
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.
నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది.