇంచెస్ TFT LCD కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.హోండా యాక్టివా ఈ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ TFT స్క్రీన్‌తో పాటు ఆప్షనల్ హోండా రోడ్ సింక్ యాప్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్లు, రివర్స్ మోడ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.ఛార్జింగ్ డీటైల్స్ఛార్జింగ్ విషయంలో మాత్రం రెండు స్కూటర్లు భిన్నంగా ఉంటాయి. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి, సుజుకి ఇ-యాక్సెస్‌ను 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం, 6 గంటల 42 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం & 2 గంటల 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్‌తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా'హోండా యాక్టివా ఈ'లో బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్‌గా అందిస్తుంది. దీనికి ఛార్జ్ చేయదగిన బ్యాటరీలు లేవు కాబట్టి, మార్చుకోగల బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక ప్లాన్ నెలవారీ అద్దె రూ. 1,999 + GSTతో వస్తుంది, దీని ద్వారా 35 kWh ఎనర్జీ లభిస్తుంది. ఈ స్కూటర్ రోజుకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.ధరలుహోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, రోడ్ సింక్. వీటి ధరలు వరుసగా రూ. 1.17 లక్షలు, రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ.. సుజుకి ఈ-యాక్సెస్ ధరలు ఇంకా వెల్లడించలేదు.అయితే దీని ధర రూ. 1.0 నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. -
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టైలిష్ డిజైన్ అంశాలతో మిళితం చేసి సుజుకి యాక్సెస్ స్కూటర్ కొత్త ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ ఎనేబుల్డ్, ఫుల్ కలర్ 4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త ఎడిషన్ ముఖ్యమైన ఫీచర్. ఇందులో డిస్ప్లే రైడర్‌కు క్లీనర్ ఇంటర్ఫేస్, మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.కొత్త కలర్కాగా యాక్సిస్ వాహనాలకు ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్లకు అదనంగా కొత్త ఎడిషన్ "పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్" రంగును పరిచయం చేస్తుంది. మ్యాట్ ఫినిష్ స్కూటర్ కు ఆధునిక, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీంతోపాటు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే మరో నాలుగు కలర్ షేడ్స్‌లోనూ యాక్సిస్ కొత్త ఎడిషన్ లభిస్తుంది.సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్టీ ఎడిషన్ ఇప్పుడు భారతదేశంలోని డీలర్‌షిప్‌లలో రూ .1,01,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లభిస్తుంది. స్మార్ట్ టెక్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ కలర్ స్కీమ్ జోడించడంతో కొత్త వేరియంట్ పోటీ 125 సీసీ స్కూటర్ విభాగంలో యాక్సెస్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. -
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్‌సేల్‌గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్‌కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్‌లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
సుజుకీ యాక్సెస్ 125 రికార్డు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే. దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది. 5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
ఆ బైక్ సేల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్ల యాక్సిస్–125 స్కూటర్లను ఉత్పత్తి చేసి ఈ ఘనతను సాధించింది. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా దాదాపు ఏటా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో 2007లో యాక్సిస్–125 స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో 125 సీసీ విభాగంలో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే. -
బీఎస్–6 సుజుకీ యాక్సెస్ వచ్చేసింది
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ.. ‘ఎస్ ఎంఐపీఎల్ వృద్ధి బాటలో ఈ స్కూటర్ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించా రు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు.