breaking news
Devotion
-
ఎదుటివారి సంతోషాన్ని చూసి మీరు సంతోషించగలరా?
మనసును శుద్ధంగా ఉంచుకోవటం ఆధ్యాత్మిక సాధనలన్నింటికీ కీలకమైన తొలి మెట్టు. శుద్ధ చిత్తం అన్ని సాధనలకూ ఆధారం. అందువలన చిత్తాన్ని శుద్ధి చేసుకొనేందుకు ప్రాచీన ఆచార్యులు ఎందరో, ఎన్నో విధాలైన సాధనలూ, అభ్యాసాలూ బోధించారు. పతంజలి మహర్షి క్రోడీకరించిన యోగ సూత్రాలలో చిత్తశుద్ధిని పెంచుకొనేందుకు ఒక చక్కని సూత్రం చెప్పారు. మనశ్శాంతికి దోహదం చేస్తుంది కనక, ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనలకే కాదు, దైనందిన ప్రాపంచిక జీవితంలో కూడా ఉపయోగకరం. సూత్రం ఇది:‘మైత్రీ కరుణా ముదితా ఉపేక్షాణాం, సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం భావనాతః చిత్త ప్రసాదనమ్’. సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాలు తారసిల్లినపుడు, వాటిపట్ల మైత్రి కరుణ ముదితా ఉపేక్ష అనే భావనలతో స్పందించే అభ్యాసం ద్వారా చిత్తానికి శుద్ధి... అని సూత్రానికి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. జీవితంలో సుఖంగా సంతోషంగా ఉన్న ప్రాణులు మనకు తటస్థ పడే సందర్భంలో, అలాంటి ప్రాణులన్నిటి పట్లా మైత్రీ భావంతో స్పందించటం అభ్యాసం చేయాలి. అసూయ లేకుండా, నిష్కల్మషమైన స్నేహ భావనతో వాళ్ళ ఆనందాన్ని చూచి, ఆనందించాలి.అలాగే, దుఃఖాలను ఎదుర్కొంటున్న వాళ్ళు తటస్థపడినప్పుడు, కరుణ భావనతో స్పందించటం అభ్యాసం చేయాలి. ఆ దుఃఖితుల పట్లా, దీనుల పట్లా దయ అన్న భావనతో ప్రతిస్పందించి, ఓదార్పు కలిగించే మాటల తోనూ, దయగల చేష్టలతోనూ, మనఃపూర్వకమైన సానుభూతితోనూ వ్యవహరించటం అభ్యాసం చేయాలి. అదే విధంగా లోకహితమైన సత్కార్యాలనూ, పుణ్య కార్యాలనూ ఆచరించే సజ్జనులను చూసినప్పుడు, వాళ్ళ ధర్మాచరణ గమనించి, హృదయపూర్వక మైన మోదం, సంతోషం అనుభవిస్తూ వాళ్ళను అభినందించగలగటాన్ని – ముదితాభావం – అలవరచుకోవాలి.అందుకు విరుద్ధంగా, పాపిష్ఠి పనులలో మునిగి తేలే పాపాత్ములు ఎప్పుడయినా ఎదురయితే, వాళ్ళ పట్ల నిర్లిప్తతా, ఉపేక్ష చూపుతూ, అలాంటి వారి చర్యల గురించిన భావనలే మనసులో చొరనీయకుండా ఉండాలి. అలాంటి మాలిన్యాల ప్రభావాలు మనసుకెక్కితే, మనసు అపరిశుద్ధమౌతుంది. మనశ్శాంతి చెదిరిపోతుంది. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళకు కూడా పై సూత్రం ఉపకరిస్తుంది. లలితా సహస్ర నామాలలో ‘మైత్రాది వాసనా లభ్యా...' (మైత్రి మొదలైన సంస్కారాలు అలవరచు కొన్నవారికి సులభ సాధ్యురాలు) అని ఒక నామం.– ఎం. మారుతి శాస్త్రి -
సేవయే సాధనగా: గాంధీజీ ఆధ్యాత్మిక ప్రయాణం
మహాత్మా గాంధీ ఆధ్యాత్మికత ఆయన రాజకీయ, సామాజిక జీవితానికి పునాది. గాంధీజీకి ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, వ్రతాలు లేదా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయడం కాదు; సమాజ సేవ, సత్య సాధన, మానవత్వమే ఆయనకు అసలైన ఆధ్యాత్మిక మార్గాలు. గాంధీజీ ఆధ్యాత్మిక జీవన విధానంలోని ముఖ్యమైన అంశాలు కొన్ని ...ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి జీవన విధానంలో అనుసరించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుందాం. సత్యమే దేవుడు గాంధీజీ తన జీవితాంతం సత్యాన్వేషణకే అంకితం చేశారు. ప్రారంభంలో ఆయన ‘దేవుడే సత్యం‘ అనేవారు, కానీ కాలక్రమేణా అనుభవంతో ‘సత్యమే దేవుడు‘ అని ప్రకటించారు. సత్యం అనేది ఒక రూపం లేని శక్తని, అది అందరి అంతరాత్మలో ఉంటుందని ఆయన నమ్మారు.అహింసఆయనకు అహింస అనేది కేవలం ఒక రాజకీయ ఆయుధం కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఎవరినీ మానసికంగా గాయపరచకుండా ఉండటమే అహింస. శత్రువును కూడా ప్రేమతో, ఓర్పుతో గెలవవచ్చని ఆయన నిరూపించారు. అహింస ద్వారానే సత్యాన్ని సాధించగలమని ఆయన నమ్మకం.భగవద్గీత ప్రభావంగాంధీజీ భగవద్గీతను తన ‘ఆధ్యాత్మిక నిఘంటువు‘గా... ‘తల్లి‘ గా భావించేవారు. గీతలోని ‘నిష్కామ కర్మ‘ (ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం) ఆయనను బాగా ప్రభావితం చేసింది. కష్ట సమయాల్లో గీతోపదేశం తనకు మానసిక శాంతిని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు.అంతఃకరణ శుద్ధి, ప్రార్థనగాంధీజీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సామూహిక ప్రార్థనలు చేసేవారు.అన్ని మతాల పవిత్ర గ్రంథాలలోని శ్లోకాలను, ప్రార్థనలను ఆయన తన ప్రార్థనా సమావేశాలలో చేర్చారు. ‘రఘుపతి రాఘవ రాజారామ్‘ ర్థన ఆయనకు ఎంతో ప్రియమైనది. మనసును శుద్ధి చేసుకోవడానికి ఆయన తరచూ మౌన వ్రతం, ఉపవాసాలు చేసేవారు.సర్వధర్మ సమభావంగాంధీజీ హిందూ మతంలో జన్మించినప్పటికీ, అన్ని మతాలను సమానంగా గౌరవించారు. క్రై స్తవ మతంలోని ’కొండమీద ప్రసంగం’ ఇస్లాం, జైన, బౌద్ధ మతాలలోని మంచి బోధనలను ఆయన స్వీకరించారు. మతాలన్నీ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే దేవుడి వైపు నడిపిస్తాయని ఆయన విశ్వసించారు.మానవ సేవే మాధవ సేవసమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల (హరిజనుల) సేవ చేయడమే దేవుడిని చేరుకోవడానికి మార్గమని గాంధీజీ నమ్మారు. మానవాళికి సేవ చేయకుండా దేవుడిని కనుగొనలేమని ఆయన స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ ఆధ్యాత్మికత జీవితానికి దూరంగా ఉండేది కాదు; అది దైనందిన జీవితంలో, రాజకీయాల్లో నైతికతను, సత్యాన్ని, ప్రేమను ఆచరించేలా ఉండేది. గాంధీ జయంతి నాడు ఆయన పటానికి దండ వేయడమే కాదు. ఆయన చెప్పిన మంచిని ఆచరించడం... ఆయన బోధలను అనుసరించడం కూడా! -
గురుశిష్య సంబంధం..
భారతీయ సంస్కృతిలో శిష్యుడు గురువు పట్ల అత్యంత వినయాన్ని కనబరచటం కనబడుతుంది. కానీ కొంతమంది ప్రఖ్యాత గురుశిష్యుల విషయంలో భిన్నమైన ధోరణిని కూడా మనం చూడవచ్చు. రామకృష్ణ పరమహంస – వివేకానందలను చూస్తే ‘గురువు’నన్న ఆధిక్యతను రామకృష్ణుడు కనబరచినట్టుగానీ, ’శిష్యుడ’నన్న విధేయతను వివేకానంద చూపినట్టుగానీ లేదు. ‘నువ్వు చెప్పిందంతా నమ్మటానికి, నువ్వు చెప్పినట్లంతా చేయటానికి నేను రాలేదు’ అని వివేకానందుడు అనేవాడు.‘కంసాలి బంగారు నాణ్యతను ఎలా పరీక్షించి నిర్ణయిస్తాడో, నీవు అలాగే పరీక్షించు నా మాటల్ని’ అని రామకృష్ణుడు చెప్పేవాడు. ఒకోసారి వాదించుకునేవారు. ఒకోసారి అలిగి మాట్లాడుకునేవారు కారు. ఒకోసారి వివేకానందుని ఎదుట రామకృష్ణుడే చేతులు జోడించి నిల్చునేవారు. ‘నీవు అలా చేస్తే లోకులు నిన్ను పిచ్చివాడు అంటారు చూడు’ అని వివేకానందుడు వారించేవాడు. వారిద్దరి మధ్య ప్రేమ, అభిమానం లేదనగలమా? వారిని గురుశిష్యులుగా అంగీకరించక ఉండగలమా?తావో మతానికి చెందిన ప్రముఖ గురువు లావోజు. ఆయన వద్దకు చువాంజు వచ్చాడు. ‘నీవు నాకు శిష్యుడిగా ఉండటానికి వచ్చావా లేక గురువుగా ఉండటానికి వచ్చావా?’ అన్నాడు లావోజు. ‘గురువు, శిష్యుడు అనే ఆ చెత్త మాటల్ని కట్టిపెట్టి మనమిద్దరం కలిసి ఉండలేమా?’ అన్నాడు చువాంజు. లావుజు నవ్వి ‘చాలా మంచి మాట చెప్పావు. అలాంటి వారే నాకు ఇష్టం, అట్లే ఉందాం’ అన్నాడు. చువాంజు వెంటనే లావోజు పాదాలకు నమస్కరించాడు.‘ఏమి చేస్తున్నావ్?’ అన్నాడు లావోజు. ‘మీ కాళ్లకు నమస్కరించాలని అనిపించింది, నమస్కరించాను. దానికి వినయం, విధేయత లాంటి పేర్లు పెట్టాల్సిన పనిలేదు. ఏమి చేయాలనిపిస్తే అలా చేస్తాను. సాక్షులుగా మనమిద్దరం దాన్ని గమనిద్దాం అంతే’ అన్నాడు చువాంజు. (పుట 314, గ్లింప్సెస్ ఆఫ్ ఎ గోల్డెన్ చైల్డ్‌హూడ్– ఓషో)– రాచమడుగు శ్రీనివాసులు -
అందానికి నగలు అవసరమా? ఈ సుభాషితం ఏం చెబుతుందంటే..
సౌందర్యం అంటే కన్ను, ముక్కుతీరు బాగుండటం, శరీర రంగు బాగుండటం, ఆకర్షించే రూపం కలిగి ఉండటం అని పైకి తోచే అర్థం. ఇది బాహ్య సౌందర్యం. కానీ, మంచి మాటలు వినటం వల్ల చెవికి అందం వస్తుంది.అంతేగానీ అందమైన, ఖరీదైన కుండలాలు పెట్టుకోవటం వల్ల రాదు. చక్కనైన, ఆకర్షణీయమైన బంగారు కంకణాలు ధరించటం వల్ల చేతికి అందం రావచ్చునేమోగానీ ఆ చేయి అవసరార్థులకు ఉచిత రీతిన దానం చేసినప్పుడు ఆ చేయి అందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతుంది. తమ దగ్గరున్నది ఇతరులకు ఇవ్వటంలో అంతులేని తృప్తి, ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. బలి, కర్ణుడు, రంతిదేవుడు వంటివారు తమ దానాలతో అటువంటి తృప్తి, ఆనందం పొందినవారే. ఆనందం ఉన్నప్పుడు సౌందర్యం ఇనుమడిస్తుంది.గంధపు పూతలు, పన్నీటి జలాలతో దేహం కాంతిమంతంగా ఉంటుంది. ఆ దేహం గల మనసులో సాటివారి పట్ల దయ, కరుణ ఉంటే ఆ దేహం మరింత ప్రకాశిస్తుంది. పరోపకారం, మంచితనం అనే గుణాల వల్ల ముఖం తేజోమంతంగా ఉంటుంది. అదే సహజ సౌందర్యం. బాహ్య రూపం కన్న అంతర్గతమైన ఈ లక్షణాలే మనిషికి అందాన్నిస్తాయని ‘శ్రోత్రం శృతే నైవ నతు కుండలేన’ అనే ప్రసిద్ధ సంస్కృత సుభాషితం చెపుతుంది.మంచి మాటలు, సంస్కారవంతమైన మాటలు, చక్కని మాటతీరు మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆవేశంలో, తీవ్రమైన కోపంలో కూడా సంయమనం పాటించి, మాటను నియంత్రించుకుని వ్యక్తం చేసేవారికి వాక్ భూషణమే నిజమైన భూషణం. కృత్రిమమైన అలంకారాలు, పైపై మెరుగులు సహజ సౌందర్యానికి సాటి రావు.– డా. చెంగల్వ రామలక్ష్మిఇదీ చదవండి: హృదయ సామ్రాజ్ఞి -
దైవానుకూలత మంచి పనులకే!
ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. దైవభక్తి అతడికి మెండుగా ఉండేది. రోజూ దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించేవాడు. ఆ పట్టణంలో అతడిని తెలిసినవారందరూ ‘దైవానుగ్రహం’ పొందిన అదృష్టవంతుడిగా గౌరవించేవారు. అతడు కూడా అంతా ‘దేవుడి దయ’వలననే సమకూరిందని నమ్మే వాడు.అయితే, రోజులు గడిచే కొలది అతడిలో అహంభావం పెరిగింది. ‘నేను ఎంత గొప్ప భక్తుడిని! దేవుడే నాకు ప్రత్యేకంగా అన్ని సుఖాలు ఇస్తున్నాడు కదా!’ అని భావించి, తన కర్మలను నిర్లక్ష్యం చేశాడు. ఒక రోజు దేవాలయంలో దీపం వెలిaగించడానికి వెళ్లినప్పుడు, పూజారి అతడిని చూసి ‘దీపం వెలిగించడమే కాదు, వెలిగించే తైలంకూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధమైనది కాకపోతే దీపం సరిగా వెలగదు. ఇది నా మాట కాదు. ఆంధ్ర మహాభారతం, అనుశాసనిక పర్వంలో తిక్కన మహాకవి చెప్పిన మాట!’ అని ఈ పద్యాన్ని చదివాడు.కం. నేయి పొలు పఱిన దీవియత్వాయత్తంబై తానునుమాయును దైవానుకూల్య మహిమ మహీశా! పూజారి మాటలను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కొద్ది నెలల్లోనే అతడి జీవితం మారిపోయింది. వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఆరోగ్యం క్షీణించింది. ‘ఇంత భక్తి ఉన్న నన్ను ఎందుకు ఇలా చూస్తున్నావు?’ అని దేవుడిని నిందించాడు.ఒక రాత్రి దేవాలయంలో ఒంటరిగా కూర్చొన్నప్పుడు, పూజారి మళ్లీ వచ్చి ‘దీపం ఆరిపోవడానికి కారణం దేవుడు కాదు. తైలం తగ్గిపోవడమే. మనిషి చేసే మంచిపనులు తగ్గిపోతే దైవానుకూలత కూడా తగ్గిపోతుంది. దేవుడు దయను ఆపడు. మనమే దానికి అర్హత కోల్పోతాం!’ అన్నాడు. పూజారి మాటలు అతడిలో ఆత్మ విమర్శకు దారి తీశాయి. కొద్ది కాలంలోనే అతడి జీవితం మళ్లీ వెలుగుతో నిండింది.– భట్టు వెంకటరావుఇదీ చదవండి: పరిమిత కోరికల నుండి పరమ శాంతి వైపు -
ధర్మరాజు వెంట ధర్మదేవత
ధర్మో రక్షితి రక్షితః.... అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. పాండవుల విషయంలో... ముఖ్యంగా ధర్మరాజు విషయంలో ఈ సూత్రం రుజువయ్యింది.మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం విజయం సాధించిన పాండవులు పట్టాభిషిక్తులయ్యారు. పాండవుల రాజ్యపాలన కూడా ముగిసింది... జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించాడు. పాండవులకు కూడా జీవిత సత్యం బోధ పడింది. జీవిత చరమాకంలోకి చేరుకున్న పాండవులు అన్నింటినీ పరిత్యజించి హిమాలయాల మీదుగా స్వర్గానికి ప్రయాణమయ్యారు. దానికే స్వర్గారోహణ పర్వమని పేరు. అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక శునకం వారి వెనుకే నడుస్తూ పాండవులను అనుసరించింది. అలా వెళుతున్న సమయంలో వారి వారి పాప పుణ్యాల తీవ్రతను బట్టి మొదటగా ద్రౌపది, తరవాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరగా భీముడు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు విడిచారు. కానీ ధర్మరాజు ఒక్కడే వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నాడు.« ధర్మరాజుకు తోడుగా శునకం ఆయన వెంట నడిచింది.ధర్మరాజు హిమాలయాల చివరి అంచుకు చేరుకోగానే దేవేంద్రుడు తన దివ్య రథంతో వచ్చి ప్రాణాలతో స్వర్గానికి రమ్మని, దివ్య రధం ఎక్కమని ధర్మరాజును ఆహ్వానించాడు. అందుకు ధర్మరాజు తనతోపాటు ఉన్న శునకాన్ని కూడా తీసుకొని వస్తానని చెప్పడంతో ఇంద్రుడు నిరాకరించి కుక్కకు స్వర్గంలో ప్రవేశం లేదని, ఒక్కడివే రథాన్ని ఎక్కమని చెప్పగా ధర్మరాజు నిరాకరించాడు. నన్ను నమ్మి నా వెంట ఎంతో దూరం వచ్చిన ఈ ప్రాణిని నా స్వార్థం కోసం వదిలేయడం అధర్మమని, అలాంటి స్వర్గం తనకు అవసరం లేదని ధర్మరాజు ఇంద్రునితో కచ్చితంగా చెప్పాడు. ధర్మరాజు ధర్మనిష్టకు, కారుణ్యానికి సంతోషించిన ఆ శునకం తన నిజరూపమైన ధర్మదేవతగా ప్రత్యక్షమైంది. అనంతరం ధర్మరాజు స్వర్గానికి చేరుకున్నాడు.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
చేతిలో కట్టెలు
ఒక ఊర్లో చెరుకు వ్యాపారి ఒకరు ఉండేవాడు. అతడికి డబ్బు సంపాదన తప్ప మరేదీ ముఖ్యం కాదు. ఊర్లో వాళ్ళని, బంధువులను దగ్గరకు చేరిస్తే సొత్తంతా తినిపోతారని ఆలోచించేవాడు. ‘వీళ్ళతో నాకేం పని ఉంటుంది?’ అన్నట్లుగా వ్యవహరించేవాడు. ‘అందరూ మోసగాళ్ళే. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు’ అని అందరినీ దూరం పెట్టేవాడు.అలాంటి వ్యాపారి ఒకసారి తన వ్యాపార రీత్యా దూర దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక గుర్రపు బండి మాట్లాడుకున్నాడు. చాలా ఊర్లు దాటి ఓ ఏటి గట్టుపైన వెళ్తూ ఉంటే దారిలో ఒక ఊరు కనిపించింది. చాలామంది రైతులు పొలాల్లో వేగంగా నడిచి పోతూ ఉన్నారు. వారి ముఖాలన్నీ గంభీరంగా ఉన్నాయి. వారందరి చేతుల్లోనూ కట్టెలున్నాయి. వారిని చూసిన గుర్రపు బండి రౌతు బండిని పక్కకు ఆపాడు. గబుక్కున బండినుంచి దిగి నడిచి వెళ్తున్న రైతులకు నమస్కరించాడు. వారు పొలం దాటి ఊర్లోకి వెళ్ళిపోయేవరకు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వారు ఊరికి చేరారని గుర్తించాక రౌతు, తను నిలబడి ఉన్న నేలకి దండం పెట్టాడు.బండిలో కూర్చుని అంతా చూస్తున్న వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ‘వారి నడక చూస్తే వేగంగా ఉంది. వారు గొడవకు పోతున్నట్లుగా అనిపిస్తోంది. అందులోనూ వారి చేతిలో కట్టెలున్నాయి. అలాంటి రైతులకు నువ్వెందుకు నమస్కరించావు? అంతే కాదు, వారెళ్లిపోయాక ఈ నేలకు ఎందుకు దండం పెట్టావు?’ అని ఎగతాళిగా అడిగాడు.చిన్నగా రౌతు ‘‘పుడితే ఇలాంటి ఊర్లలో పుట్టాలనిపిస్తుంది నాకు. ఊరిలో ఎవ్వరు చనిపోయినా ఇంటికొకరు శ్మశానం దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక కట్టె తీసుకెళ్తారు. చనిపోయిన వాళ్ళలో ధనికులూ ఉంటారు, పేద వాళ్ళూ ఉంటారు. ఎవరు చనిపోయినా శవ దహనం మాత్రం గొప్పగా జరగాలన్నది వారి ఆశయం. అందుకే వాళ్ళందరూ మనిషికొక కట్టె ఎత్తుకుని వెళ్తున్నారు. ఆ ఊరి వారి సహదయతకు, కట్టుబాటుకు నమస్కరించాను. అలాంటి మంచి మనుషులు తిరుగులాడుతున్న ఈ నేల గొప్పదని భావించి నేలకీ దండం పెట్టాను. ఒంటిగా ఉంటే ఒంటరి బలం, తోడుంటే కొండంత బలం కదా ’’ అని చెప్పాడు.‘ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలి ఉంది. అందుకే సమాజం ఇంకా ఒక క్రమపద్ధతిలో నడుస్తోంది. ఏ కాలమైనా మనిషికి మనిషే సహాయపడగలడు’ అని వ్యాపారి అర్థం చేసుకున్నాడు. తన వారినందరినీ ఆదరిద్దామని, చేతనైనంత సహాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
పరిమిత కోరికల నుండి పరమ శాంతి వైపు
ఆధ్యాత్మిక పరిభాషలో ‘ముక్తి’ లేదా ’మోక్షం’ అంటే ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. అది జనన మరణ చక్రం నుండి, మనస్సులోని అజ్ఞాన బంధాల నుండి పొందే పరమ శాంతి. లౌకికమైన భోగాలు తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. కానీ అంతిమంగా దుఃఖానికి కారణమవుతాయి. ముక్తి ఎప్పటికీ తరగని ఆనందాన్ని అందిస్తుంది. కోరికలు, రాగద్వేషాలు అనే సంకెళ్ల నుండి మనసును స్వేచ్ఛగా ఉంచడమే నిజమైన ముక్తి. రాజయోగం. దేవుడు మనకు ఏది ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు; కానీ మనమే చిన్న చిన్న కోరికలతో సంతృప్తి పడిపోతున్నాం.ఓ రాజు ఓసారి చెరసాలని సందర్శించాడు. అక్కడున్న ఖైదీల యోగక్షేమాలు ఆప్యాయంగా విచారించి వాళ్ళు కోరింది ఏదైనా ఇస్తానని చెప్పాడు. ఒకరు వేడినీళ్ళనీ, మంచాన్నీ, చెప్పులనీ, మంచి దుస్తులనీ, చక్కటి ఆహారాన్ని ఇలా తలొకటి కోరుకున్నారు. అంతేకాని, ఎవరూ తనకి స్వతంత్రం కావాలని కోరుకోలేదు. మనమంతా కూడా ఆ ఖైదీల్లాంటి వాళ్ళమే. దేవుడిని సంపద, ప్రమోషన్, పిల్లలకి ఉద్యోగం, ఆరోగ్యం లాంటివి కోరుకుంటాం తప్ప, పరమ శాంతిని ఇచ్చే ఆనందకరమైన ముక్తిని కోరుకోం.ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమో గుర్తించే శక్తిని పెంపొందించుకోవాలి. ‘భగవంతుడా! నాకు ఈ వస్తువు ఇవ్వు, ఆ పదవి ఇవ్వు‘ అని అడిగే స్థాయి నుండి ‘నాకు నీపై భక్తిని, పరమ శాంతిని, ముక్తిని ప్రసాదించు‘ అని అడిగే స్థాయికి మనసు ఎదగాలి. రోజూ కొద్దిసేపు ధ్యానం ద్వారా మనసును అంతర్ముఖం చేసి, లౌకిక తాపత్రయాల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించాలి. రాజు ముందర నిలబడిన ఖైదీకి స్వేచ్ఛ కంటే దుస్తులు ఏవిధంగా అల్పమైనదో, పరమాత్మ సమక్షంలో ముక్తి కంటే లౌకిక సంపదలు అంతే అల్పమైనవి. కాబట్టి, తాత్కాలిక సౌఖ్యాలనే కంబళులను, దోమతెరలను కోరుకోవడం మాని, పరమ శాంతిని ఇచ్చే ఆనందకరమైన అంతిమ ముక్తిని కోరుకోవడమే మానవ జన్మకు సార్థకత. ప్రమోషన్ వస్తే సంతోషపడతాం, కానీ కొద్ది రోజులకే మరో కొత్త బాధ్యత లేదా ఒత్తిడి మొదలవుతుంది. పిల్లలకు మంచి ఉద్యోగం వస్తే ఒక నిశ్చింత వస్తుంది, కానీ వారి భవిష్యత్తు గురించి మరో కొత్త ఆందోళన మొదలవుతుంది. అంటే, మనం కోరుకునే లౌకిక విజయాలన్నీ ఒక సమస్యను తీర్చి మరొక తాత్కాలిక ఊరటను మాత్రమే ఇస్తాయి. అనారోగ్యం భయ పెడుతుంది. మంచి ఆరోగ్యాన్ని కోరుకోవడం తప్పేం కాదు, కానీ శరీరం అనిత్యమైనది. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనస్సులో శాంతి లేకపోతే ఆ ఆరోగ్యం కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. ‘ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను’ అనే షరతుల నుంచి మనస్సు విముక్తి పొందడమే ముక్తి. లౌకిక ఆశలు మనల్ని ‘అసంతృప్తి, ప్రయాస, తాత్కాలిక ఉపశమనం’ అనే చక్రంలో తిప్పుతూనే ఉంటాయి. ముక్తి అనేది ఏ వస్తువుపైనా, ఏ వ్యక్తిపైనా, ఏ పరిస్థితిపైనా ఆధారపడని శాశ్వత అంతర్శాంతి. లౌకిక బాధ్యతలను నెరవేరుస్తూనే మన కోరికల దిశను మార్చుకోవచ్చు. పిల్లల చదువు, ఉద్యోగం, ఆరోగ్యం కోసం ప్రయత్నించడం మన బాధ్యత. కానీ దాని ఫలితంతోనే నా జీవిత ఆనందం ముడిపడి ఉందనే మోహాన్ని తగ్గించుకోవడం, బయటి ప్రపంచంలో ఎంత ఎదిగినా, అంతరంగంలో ప్రశాంతత లేకపోతే అదంతా శూన్యమని గుర్తించడమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి మెట్టు.మనకు కావలసింది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే ‘వేడినీళ్లూ మంచమూ’ కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచే అంతర్గత స్వతంత్రత.– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
దుర్వాసుడి కోపానికి భార్య భస్మం.. ఆమె పేరుతో పుట్టిన చెట్టు ఇదే!
ఒకానొకప్పుడు దుర్వాసుడు గంధమాదన పర్వతంపైనున్న వనంలో తపస్సు చేసుకుంటున్నాడు.ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలోనే ఒకనాడు బలిచక్రవర్తి మనవడైన సాహసికుడు, అప్సరస తిలోత్తమ తగిన ఏకాంతం కోసం వెదుకులాడుతూ అక్కడకు వచ్చారు. నిశ్చలంగా తపోనిష్ఠలో కూర్చున్న దుర్వాసుడిని వారు గమనించినా, అతడిని పట్టించుకోకుండా, అతడి ఎదుటనే వారు యథేచ్ఛగా సరస సల్లాపాలకు దిగారు.వారి మాటలకు, వారు చేసే శబ్దాలకు దుర్వాసుడి ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆయన కళ్లు తెరిచి చూశాడు. తన ఎదుటనే సల్లాపాలు సాగిస్తున్న తిలోత్తమా సాహసికులు కనిపించారు. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు వారి చేష్టలకు మండిపడ్డాడు.‘దుర్మార్గులారా! తపోనిష్ఠలో ఉన్న నా ఎదుటనే మీరు నిర్లజ్జగా సల్లాపాలకు దిగారు. మీరు భూలోకంలో రాక్షసులై జన్మిస్తారు’ అని శపించాడు.దుర్వాసుడి ఆగ్రహానికి తిలోత్తమా సాహసికులు భయంతో వణికిపోయారు.‘మహర్షీ! మా అపరాధానికి మన్నించు. శాపోపశమనం నువ్వే అనుగ్రహించు’ అని ప్రార్థించారు.‘సాహసికుడికి బలరాముడి చేతిలో హతమయ్యాక శాప విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడి తనయుడితో కొంతకాలం జీవనం సాగించిన తర్వాత తిలోత్తమకు శాప విమోచనం కలుగుతుంది’ అని పలికాడు దుర్వాసుడు.తిలోత్తమా సాహసికుల కారణంగా తపోభంగం కలిగిన దుర్వాసుడికి తిరిగి ఏకాగ్రత కుదరలేదు. ఆయన మనస్సులో సంసార వాంఛ కలిగింది. దాంతో తపోనిష్ఠను విరమించుకున్నాడు. తనకు తగిన వధువును చూసుకుని, సంసారాశ్రమంలోకి ప్రవేశించాలని తలచాడు. ఔర్వ మహర్షి కుమార్తె కందళి వివాహానికి తగిన వయసులో ఉందని విన్నాడు. వెంటనే ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘మహర్షీ! నీ కుమార్తె వివాహానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకుంటే, ఆమెను నేను వివాహం చేసుకుంటాను’ అని చెప్పాడు.‘దుర్వాసా! నా కుమార్తె కందళి అతిగారాబం వల్ల అవివేకిగా, కోపిష్టిగా తయారైంది. ఆమెను భరించడం కష్టం. అయినా నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరమేమీ లేదు’ అన్నాడు ఔర్వుడు.దుర్వాసుడు కందళిని వివాహం చేసుకోవడానికి తన సమ్మతి తెలిపాడు. ఔర్వుడు వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు.వివాహం తర్వాత దుర్వాసుడు భార్యను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. తన తపో మహిమతో ఆశ్రమంలో అన్ని భోగాలను కల్పించాడు. ఎన్ని భోగాలు కల్పించినా, కందళి తన ధోరణిని మార్చుకోలేదు. గయ్యాళితనంతో భర్తను నిత్యం దేనికో దానికి సాధించసాగింది. భరించినంత కాలం భరించిన దుర్వాసుడు తుదకు సహనం కోల్పోయాడు. ఒకనాడు ధ్యానం చేసుకుంటున్న దుర్వాసుడిని కందళి నిందించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కళ్లు తెరిచి ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె అక్కడికక్కడే భస్మీపటలమైపోయింది.వెంటనే ఆమె భస్మమైన చోటకు ఎగువగా ఆకాశంలో ఒక సుందరి రూపం కనిపించింది. ‘స్వామీ! నా దోషాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించు’ అని పలికి అదృశ్యమైపోయింది.ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు తన భార్య కందళి పేరు భూమ్మీద శాశ్వతంగా నిలిచి ఉండేలా ‘కదళి’ వృక్షజాతిని సృష్టించాడు. దుర్వాసుడి భార్య పేరు కదళీ వృక్షాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయింది.ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఔర్వుడు దుర్వాసుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో తన కుమార్తె కందళి కనిపించలేదు. ఆయన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. దుర్వాసుడిపై మండిపడ్డాడు.‘ఓరీ! నువ్వు అన్నీ తెలుసుకుని నా కుమార్తెను వివాహం చేసుకుని, ఆమెను భస్మీపటలం చేసి, నన్ను తీవ్రంగా అవమానించావు. దీనికి ఫలితంగా నువ్వు భవిష్యత్తులో అంబరీషుడి చేతిలో అవమానం పొంది మిగుల దుఃఖాన్ని అనుభవించగలవు’ అని శపించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఔర్వుడి శాపానికి దుర్వాసుడు కొంత చింతించాడు. అయినా జరిగేది జరగక మానదు అని తనను తాను సమాధానపరచుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు.- సాంఖ్యాయనపురావిశేషం..ఈ ఏడాది పితృపక్షంగా పేరుపొందిన మహాలయపక్షం నేటితో మొదలవుతోంది. పితృతర్పణాలకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం తమిళనాడులోని తిలతర్పణపురి. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం ముక్తీశ్వర స్వామి. అమ్మవారు స్వర్ణవల్లి. శైవక్షేత్రమైన ఈ ప్రదేశంలో పితృదేవతలకు తిలతండులాలతో తర్పణాలు విడిచిపెడితే వారికి ఉత్తమగతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి ఇక్కడే పిండప్రదానం చేశాడని, అలాగే, ద్వాపరయుగంలో పాండవులు కూడా తమ పితృదేవతలకు ఇదేచోట పిండప్రదానం చేశారని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో మరెక్కడా లేని విధంగా నరముఖ గణపతి ఆలయం ఉండటం విశేషం. ఆదివినాయకుడిగా పేరుపొందిన ఇక్కడి వినాయకుడు గజముఖంతో కాకుండా, మానవముఖంతో దర్శనమిస్తాడు.ఇదీ చదవండి: ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్? -
జీవితమే ఓ పద్మవ్యూహం.. బయటపడాలంటే ఏం చేయాలి?
మహాభారతంలో పద్మవ్యూహం అనేది యుద్ధరంగంలో రూపొందించిన అత్యంత సంక్లిష్టమైన వ్యూహాలలో ఒకటి. దానిలోకి ప్రవేశించడం ఒక సవాలు అయితే, సురక్షితంగా బయటకు రావడం మరింత పెద్ద సవాలు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన కథ మనకు ధైర్యాన్ని మాత్రమే కాకుండా, సంపూర్ణ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.ఏ కార్యంలోనైనా ప్రవేశించే ముందు, దాని నుంచి బయట పడే మార్గాన్ని కూడా తెలుసు కోవడం అవసరమనే జీవనసూత్రాన్ని ఈ ఘట్టం మనకు గుర్తుచేస్తుంది.మన జీవితంలో కూడా ఎన్నో ‘పద్మవ్యూహాలు’ ఎదురవుతాయి. ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో ఒత్తిడులు, లక్ష్యసాధనలో అడ్డంకులు– ఇవన్నీ పద్మవ్యూహాలే. ధైర్యం మనల్ని ముందుకు అడుగు వేయిస్తుంది. వ్యూహం సరైన దారిని చూపిస్తుంది. సమయస్ఫూర్తి ప్రమాదం నుంచి బయటపడే మార్గాన్ని సూచిస్తుంది. పద్మవ్యూహంలా మన సమస్యలు కూడా మొదట్లో అర్థంకాని విధంగా కనిపించ వచ్చు. కానీ సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిశీలిస్తే పరిష్కార మార్గాలు క్రమంగా కనిపిస్తాయి.ముందుగా అసలు సమస్య ఏమిటో గుర్తించాలి. తర్వాత మనకు ఉన్న వనరులను అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి. సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.అభిమన్యుడి కథ... ‘ఎంత ప్రతిభావంతుడైనా ప్రతి పరిస్థితినీ ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు’ అని చెబుతోంది. సరైన సహాయాన్ని సరైన సమయంలో స్వీకరించడం కూడా ఒక జ్ఞానమే. సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా, ఆలోచనకు మార్గం, ధైర్యానికి దిశ, ప్రయత్నానికి వ్యూహం ఉంటే ముందుకు సాగవచ్చు.– డా. బాలాజీ దీక్షితులు పి.వి.ఇదీ చదవండి: భిన్నత్వంలో ఏకత్వమే.. శాంతి సౌభాగ్యాలకు బాట! -
భిన్నత్వంలో ఏకత్వమే.. శాంతి సౌభాగ్యాలకు బాట!
విశ్వవ్యాప్తంగా విభిన్న మతాలు, జాతులు కలిసి జీవిస్తున్నాయి. ఒకరి విశ్వాసాలు మరొకరు గౌరవించుకుని కలసి జీవించడం అనాదిగా సాగుతున్న వాస్తవం. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఎక్కడయితే ఒక మతాన్ని, ఒక జాతిని వేరుపరచే విద్వేషాలు నూరిపోసి ఆటంకాలు కలిగిస్తే, అక్కడ అశాంతి, అలజడి జరిగి మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.ఇది ప్రజాజీవన క్రమ వికాసానికి అవరోధం అవుతుంది. దీనివల్ల సమైకత్య, సహజీవన సహభావం కొరవడి నిత్యం అలజడి, అభద్రత, అశాంతి కలిగి దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. పైగా భవిత అస్తవ్యస్తమై యువత నిరాశ నిçస్పృహలతో నిర్వీర్యమై అంతర్గత విప్లవం ప్రారంభమవుతుంది.ఎక్కడయితే సర్వజాతులు, మతాలు, వర్గాలు కలిసిమెలిసి జీవిస్తాయో అక్కడ ఆనందం, శాంతి, సమాధానం పుష్పిస్తాయి. అందుకే పవిత్ర బైబిలు గ్రంథంలో కీర్తనలు 133లో ‘సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం’ అని దావీదు మహారాజు క్రీస్తుపూర్వం 1010లోనే వివరించాడు. ఇక్కడ సహోదరులు అంటే విశ్వవ్యాప్త సోదరులని భావన. అటువంటి చోట పరిమళ తైలపు సువాసనలు వెదజల్లుతాయి అని వివరిస్తాడు. అక్కడే ఆశీర్వాదం, శాశ్వత శాంతి జీవనం కలిగి సమాజం తేజోవంతంగా వెలుగుతుంది.ఆ దేశం నిత్యం ప్రగతిపథంలో ఎదిగి ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. సమాజం ఐక్యంగా జీవించినపుడే శాంతి సౌభాగ్యాలతోపాటు సమసమాజ నిర్మాణం పటిష్టమవుతుంది. అదే సర్వసత్తాక శాంతిమయ కాంతి జీవన జగతిగా భాసిస్తుంది.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారిఇదీ చదవండి: కూతురే...దేశానికి గర్వకారణం! -
నిమజ్జనం అంటే ముగింపు కాదు.. గణపతి చెప్పే జీవిత పాఠమిదే!
గణపతిని ఇంటికి తీసుకొస్తాం.. భక్తిశ్రద్ధలతో పూజిస్తాం.. కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తాం. మరి పూజలు పూర్తయ్యాక అదే గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తాం? ఎంతో భక్తితో ఇంటికి తీసుకొచ్చిన దేవుడిని చివరికి నీటిలో ఎందుకు కలిపేస్తారు? దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే ఉందా? లేక మనకు అర్థం కాని ఆధ్యాత్మిక సందేశం ఏదైనా ఉందా? శాస్త్రోక్త సంప్రదాయాలను పరిశీలిస్తే.. గణేశ నిమజ్జనం వెనుక ప్రకృతి, జీవితం గురించి చెప్పే ఓ గొప్ప భావన కనిపిస్తుంది.శాస్త్రోక్త సంప్రదాయాల ప్రకారం.. గణపతి విగ్రహాన్ని మట్టి వంటి సహజ పదార్థాలతో తయారు చేయడం వెనుక ప్రత్యేకమైన అర్థం ఉంది. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టితో గణపతి రూపాన్ని తయారు చేసి, కొంతకాలం భక్తితో పూజించిన తర్వాత తిరిగి అదే ప్రకృతిలో కలిపేస్తారు. పండితుల వివరణ ప్రకారం.. ఇది ప్రకృతిలో జరిగే సహజ మార్పును గుర్తుచేస్తుంది. పుట్టుక, జీవితం, చివరికి ప్రకృతిలో కలిసిపోవడం.. ప్రతి జీవికి, ప్రతి రూపానికి సహజమైన పరిణామమే అనే విషయాన్ని గణపతి నిమజ్జనం గుర్తుచేస్తుంది.నీటిలోనే నిమజ్జనం ఎందుకు చేస్తారు?భారతీయ సంప్రదాయాల్లో నీటికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. నీటిని జీవానికి ఆధారంగా, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. ఎండిపోయిన నేలకు వర్షం పడితే మళ్లీ పచ్చదనం చిగురించినట్లే.. నీరు కొత్త జీవానికి నాంది పలుకుతుంది. అలా గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో.. ప్రకృతి నుంచి తీసుకున్నది తిరిగి ప్రకృతికే చేరుతుందనే భావనను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. మట్టి విగ్రహం నీటిలో క్రమంగా కరిగి సహజ పదార్థాల్లో కలిసిపోవడం కూడా ప్రకృతిలో ప్రతీది లీనం అనే భావనకు ప్రతీకగా చూడవచ్చు.ఎన్నవరోజు నిమజ్జనం చేయాలి?గణపతిని ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలనే విషయంలో కూడా ఒకే విధానం లేదు. అయితే, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ ఆచారాలను బట్టి నిమజ్జనం చేసే రోజు మారుతూ ఉంటుంది. కొందరు ఒకటిన్నర రోజునే నిమజ్జనం చేస్తే.. మరికొందరు 3, 5, 7, 9 లేదా 10వ రోజున నిమజ్జనం చేస్తారు. అంటే పదో రోజునే తప్పనిసరిగా నిమజ్జనం చేయాలనే నియమం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఆయా ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది.ఇక గణేశ నిమజ్జనం మనకు చెప్పే అసలు సందేశం మన జీవితంతో ముడిపడి ఉందన్న విషయం వేద పండితులు ఈ పండుగతో మనకు పదే పదే గుర్తుచేస్తున్నారు. ఎంత అందమైన రూపమైనా శాశ్వతం కాదు. అలాగే మనం సంపాదించే సంపద, హోదా, పేరు కూడా శాశ్వతంగా మనతో ఉండవు. ప్రకృతి నుంచి తీసుకున్నదాన్ని తిరిగి ప్రకృతికే అందించడంతో.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని ఈ ఆచారం గుర్తుచేస్తుంది.గణపతిని భక్తితో ఆహ్వానించినట్టే.. సమయం వచ్చినప్పుడు అదే భక్తితో సాగనంపడం కూడా జీవితంలో ఒక భాగమేనని చెబుతున్నారు. వచ్చినదాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం.. సమయం వచ్చినప్పుడు వదిలేయడం.. మనం నేర్చుకున్న మంచి విషయాలను మాత్రం జీవితాంతం మనతో తీసుకెళ్లడం.. ఇదే గణేశ నిమజ్జనం మనకు అందించే అందమైన జీవిత సందేశం.ఇదీ చదవండి: మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా? -
14 ముడుల అనంత సూత్రం వెనుక రహస్యం ఏంటి?
జీవితంలో వచ్చే కష్టాలు, బాధల నుంచి విముక్తి పొందడానికి, సకల ఐశ్వర్యాలు కలగడానికి ఆచరించ వలసిన వ్రతం అనంత పద్మనాభ వ్రతం. భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశికే అనంత పద్మనాభ చతుర్దశి అని పేరు. అనంత వ్రతం ఆచరించే పవిత్రమైన పర్వదినం ఇదే. ఈ రోజున ఆదిశేషువుపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును (అనంత పద్మనాభుడిని) భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రేపు అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా ఆ వ్రతానికి సంబంధించిన పూజా విధానం, వ్రత కథ...వినాయక చవితితో ప్రారంభమైన గణేశ ఉత్సవాలు పదవరోజైన ఈ అనంత చతుర్దశి నాడే గణపతి నిమజ్జనంతో ముగుస్తాయి. 14 ముడులు ఉన్న అనంత సూత్రం అనే పవిత్రమైన తోరపు దారాన్ని చేతికి కట్టుకోవడం ఈ వ్రతంలో ప్రధాన ఆచారం. ఈ దారం సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసుకోరు. ఇంటి ఆచారం ప్రకారం ముందు తరాల నుంచి తర్వాతి వారికి అందుతూ ఉంటాయి.కలశ స్థాపన:పూజా స్థలంలో బియ్యం పోసి, దానిపై వెండి లేదా రాగి కలశాన్ని ఉంచుతారు. కలశంపై దర్భలతో చేసిన ఏడు పడగల శేషనాగు (పాము) బొమ్మను ఉంచి పూజిస్తారు.యమునా పూజ:ప్రధాన పూజకు ముందు ఒక పాత్రలో నీటిని తీసుకుని, అందులోకి యమునా నదీదేవతను ఆవాహన చేసి పూజించడం ఈ వ్రతంలో ఒక ముఖ్య విశేషం.అనంత సూత్ర పూజ:కుంకుమ, పసుపు రాసిన 14 ముడులు కలిగిన ఎరుపు రంగు దారాన్ని (అనంత తోరం) స్వామివారి వద్ద ఉంచి పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ఈ తోరాన్ని కట్టుకుంటారు.షోడశోపచార పూజ:శ్రీ అనంత పద్మనాభ స్వామికి 14 రకాల పూలు, పత్రాలతో షోడశోపచార పూజ చేస్తారు.నైవేద్యం:ఈ వ్రతంలో 14 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే 14 రకాల పిండి వంటలు లేదా కనీసం 14 బూరెలు/గారెలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.వ్రత కథ:మహాభారతంలో అరణ్యవాసం చేస్తూ కష్టాల్లో ఉన్న ధర్మరాజుకు శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ వ్రత మహత్యాన్ని వివరిస్తాడు. పూర్వం కృతయుగంలో జరిగిన కథను చె΄్తాడు: సుమంతుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె శీల. ఆమెకు కౌండిన్య మహర్షితో వివాహం జరుగుతుంది.ఒకసారి శీల నదీతీరంలో స్త్రీలు అనంత వ్రతం ఆచరించడం చూసి, తాను కూడా భక్తితో ఆ వ్రతాన్ని చేసి, 14 ముడుల అనంత సూత్రాన్ని చేతికి కట్టుకుంటుంది. ఆ వ్రత ప్రభావం వల్ల కౌండిన్యుడి ఆశ్రమం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అయితే, ఒకరోజు కౌండిన్యుడు శీల చేతికున్న దారాన్ని చూసి, అది తనను వశపరుచుకోవడానికి కట్టిన తంత్రం అనుకుని, కోపంతో ఆ దారాన్ని తెంపి అగ్నిలో పారేస్తాడు.అత్యంత పవిత్రమైన అనంత సూత్రాన్ని అవమానించినందుకు, ఆ క్షణం నుండి వారి ఐశ్వర్యం అంతా హరించుకుపోయి, వారు తీవ్ర దారిద్య్రం లో మునిగిపోతారు. తమ తప్పును తెలుసుకున్న కౌండిన్యుడు పశ్చాత్తాపంతో అడవుల పాలై, అనంత పద్మనాభ స్వామి కోసం తీవ్రంగా అన్వేషిస్తాడు. చివరకు స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చి, ఓదార్చుతారు. స్వామి వారి ఆజ్ఞ ప్రకారం కౌండిన్యుడు 14 సంవత్సరాల పాటు నిష్ఠగా అనంత వ్రతాన్ని ఆచరించి, కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందుతాడు. ఈ వ్రతాచరణతో ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కవచ్చని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.ఇదీ చదవండి: ఏడు పడగల నాగకల్లు.. ఈ ముడి రహస్యం ఏంటి? -
నాగకల్లును సంతానం కోసం ఎందుకు పూజించేవారు?
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన పురాతన నాగకల్లు శిల్పం. ఇది సుమారు పదవ పదకొండవ శతాబ్దాల నాటిది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మ్యూజియం పురావస్తు విభాగంలో భద్రపరచబడి ఉంది. ఈ శిల్పం దాదాపు 99 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శిల్పం పైభాగంలో ఏడు పడగలు విప్పిన సర్పరాజు ఆకృతి అత్యంత నైపుణ్యంతో చెక్కబ\డింది. హిందూ సంప్రదాయంలో దీనిని సంతానోత్పత్తికి, సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు.శిల్పం కింది భాగంలో పాములు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి సంక్లిష్టమైన ముడి ఆకారాన్ని తలపిస్తాయి. దీనిని నాగబంధం అని పిలుస్తారు. ఈ ముడి ఎక్కడ మొదలైందో ఎక్కడ పూర్తయిందో గుర్తించడం చాలా కష్టం. ఈ జ్యామితీయ ముడుల రూపం దక్షిణ భారతదేశంలో ఇళ్ల ముందు స్త్రీలు బియ్యప్పిండితో పెట్టే సాంప్రదాయక మెలికల ముగ్గు లేదా రథం ముగ్గును పోలి ఉంటుంది. శిల్పం పైభాగంలో ఎడమవైపు సూర్యుడు, కుడివైపు చంద్రుని ఆకృతులు అలాగే ముడుల మధ్యలో గుండ్రటి పద్మం ఆకారం చెక్కబడి ఉన్నాయి. ఇవి సృష్టిలోని శాశ్వతత్వానికి, పవిత్రతకు చిహ్నాలు.దక్షిణ భారతదేశంలో నాగారాధన చాలా పురాతనమైనది. సంతానం లేని మహిళలు సంతానోత్పత్తి కోసం వంశాభివృద్ధి కోసం ఇటువంటి నాగకల్లులను ప్రతిష్టించి పూజలు చేసేవారు. పూర్వకాలంలో ఈ నాగకల్లులను గ్రామాల సరిహద్దులలో గుడుల ప్రవేశ ద్వారాల వద్ద పవిత్రమైన రావి చెట్ల కింద లేదా చెరువుల గట్లపై ప్రతిష్టించేవారు. ఇవి గ్రామానికి రక్షణ కల్పిస్తాయని నమ్మేవారు. నాగ పంచమి రోజున ఈ శిల్పాలకు పాలు పెరుగు నెయ్యి కొబ్బరినీళ్లు పోసి పూజలు చేస్తారు.చెన్నై ప్రభుత్వ మ్యూజియంలో 700కు పైగా శిలా శిల్పాలు ఉన్నాయి. వాటిలో సుమారు 10 నాగకల్లు శిల్పాలు ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రపంచంలోనే అత్యధిక కాంస్య విగ్రహాల సేకరణ కలిగిన సంస్థలలో ఒకటి. ఈ శిల్పం ప్రాచీన భారతదేశంలోని శిల్పుల అసాధారణ రేఖాగణిత పరిజ్ఞానానికి రాతిపై వారు చూపిన సూక్ష్మ నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం.– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ఇదీ చదవండి: మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా? -
మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా?
ప్రతి ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షాన్ని (15 రోజులను) మహాలయ పక్షం లేదా పితృపక్షం అని పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో మహాలయ పక్షాలు లేదా పితృ పక్షం అనేది గతించిన మన పితృదేవతలను (పూర్వీకులను) స్మరించుకుంటూ, వారికి కృతజ్ఞతగా శ్రాద్ధకర్మలు, తర్పణాలు అర్పించడానికి కేటాయించిన అత్యంత పవిత్రమైన రోజులు. మహాలయ పక్షాల విశిష్టత, పురాణ నేపథ్యం, ఆచరించాల్సిన విధులకు సంబంధించిన సమగ్ర సమాచారం... హిందూ ధర్మం ప్రకారం, మరణించిన మన తల్లిదండ్రులు, తాతముత్తాతల ఆత్మల శాంతికోసం ప్రతి ఏటా వారి తిథి నాడు ఆబ్దికం నిర్వహిస్తారు. అయితే, ఏవైనా కారణాల వల్ల ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు నిర్వహించలేకపోయిన వారు, ఈ 15 రోజుల మహాలయ పక్షంలో ఏ రోజైనా తర్పణాలు ఇవ్వవచ్చు. ఈ సమయంలో యమధర్మరాజు పితృదేవతలను తమ వారసుల నుంచి పూజలు అందుకోవడానికి భూలోకానికి అనుమతిస్తారని, వారు తమ సంతానం ఇచ్చే పిండప్రదానాల కోసం ఆకలిదప్పులతో ఎదురు చూస్తుంటారని గరుడ పురాణం చెబుతోంది.పురాణ నేపథ్యం (కర్ణుడి కథ)మహాలయ పక్షాల ప్రాధాన్యత గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి తినడానికి ఆహారానికి బదులుగా బంగారం, వెండి, రత్నాలు లభిస్తాయి. ఆకలి దప్పులతో అలమటించిన కర్ణుడు దీనికి గల కారణాన్ని యమధర్మరాజును అడగ్గా... కర్ణుడు తన జీవితకాలంలో ఎంతో దానం చేసినప్పటికీ, అన్నదానం చేయలేదని, అలాగే పితృదేవతలకు తర్పణాలు అర్పించని ఫలితమే అదంతా అని తెలుపుతాడు.తన పూర్వీకులెవరో తెలియకపోవడం వల్లే అలా చేయలేకపోయానని కర్ణుడు చెప్పడంతో, యముడు అతనికి 15 రోజుల పాటు భూలోకానికి వెళ్లేందుకు అనుమతిస్తాడు. ఆ సమయంలో కర్ణుడు భూమిపైకి వచ్చి తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానం చేయడం వల్ల తిరిగి స్వర్గంలో అన్న పానీయాలు పొందుతాడు. ఆ పక్షందినాలే మహాలయ పక్షాలు.ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఎలాంటి ఫలితమంటే..?మహాలయ పక్షాల్లోని 15 రోజుల్లో ఒక్కో తిథికి ఒక్కోప్రత్యేకత ఉంది. శాస్త్రాల ప్రకారం ఆయా రోజుల్లో తర్పణాలు ఇస్తే కలిగే ఫలితాలు:పాడ్యమి: ధన్రపాప్తి కలుగుతుంది.విదియ: ఉత్తమ సంతానం కలుగుతుంది.తదియ: వ్యాపార, ఉద్యోగాల్లో ప్రగతి లభిస్తుంది.చవితి: శతృ భయం తొలగిపోతుంది.పంచమి: బంగారం, వెండి వంటి సంపదలు లభిస్తాయి.షష్ఠి: సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.సప్తమి: నాయకత్వ లక్షణాలు, అధికార బలం చేకూరతాయి.అష్టమి: బుద్ధి వికాసం, బ్రహ్మజ్ఞానం లభిస్తాయి.నవమి: మాతృశ్రాద్ధానికి శ్రేష్ఠమైనది, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. దశమి: కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.ఏకాదశి: వేద విజ్ఞానం లభిస్తుంది.ద్వాదశి: వంశాభివృద్ధి జరుగుతుంది.త్రయోదశి: అపారమైన సంపద, పశులాభం.చతుర్దశి: ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు (బలవన్మరణాలు) పొందిన వారికి ఈ రోజు శ్రాద్ధం పెట్టాలి. అమావాస్య (సర్వపితృఅమావాస్య): పక్షం రోజులు చేయలేని వారు ఈ ఒక్క రోజు శ్రాద్ధం పెట్టినా, పూర్వీకులందరి ఆశీస్సులు లభిస్తాయని ప్రతీతి. పితృదోషాలు – పరిహారాలుకుటుంబంలో ఎవరికైనా అకాల మరణాలు సంభవించినా, లేదా పెద్దలకు సరిగ్గా ఆబ్దికాలు నిర్వహించకపోయినా ఆ కుటుంబానికి పితృదోషం చుట్టుకుంటుందని, దీనివల్ల ఇంట్లో నిరంతరం కలహాలు, వివాహం ఆలస్యం కావడం, అప్పుల పాలు కావడం, సంతాన లేమి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయనీ శాస్త్ర కథనం.పరిహారాలుమహాలయ పక్షాల సమయంలో నది తీరాలలో లేదా పుణ్యక్షేత్రాలలో తిల హోమం, నారాయణ బలి పూజ ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు స్వయంపాకం (బియ్యం, కూరగాయలు) దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. కాకులకు, గోవులకు రోజూ ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ పితృ పక్షాల సమయంలో కేవలం పితృదేవతల ఆరాధనకే సమయాన్ని కేటాయిస్తారు. భక్తిశ్రద్ధలతో మన పూర్వీకులను స్మరిస్తూ ఈ మహాలయ పక్షంలో తర్పణాలు అర్పించి వారి ఆశీస్సులు పొందడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: ముగ్గురు గురువులు: ఒక దొంగ.. ఒక కుక్క.. ఓ చిన్నారి..! -
ముగ్గురు గురువులు: ఒక దొంగ.. ఒక కుక్క.. ఓ చిన్నారి..!
గొప్ప సూఫీ జ్ఞాని హసన్ బస్రీ చివరి ఘడియల్లో ఉన్నప్పుడు, ఒక సన్నిహితుడు ‘హసన్, నీ గురువు ఎవరు?’ అని అడిగాడు. దానికి హసన్ ఇలా అన్నాడు: ‘‘అది చెప్పడం కొంచెం కష్టం.ఎందుకంటే నాకు వేలమంది గురువులు ఉన్నారు. ఇప్పుడు అందరి గురించీ చెప్పేంత సమయం లేదు. కానీ ముగ్గురు గురువుల గురించి చెప్తాను.మొదటి గురువు– ఒక దొంగ: ఒకసారి నేను ఎడారిలో దారితప్పి అర్ధరాత్రి ఒక ఊరికి చేరుకున్నప్పుడు, ఒక దొంగ నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతని వద్ద ఒక నెల రోజులు ఉన్నాను. ప్రతి రాత్రి అతనికి ఏమీ దొరకకపోయినా ఎప్పుడూ నవ్వుతూ, రేపు మళ్ళీ ప్రయత్ని స్తాను. దేవుడి దయ ఉంటే రేపు నా పని పూర్తవుతుంది అనేవాడు. ఏళ్ళ తరబడి నేను ధ్యానం చేస్తూ తీవ్ర నిరాశకు గురైనప్పుడు, ఆ దొంగకే అంత ఆశ, నమ్మకం ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రయత్నించకూడదు? అనిపించేది.రెండో గురువు– ఒక కుక్క: ఒక రోజు తీవ్రమైన దాహంతో ఉన్న ఒక కుక్క నీటిలోకి చూడగానే, తన నీడను చూసి వేరొక కుక్క అనుకుని భయపడింది. చివరకు దాహం ఎక్కువై, భయాన్ని పక్కన పెట్టి నీటిలోకి దూకగానే ఆ నీడ మాయమై హాయిగా నీళ్ళు తాగింది. నేను కూడా జ్ఞాన సాధనలో భయపడి వెనక్కి తగ్గినప్పుడు ఆ కుక్కను గుర్తుచేసుకుని ధైర్యంగా ముందుకు దూకాను. దాంతో నాలోని భయం, నేను అనే భావం మాయమై పరమాత్మ మిగిలాడు.మూడో గురువు– ఒక చిన్న పిల్లాడు: చేతిలో వెలుగుతున్న ప్రమిదను పట్టుకుని వెళ్తున్న పిల్లాడిని ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగలవా? అని అడిగాను. ఆ పిల్లాడు గాలి ఊది ఆ దివ్వెను ఆర్పేసి, వెలుగు ఎక్కడికి పోయిందో మీరే చెప్పండి! అన్నాడు. ఆ క్షణం నుండి నా పండితత్వాన్ని, జ్ఞానమనే అహంకారాన్ని పూర్తిగా వదిలేశాను’’.– యామిజాల జగదీశ్ -
పాండిత్యమా.. స్వానుభవమా? సత్యాన్ని చూపించేది ఏది?
మహర్షులు స్వానుభవంతో రచించిన గ్రంథాలనే శాస్త్రాలని అంటారు. అవి ఏ భాషలో ఉన్నా ఆ భాషలో ప్రావీణ్యత వున్న వారందరికీ ఆ శాస్త్రాలు బాగా అర్థమవుతాయని చెప్పలేము. ఆ యా మహర్షులు ఏ అనుభవాన్ని పొంది వాటిని రచించారో ఆ అనుభవాన్ని పొందిన వారికే ఆ శాస్త్రాల సారం తెలుస్తుంది. కేవల పాండిత్యం అసలైన అర్థాన్ని గ్రహించలేక పోవటమేకాక తప్పు అర్థాన్నిచ్చి తప్పుదారి పట్టించే ప్రమాదం కూడా ఉంది.ఒకసారి రాధాస్వామి సత్సంగ్‌కు చెందిన జైమల్ సింగ్జీ వద్దకు ముగ్గురు పండితులు వచ్చారు. వారు ఏదో ఒక శాస్త్ర అంశంపై వాదించుకొని, ఏది సరైన భావమో తేల్చుకోలేక, జైమల్ ఒక మహాత్ముడనీ; అంతర దృష్టి, స్వానుభవం గల వ్యక్తి అయినందున సరైన అర్థం చెప్పగలడనీ భావించారు. బాబాజీ వారితో ‘నాకు సంస్కృతం రాదు, అర్థమైనంత చెబుతాను’ అంటూనే విషయాన్నంతా విడమరచి చెప్పినారు. ఆ పండితులు నివ్వెరపోయారు. ‘మమ్మల్ని మీ శిష్యులుగా చేసికొని ఉపదేశమివ్వండి’ అని ప్రార్థించారు. కానీ జైమల్ సింగ్జీ వారితో ‘బాగా చదువుకున్నవారు, విద్యను ఆధారం చేసుకునేవారు నామాభ్యాసాన్ని (సాధనను) చేయలే’రని అన్నారు.మహా పండితుడైన కావ్యకంఠ గణపతి శాస్త్రి గారికి మోక్షం వస్తుందా అని భగవాన్ రమణ మహర్షిని ఎవరో అడిగారట– ‘ఇంత పాండిత్యం ఉన్నవారికి మోక్షమెట్లొస్తుంది’ అన్నారట ఆయన. పాండిత్యం సత్యాన్ని మరుగు పరుస్తుంది. అహంకారాన్ని పెంచుతుంది. స్వానుభవం సత్యాన్ని ప్రకాశింప చేస్తుంది. వినయాన్ని వృద్ధిచేసి, ఆత్మ విశ్వాసాన్ని ధృఢ పరుస్తుంది. జైమల్ సింగ్జీ మాటల్ని విన్న పండితుల్లో ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక్కరు పట్టుదలతో ఆయన వద్దే ఉండి దీక్ష పొందాడు (పుట 58 – భూతల స్వర్గము–రాధాస్వామి సత్సంగ్ బ్యాస్). పాండిత్యం కోసం ప్రాకులాడక, అంతర్ముఖులై సత్య సాక్షాత్కారానికై కృషి చేయటమే శ్రేయస్కరమన్నది పెద్దల మాట.– రాచమడుగు శ్రీనివాసులుఇదీ చదవండి: విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..? -
పాండవులు హస్తినకు రాగానే.. వ్యాసుడు ఎందుకు ఆ మాట అన్నాడు?
ధర్మదేవత అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వనీదేవతల అంశతో నకుల సహదేవులు– శతశృంగ పర్వతంపై తన ఇరువురు భార్యలైన కుంతి, మాద్రిలతో కాలం గడిపిన రోజులలో– పాండురాజుకు కలిగిన సంతానం. శాపకారణంగా పాండు రాజు, మాద్రి మరణించిన తరువాత పదిహేడు రోజులకు, పాండు రాకుమారులు ఐదుగురితో ధృత రాష్ట్రుడి వద్దకు చేరింది కుంతి.శతశృంగ పర్వతం నుండి తోడుగా వచ్చిన మునిజనం, అక్కడ జరి గిన సంగతులను ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పి, బాలురుగా ఉన్న పాండుపుత్రులు ఐదుగురిని, కుంతిని ధృతరాష్ట్రు డికి అప్పగించి వెళ్ళిపోయారు. అప్పుడు వారిని రాజభవనంలోకి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళినవారిలో, పాండు పుత్రుల ముత్తమ్మ సత్యవతి, నాన్నమ్మలు అంబిక, అంబాలిక కూడా ఉన్నారు. స్వాగత కార్యక్రమాలన్నీ ముగిశాక, రాజప్రాసాదంలో ఎవరెవరి గదులలోకి వారు వెళ్ళి స్థిరపడినాక, వ్యాసభగవానుడు తన తల్లి అయిన సత్యవతితోనూ, మరదళ్ళయిన అంబిక, అంబాలికలతోనూ ఇలా అన్నాడు (ఆంధ్ర మహాభారతం, పంచమాశ్వాసం):క. క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్రసుతు లసద్ వృత్తులు నిష్కారణవైరులు వీరలకారణమున నెగ్గు పుట్టు గౌరవ్యులకున్.ధృతరాష్ట్రుడి కొడుకులు క్రూరమనస్కులు, ఏ కారణం లేకుండానే వైరానికి దిగేటటువంటివారు, ధర్మబద్ధ నడవడి లేనటువంటివారు. వాళ్ళ వలన కౌరవకులానికి చాలా గొప్ప హాని జరగనుంది. ‘దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుంగాన మీ రీ దారుణంబు జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుం’ డని చెప్పి వెళ్ళి పోయాడు. కొడుకు మాటలను విన్న సత్యవతి, భీష్ముడికి విదురుడికి చెప్పి, కోడళ్ళైన అంబిక, అంబాలికలను వెంట తీసుకుని తపోవనానికి వెళ్ళిపోయింది. అక్కడ ఉంటూనే వాళ్ళు ముగ్గురూ కొంత కాలం తరువాత ప్రాణాలను వది లారు. చివరికి వ్యాసుడు చెప్పిందే జరిగింది. పర్యవసానాన్ని ధృతరాష్ట్రుడు ఒక్కడే చివరిదాకా అనుభవించాడు.– భట్టు వెంకటరావు -
కృతజ్ఞత: పరిపూర్ణ వ్యక్తిత్వానికి తొలిమెట్టు!
తల్లి కేవలం జన్మనిచ్చే దేహం కాదు, అది ఒక పవిత్ర క్షేత్రం. తొమ్మిది నెలలు తన రక్తాన్ని పాలుగా మార్చి, మనిషికి ప్రాణం పోసిన మొదటి గురువు అమ్మ. సంస్కారం గర్భం నుండే మొదలవుతుంది. కాయను కాపాడే తొక్కలా, విత్తనాన్ని రక్షించే పొరలా అమ్మ ప్రేమ బిడ్డను నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది. నేటి యాంత్రిక జీవనంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే, అది తల్లి ప్రేమను తూకం వేస్తున్న అజ్ఞానానికి నిదర్శనం. అమ్మ మన అస్తిత్వంఅమ్మ పాదాల చెంత ఉన్నంత ప్రశాంతత ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. కష్టకాలంలో అమ్మ ఇచ్చే ఒక ఓదార్పు మాట, వేల కోట్ల విలువైన ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మను గౌరవించడం అంటే, మన అస్తిత్వాన్ని మనం గౌరవించుకోవడమే.అదృశ్య శ్రమకు చిహ్నం తండ్రితండ్రి భుజంపై కూర్చుంటేనే కదా పసివాడు ఈ లోకాన్ని చూడగలుగుతాడు! కన్నబిడ్డ భవిష్యత్తు కోసం తన కలలను, శ్రమను ధారపోసే అద్భుత శిల్పి నాన్న. నాన్న కన్నీళ్లు ఎవరికీ కనిపించవు, కానీ ఆయన పడే కష్టం ఇంటి పునాదిలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎండకు ఎండి, వానకు తడిసి మనకు నీడను ఇచ్చే ఇంటి కప్పులా తండ్రి శ్రమ అదృశ్యంగా ఉంటుంది. తండ్రి వేలు పట్టుకుని నడక నేర్చిన వ్యక్తి, పదిమందిలో తలెత్తుకుని బతకడమే ఆయనకు ఇచ్చే అసలైన కృతజ్ఞత. సంక్షోభ సమయాల్లో నాన్న చూపే స్థితప్రజ్ఞత, నేటి యువత నేర్చుకోవాల్సిన గొప్ప జీవన నైపుణ్యం. నాన్న మాట ఒక శాసనం కాదు, అది మన బాగుకోసం చేసే ఒక దిశానిర్దేశం.కృతజ్ఞతే అసలైన సంపదనేటి పోటీ ప్రపంచంలో కృతజ్ఞత)అనేది మానసిక ఆరోగ్యానికి పరమౌషధం. మన ఎదుగుదలలో తోడ్పడిన ఈ ముగ్గురిని నిత్యం స్మరించుకోవడం వల్ల అంతరంగాన అహంకారం నశించి, వినమ్రత పెరుగుతుంది. బావిలోని నీరు తోడేకొద్దీ ఊరుతుంది; కతజ్ఞత పెరిగేకొద్దీ వ్యక్తిత్వం వికసిస్తుంది. అపజయాలు ఎదురైనప్పుడు అమ్మ భరోసా, నాన్న ధైర్యం, గురువు మార్గదర్శకత్వం కన్నా గొప్ప అస్త్రాలు లోకంలో లేవు. వీరే మన మూలాలు, వీరే మన జీవన నిధులు. మూలాలు లేని సౌధం చిన్న గాలివానకే కుప్పకూలుతుంది; కానీ ఈ ‘త్రిదేవతల’ ఆశీస్సులున్న వ్యక్తి అజేయుడిగా నిలుస్తాడు.ఆచార్యదేవో భవ: జ్ఞాన నేత్రంతల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తాడు. అక్షర జ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వరకు నడిపించే దివిటీ ఆచార్యుడు. గురువు లేని విద్య, చుక్కాని లేని నావ వంటిది. చీకటి గదిలో వెలుగునిచ్చే దీపంలా, అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞాననేత్రాన్ని తెరిపించే శిల్పి గురువు. నేడు గూగుల్‌లో సమాచారం దొరకవచ్చు, కానీ దాన్ని ఎలా వినియోగించాలో నేర్పే సంస్కారం గురువు వద్దే దొరుకుతుంది. విజ్ఞానానికి వివేకాన్ని జోడించి, వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసే శిల్పి గురువు. గురువును గౌరవించడం అంటే, విజ్ఞానాన్ని గౌరవించడమే.. – కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..?
అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు, వ్యాసమహర్షి, పాండవులు శ్రద్ధగా విన్నారే కానీ ఎవరూ వ్రాసుకోలేదు. ఎంతో మహిమాన్వితమైన సహస్రనామాలను అందరికీ చేరేందుకు లిఖించబడాలి... కానీ ఇప్పుడు ఎలా? అని ధర్మరాజు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మను అడుగగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ పాండవుల్లో కనిష్టుడైన సహదేవుడు వల్లే సాధ్య అవుతుంది. అంతేకాకుండా వ్యాస మహర్షి లిఖిస్తే అందరికీ అందేలా గ్రంథస్థం చేయించవచ్చునని సమాధానమిచ్చాడు. అందుకు ధర్మరాజు అదెలా సాధ్యమనగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ మనందరిలో ఒక సహదేవుడు మాత్రమే సూతస్పటికం వేసుకున్నాడు. దానివల్లే సాధ్యమవుతుందన్నాడు.సూత స్ఫటికం అంటే.....వాతావరణంలో ప్రయాణించే శబ్ద తరంగాలను గ్రహించి తనలో నిల్వ చేసుకోగల ఒక అద్భుతమైన స్పటికం. హిందూ పురాణాల ప్రకారం సూతస్ఫటికాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. నేటి ఆధునిక టేప్ రికార్డర్‌లా పనిచేస్తుంది. గాలిలో కలిసిపోయిన శబ్ద తరంగాలను రికార్డు చేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ వినిపించ గల శక్తి దీనికుంది.సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం మనమందరం పిలుస్తున్న క్లౌడ్ స్టోరేజ్ లాంటిది.అంత మహిమాన్వితమైన సూతస్పటికాన్ని ధరించిన సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే స్పటికంలో నమోదుకాబడిన శబ్ద తరంగాలు వెనకకు వస్తాయని (రీప్లే)వాటిని వ్యాస మహర్షి తో వ్రాయించాలని శ్రీ కృష్ణుడు సలహా ఇవ్వడంతో సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థించడం, వ్యాసమహర్షి విష్ణు సహస్రనామాలను లిఖించడంతో, అవి మనందరికీ గ్రంథస్వరూపంలో అందాయి. వాటినే మనం ప్రతిరోజు పఠనం చేసుకుంటున్నాము.ఇదంతా ఎలా తెలిసిందంటే... బహుశా... 1940లో అనుకుంటా... అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామీజీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి టేప్ రికార్డుతో వచ్చాడు. ఆ సందర్భంగా స్వామీజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏదని అడిగితే ఎవరినుండీ....ఏ మాత్రం సమాధానం రాలేదు. అప్పుడు స్వామీజీ మనకు విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయి ?.... ఎలా లిఖించబడింది.... ఎవరు వ్రాసారు... అని ప్రశ్నించారు. మరలా మౌనమే సమాధానం కావడంతో స్వామీజీ పైన చెప్పుకున్న కథనంతా చెప్పారన్నమాట. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ! -
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.పురావిశేషం..ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.- సాంఖ్యాయనఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు? -
ఏ శుభకార్యమైనా గణపతి పూజతోనే ఎందుకు మొదలు? కారణం ఇదే!
మహాభారత కర్త, అష్టాదశ పురాణకర్త వేదవ్యాసుడు వేదాలకు వ్యాఖ్యానంగా, కలియుగంలో మానవులకు సరళ సుబోధకంగా ఉండేటట్లు ప్రతి ఆశ్రమంలోను పాటించవలసిన విధి విధానాలను చెప్పాలనుకున్నాడు. కానీ భావస్ఫూర్తి, వ్యక్తీకరణలలో స్తబ్ధత ఏర్పడింది. ఎందుకలా జరిగిందో తెలియలేదు. వెంటనే వ్యాసుడు సత్యలోకానికి వెళ్లి, బ్రహ్మ పాదాలకు ప్రణమిల్లి, ఈ స్తబ్ధతకు కారణం తెలపమని, దాని నుంచి బైటపడి కార్య సాఫల్యం జరిగే మార్గం తెలపమని ప్రార్థించాడు.అప్పుడు బ్రహ్మ వ్యాసునితో, ‘నువ్వు వేద విభాగ కార్యారంభంలో, ఈ సృష్టికి ఆద్యుడు, సర్వ కార్యాలకు కర్త, త్రిమూర్తులమైన శివుడు, విష్ణువు, నేను కూడా ప్రణవస్వరూపంగా ధ్యానించే మూర్తి, ముఖ్యంగా నమ్మినవారికి కార్య సాఫల్యం కూర్చేవాడు అయిన గజాననుని పూజించలేదు. ఆ వినాయకుని సర్వ కార్యారంభాలలోనూ, స్మరించుట చేతనూ, భక్తితో పూజించటం వల్లనూ సకల విఘ్నాలు దూరమవుతాయి. గణపతి ప్రసన్నుడైతే నీ కార్యం సాను కూలమవుతుంది. వెంటనే ఆ దేవదేవుని పూజించి శరణు పొందు’ అని బ్రహ్మ చెప్పాడు.అప్పుడు వ్యాసుడు బ్రహ్మను ‘ఆ విఘ్నహరుడు ఎలా ఉంటాడు? ఇంతకు మునుపు ఎవరెవరిని అనుగ్రహించాడు? ఆయన చేసిన మహత్తర కార్యాలేవి?’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు. గణేశుని పూజించి తరించిన అనేక భక్తుల కథలను బ్రహ్మ వినిపించి, వ్యాసునికి కార్యసిద్ధి ప్రదం అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి, అనుష్టాన క్రమాన్ని వివరించి, గణేశుని ప్రసన్నుని చేసుకుని వరం కోరుకొమ్మన్నాడు. అలాగైతేనే ‘నీకు సమస్త గ్రంథ రచనా శక్తి కలుగుతుం’దని చెప్పాడు. కారణం తెలిసింది. వ్యాసుని నిర్వేదం తొలగింది. గణపతి ఆదిదైవం. అందుకే ఏ పూజనైనా, ఏ శుభ కార్యాన్నైనా గణపతి పూజతోనే ప్రారంభిస్తాం.– డా. చెంగల్వ రామలక్ష్మిఇదీ చదవండి: తెలివైన చలికోడి -
జింకపిల్లకు పులిపాలు!
తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయం స్తంభంపై చెక్కబడిన అరుదైన శిల్పం ఒకటి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం మురుగేశుని ఆరు పడై వీడులలో మొదటిదిగా పేరుగాంచింది. మదురై నగర కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందమలై అనే పవిత్ర కొండపై ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆరవ శతాబ్దంలో పాండ్యుల కాలంలో రాతిని తొలచి నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత నాయక రాజులు పదహారవ శతాబ్దంలో విస్తరించారు. శివుడు, విష్ణువు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకమైన లక్షణం. ఆ శిల్పంలో పరమశివుడు ఒక జింక పిల్లను ఒడిలో పట్టుకుని రక్షిస్తున్నట్లుగా పక్కనే నోరు తెరిచిన పులి ఆకృతి కనిపిస్తుంది. ఈ చిత్రంలో పాలు తాగుతున్న జింకను చూడవచ్చు. ఈ శిల్పానికి ఉన్న పురాణ నేపథ్యం తమిళ శైవ భక్తి గ్రంథాలలో ముఖ్యంగా తిరువిళైయాడల్ పురాణం శివుని అరవై నాలుగు లీలలలో కనిపిస్తుంది. కథ ఏమిటంటే ఒకప్పుడు అడవిలో ఒక తల్లి లేడి తన చిన్న కూనను ఒక పొదలో సురక్షితంగా దాచి నీరు తాగడానికి వెళ్తుంది. ఆ సమయంలో ఒక వేటగాడు ఆ తల్లి లేడిని వేటాడి చంపేస్తాడు. దీంతో ఆ లేడి కూన అనాథగా మిగిలి ఆకలితో అలమటిస్తుంది. ఆ దీనస్థితిని చూసిన కరుణామయుడైన శివుడు మదురైలో ఆలవాయ్ అళగన్గా పిలువబడే సోమసుందరేశ్వరుడు ఆ పిల్లను రక్షించడానికి ఒక అద్భుత లీల చేస్తాడు. అడవిలోని ఒక ఆడపులిని పిలిపించి దానిలో మాతృత్వాన్ని ప్రేరేపించి ఆ పులి ద్వారానే ఆ జింక పిల్లకు పాలు తాగించి కాపాడతాడు. సహజ శత్రువులైన పులి, జింకల మధ్య కూడా శివకరుణతో వాత్సల్యం ఏర్పడుతుందని ఈ లీల చెబుతుంది. ఈ అపార కరుణా ఘట్టాన్నే తిరుప్పరంకుండ్రం ఆలయ శిల్పులు రాతిలో అద్భుతం గా మలిచారు. శివుని చేతిలో లేడి పిల్ల... దానికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న పులి– ఇది శివుడు కేవలం సంహారకారుడు మాత్రమే కాదు సకల ప్రాణులను సమానంగా కాపాడే ప్రాణదాత, కరుణామూర్తి అని చెప్పే ప్రతీక. ఆలయంలోని ఆస్థాన మండపం, కంబతాడి మండపంలో ఇలాంటి అనేక అరుదైన శిల్పాలు కనిపిస్తాయి. అదే రాతి కొండపైనే మహిషాసుర మర్దిని కర్పగ వినాయకర్ తదితర దేవతా మూర్తులు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రధాన ఆలయ గోడలపై శివుని వివిధ నృత్య భంగిమలను చూపే ఫలకాలు కూడా భక్తులను ఆకట్టుకుంటాయి.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ఇదీ చదవండి: గణేశ్ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్.. అంత ఖరీదా ఆ చీర!) -
గణేశుడిలాగే.. ఓ ప్రజాపతికి మేక తలను అమర్చిన కథ తెలుసా?
అందరూ వినాయక చవితి జోష్‌లో ఉన్నారు కదా..? వినాయకుడికి గజముఖం వచ్చిన కథ మీ అందరికీ తెలిసిందే..! అయితే.. వినాయకుడికి ఏనుగు తలను అతికించడానికి ముందే.. ఇలాంటి తల మార్పిడి గురించి శివ మహాపురాణంలో ఉందనే విషయం మీకు తెలుసా..? ఒక్క శివపురాణమే కాదు.. వాయు పురాణం, పద్మ పురాణంతోపాటు.. రుద్ర సంహితలో కూడా ఈ వృత్తాంతం ఉంది. దక్ష ప్రజాపతి గురించి మీకు తెలియంది కాదు. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. ప్రజాపతి కూడా. దక్ష యజ్ఞం సమయంలో వీరభద్రుడు తన గణాలతో కలిసి వెళ్లి, దక్షుడిపై విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో.. దక్షుడి శిరస్సును ఖండించాడు. ఆ దెబ్బకు దక్షుడి తల యజ్ఞగుండంలో పడి భస్మమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి కంటే ముందే.. మన భారతావనిలో మరో తలమార్పిడి శస్త్రచికిత్స ఎలా జరిగింది? ఈ కింది వీడియోలో చూడండి.. -
శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడుందో తెలుసా?
వినాయక నవరాత్రులను అంతా ఆస్వాదిస్తున్నారు కదా..? వినాయక చవితి రోజు వ్రతకథలో శివుడు వినాయకుడి తలను తన త్రిశూలంతో ఖండించడం.. ఆ తర్వాత ఏనుగు తలను పెట్టడం.. అందుకే గణపతి గజముఖుడిగా మనకు కనిపించడం తెలిసిందే..! అయితే.. శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడ ఉందో తెలుసా..? భూగర్భంలో 90 అడుగుల లోతులో ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి రావడమంటే.. ప్రాణాలకు తెగించడమే..!అది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గంగోలిహాట్. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం వెళ్తే.. మీరు భువనేశ్వర్ అనే చిన్న గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడే ఉంది.. ఈ భూగోళంలోనే అత్యంత రహస్యమైన ‘పాతాల్ భువనేశ్వర్’ గుహ..! అది సముద్రమట్టానికి 1,930 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే ఇదంతా కేవలం నమ్మకమేనా..? సైన్స్ ఏం చెబుతోంది..? ఇంకా పాతాళ్ భువనేశ్వర్ గుహ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే ..
సాధారణంగా గణేశ్ విగ్రహాలనీ అత్యంత ఆకర్షణీయమైన రూపంలో ఉంటాయి. ప్రతి విగ్రహం దేనికి దానికి విలక్షణమైనది. కానీ ఉత్తరాఖండ్‌లో కొలువైన వినాయకుడు అత్యంత విభిన్నం. ఇక్కడ వినాయకుడి రెండు జీవితాలను దర్శించి తరించే అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ ఆయన రూపం ఇప్పటి వరకు మనం చూసిన గణేశుడి విగ్రహాల్లోకెల్లా అత్యంత విభిన్నంగా ఉంటుంది. గజనానుడిగా మారక ముందు ఆయన రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఆకృతి. ప్రపంచంలోనే తలలేని వినాయకుడి ఆలయం ఇది. ఇక్కడ వినాయకుడు తల లేకుండా మొండెంతో పూజలందుకుంటాడు. ఈ వినాయకుడి విగ్రహం కాషాయం రంగులో శక్తిమంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ‘శ్రీ ముండ కటియ గణేశ ఆలయం’ అని పిలుస్తారు. పురాణ గాథ..గణేశుడిగా ఆవిర్భవించిన కథ మన అందరికి తెలిసిందే..పార్వతి దేవి గణేశుడిని సృష్టించాలనే ఆలోచన రావడం. శివుని ఆగమనానికై ఎదురు చూస్తూ..పసుపు ముద్దతో ఒక బాలుడి విగ్రహాన్ని రూపొందించి ప్రాణం పోసి కుమారుడిగా స్వీకరించింది. తాను స్నానం ముంగించి వచ్చే వరకు ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆ బాలునికి చెప్పింది. సరిగ్గా ఆ సమయంలో శివుడు ఇంటికి తిరిగి వచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. తల్లి చెప్పిన మాటను శిరసావహిస్తూ..లోనికి వెళ్లడానికి వీల్లేదని హుంకరించాడు. ఎంత నచ్చచెప్పిన వినకపోగా..ఆయన దారికి అడ్డుగా నిలిచాడు. ఇది శివునికి ఆగ్రహానికి తెప్పించి ఆ బాలుని శిరస్సుని ఖండించేందుకు దారితీసింది. ఇంతలో పార్వతిదేవి వచ్చి శివుడుకి స్వాగతం పలికి..ఆయనకు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి..ముచ్చటిస్తుండగా..ద్వారం వద్ద ఉన్న బాలుడి ప్రస్థావన వచ్చింది. అంతే అక్కడే తల, మొండెం వేరై పడి ఉన్న బాలుడిని చూసి పార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. తన కుమారుడికి తిరిగి ప్రాణం పోయకపోతే ఈ విశ్వాన్నే నాశనం చేస్తానని శపథం చేసింది. దాంతో శివుడు కాత్యాయని శాంతించు అంటూ ఊరడించి తక్షణమే ఆ బాలుడిని బతికిస్తానని వాగ్దానం చేశాడు. తన గణాలకు ఉత్తరదిశగా నిద్రిస్తున్న ఏనుగు తలను ఖండించి తీసుకురమ్మని ఆదేశించాడు. అలా శివుడు ఏనుగు మొండెన్ని అతికించి ప్రాణం పోయడంతో గజానుడిగా పేరొందాడు అంతేగాదు తొలి పూజను అందుకునే గౌరవాన్ని, అడ్డంకులను తొలగించే దేవుడిగా వరాలు ప్రసాదించాడు. ఇప్పుడు మనం చెబుతున్న ఈ ఆలయం ప్రదేశంలోనే బాల గణేశుడు శిరస్సుని కోల్పోవడంతో ఈ ఆకృతిలోనే భక్తులకు వినాయకుడు దర్శనమిస్తూ పూజలందుకుంటున్నాడు. చేరుకునే మార్గం.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్ లోయకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది గౌరీకుండ్, కేదార్నాథ మార్గంలో సోన్‌ప్రయాగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో వస్తున్నట్లయితే, డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయంకు చేరుకుని 226 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే రైలులో వస్తున్నట్లయితే..రిషికేశ్ లేదా డెహ్రాడూన్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోన్‌ప్రయాగ్‌కు చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకునే యాత్రికులకు మందాకిని నదిని చూస్తూ నడవడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: 'గోల్డెన్ మోదక్'..ధర ఎంతో తెలుసా!) -
గణపతి నవరాత్రులు ఎందుకు?
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు. ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు. – గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులువ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్ -
పండగ కళ
గణేశుడి రూపానికి, కార్టూన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కార్టూనిస్టులకు అత్యంత ఇష్టమైన, సులభంగా విభిన్న రూపాల్లోకి మలచగలిగే రూపం గణపతి. ప్రముఖ కార్టూనిస్టులు సరసి, లేపాక్షి వినాయక చవితితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జ్ఞాపకాలతోపాటు జయదేవ్, రాజు వంటి ఉద్దండుల కార్టూన్లు మచ్చుకు కొన్ని... గణపతి విశేషాలు మరికొన్ని...1970ప్రాంతాలకు ముందు... ఆ తర్వాత అనుకుంటే బుక్‌స్టాల్ ముందు నుంచుంటే ఎన్నో మ్యాగజైన్లు కళ్ళముందు కళకళలాడుతూ కనపడేవి కొనండి కొనండంటూ. పండగలంటూ వచ్చాయంటే పాఠకులకు పండగే. కార్టూనిస్టులైతే నెల ముందు నుంచే బిజీ అయిపోయే వాళ్ళు. ముఖ్యంగా వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు కార్టూనిస్టులకు ఇష్టమైన పండుగలు. అందులో వినాయక చవితి ప్రత్యేకం. గణపతి మీద ఎన్నో కార్టూన్లు గీసే వాళ్ళు. ఆ రోజుల్లో బాపు, జయదేవ్, మల్లిక్, సత్యమూర్తి, కాటూరి, రాగతి పండరి లాంటి ఎంతోమంది ప్రముఖ కార్టూనిస్టులు విరివిగా కార్టూన్లు వేసే వాళ్ళు. ప్రత్యేక సంచికంటే కార్టూన్లకు ఎక్కువప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు. ఎక్కువ కార్టూన్లు ప్రింటవుతాయన్న ఉద్దేశంతో యువ కార్టూనిస్టులతో సహా అందరు కార్టూనిస్టులు ప్రయత్నించేవాళ్లు. అప్పుడు కార్టూన్లకు మంచి పారితోషికాలు కూడా ఇచ్చేవాళ్ళు. గణపతి మీద కార్టూన్లు అంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు, చవితి–చంద్రుడు, గణపతి భూలోకం రావటం, మూషికం... ఇలాంటి సబ్జెక్టుల మీద కార్టూన్ ఎక్కువగా వేసేవాళ్ళు. అప్పుడు కార్టూనిష్టులు ఎక్కువగా ఉండేవాళ్లు, చదివేవాళ్ళు కూడా ఎక్కువమంది ఉండేవాళ్ళు కాబట్టి కార్టూనిష్టులు కూడా చాలా శ్రద్ధగా కార్టూన్లు వేసేవారు. ఇప్పుడు పత్రికలు కూడా ఎక్కువ లేవు, శ్రద్ధగా వేసే కార్టూనిష్టులు కూడా తగ్గిపోయారు. ఏమైనా, ఆ రోజులు తల్చుకుంటే భలే ఆనందంగా ఉంటుంది నాలాంటి కార్టూనిస్టులకు.– లేపాక్షి, సీనియర్ కార్టూనిస్ట్నవ్వుల దేవుడువినాయక చవితి పిల్లలకే కాదు కార్టూనిస్టులకి కూడా పండగే. వినాయకుడు కార్టూనిస్టులకి దేవుడు, స్నేహితుడు, గొప్ప సబ్జెక్టు కూడా. అందుకే ఆయన కార్టూనిస్టుల కులదైవం! ఆయన నవ్వించినట్టు ఏ దేవుడూ నవ్వించలేదు మరి. ఆయన్ని చూసే కార్టూనిస్టులు ప్రపంచాన్ని నవ్వించడం నేర్చుకున్నారేమో! దిన, వార, మాస పత్రికలు విస్తారంగా వచ్చే రోజుల్లో చవితి వచ్చిందంటే చాలు కార్టూనిస్టులు చెలరేగిపోయి కార్టూన్లు వేసేవారు. పండగ ప్రత్యేక సంచికలకి ‘ఫుల్ పేజి కార్టూన్లు’ వేసి ఆరారా నవ్వులు ఆరబోసేవారు. చవితి కార్టూన్లకి అన్ని ఐడియాలు ఎలా పుడతాయి కార్టూనిస్టులకి... అనిపిస్తుంది. పుడతాయి! ఒకటీ రెండూ కాదు ఎన్నయినా పుడతాయి. అదే మరి గణేశుడి మహిమ. పిల్లలు మట్టిలో ఆడితే కోప్పడే పెద్దలు తాము కూడా మట్టిలో చేతులు పెడతారు దేవుడి బొమ్మ చెయ్యడానికి. ఇది విచిత్రం కాదూ. బొమ్మ చేశాక అది కార్టూనిస్టులు వేసే బొమ్మలాగా పొట్టిగా ఉన్నా, పొట్ట పెద్దదైనా, చేతులు పీలగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా ఎలా వున్నా అది గణేశుడి బొమ్మే! అలా ఎందుకు చేసావని ఆ దేవుడు చిన్నబుచ్చుకోడు. నవ్వుతాడు. నవ్వుల దేవుడు కదా! ఇదే కాదు. అంత దేవుడూ కూడా తాను కూర్చుని సవారీ చేసేది చిన్న ఎలక మీద. ఇదో విచిత్రం! ఆ బొమ్మ పక్కనే చిన్న మట్టి ఎలక పిల్లని కూడా చేసి పెట్టాలి. లేకపోతే చిన్న ఎలక కాస్తా చిన్నబుచ్చుకుంటుంది. మట్టి ఉండలు చేసి ముగ్గులోనో, బియ్యం పిండిలోనో పొర్లించి వాటినే ‘ఉండ్రాళ్ళు’ అంటాం. రంగు రంగు బట్టలు కట్టి, గొడుగు నెత్తిన పెట్టి, పీటమీద కూర్చోబెడతాం. తరవాత పూజ. ఎక్కడెక్కడో పేర్లు కూడా వినని చెట్ల ఆకులతో పూజ. పిల్లా పెద్దా కుటుంబం అంతా కూర్చుని భక్తితో చేస్తాం ఆ పూజ. ఇదంతా ఓ విచిత్రం, వినోదం కాదూ. ఈ తతంగంలో ఎక్కడికక్కడ ఐడియాలు వెల్లివిరుస్తాయి కార్టూనిస్టులకి. అందుకే వినాయకచవితి కార్టూనిస్టులకి ఓ నవ్వులగని. తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. నవ్వుకునేవాడికి నవ్వుకున్నంత!!నవ్వించేవాడి చుట్టూ నలుగురూ చేరతారు. అలా నవ్వించే దేవుడే గణేశుడు. ఆ దేవుడి చుట్టూ తిరుగుతూ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ మనం ఆనందంతో గెంతులు వేసే ఈ నవ్వుల పండగ ఏడాది పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది కదా! – సరసి, సీనియర్ కార్టూనిస్ట్ -
మహా గణపతిం భజే!
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కోసం అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు ఆ గణేశుడు.సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారు. మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు.దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాథ, దీనిలో అంతరార్థం ఏమిటంటే –– మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి – ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు.వినాయకుడికి అవతారాలున్నాయా?వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు.వినాయకుని ఆసనంలో గల అంతరార్థంచాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ భంగిమలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒకపక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనం ప్రతీక. అంటే జీవితంలోని ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.– డి.వి.ఆర్ -
ఈ కాలానికి తగ్గ దేవుడు
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకుపోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే. ఎపిక్టెటస్! ‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ పాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను. ‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని. కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగిపోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగి΄ోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను. ‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో. ‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసి΄ోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.వాడ్రేవు చిన వీరభద్రుడు చదవండి: ఘనమైన ఆసనం -
ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతోపాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది.సులభంగా అలంకరణ కృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్‌తోపాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డిచదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య! -
అష్టగణపతుల ఆలవాలం... శ్రీముఖలింగం
శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రంలో మరో అరుదైన విశేషం ఉంది. ఇక్కడ అష్టగణపతులు కొలువై ఉండి, భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. 1. శక్తి గణపతిదీర్ఘకాలిక బాధలు, వ్యాధులు శక్తిగణపతిని పూజిస్తే నయమైపోతాయని భక్తుల నమ్మకం. తూర్పువైపున ఉన్న ఈ ఆలయంలో శక్తిగణపతి పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. 2. చింతామణి గణపతిజీవితంలోని ఈతిబాధలు, మానసిక చింతలు, దుఃఖాలను పోగొట్టే స్వామిగా ఇక్కడి చింతామణి గణపతి పూజలు అందుకుంటున్నాడు. దక్షిణం వైపు ఉన్న ఈ ఆలయంలో చింతామణి గణపతి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు.3,4. ఢుంఢి గణపతులుపంచాయతన క్షేత్రానికి సంబంధించి ఢుంఢి గణపతుల విగ్రహాలు కాశిలో రెండు, అలాగే శ్రీముఖలింగంలో రెండు ఒకే చోట ఉంటాయి. ఈ ఢుంఢి గణపతులను దర్శనం చేసుకుంటే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఢుంఢి గణపతులు ఉత్తరాభిముఖంగా దక్షిణ దిశలో కొలువు దీరి ఉంటారు.5. సాక్షి గణపతి:భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ముందుగా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఈయన తన తండ్రి అయిన పరమేశ్వరునికి భక్తుల రాక గురించి సాక్ష్యం చెబుతారట! ‘ఈ భక్తులు నా అనుమతి తీసుకున్నారు. తండ్రీ, వీరికి నీ దర్శన దర్శనభాగ్యం కల్పించ’ని కోరుతాడట! ఈ ఆలయంలో సాక్షి గణపతి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.6. నాట్యగణపతినాట్యం సహా లలితకళలు నేర్చుకునేవారు ముందుగా ఇక్కడి నాట్యగణపతిని దర్శనం చేసుకుంటే సకలు కళలలో త్వరితిగతిని ప్రావీణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పశ్చిమ దిశలో తూర్పు అభిముఖంగా నాట్యగణపతి భక్తులకు దర్శనమిస్తాడు. 7. కార్యసిద్ధి గణపతిమనసులో తలచిన కార్యాలను ఇక్కడి కార్యసిద్ధి గణపతికి నివేదించుకుంటే చాలు, అవి నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్వామి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.8. వరసిద్ధి గణపతిభక్తులకు కోరిన వరాలను అనుగ్రహించే స్వామిగా ఇక్కడి వరసిద్ధి గణపతిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి ముందు ఎడమవైపుగా దక్షిణాభిముఖంగా వరసిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. - సుంకరి శాంత భాస్కరరావుజలుమూరు, శ్రీకాకుళం జిల్లా -
గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!
ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.బప్పా మండపంలో బీట్ అదిరిపోవాల్సిందే! పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్ స్పీకర్ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్ పాటలు, పిల్లల ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!గణపయ్యకు... మేకప్ రెడీ!గణపయ్యను తీసుకొచ్చాక... ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్! పూలు, లైట్లు, అలంకరణ సామాన్లు అంటూ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్, పెద్దలకు డెకరేషన్ బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.మంత్రాల మినీ మాస్టర్!గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్ సెటప్ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్ టెన్షన్ లేకుండా నేరుగా విద్యుత్ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. -
గణపతికి నచ్చే వంటకాలు
పాల పాయసంకావలసినవి: బియ్యం – 1 గ్లాస్ (కడిగినవి), పాలు : 1 లీటరు, పంచదార / బెల్లం: 1 కప్పు (రుచికి సరిపడా), నెయ్యి, డ్రైఫ్రూట్స్ తగినన్నితయారి: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, ఇతర డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు కాగిన తర్వాత మంట తగ్గించి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. పాయసం చిక్కగా, కమ్మగా తయారైన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, డ్రైఫ్రూట్స్‌ను వేసి కలపాలి. పాల పాయసం సిద్ధం! రవ్వ పూర్ణాలు కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పులు, పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పు తయారి: బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి. చిట్టి ముత్యాల లడ్డు కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారి: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్æ కలర్, ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో బూందీ తయారు చేసుకోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న పాకంలో బూందీ. యాలకల పొడి కలిపి లడ్డుగా చుట్టుకోండి. తీపి ఉండ్రాళ్ళు కావలసినవి: బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు వంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడు ఉండ్రాళ్ళలో నింపడానికి : పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు : 1 గరిటెడు, ఏలకుల పొడి : 1/2 చెంచాతయారి: కొబ్బరి, బెల్లం, ఏలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి తగు మాత్రం తీసుకుని చేతిలో వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి పాకాన్ని ఉంచి మూసివేసి, గుండ్రంగా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి. రవ్వలడ్డు కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. తయారి: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. పాకంలో రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి కలుపుకుని లడ్డు చుట్టుకోవాలి. తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ. -
దూర్వాంకుర మహిమ
కౌండిన్య మహర్షి గణేశుని పరమభక్తుడు. ఆయన తన ఆశ్రమంలోని గణేశ ప్రతిమకు దూర్వాంకురాలతో నిత్యం పూజించేవాడు. ఆయన భార్య ఆశ్రయ ఒకనాడు ‘స్వామీ! మీరు దూర్వాంకురాలతో గణేశుని ఎల్లప్పుడూ పూజిస్తుంటారు కదా, దూర్వాంకురాలు అంత మహిమాన్వితమైనవా?’ అని అడిగింది. కౌండిన్యుడు ఆమెకు దూర్వాంకుర మహిమ గురించి అనేక పురాణగాథలు చెప్పాడు. కౌండిన్యుడు చెప్పిన గాథలను ఆలకించినప్పటికీ ఆశ్రయకు దూర్వాంకుర మహిమ పట్ల మనసులో సంశయాలు తొలగిపోలేదు. కౌండిన్యుడు తన భార్య మనోగతాన్ని గ్రహించాడు. ఆమె సంశయాలు తొలగిపోవాలంటే, దూర్వాంకుర మహిమ ఎంతటితో ఆమెకు స్వయంగా తెలిసిరావాలి అని భావించాడు.కౌండిన్యుడు ఆమె చేతికి ఒక దూర్వాంకురాన్ని ఇచ్చి, ‘దేవీ! నువ్వు ఈ దూర్వాంకురాన్ని తీసుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లు. దీనికి సరిసమానమైన స్వర్ణాన్ని నేను అడిగినట్లు అతడికి చెప్పుడు. ఈ దూర్వాంకురం కంటే ఏమాత్రం ఎక్కువ గాని, తక్కువ గాని స్వర్ణాన్ని స్వీకరించకు’ అని చెప్పాడు.భర్త ఆదేశంతో ఆశ్రయ దేవేంద్రుడి వద్దకు వెళ్లి, భర్త తనకు ఇచ్చిన దూర్వాంకురాన్ని అతడికి ఇచ్చి, ‘దేవేంద్రా! ఈ దూర్వాంకురానికి సరిసమానమైన స్వర్ణాన్ని తీసుకురమ్మని నా భర్త నీ వద్దకు పంపాడు. దీని కంటే నాకు లేశమైనా ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.‘సాధ్వీమణీ! ఈమాత్రం దానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నీ భర్త ఆదేశమై సందేశాన్ని పంపితే, సాక్షాత్తూ స్వర్గాన్ని పంపమన్నా పంపుతాను కదా’ అని, ఒక దేవదూతను పిలిచి, ‘ఈ సాధ్వీమణిని కుబేరుని వద్దకు తీసుకుపోయి, ఈమెకు ఈ దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని ఇవ్వమని నా ఆజ్ఞగా చెప్పు’ అని పంపాడు.దేవదూత ఆశ్రయను తీసుకుని కుబేరుడి వద్దకు వెళ్లి, దేవేంద్రుడి సందేశాన్ని చెప్పాడు. ‘దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని కోరడానికి ఇంతదూరం వచ్చిన కౌండిన్య పత్నికి ఏమైనా మతిభ్రమణం కలిగిందా? ఈమెను నా వద్దకు పంపిన దేవేంద్రుడు ఏమైనా మాయలో పడ్డాడా?’ అని అనుకుని, కొద్దిసేపు ఆలోచించాడు కుబేరుడు.కేవలం దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణాన్ని మాత్రమే ఇచ్చి పంపిస్తే, ధనాధిపతి అయిన తన పరువు ఏం కావాలని భావించి, ఆశ్రయ ముందు అనేక మణుగుల బంగారం ఉంచాడు. ఆమెకు కాస్త ఆశ పుట్టినా, భర్త పట్ల భయం వల్ల ‘నా భర్త ఆదేశం మేరకు దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణమే చాలు. అంతకు ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.కుబేరుడు ఒక చిన్న త్రాసు తెప్పించి, ఒకవైపు దూర్వాంకురాన్ని ఉంచి మరోవైపు బంగారాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఎంత బంగారం వేసినా, చాలడం లేదు. కుబేరుడు ఒక పెద్ద త్రాసు తెప్పించి బంగారం వేసినా, ఫలితం లేకపోయింది. ఈసారి మరింత భారీ తక్కెడను తెచ్చి, అందులో తన యావత్ సంపదను వేసినా, అదంతా దూర్వాంకురానికి సమానం కాలేదు. సర్వాలంకార భూషిత అయిన తన భార్యను తక్కెడలో కూర్చోబెట్టాడు, చివరకు తాను కూడా స్వయంగా కూర్చున్నాడు. అయినా దూర్వాంకురం ఉంచిన వైపు తక్కెడ పాత్ర వీసమంతైనా పైకి లేవలేదు. దిక్కుతోచని కుబేరుడు తన సాటి దిక్పాలకులకు, త్రిమూర్తులకు కబురు పెట్టాడు. వారందరూ తమ తమ సమస్త సంపదలను తీసుకువచ్చినా, ఫలితం కనిపించలేదు. వారందరికీ ఇదేదో పెనుమాయగా అనిపించింది.ఇదేదో కౌండిన్యుడినే అడిగి తెలుసుకోవాలని భావించి, దేవతలందరూ కలసి కౌండిన్యుడి వద్దకు వెళ్లారు. ‘మహానుభావా! పూర్వపుణ్యం వల్ల నీ దర్శనభాగ్యం లభించింది. నీ ధర్మపత్ని మా అహంకారాన్ని సర్వం హరించింది. మాకు దూర్వాంకుర మహిమ తెలియదు. త్రిలోకాలు కూడా దీని మహిమకు సాటిరావు. నువ్వు భక్తిగా గణేశుడి మస్తకాన్ని అలంకరించిన ఈ దూర్వాంకుర మహిమను ఎవరు తెలుసుకోగలరు? సమస్త యజ్ఞ, దాన, తపో, వ్రత, స్వాధ్యాయములలో ఏదీ దూర్వాంకుర సమర్పణకు సరిసాటి కాదు. శ్రీగణేశుని అనునిత్యం ఆరాధించే నీ మహిమను మాత్రం ఎవరు తెలుసుకోగలరు?’ అని కౌండిన్యుడిని కొనియాడారు. అనంతరం వినాయకుడిని వేనోళ్ల స్తుతించి, తమ తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.ఈ సంఘటనతో ఆశ్రయకు తన భర్త గణనాథుని అర్చనకు ఉపయోగించే దూర్వాంకుర మహిమ పూర్తిగా అవగతమైంది. ‘స్వామీ! మీ మాటలను శంకించాను, మన్నించండి.’ అని పలికింది. ఆమె కూడా భర్తతో కలసి దూర్వాంకురాలతో శ్రీగణేశుని భక్తితో అర్చించడం ప్రారంభించింది. ప్రతిరోజూ ఆ దంపతులు ప్రాతఃకాలంలో దూర్వాంకురాలతో గణపతిని అర్చించసాగారు. కొన్నాళ్లకు గణేశుడు వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు.∙సాంఖ్యాయన -
శ్రీనాథ విరచిత వినాయక దండకం
జయ జయ జగదేక రక్షామణీ!దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!ముకుందప్రియా! యిందుధారీ!కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమఃఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు -
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం -
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత -
వినాయక పూజకు సన్నద్ధత
వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం. ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం. పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..ఇదీ చదవండి: విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు -
గణనాథుడికి...ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతో పాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది. సులభంగా అలంకరణకృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్‌తో పాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డి -
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్‌లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్‌గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్‌లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?
సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
సంతానం.. క్షేమం కోసం పోలాల అమావాస్య పూజ
సంతానం లేనివారు సంతానం కలిగే వరకు పరితపిస్తూనే ఉంటే, సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతమే పొలాల అమావాస్య వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసే ఈ వ్రతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉద్దేశంతో... ఒక్కోవిధంగా చేస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పశువులను పూజిస్తే మరికొన్ని తాలలో కంద మొక్కను పూజించి, కలగలపు పులుసు చేసుకుని తింటారు.రేపు పోలాల అమావాస్య సందర్భంగా ఆ వ్రత విధానం ...పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు. దీపారాధన కుందులు, నూనె/నెయ్యి, వత్తులు, అగరు బత్తీలు, కర్పూరం సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యమైనవి: కంద మొక్క (లేదా కంద పిలక), తోరాలు (పసుపు రాసి, పసుపు కొమ్ములు కట్టిన దారాలు). నైవేద్యం: పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన కలగాయ కూర/పులుసు. పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పీటపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్నిపరచాలి. దానిపై కంద మొక్కను ఉంచి మంగళగౌరీ దేవి లేదా పోలేరమ్మ తల్లిగా భావించాలి.గణపతి ప్రార్థన: ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి ముందుగా వినాయకుడిని మనసు లో స్మరించుకోవాలి.‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘దీపారాధన: దీపాలను వెలిగించి, దానికి పసుపు, కుంకుమలు పెట్టాలి. ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి. ప్రధాన పూజ – తోర పూజ కంద మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించాలి. అమ్మవారిని షోడశోపచారాలతో (ధ్యానం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు) పూజించాలి. తోర పూజ: పసుపు కొమ్ములు కట్టిన తోరాలను (దారాలను) అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించాలి. తోరం కట్టుకునేటప్పుడు ‘పోలాయ నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని... పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం బధ్నామి తవ తోరకమ్’ అని భక్తి శ్రద్ధలతో చదువుతూ తోరం కట్టుకోవాలి. ‘నైవేద్యం: తయారు చేసుకున్న పూర్ణం బూరెలు, కలగాయ (ఇరుగు పొరుగు ఇళ్లనుంచి సేకరించిన లేదా స్వయంగా సమకూర్చుకున్న రకరకాల కూరగాయలతో చేసిన పులుసు)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పోలాల అమావాస్య వ్రత కథ. (ఈ కథను కూడా ఒక్కో ్ర΄ాంతంలో ఒక్కో విధంగా చెప్పుకుంటారు. అధిక ప్రాచుర్యం పొందిన కథలలో ఇదొకటి) పూజ పూర్తయిన తర్వాత చేతిలో అక్షతలు, పూలు పట్టుకుని ఈ కింది కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. వ్రతకథ: పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ వివాహాలై, పిల్లలు కలిగారు. అయితే అందరికంటే చిన్నవాడి భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతుండేవారు. ప్రతి ఏటా శ్రావణ లేదా భాద్రపద అమావాస్య రోజున పెద్దకోడళ్లు అందరూ కలిసి ఎంతో వైభవంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించేవారు. కానీ చిన్నకోడలికి పిల్లలు చనిపోతుండటం వల్ల, ఆమెను సూతకం (మైల) కారణంతో పూజకు రానిచ్చేవారు కాదు. ఒక సంవత్సరం అమావాస్య నాడే చిన్నకోడలికి మళ్లీ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు కూడా వెంటనే చనిపోయాడు. ఆ దుఃఖాన్ని భరించలేక, పూజకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎవరికీ చెప్పకుండా గదిలో ఒక చాట కింద దాచిపెట్టింది. తోడికోడళ్లు పూజ ముగించుకుని, కందమొక్కకు కట్టిన తోరాలను చిన్నకోడలికి ఇవ్వడానికి వచ్చారు. ఆమె తోరాన్ని తీసుకుని, మనసులో ఎంతో బాధపడుతూ గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్థించింది. అనంతరం చిన్నకోడలు చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్లి, దేవత పాదాల చెంత బిడ్డను ఉంచి బోరున విలపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, మాతృత్వపు వేదనకు కరిగిపోయిన పోలేరమ్మ తల్లి ప్రత్యక్షమైంది. తన అమృత హస్తంతో ఆ చనిపోయిన బాలుడిని తాకగానే, ఆ బిడ్డ ప్రాణాలతో లేచి బోసినవ్వులు నవ్వాడు. అంతేకాకుండా, గతంలో చనిపోయిన ఆమె మిగతా పిల్లలందరినీ కూడా అమ్మవారు బతికించి ఆమెకు అప్పగించింది. తన పిల్లలందరితో కలిసి చిన్నకోడలు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె భక్తిని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి సంతాన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నిష్టగా చేయడం ప్రారంభించారు. ఉద్యాపన లేదా ముగింపుకథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను తలపై వేసుకోవాలి. పూజించిన తోరాలను తీసుకుని తల్లి తన పిల్లల కుడి చేతికి కట్టాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు వాయనాలు (తాంబూలం, బూరెలు) ఇచ్చి, పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనితో వ్రతం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి. పూజించిన కంద మొక్కను ఏం చేయాలి?ఈ వ్రతంలో పూజించిన కంద మొక్కను ΄ోలాల అమావాస్య మరుసటి రోజు ఇంటి ఆవరణలో కానీ, పూల కుండీల్లో కానీ నాటాలి. ప్రతిరోజూ నీళ్లు ΄ోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పటికే సంతానం ఉన్నవారికి వారి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ప్రతీతి. – పి.సాయికృష్ణ ప్రణతి(చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!) -
గంధము పూయరుగా!
భగవంతునికి చేసే షోడశోపచారాలలో తొమ్మిదవ ఉపచారం చందన సమర్పణం. ఓ దేవదేవా! మంచి సువాసన కలిగిన, మనోహరమైన ఈ శ్రీగంధాన్ని ప్రీతితో స్వీకరించమంటూ భగవంతునికి చందనం సమర్పిస్తాం.సృష్టిలో ఉన్న వృక్ష జాతులలో గంధపు చెట్టుది ప్రత్యేక స్థానం. పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలు, పెండ్లిండ్లలో చందనం అందించడం తప్పనిసరి. పేరంటాలలో ముత్తైదువులకు గంధాన్ని కంఠ భాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడ రెండు వేళ్ళతో చందనం రాయడం వల్ల విశుద్ధి చక్రం ఉత్తేజితమౌతుంది. నుదుటి భాగంలో గంధం రాయడం వల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశం ఉపశమిస్తుంది. శాంతి లభిస్తుంది.గంధం పూయడం వలన మనస్సుకు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో గంధం, కస్తూరి వంటి వాటితో బొట్టు పెట్టుకొంటే కనుబొమల మధ్యన ఉన్న జ్ఞాననాడులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢమవుతుంది. ఆయుర్వేద శాస్త్ర రీత్యా స్త్రీలు గంధం పూసుకోవడం వల్ల ఋతుక్రమం చక్కబడి ఆరోగ్యకరమైన అండోత్పత్తి జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అనారోగ్యం, అంటువ్యాధులు, చర్మరోగాలు నివారించబడతాయి. గర్భవతులకు గంధం పూయడం వారి కడుపులోని బిడ్డకు ఆరోగ్యకరం. శుభకార్యాలలో అతిథులనుచందన తాంబూలాలతో గౌరవించడం మన ఆచారం.దేవతలకు కూడా...సింహాద్రి అప్పన్నకు ఏడాది పొడవునా చందనం అలంకరిస్తూ ఆయన రౌద్రాన్ని శాంతింపజేస్తూంటారు. అక్షయ తదియనాడు ప్రతి ఏటా ఆయనకు చందనోత్సవం జరుపుతారు. అమ్మవారికి కూడా చందనమంటే ఎంతో ప్రీతి. అందుకే ఆమెను చందన ద్రవ దిగ్ధాంగీ’(శరీరానికంతటికీ చందన ద్రవం అలదుకొన్నది) అని వర్షిస్తారు.ఇక శ్రీకృష్ణ పరమాత్మ అయితే సదా చందన చర్చిత నీల కళేబరుడు. ఆంజనేయునికీ సింధూరం, గంధం ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. తిరుమల వంటి దివ్యక్షేత్రాలలో శ్రీగంధ కైంకర్యం నిత్యం జరిగే పూజా విధిలో భాగం. అందుకోసం అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పరచబడింది. గంధ పరిమళం వ్యాపించి ఉన్న ్రపాంతంలో సానుకూల శక్తి, దైవిక అనుభూతి ఉంటుందన్న విశ్వాసం, ఆ పవిత్ర వాతావరణంలో జరిగే కార్యక్రమాలు విజయవంతం అవుతాయనే నమ్మకమూ భక్తులలో దృఢంగా ఉన్నాయి.జ్వర తీవ్రత తగ్గడానికి తల కణతలకు గంధం రాయడం ఒక వైద్యం. చందనలేపనం ముఖ కాంతిని పెంచుతుంది. గంధం మంచి సౌందర్య సాధనం కూడా! ΄ûడర్లు, సబ్బులు, అగరుబత్తి, అత్తరు వంటి వాటి తయారీలో గంధం వాడతారు కదా!పరమశివుని అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. మొత్తానికి ఆరోగ్యం, ఆహ్లాదం, అందం, ఆనందం, ఆధ్యాత్మికత కలబోసిన సంప్రదాయంగా చందన లేపనాన్ని చెప్పవచ్చు.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
రూ.1051 కోట్లు : రమణీయంగా మధుర..అయోధ్యలాంటి మేకోవర్!
అయోధ్య తరహాలో మథుర-బృందావన్ రూపురేఖలను మార్చి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,051 కోట్ల ప్రణాళికను రూపొందిం. ఇందులో రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించారు. మరో 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 1,051 కోట్ల విలువైన 229 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.అయోధ్య, కాశీ తరహాలోనే మధుర-బృందావన్‌లో కూడా అత్యంత ఘనంగా ఆలయ సముదాయాలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మధుర 2.0:మొత్తం రూ. 1,051 కోట్లలో ఇప్పటికే రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ప్రారంభించగా, మరో రూ. 437 కోట్ల విలువైన 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 72 కోట్లు నేరుగా బదిలీ చేశారు.ప్రాజెక్టుకేటాయించిన నిధులుప్రయోజనంబృందావన్కు 4-లేన్ల హైవేరూ. 251 కోట్లుయమునా ఎక్స్‌ప్రెస్ వే నుండి నేరుగా బృందావన్‌కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయని భావిస్తున్నారు.యమునా నదిపై కొత్త వంతెన : 2-లేన్ల క్రాసింగ్ ద్వారా పాత వంతెనలపై భారం తగ్గింపు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా. 12 అంతస్తుల పర్యాటక హాస్టల్స్. 47 కోట్లు పండుగల సమయంలో (జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి) వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం.ఛాతా మాస్టర్ ప్లాన్ రోడ్డు : రూ. 86 కోట్లు30 మీటర్ల వెడల్పుగల రోడ్డు ద్వారా భారీ వాహనాల మళ్లింపు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ.ఫ్లైఓవర్ & సౌందర్యీకరణరూ. 79 కోట్లుజాతీయ రహదారి (NH-19) నుండి బృందావన్ ప్రవేశ మార్గం ఆధునీకరణ (ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు, అండర్‌గ్రౌండ్ వైరింగ్).12 అంతస్తుల పర్యాటక వసతి గృహం: నయారా పోలీస్ లైన్స్ క్యాంపస్‌లో రూ. 47 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇది, జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి వంటి పండుగల సమయంలో నగరం యాత్రికులతో నిండిపోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం.బృందావన్‌లో ఒక పౌర శిక్షణా కేంద్రం: పరిశుభ్రత, స్మార్ట్ సేవలు , యాత్రికుల నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం కోసం రూ. 31 కోట్లు కేటాయించారు.ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహందీంతో పాటు బృందావన్‌లో కొత్త రోప్‌వే , భారీ పార్కింగ్ ప్రాజెక్టులు.సూర్దాస్ బ్రజ్‌భాషా అకాడమీ , 400 ఎకరాల్లో విస్తరించే ఆసియాలోనే అతిపెద్ద సిటీ ఫారెస్ట్ సిద్ధం కానుంది. ఇంకా కొత్త హైవేలు, ఫ్లైఓవర్లు నిర్మానంకానున్నాయి. ఫలితంగా ఢిల్లీ, నోయిడా నుండి మధుర-బృందావన్‌లకు ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గనుంది. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కోరుకునే వారికి, వారాంతపు పర్యాటకులకు బృందావన్ అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅయెధ్యలోరామమందిరి నిర్మాణంతో రామమందిరం సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి, పెట్టుబడిదారులు స్థలాలను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.ఇప్పుడిక శ్రీకృష్ణుని జన్మభూమి అయిన ఈ ప్రాంతంలో కూడా అటువంటి మార్పునే తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం, హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్‌లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్ -
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర -
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
భారత్‌లోని జపాన్ రాయబారి (Ambassador) ఓనో కేయిచి (Ono Keiichi) రిషికేష్ పర్యటన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.గంగోత్రి నదీ తీరాన పవిత్ర గంగానదిలో మూడుసార్లు పవిత్ర స్నానం ఆచరించి, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, తన అనుభూతిని, అభిమానాన్ని చాటుకున్న వైనంగా నెట్టింట వైరల్‌గా మారింది. గంగలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో వివరించారుజన్మాష్టమి వారాంతంలో జరిగిన ఈ అనుభవాన్ని ఓనో కేయిచి ఎక్స్ వేదికగా పంచుకుంటూ నిజంగా ఇది మరచిపోలేని క్షణం, అద్భుతం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. రిషికేష్‌లోని గంగానది ఒడ్డున భద్రత కోసం ఉన్న గొలుసును పట్టుకుని ఆయన మూడుసార్లు నీటిలో మునిగారు. ఈ అనుభవం తనకు ఎంత గొప్ప భక్తిని, కృతజ్ఞతా భావాన్నికలిగించిందని, జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. రిషికేశ్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య ఉండటం తనకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగించిందని ఒనో కేయిచి చెప్పారు. “చివరకు రిషికేశ్‌లో గంగానదిలో పూర్తిగా మూడుసార్లు మునిగాను. జన్మాష్టమి వారాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కలిగింది. ‘‘ఇది నిజంగా మరచిపోలేని క్షణం” అని ఆయన రాసుకొచ్చారు. అలాగే గంగా ఆరతి సందర్భంగా సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆచారాల్లో భాగంగా ఆయన నదీ తీరంలో మట్టి దీపాన్ని వెలిగించారు. ఈ ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇదీ చదవండి : రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! Finally, a full dip in the Ganges in Rishikesh—three times! 🙏Over the Janmashtami weekend, surrounded by people carrying on centuries-old faith and traditions, I felt a profound spiritual connection, along with awe, humility, and gratitude.A truly unforgettable moment 🇮🇳 pic.twitter.com/A1SoVaDYuH— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) September 6, 2026ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగాకాగా భారతీయత, ప్రాధాన్యతలపై ఓనో కేయిచి ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదు. 21024 నవంబర్‌లో భారత జపాన్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన ఓనో కేయిచి, మొదటినుంచీ భారతీయ ఆహార పద్ధతులు, సంస్కృతి పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.గతంలో ఢిల్లీలో చేతితో బిర్యానీ తింటూ.. "సుషి" లాగే బిర్యానీని కూడా చేతితో తింటేనే అసలైన రుచి వస్తుందని చెప్పారు. అలాగే బిహార్ పర్యటనలో 'లిట్టి చోఖా' రుచి చూసి భోజ్‌పురి భాషలో "గజబ్ స్వాద్ బా" (అద్భుతమైన రుచి) అని ప్రశంసించారు.ఇదీ చదవండి: రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా -
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.పౌరాణిక కథ మహాభారత కథతో ఈ ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వచ్చారట. శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో దాక్కున్నాడని, అప్పుడు ఆయన శరీర భాగాలు ఐదు చోట్ల వెలిశాయనేది పౌరాణిక విశ్వాసం. అందులో చేతులు (బాహువులు) వెలసిన ప్రదేశమే తుంగనాథ్. ఆలయ పునాదిని అర్జునుడు వేశాడని కూడా పురాణ కథనాల్లో చెబుతారు. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తారు.చోప్టా నుంచి మొదలయ్యే ప్రయాణంతుంగనాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ’మినీ స్విట్జర్లాండ్’ అని పిలిచే చో΄్టా నుండి ట్రెక్ చేయాలి. కేవలం 3 కిలోమీటర్ల దూరమే అయినా, నిటారుగా ఉండే ఈ దారిలో రోడోడెండ్రాన్ పూల అడవులు, మంచు కప్పిన హిమాలయ శిఖరాలు కనువిందు చేస్తాయి.ఆలయానికి మరో 1.5 కిలోమీటర్ల దూరంలో చంద్రశిల శిఖరం ఉంది. అక్కడి నుండి నందాదేవి, త్రిశూల్, చౌఖంబా శిఖరాలుం ఇలా 360 డిగ్రీలలో ఎటు తిరిగినా హిమాలయాల దర్శనం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?చలికాలంలో అంటే సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు కారణంగా ఆలయం మూసివేయబడుతుంది. అప్పుడు ఉత్సవమూర్తిని మక్కుమఠ్కు తరలిస్తారు. దర్శనానికి సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆలయం తెరవడం, మూసివేయడం తేదీలు ప్రతి సంవత్సరం మారవచ్చు.తుంగనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకతి, ఆధ్యాత్మికత, సాహసం కలిసిన ఒక పవిత్ర యాత్ర. శివుడి నామస్మరణతో ఆ కొండల్లో వేసే ప్రతి అడుగు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. చదవండి: ధృతరాష్ట్ర కౌగిలి -
ధృతరాష్ట్ర కౌగిలి
ఎంతో ఆప్యాయతను, ప్రేమనూ నటిస్తూ, తియ్యగా పలకరిస్తూ లోలోపల తీవ్రహాని తలపెట్టే సందర్భాలను, ప్రమాదకర పరిస్థితులను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు పట్టాభిషేకం నిర్వహించుకోవడానికి ముందు తమ పెదనాన్న ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్లారు. తన నూరుగురు కుమారులను పాండవులలో రెండోవాడైన భీముడు చంపాడన్న కోపాన్ని లోలోపలే ఉంచుకొని కక్షతో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడు పైకి మాత్రం ప్రేమను నటిస్తూ అందరినీ కౌగిలించుకొని ప్రత్యేకంగా భీముడిని తన ఉక్కుకౌగిలిలో బంధించి చంపి వేయాలని భావిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణ పరమాత్మ ఉక్కుతో భీముని విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. తనను కలవడానికి వచ్చిన పాండవులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకొంటాడు. అయితే ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా భీముడేడి అని అడుగుతున్న సమయంలో శ్రీ కృష్ణ పరమాత్మ భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకెళ్లగా దానినే భీముడుగా భావిస్తూ ధృతరాష్ట్రుడు తన ఉక్కుకౌగిలిలో బంధించగా ఆ విగ్రహం తుక్కు తుక్కు అయిపోయింది.ధృతరాష్ట్రునికి ఎందుకంత బలం?పుట్టుకతో అంధుడైనా, వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ధృతరాష్ట్రునికి సుమారు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది. తనకున్న బలంతో తన నూరుగురు కొడుకులను చంపిన భీముడిని కౌగిలించుకుని చంపాలన్నది ధృతరాష్ట్రుని ప్రణాళిక. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ఇనుముతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఇనుప విగ్రహాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. దీంతో శ్రీ కృష్ణుని వల్ల భీముడికి ప్రాణాపాయం తప్పింది. అప్పటినుండి ధృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి వచ్చింది.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
నిర్మల హృదయమే గర్భగుడి
ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
పశ్చాత్తాపం... ప్రాయశ్చిత్తం
ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. తెలిసో తెలియకనో మనం ఇతరులకు బాధ కలిగిస్తుంటాం. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకోగలగటం, అందుకు మనసులో బాధతో దహించుకుపోవటాన్నే పశ్చాత్తాపం అంటారు. ఇదే మానవత్వపు ఔన్నత్యం!మళ్ళీ ఆ తప్పు తనవల్ల జరగకుండా జాగ్రత్త పడటం, తనవల్ల వేదనకు గురైన బాధితులకు తగిన మేలు చేయడమే ప్రాయశ్చిత్తం, అదే మానవ ధర్మం. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పాప పరిహారం లేదు’ అని ఎవరో అన్నారని ‘నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని ఒక మాట చెప్పేసి ‘నేను పశ్చాత్తాప పడ్డాను కాబట్టి నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు’ అని తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఆదిశంకరాచార్యులవారు కూడా అలా అడ్డదారులలో సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల ఫలితాల నుండి విముక్తం అవటం సాధ్యం కాదు అనీ జ్ఞానబుద్ధితో మాత్రమే ప్రాయశ్చిత్తం లభిస్తుందని అన్నారు. ‘తెలిసి చేసిన తప్పును ఏ దేవుడూ క్షమించడు’ అని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట కూడా ఆమోద యోగ్యమే. ‘ఎవ్వరికీ అపకారం చేయని ఆ ఆవు చావుకి కారణమయ్యాను. ఇక నేను కూడా బతకను’ అని.. ఆత్మాహుతి చేసుకునేందుకు పరుగులు తీసే మనసున్న మనిషికి మాత్రమే .... కేవలం పశ్చాత్తాపం తో పరిహారం అయినట్లు భావించాలి. పశ్చాత్తాపపు బాధతో దహించుకుపోతున్న మనస్సుతో అతను జీవితం మొత్తం గడుపుతాడు. ఆ వ్యథనే అతడు శిక్షగా భావిస్తాడు.పై వివరణ కేవలం ఒక ఘటన, ఉదాహరణ మాత్రమే. పశ్చాత్తాపం అంటే పై విధంగా ఉండాలి.దేశం ఏదైనా, మతం ఏదైనా సమాజంలో మానవుని జీవితంలో తప్పు జరగటం అనివార్యం, అయితే అటువంటి తెలిసీ తెలియని తప్పులకు కూడా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వంటివాటిని పెద్దలు ఎప్పుడో చెప్పారు. వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడటం క్షమాపణ చెప్పటం నైతికత. ప్రవర్తనను సంస్కరించుకొనటం, ఆపై పరిహారం అందించటం ద్వారా ప్రాయశ్చిత్తం. చట్టపరమైన.. న్యాయం నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేయటం, శిక్షద్వారా పశ్చాత్తాపం పొందేలా చేయటం ప్రాయశ్చిత్తం జరిపించడం ఆచరణీయాలుగా ఉన్నాయి.క్రైస్తవ్యంలో.. మెటానోయియా అనబడుతూ పశ్చాత్తాపం, దైవశాస్త్ర ప్రాయశ్చిత్తం ఉన్నాయియూదు మతంలో.. తెషువా అనబడే ప్రాయశ్చిత్తం ఉన్నాయి. ఇస్లాంలో.. తౌబా అనబడే ఆచారం.. పశ్చాత్తాప భావనను, ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. లౌకికవాదంలో... పశ్చాత్తాపం అంటే వ్యక్తం చేయటంతో పాటు, క్షమించ బడటానికి సమాజంలో విశ్వాసం పొందడానికి తగిన పారదర్శకతతో కూడిన పరిహార చర్యలను ప్రాయశ్చిత్తంగా భావిస్తుంది.ప్రభావవంతమైన నైతిక పునరుద్ధరణకు పునరావృతం కాకుండా నిరోధించడానికి నిజమైన పశ్చాత్తాపంతో పాటు స్పష్టమైన తత్సమానమైన ప్రాయశ్చిత్తం అవసరం అంటుంది. ధర్మశాస్త్రం, పురాణాలూ, నిఘంటువులు, మతాలూ, చట్టాలూ ఏమిచెబుతున్నా... ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. తప్పు. అలాంటి తప్పులకు పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందిఅపరాధ భావంతో తెలియక చేసిన ఆ పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగపాపం తొలగిపోతుంది. పశ్చాత్తాపంలో భాగంగా పాటించవలసిన కట్టుబాటులో బాధితుల్ని శరణు వేడటం, మెప్పించటం వంటి నిబంధనలు ఉంటాయి.చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెపుతున్నాయి. దానినే..‘మనః ప్రాయశ్చిత్త’మని అంటారు. ఇట్టి మనః ప్రాయశ్చిత్తం బాధితులకు భౌతికంగా, మానసికంగా కూడా సహాయకారియై పరస్పరం ఇరువర్గాలకు మనశ్శాంతిని ఇస్తుందని జ్ఞానులు నమ్ముతారు.– డా.గాదిరాజు మధుసూదన రాజు -
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం -
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు -
కృష్ణుడి గురించి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి!
అసంఖ్యాకమైన భగవదావతారాలలో అతి విశిష్టమైనదీ, పరిపూర్ణమైనదీ కృష్ణావతారం. భావో ద్రేకాలు అధికమైన భక్తులకు శ్రీకృష్ణుడు మహానందాంగనా డింభకుడిగా, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యంగా, అందమైన అల్లరి చేష్టల నవనీత చోరుడిగానే ముందు మనసుకు వచ్చి మురిపిస్తాడు కానీ ఆయన జగద్గురువు. యోగేశ్వరుడు. దేవదేవుడు. భూభారం తగ్గించటమే లక్ష్యంగా ఆయన ఎత్తిన కృష్ణావతారంలో ఆజన్మాంతం దుష్టశిక్షణా, సాధురక్షణా, ధర్మ సంస్థాపనా, జగదోద్ధరణా జరిగాయి. అన్ని అద్భుత ఘనకార్యాలు మరే అవతారంలోనూ కనబడవు. ఆ ‘భాగవత’మంతా పఠిస్తేనే చాలు, ‘బాగవుతాం’ అన్నారు పెద్దలు.పుట్టిన మూడో నెలలో పూతనను మట్టుపెట్టడంతో ఆరంభించి, పసితనంలోనే ఆయన వల్ల మట్టిలో కలిసిన మహాబలులూ, మాయావులూ అయిన రాక్షసులకు లెక్క లేదు. ఏడేళ్ల వయస్సులో ఏకంగా కొండనే ఎత్తి, ఏడు రోజులు చిటికెన వేలుమీద స్థిరంగా నిలిపి ఉంచి, ప్రజారక్షణ చేసి, ఇంద్రుడికే సవాలు విసిరిన లీలాబాలుడికి ఎవరు సాటి? ఎందరు దుష్టులను దునుమాడినా, ఆయన ఎవరినీ ద్వేషించలేదు. ఆయన చేత వధించబడిన దుష్టులు ఆఖరికి సద్గతులే పొందారు.కృష్ణావతారం నొక్కి వక్కాణించే సూత్రం ‘గోవిందుడు అందరివాడు’ అని. కామోత్కంఠతో గానీ, స్నేహంతో గానీ, చనువుతో గానీ, భక్తితో గానీ బాంధవ్యంతో గానీ, ప్రేమతో గానీ, చివరకు ఆయనపట్ల అమితమైన అకారణ ద్వేషంతో గానీ, ఆయన మీద మనసు లగ్నం చేయగలిగిన వాళ్ళందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదిస్తాడనేందుకు గోపికలూ, కుచేలుడూ, గోపాలకులూ, నారదాదులూ, యాదవులూ, పాండవ పరివారమూ, కంస–శిశుపాల–సాల్వ–కేశి–పౌండ్రక–దంత వక్త్ర– నరకాసురాదుల వృత్తాంతాలు తనువు పులకరింపజేసే తార్కాణాలు.కార్య విజయాలనూ, జీవన సాఫల్యాన్నీ కాంక్షించే వారికి, సకల శాస్త్రవేత్తా, ధర్మమూర్తీ అయిన భీష్మాచార్యుడు నిర్ద్వంద్వంగా నిర్దేశించిన, ‘యతః ధర్మః తతః కృష్ణః, యతః కృష్ణః తతః జయః!’ (ఎక్కడ ధర్మం ఉంటే, అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుంటే, అక్కడ విజయం ఉంటుంది) అన్న సూచన అందరికీ నిత్యస్మరణీయం, అనుసరణీయం.– ఎం. మారుతి శాస్త్రి -
మన వెన్నంటి చిన్నికృష్ణుడు...
లోక కల్యాణం కోసం శ్రీహరి ధరించిన దశావతారాలలో రామావతారం తర్వాత మళ్లీ అంతటి పరిపూర్ణమైన అవతారం శ్రీ కృష్ణావతారమే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’’.... అని శ్రీమద్భాగవతం శ్రీ కృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. శ్రీ కృష్ణ భగవానుడి లీలల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంత విన్నా భక్తుడి హృదయం పరవశిస్తూనే ఉండటం విశేషం. మన జీవితాలను, సమస్త కర్మలను దేవదేవుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మకు పునరంకితం చేయమని కృష్ణాష్టమి పర్వదినం మనకు గుర్తు చేస్తుంది.శ్రీ నందన నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవులకు స్వయంగా శ్రీ మహావిష్ణువే కృష్ణుని గా జన్మించాడు.అందరికీ అన్నీ తానే అయి....మన పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజాసంప్రదాయాలలోనూ కృష్ణుని చిలిపి బాలునిగాను, పశువులకాపరి గాను, రాధా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగానూ... ఇలా అనేక విధాలుగా శ్రీ కృష్ణుని చిత్రీకరిస్తుంటారు. అంతేకాదు, శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం గురించి ఎన్నో విధాలుగా చదువుతుంటాం. అయినా ఆ కృష్ణుని గురించి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఉంటూనే ఉంటాయి.వెన్న దొంగ ఎందుకయ్యాడు?చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణునిగానూ, వెన్న దొంగగానూ పేరు పొందాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో దేవరహస్యం ఏమంటే... వెలుగుకు, విజ్ఞానానికి సంకేతమైన వెన్న, చీకటికి, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండలలో ఉండేది, తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడని భాగవత లీలలు చెబుతున్నాయి.నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే, వైష్ణవులు నక్షత్రమే ప్రధానంగా తీసుకుంటారు.ఎలా జరుపుకోవాలంటే...కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు అలంకరించి పూజామందిరంలో ముగ్గులు వేయాలి.ఇక ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి భాగవత పురాణాన్ని లేదా శ్రీ కృష్ణ లీలలను పారాయణ చేస్తూ గడుపుతారు. సాయంత్రం వేళ విధి విధానాలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అనంతరం ఈ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడలను నైవేద్యం పెడతారు. రాత్రి కాగానే ఊయలలు కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాల్ని పవళింపజేసి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అనీ పిలుస్తారు. వేణుమాధవుడు...కృష్ణుడు వేణువును విడిచి పెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే... చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కృష్ణుడు తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. చివరికి అందరూ కలిసి నువ్వంటే కృష్ణుడికి ఎందుకంత ఇష్టమని వేణువుని అడిగితే.. ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అని చెప్పిందట వేణువు. నిజమే కదా! వేణువు అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తన మనసులో ఏ మాలిన్యమూ, భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే.– డి.వి.ఆర్. -
దైవబలమే గొప్పదా? ఈ శతకాలు ఏం చెబుతున్నాయంటే!
మానవుడు ఏమి తలచినా చివరకు దైవనిర్ణయం ప్రకారమే జరుగుతుంది.. మనకు ఏం జరిగినా దేవుడు మంచే చేస్తాడని దైవం మీద నమ్మకం వుండాలి. అందుకు ఉదాహరణగా శతకనీతిలో ఏం చెప్పారో చూద్దాం...‘యధా కందుక పాతేనో త్పత త్యార్య :పతన్న పి...అంటే.. పురుషకారం కన్నా దైవమే గొప్పదంటాడు భర్తృహరి.కింద పడ్డ బంతి పైకి ఎలా ఎగురుతుందో దైవాన్ని నమ్మినవాడు హీన స్థితి పొందినా ఉన్న స్థితిని పొందుతాడుదీనినే దైవబలం అంటారు.లోకంలో అన్నిటికన్నా దైవమే బలీయమైనది అని అంటూ ‘మతిమతాం చ విలోక్య దరిద్రతాం’.. బుద్ధిమంతులు దారిద్రాన్ని అనుభవించారు అని అంటారు.మరో పద్యం ద్వారా అన్నింటికీ దైవమే శరణం అని అంటారు..‘దైవబలమే గాని తనబల్మి కాదయ్యా‘ అని తేల్చి చెప్పేసాడు వేమన.‘దైవము లేనిది యే కార్యము సాగదు సుమతీ ఎన్ని సాధనములున్నన్ ‘అన్నారు, సుమతి శతకం లో ‘ఈ జగమందు, దా మనుజుడెంత మహాత్ముడెయైన దైవ మా తేజము తప్పజూచునెడ ద్రిమ్మరి కోల్పోడు నెట్లనిన’ అంటూ మహారాజుకుమారుడైన రామచంద్రుడి వనవాసం ప్రస్తావన తెస్తాడు భాస్కర శతకంలో ‘మహాత్ముడైన దాసాంద్ర విభూతి బాసి యొక విíహీనుని గోల్చియుంట’అంటూ అదే శతకంలో చక్రవర్తి సత్య హరిశ్చంద్రుడు కాటికాపరి అయి వీరబాహుణ్ణి సేవించే ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తాడు. చివరగా ‘దైవే దుర్బలతాంగతే తృణమపి ్రపాయేణ వజ్రాయతే ‘ అన్న సుభాషితం మన భ్రమలను తొలగిస్తుంది.– డా. కందాళ సత్య నారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ఇవి కూడా చదవండి: బాలుని మింగిన మొసలి! శివభక్తికి నిదర్శనం! అసలే జరిగిందంటే? -
బాలుని మింగిన మొసలి! శివభక్తికి నిదర్శనం! అసలేం జరిగిందంటే?
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలసిన చారిత్రాత్మక అవినాశిలింగేశ్వర ఆలయం అవినాశి అప్పర్ ఆలయం అని కూడా పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్భుతమైన శిల్పం 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ జీవితంలో జరిగిన అత్యంత ప్రసిద్ధమైన పౌరాణిక అద్భుతాన్ని కళ్లకు కడుతుంది.సుందరార్ శివభక్తులలో అగ్రగణ్యుడు, తేవారం అనే పవిత్ర తమిళ శైవ కీర్తనల సంకలన కర్త. ఈ శిల్పఘట్టాన్ని తమిళంలో ముదలై వాయి పిళ్ళై అని పిలుస్తారు, మొసలి నోటిలోని బాలుడని దీని అర్థం. ఎనిమిదవ శతాబ్దంలో సుందరార్ అవినాశి గ్రామం గుండా వెళ్తుండగా ఒకే వీధిలోని రెండు ఇళ్లలో పరస్పర విరుద్ధమైన వాతావరణాన్ని గమనించారు. ఒక ఇంట్లో ఒక బాలుడికి ఎంతో వైభవంగా ఉపనయన వేడుక జరుగుతుండగా ఎదురింట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా 3 ఏండ్లక్రితం ఆ ఇద్దరు బాలురు స్థానిక తామరై కుళం అనే తామరచెరువులో స్నానానికి వెళ్లినప్పుడు ఒక బాలుడిని పెద్ద మొసలి మింగేసింది.ఈ రోజు బతికి ఉన్న బాలుడి ఉపనయన వేడుకలు చూసి తమ కొడుకు కూడా ఉంటే ఇలాగే వేడుక చేసుకునేవారమని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న అపారమైన వేదనను, దు:ఖాన్ని చూసి సుందరార్ హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన ఆ చెరువు ఒడ్డుకు చేరుకుని అవినాశిలింగేశ్వరుడిని అంటే పరమశివుడిని సంపూర్ణ భక్తితో ధ్యానిస్తూ పది పవిత్ర తమిళ శ్లోకాలతో కూడిన ఎట్రానై మరక్కేనే అనే ప్రసిద్ధ దేవార పదిగమ్ను ఆలపించారు.ఇలా భక్తి పారవశ్యంలో ఆలపించిన కీర్తనల ద్వారానే శివుడిని మెప్పించి అద్భుతాలు సాధించడం నాయనార్ల చరిత్రలో పలుమార్లు కనిపించే ఒక విశిష్టలక్షణం. సుందరార్ అనన్య భక్తికి ఆర్తికి మెచ్చిన పరమశివుడు ప్రదర్శించాడు. సుందరార్ ప్రార్థన పూర్తికాగానే ఎండిపోయిన ఆ చెరువులోకి నీరు అమాంతంగా ప్రవహించడం ప్రారంభమై నిండింది.ఆ చెరువులో నుండి ఒక పెద్ద మొసలి పైకి తేలింది. యమధర్మరాజు స్వయంగా ఆ బాలుడి ఆత్మను తిరిగి ప్రవేశపెట్టగా ఆ మెుసలి తన నోటి నుండి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు పడవేసింది. కాలం గడిచినా శివానుగ్రహంతో ఆ బాలుడు చనిపోకుండా సరిగ్గా ఉపనయన వయస్సున్న 8 ఏళ్ల బాలుడిగా ఎటువంటి గాయాలు లేకుండా నమస్కరిస్తూ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ శిల్పంలో ముసలి నోటి నుండి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటకు వస్తున్న భక్తిరస పూరిత అద్భుత దృశ్యాన్ని నాటి శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కారు. శైవ సిద్ధాంతంలో భక్తికి శక్తికి భగవంతుని అపరిమిత కరుణకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ కథ తమిళ శైవసాహిత్యంలో పెరియపురాణం అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఇది నాయనార్ల జీవిత చరిత్రలను వర్ణించే ప్రామాణిక కావ్యం. ఈ నాటికీ అవినాశిలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పంగుణి అశ్విని నక్షత్రం రోజున ఈ ముదలై వాయి పిళ్ళై అద్భుతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు విశేషంగా పాల్గొంటారు.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ఇవి కూడా చదవండి: విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే! -
విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!
మాతృదేవోభవ, పితృదేవోభవ అన్న సూక్తి తర్వాత మన సంస్కృతి స్థానం కల్పించింది ఆచార్యుడికే! కన్నవారు జన్మనిస్తే... ఆ జన్మకు సార్థకతను, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. సమాజమనే తోటను సుభిక్షంగా ఉంచే తోటమాలి ఉపాధ్యాయుడు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందని నమ్మిన దేశం మనది. అటువంటి గురు పరంపరకు కృతజ్ఞతలు చెప్పుకునే పవిత్రమైన రోజే ‘గురు పూజోత్సవం’.భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి, జగద్గురువుగా కీర్తించబడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని (సెప్టెంబరు 5) మనం ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, దేశ అత్యున్నత పదవిని అధిష్టించినా, ఆయన హృదయం ఎప్పుడూ విద్యాబోధన వైపే నిలిచింది. అందుకే, తన పుట్టినరోజును వేడుకగా కాకుండా, దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజుగా జరపాలని ఆయన కోరారు. ఆనాటి నుండి నేటివరకు ఈ రోజును మనం ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం.సమాజ శిల్పి:కాలం మారుతున్నా, సాంకేతికత పెరుగుతున్నా గురువు పాత్రను పూరించే శక్తి దేనికీ లేదు. ఒక ఉత్తమ గురువు నిర్వర్తించే విధులు కేవలం నాలుగు గోడలకే పరిమితం కావు: కేవలం పుస్తకాల్లోని అక్షరాలను పాఠాలుగా నూరిపోయడం కాదు, లోకజ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థిలోని సృజనాత్మకతకు పదును పెట్టడం గురువు ప్రథమ కర్తవ్యం.నైతిక విలువల రూపశిల్పి: విద్యార్థులలో క్రమశిక్షణ, సత్యం, కరుణ, పెద్దల పట్ల గౌరవం వంటి సంస్కారాన్ని నూరిపోసి వారిని సన్మార్గంలో నడిపించే పక్షపాత రహిత మార్గదర్శి గురువు. తరగతి గదిలో ప్రతిభావంతులతో పాటు వెనుకబడిన విద్యార్థులను కూడా సమానంగా ఆదరిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం గురువుకే చెల్లింది.స్ఫూర్తి ప్రదాత: విద్యార్థుల భయాన్ని పోగొట్టి, వారిలో దాగివున్న ప్రత్యేక నైపుణ్యాలను (కళలు, క్రీడలు, నాయకత్వం) గుర్తించిప్రోత్సహించడం ద్వారా గురువు తాను స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే కాదు, తన శిష్యులను కూడా పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చే మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతాడు.గురు ఋణం తీర్చుకుందాంఈనాటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు. వారిని ఉత్తమ పౌరులుగా మార్చే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. కేవలం సెప్టెంబరు 5వ తేదీన పూలమాలలు వేసి సన్మానించడమే కాదు, జీవితాంతం గురువులను గౌరవించడం, వారు చూపిన సన్మార్గంలో నడవడం ద్వారానే మనం గురు ఋణాన్ని తీర్చుకోగలం. సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయ లోకానికి వందనాలు సమర్పిస్తూ... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.– డా. డి.ఎల్. అనూరాధ -
బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే!
విశ్వవ్యాప్తంగా రెండు వేల సంవత్సరాల నుండి ఉన్న క్రైస్తవ సమాజానికి మౌలికమైన రెండు సంస్కారాలను యేసు ప్రభువు సూచించారు. ఒకటి పరిశుద్ధ సమభాక్తము. రెండు పరిశుద్ధ బాప్తిస్మం. దీనిని వేదాంత పండితులు దివ్యస్నానం అన్నారు. ఒకసారి జరిగిన వేదాంత సమావేశంలోని పెద్దలు బాప్తిస్మమునకు ప్రతినామంగా దివ్యస్నానమును నిశ్చయించారు. దీనిని కేథలిక్ సంఘం వారు జ్ఞానస్నానమంటారు.వాస్తవంగా బాప్తిజోమ్ అనే గ్రీకు భాషలోని పదం, తెలుగు భాషలో బాప్తిస్మం లేదా జ్ఞానస్నానం అంటారు. ఇంకా కొన్ని ్ర΄÷టెస్టెంట్ సంఘాల గురువుల సమావేశాల్లో ఇంకా అదనంగా ఏడు సంస్కారాలు/సాంప్రదాయాలు నిర్ణయించారు. అప్పటి ఉమ్మడి తెలుగు ప్రాంతాలైన చిత్తూరు మొదలు అదిలాబాద్ ప్రాంతానికి క్రీ.శ. 1842 నుండి మాత్రమే క్రైస్తవ విశ్వాసం ప్రవేశించిందన్నది బైబిలు గురువుల అభి్రపాయ సారాంశం.నీకొదేము సంభాషణ:ఒకసారి యూదుల అధికారిౖయెన నీకొదేమను పరిసయ్యడు, అతడు రాత్రియందు యేసు ప్రభువు వద్దకు వచ్చాడు. ఆయన తో – బోధకుడా... నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని తెలుసు. దేవుడు మీకు తోడై యుంటేనే గానీ నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవరునూ చేయలేరన్నాడు. ప్రభువు వానితో ‘‘ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను’’ అని అన్నారు.అందుకు నీకొదేము ‘‘ముసలివాడైన మనుష్యుడేలాగు రెండవసారి గర్భం నుండి జన్మింపగలడ’’ని ఆయనతో అన్నాడు. యేసుప్రభువు ఈ విధంగా అన్నాడు. ‘‘ఒకడు నీటి మూలంగానూ, ఆత్మ మూలంగానూ జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాన’’ని అన్నాడు.పునీత అగస్టీన్ ఈ బాప్తిస్మం అనే ప్రక్రియను బాహ్యంగానూ అంతరంగంలోనూ జరిగే ప్రక్రియ అన్నారు. దీనినే ప్రక్షాళన, కడగబడటం అంటారు. బా΄్తోమ్ (గ్రీకు) అనగా శుద్ధి చేసుకోవటం.సర్వశక్తిమంతుడైన భగవంతునిపై భక్తితో శరణాగతి కలిగి యుండటం. యూదులు దేవాలయంలోనికి ప్రవేశించే ముందు ప్రథమభాగంలో పాప పరిహారార్థం బలులు అర్పణ చేసి గంగాళంలోని నీళ్ళతో శుభ్రపరచుకొని ప్రవేశిస్తారు.ఇవి కూడా చదవండి: ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిలో గ్రామ ప్రాంత దేవాలయంలోనికి ప్రవేశించే ముందు చెరువులో స్నానం చేసి, చెరువుగట్టు సమీపంలో వున్న దేవాలయంలోనికి ప్రవేశిస్తారు. అంతరంగ శుద్ధీకరణ అనేది ఒక్కసారే జరగాలి. అది పైనుండి జరిగే క్రియ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల అభిషేకం జరగాలి. ఎందుచేత అంటే ఏక దేవుని నామమున, ఏకత్వం అయిన త్రిత్వదేవునిచే జరిగే ఆత్మప్రక్షాళన. బాప్తిస్మం, సమబాప్తం ఈ రెండు సూత్రాలు క్రైస్తవ సమాజానికి, సంఘానికి పునాది. (ఫౌండేషన్). దైవకార్యార్థ సేవ (మిషన్), అనగా 1. బోధన (టీచింగ్), 2. ప్రబోధ (ప్రీచింగ్), 3. స్వస్థత (హీలింగ్) (టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్).ఆ దినములలో (క్రీ.శ. తొలిదశ) బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనస్సు పొందుడని ప్రకటిస్తున్నప్పుడు యూదులందరూ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం పొందారు. ఆ సమయంలో బాప్తిస్మం పొందటానికి యేసుప్రభువు గలిలయ నుండి యోర్దాను దగ్గర వున్న యోహాను దగ్గరకు వచ్చాడు. అప్పుడు యోహాను ‘‘నేను మీ చేత బాప్తిస్మం పొందవలసినవాడనై వుండగా మీరు నా దగ్గరకు వచ్చితిరా?’’ అని ఆయనను నివారింప జూశాడు. కానీ ప్రభువు ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది కావున ఆయనను జరిగించమ’’న్నాడు. కనుక ఆయన అలాగు చేశాడు.యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు రాగా ఆకాశంనుంచి దేవుని ఆత్మ పావురంలా యేసుప్రభువు దగ్గరకు రావడం చూశాడు యోహాను. ‘‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేనానందిస్తున్నానన్న’’ శబ్దం ఆకాశం నుండి వచ్చింది. (పరి. ముత్త 3:13:17).గురువు/ప్రీస్ట్/పాస్టరు నీటిలో ముంచి తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ పేరిట వారికి బాప్తిస్మం/దివ్యస్నానం ఇవ్వటం, మారు మనస్సు పొందినవారికి త్రియేక దేవుని నామం పేరిట పరి. బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. శరీరానికి, ఆత్మకు, ఆత్మకు, శరీరానికి జరిగే పోరాటంలో జయించిన వారే తమను తాము జయించినవారు. యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో మనవలె జీవించాడు. ఒక్క పాపం విషయంలో తప్ప. అటువంటి బాధ్యత పునీతులు, తమను తాము జయించుకున్నవారే పరలోక రాజ్యానికి అర్హులు. అది యేసు వారు దైవకుమారుడైనందుననే లోకాన్ని జయించాడు. తనను తాను రిక్తునిగా చేసుకుని తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అటువంటి ధన్యత, భాగ్యం మనకనుగ్రహించును గాక. ఆమెన్!– కోట బిపిన్ చంద్రపాల్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!
మహోపాధ్యాయ మహాప్రవక్త ‘‘ఈ రోజుల్లో కాస్త కోపం వస్తే చాలు, విరుచుకుపడే మాష్టార్లను చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో... ఒక అమాయకపు పల్లెటూరి మనిషి, మసీదు పవిత్రత తెలియక లోపల మూత్రవిసర్జన చేస్తే, చుట్టూ ఉన్నవాళ్ళు కర్రలెత్తారు. కానీ ఆ మమహనీయులు ఏమన్నారో తెలుసా? ‘‘ఆగండి... అతడిని పూర్తి చేయనివ్వండి.’’ అదీ సహనం అంటే! ఆ తర్వాత అతడిని దగ్గరకు పిలిచి, ప్రేమగా చెప్పి, ఒక బకెడు నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు.‘‘తప్పు చేశావు!’’ అని గద్దించడం కాదండీ, ‘‘ఏది ఒప్పో’’ తలనిమిరి చెప్పడం గురువు లక్షణం. అలాగే ఒక కుర్రాడు వచ్చి, నాయనా... నాకు వ్యభిచారం చేయడానికి అనుమతివ్వు అని అడిగితే... ఏ సమాజమైనా ఏం చేస్తుంది? కానీ ప్రవక్త గారు నవ్వారు. కూర్చోబెట్టుకున్నారు. ‘‘రా నాయనా... ఇది నీ తల్లికో, నీ చెల్లికో ఇతరులు చేస్తే ఒప్పుకుంటావా?’’ అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న ఆ కుర్రాడి గుండెల్లో నాటుకుపోయింది. మనసు మారిపోయింది. విమర్శించడం కాదు, ఆలోచింపజేయడం! అదీ ఆయన శైలి.ఖురాన్ అంటుంది: ‘‘ఆయనే మీకు జ్ఞానాన్ని, విచక్షణను, సరికొత్త విషయాలను నేర్పించే గురువు’’ అని. అందుకే ఇస్లాంలో గురువు స్థానం సామాన్యమైనది కాదు. హజ్రత్ అలీ ఒక మాటంటారు ‘‘నాకు ఒక్క ఒక్క అక్షరం నేర్పినా, నేను జీవితాంతం అతనికి బానిసనే!’’ ఎంత గొప్ప మాటండీ ఇది! ఈ రోజుల్లో గురువులకు ఆ గౌరవం దక్కుతోందా? మనం చనిపోయాక కూడా మనతో వచ్చేది రెండే రెండు... ఒకటి మనం చేసిన మంచి, రెండు మన గురువు మనకు నేర్పిన జ్ఞానం. దాన్నే ‘సదఖాయె జారియా’ అన్నారు.అంటే తరగని పుణ్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... గురువు అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు అప్పజెప్పే టేప్ రికార్డర్ కాదండీ... ఒక మనిషిలోని అజ్ఞానాన్ని తుడిచేసి, అతనిలో నిద్రపోతున్న మంచితనాన్ని నిద్రలేపే ఒక ‘అద్భుతమైన శిల్పి’. ఆ శిల్ప కళను ప్రపంచానికి ఆచరించి చూపించిన ఆ మహా ఉపాధ్యాయుడికి మేలును ఎలా మర్చిపోగలం! ఏమంటారు? ఆలోచించండి మరి!– ముహమ్మద్ ముజాహిద్ఇవి చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా? -
జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా?
శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పర్వదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా భక్తులు ప్రతియేటా జరుపుకుంటారు. శ్రావణమాసం కృష్ణపక్షం – అష్టమి తిథిన దేవాది దేవుడు ఆవిర్భవించాడు. నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురలో దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా కంసుని కారాగృహంలో భగవానుని ఆవిర్భావం జరిగింది. ఈ శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా... భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్ని రేఖామాత్రంగానూ, ఆ తర్వాత ఆ పర్వదినాన ఆచరించ వలసిన విధులనూ తెలుసుకుందాం...పూర్వం దానవ రాజుల అకృత్యాలతో భూమాత తల్లడిల్లింది. తన ఇబ్బందులను వినిపించేందుకు బ్రహ్మదేవుని చెంతకు భూమాత చేరింది. భూలోక పరిస్థితులను విన్న బ్రహ్మ తాను కూడా కలత చెంది క్షీరసాగరంలో శయనించిన విష్ణువును దేవతలందరితో కలసి వెళ్లి స్తుతిస్తారు. వీరి మొర ఆలకించిన దేవాదిదేవుడు త్వరలోనే వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తానన్న తన దివ్య సందేశాన్ని బ్రహ్మ ద్వారా తెలియజేస్తాడు. తదనంతరం శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవతలందరూ తమకు నిర్దేశించిన రీతిలో యదువంశంలో జన్మిస్తారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు తానే స్వయంగా దేవకీ దేవి అష్టమ గర్భాన కృష్ణునిగా అవతరించాడు.ధర్మాచరణంధర్మ స్థాపన కొరకు దేవాది దేవుడి శ్రీ కృష్ణ అవతారం చాలా ప్రముఖమైనది. క్రూరుడు అయిన కంసుడిని వధించి యదువంశాన్ని రక్షించాడు. బాల్యలీలల ద్వారా పూతనను సంహరించాడు. గోవర్ధనగిరి అనే పర్వతాన్ని చిటికన వేలితో ఏడురోజులపాటు ఎత్తి యాదవులందరిని కాపాడాడు. కాలియుడనే విష సర్పం గర్వాన్ని అణిచివేసి పడగలపై నృత్యం చేశాడు జరాసంధుడు, శిశుపాలుడు వంటి ఎందరో దానవులను మట్టుబెట్టారు. కుచేలుడు, కుంతీదేవి, ద్రౌపది వంటి వారెందరికో తన కృపను ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో పాండవులకు ఎల్లవేళలా రక్షణ ఇచ్చి చివరకు అర్జునుడికి రథ సారధి అయ్యాడు. యుద్ధభూమిలో కర్తవ్య నిర్వహణకు సందేహించిన అర్జునుడికి జీవితసత్యాలతో భగవద్గీత బోధించాడు. ఈ గ్రంథం సర్వమానవాళికి గొప్ప మార్గదర్శం.జన్మాష్టమి రోజు చేయాల్సినవిభగవానుడికి చేరువయ్యేందుకు భక్తులు ఉపవాసం చేస్తారు. అర్ధరాత్రి కృష్ణుడి జన్మ సమయం వరకు భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీ కృష్ణుని లీలలను శ్రవణం చేస్తారు. కృష్ణుడి విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు, అటుకులు, వెన్న, మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉట్టి కొట్టడం, సాంస్కృతిక ప్రదర్శనలు, కృష్ణ అలంకరణ వంటివి కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇలా దేవాదిదేవుడి జన్మదినం సర్వమానవాళికి శుభం కలిగించే మహోత్సవంగా జరుపుతారు.– దేవిశెట్టి శ్రీనివాస్భగవంతుడనే పదానికి స్వాగతం కృష్ణా...ప్రపంచంలోని మతాలన్నీ ఆయా సంస్కృతులు, భాషానుసారం భగవంతుణ్ణి వివిధ నామాలతో సంబోధిస్తుంటాయి. ఆ నామాలన్నీ నిస్సందేహంగా భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ తెలుపబడినవే, కాని అవి భగవంతుని అనంతమైన గుణాల్లో ఒక్కోగుణాన్ని ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ తెలుపబడినవి.‘భగవంతుడు’ అనే పదానికి అత్యంత సరళమైన ఒక నిర్వచనం. అంటే, ‘ఎవరినుంచైతే సర్వం ఆవిర్భవిస్తుందో వారే’ అని అర్థం. (శ్రీమద్భాగవతం 1.1.1)విశేషమైన ప్రామాణిక వైదిక వాఙ్మయాన్ని పరిశీలిస్తే, ‘భగవంతుడు’ అన్న పదానికి వేదవ్యాసుల తండ్రియైన పరాశరముని ఒకచక్కటి నిర్వచనాన్ని అందించారు.ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసఃశ్రియఃజ్ఞాన వైరాగ్యయోశ్చైవషణ్ణాం భగవతీంగన‘‘జ్ఞాన, బల, ఐశ్వర్య, కీర్తి, సౌందర్య, వైరాగ్యాలనే ఆరు విభూతుల నిధనమే దేవాదిదేవుడైన భగవంతుడు.’’ (విష్ణు పురాణం 6.5.47) జన్మాష్టమి అంటే శ్రీ కృష్ణుడు అవతరించిన దివ్యతిథి. పరమపూజ్యశ్రీ శ్రీల ప్రభుపాదుల వారి విశేష కృషి ఫలితంగా నేడు జన్మాష్టమి మహోత్సవం ప్రపంచమంతటా జరుపుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఈ జన్మాష్టమి రోజున మీకు సమీపంలోని మందిరాన్ని సందర్శించి, పవిత్ర భగవన్నామాలను జపిస్తూ ఉత్సవాల్లో భాగస్తులై శ్రీ కృష్ణుడిని మీ జీవితాల్లోనికి స్వాగతించండి. హరే కృష్ణ!– శ్రీ మాన్ సత్య గౌర చంద్ర దాస, అధ్యక్షులు, హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ఇవి కూడా చదవండి: అన్నదాన మహిమ! -
అన్నదాన మహిమ!
‘అన్నదానాత్పరం నాస్తి దానమన్యదిలాతలే.’ ఈ భూలోకంలో అన్నదానం కంటె గొప్ప దానం మరొకటి లేదు. నిత్యం అన్నదానం చేసే ఓ వ్యక్తి తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, తాను చేసినట్లే అన్నదానం చేయాలని కోరాడు. తన దగ్గర అంతగా డబ్బులేని ఆ కుమా రుడు తన సమస్యను నారాయణునికి నివేదించడానికి బదరీకి బయలుదేరాడు.దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. వాటిని ఎవరూ ముట్టుకున్న జాడ కనిపించలేదు. ఒక పాము ఎవరు ఎంత కొట్టినా తనకు చావు రావడంలేదని చెప్పింది. ఒక పొలం యజమాని తన పండిన పంట తనకు దక్కడం లేదని వాపోయాడు. తమ సమస్యలను బదరీ నారాయణునికి నివేదించమని కోరారు. దారిలో ఆకలితో ఒక బోయవాని ఇంటికి వెళితే బోయవాడు తన కోసం ఉంచుకున్న దుంపలను ఆ బాటసారికి ఇచ్చాడు. అతడి భార్యాపిల్లలు తమ దుంపలను ఇవ్వడానికి నిరాకరించారు. తెల్లవారే టప్పటికి ఓ పులి బోయవాణ్ణి, అతడి కుటుంబాన్ని చంపిన దృశ్యం చూశాడు.బదరీ వెళ్లి నారాయణునితో ముందుగా ఇతరుల సమస్యలే నివేదించాడు. అందుకా నారాయణుడు పూర్వ జన్మలో ఒక వేదపండితుడు ఎవరికీ వేద పాఠం చెప్పకుండా చనిపోయి ఈ జన్మలో ప్రయోజనం లేని పండ్ల చెట్టయి పుట్టాడనీ, ఇప్పుడు ఎవరికైనా వేదం చెబితే అతడి సమస్య తీరుతుందనీ చెప్పాడు. పాము పూర్వజన్మలో పెద్ద ఆస్తిగల పిసినారి అనీ, ఇప్పుడు తన మణి మాణిక్యాలకు కాపలా కాస్తూ పడివున్నదనీ, వాటిని ఎవరికైనా దానం చేస్తే సమస్య తీరుతుందనీ చెప్పాడు. పొలం యజమాని తన ముగ్గురు కూతుళ్ళకు కన్యాశుల్కం తీసుకున్నాడనీ, ఇప్పుడు నాలుగో కుమార్తెకు కన్యా శుల్కం తీసుకోకుండా పెళ్లి చేస్తే అతడి పంట చేతికి వస్తుందనీ చెప్పాడు. ఇక బోయవాని ఉదంతం తెలుసుకోవాలంటే ఇప్పుడే కాశీరాజుకు జన్మించిన కుమారుని వద్దకు వెళ్ళమన్నాడు.బాటసారి ఆ పసిబాలుని దగ్గరకు వెళ్లగా ‘నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయవాడిని నేనే! తమవంతు ఆహారాన్ని పెట్టని నా భార్య, బిడ్డలు ఈ జన్మలో పందిపిల్లలుగా పుట్టారు’ అని చెప్పాడు. దీంతో అన్నదాన మహిమ అర్థమైన బాటసారి నారాయణుడు చెప్పిన పరిష్కార మార్గాలు రైతు, పాము, మామిడి చెట్టుకు చెప్పాడు. దీంతో, రైతు తన కుమార్తెను బాటసారికిచ్చి పెండ్లి చేశాడు. పాము తన సంపదనంతా అతడికే ఇచ్చింది. మామిడి చెట్టు రూపంలోని పండితుడు వేద పాఠం చెప్పాడు. అందరి సమస్యలను పరిష్కరించిన బాటసారి ధనం, విద్య, భార్యతో తల్లిని చేరి అన్నదానం ప్రారంభించి ధన్యుడయ్యాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!
ఏ స్వామికైనా ప్రసాదం నారికేళం, అరటిపండ్లు వంటివి భక్తులు నివేదించడం చూశాం. అలాగే ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా లడ్డూలు, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, అటుకులు వంటివి నైవేద్యంగా పెడతారు. పురాతన ఆచారం, ఆలయం విశిష్టత అక్కడ కొలువైన స్వామి ఆధారంగా నైవేద్య సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత దేవతకు సమర్పించిన ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుంటారు. ఇది అత్యంత సర్వసాధారణం. దక్షిణాది వాళ్లు కార్తికేయ, సుబ్రమణ్యస్వామి, మరుగన్ వంటి పేర్లతో ఆరాధించే ఆ శరవణభవుడుకి అక్కడ ఏం సమర్పిస్తారో తెలిస్తే విస్తుపోతారు. అది కూడా ఓ చిన్నపిల్లవాడి కారణంగా ఆ పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, ఆచారంగా మారడం విశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే..కేరళలోని అలెప్పీలోని తెక్కన్ పళని సుబ్రహ్మణ్య స్వామి మహా క్షేత్రం అనే తలవాడి ఆలయం అత్యంత పురాతన ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది 300 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడ కార్వికేయుడు బాలమురుగన్ రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. అయితే ఇక్కడ స్వామి వారికి మంచ్బార్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆఖరికి ఈ ఆలయానికి వచ్చే భక్తులు సైతం మంచ్ బార్లనే తీసుకొస్తుంటారు. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందంటే..ఆ బాలుడి కారణంగా..స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒక ముస్లిం బాలుడు ఆడుకుంటూ..ఆ ఆలయ గంటను మోగించడంతో అతని తల్లిదండ్రులు మందలించారు. ఆ రాత్రి అతనికి తీవ్ర జ్వరం రావడంతో, కలవరింతల్లో మురుగని నామస్మరణ చేశాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు అతన్ని ఆలయానికి తీసుకురాగా, పూజారి ఏదైనా స్వామివారికి నివేదించండి అని చెప్పగా ఆ బాలుడు పట్టుబట్టి మరి తన వద్ద ఉన్న 'మంచ్' చాక్లెట్‌ను సమర్పించాడు. ఆనాటి నుంచి స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం ఆచారంగా మారింది. అంతేగాదు స్వామివారికి పూలదండలకు బదులుగా మంచ్ చాక్లెట్ల దండనే సమర్పిస్తారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి ‘మంచ్ మురుగన్’ ఆలయం అని పేరొచ్చింది. అయితే ఇటీవల ఈ ఆలయాన్ని రేహా అదానీ అనే కంటెంట్ క్రియేటర్ దర్శించుకుంది. అక్కడ స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం చూసి ఆశ్చర్యంతో..ఆ స్వామివారి సందర్శనకు సంబంధించిన వీడియోని పంచుకుంది. అంతేగాదు తనకు ప్రసాదంగా పూజార్లు ఇచ్చిన మంచ్ చాక్లెట్‌ని చూపిస్తూ ఆనందంగా ఆస్వాదించింది. నెటిజన్లు కూడా తాము కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నామని, అక్కడ మంచ్ చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Reha Adani (@stitchyourmap) (చదవండి: ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..) -
ఒక్క ఏడాది.. ఆరు కొత్త పేర్లు.. పాండవుల అజ్ఞాతవాస కథ ఇదే!
మాయాజూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు అరణ్య వాసం, ఏడాది పాటు అజ్ఞాతవాసం చేశారు. ఈ సమయంలో వారు పాండవులు అని ఎవరికైనా తెలిసినట్లయితే మరో 12 ఏళ్లు అరణ్యవాసం, మరో ఏడాది అజ్ఞాతవాసం చేయాలనే నిబంధన ఉంది. అందువల్ల తాము ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం పాండవులు మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు కొలువులో ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసారు. ఆ సమయంలో పాండవులు విభిన్న పేర్లతో వారి వారి వృత్తులను నిర్వహించారు. వారి పేర్లు, నిర్వహించిన వృత్తులను ఇప్పుడు తెలుసుకుందాం.ధర్మరాజు కంకు భట్టు పేరుతో యతి వేషంలో తనకున్న విద్యతో విరాట రాజుకు వినోదం కలిగించేవాడు.భీముడు వలలుడు పేరుతో విరాట రాజు కొలువులో వివిధ రకాల రుచికరమైన వంటలు చేసి మెప్పించేవాడు.అర్జునుడు బృహన్నలగా రూపం మార్చుకుని విరటుని కొలువులో యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చేవాడు.ఇక నకులుడు దామగ్రంథిగా పేరు మార్చుకుని విరటుని ఆస్థానం లో అశ్వశాల విధులు నిర్వహించాడు. అశ్వాలకు శిక్షణ ఇచ్చేవాడు.సహదేవుని తంత్రీపాలుడనే పేరుతో పశువుల శాలకు అధిపతిగా ఉంటూ పశుపోషణ చేస్తూ గోపాలకుడిగా విధులు నిర్వహించాడు.పాండవుల భార్య ద్రౌపది మాలిని పేరుతో విరాట రాజు భార్య సుధేష్ణ అంతఃపురం లో (సైరంధ్రి)గా మాలలు అల్లేలా... రాణిగారికి ప్రధాన పరిచారికగా విధులు నిర్వహించింది. (నేటి పరిభాషలో చె΄్పాలంటే మేకప్ ఉమన్‌గా అన్నమాట.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులుఇవి కూడా చదవండి: ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది! -
ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!
రామాపురం గ్రామం నిత్యం ΄ాడిపంటలతో సస్యశామలంగా ఉండేది. ఒక్కసారిగా ఊరిని కరవు కబళించింది. భూములు బీటలు వారాయి. పశువులు ఆవురావురంటూ ఆకలి కేకలు వేశాయి. నిండు బావులు అడుగంటాయి. కరవును ఎదుర్కోలేక గ్రామస్తులు వలసలు మొదలుపెట్టారు. అది గమనించిన ఓ బ్రాహ్మణుడు ఊరికి ఉత్తర దిక్కున ఉన్న రావిచెట్టు కింద ఉన్న నారాయణుడి శిలకు పూజలు చేయమని చెబుతాడు.ఆయన మాటలు విని గ్రామస్తులు ఉన్నంతలో నారాయణుడిని ఆరాధిస్తారు. ప్రతిరోజు పూజలు చేస్తారు. ఫలితం మాత్రం కనిపించదు. రోజులు గడుస్తున్నా.. గడ్డుకాలం గ్రామాన్ని వీడలేదు. అలసిన గ్రామ ప్రజలు పూజలను మొక్కుబడిగా మమ అనిపిస్తారు. కరువు అలవాటు కావడంతో కొందరు ఇళ్లకే పరిమితమవుతారు. భగవంతుడు ఉన్నాడా అనే సందేహంతో మళ్లీ వలసలు కొనసాగించారు.కానీ అదే గ్రామం లోని ఓ వృద్ధుడు బ్రహ్మయ్య మాత్రం పూజలు కొనసాగిస్తూనే ఉంటాడు. అలసట లేకుండా వర్షాలు పడతాయని ప్రతిరోజూ నారాయణు డిని ్ర΄ార్థిస్తూనే ఉంటాడు. తన భక్తిపై నమ్మకంతో పూజకు వెళ్లే క్రమంలో తాటాకుతో అల్లిన గొడుగును వెంట తీసుకువెళతాడు. అది చూసి గ్రామప్రజలు నవ్వేవారు. కానీ ఆయన మాత్రం బ్రాహ్మణుడు చెప్పిన నాటి నుంచి ప్రతిరోజూ నారాయణుడిని కొలుస్తూనే ఉన్నాడు. అలా కాలం గడుస్తుంటుంది.రోజూలానే బ్రహ్మయ్య నారాయణుడి సేవకు వెళ్లి పూలను శ్రీహరికి సమర్పించి వెనుతిరుగుతాడు. ఉన్నఫళంగా ఆకాశం మేఘావృతం అవుతుంది. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొని చినుకులు పడడం మొదలవుతాయి. దీనిని గమనించిన వైకుంఠంలోని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువును ఇలా అడుగుతుంది... స్వామీ, గ్రామంలోని ప్రజలందరూ కలసి ఎన్నో రోజులు పూజించారు. కానీ.. మీరు బ్రహ్మయ్య భక్తికి మాత్రమే కరుణించడంలో ఆంతర్యం ఏమిటి? అని.అప్పుడు శ్రీమహావిష్ణువు ‘‘భగవంతుడు ఎప్పటికైనా కరుణిస్తాడని బ్రహ్మయ్య నమ్మడమే ఇందులోని ఆంతర్యం. బ్రహ్మయ్య అందరిలా కార్యాచరణ చేసి ఆగలేదు. ఆయన శ్రద్ధాభక్తికి నేను తన్మయం పొందాను. ముఖ్యంగా వర్షం పడుతుందన్న నమ్మకంతో రోజూ గొడుగు కూడా తెచ్చుకునేవాడు. ఆ నమ్మకానికి నేను కట్టుబడి ఉండకపోతే ఆ రావిచెట్టు కింద ఉంది నిజంగానే శిలే అనుకుంటాడు’’ అని బదులిచ్చాడు. భగవంతుడిని పూజించడం అంటే కార్యసాధన చేసి విజయం వరించే వరకూ నిలవడం అని గ్రామస్తులు గ్రహిస్తారు.– పంతాడి లోకరాజు, సాక్షి, మంగళగిరిఇవి కూడా చదవండి: ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా? -
ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా?
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘ఏ వరమూ లేకుండానే కావరంతో వీడు పెట్టే బాధలు భరించరానివిగా ఉన్నాయి. ఇక వరములిస్తే లోకాలు తట్టుకోగలవా దేవా? కనుక, ఏ వరాలూ కుంభకర్ణుడికి ఇవ్వవలదు’ అని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు దేవతలు.కుంభకర్ణుడిపై కారుణ్యత్వము మాని, అతడిని మాయావివశుడిని జేసి, ఏదో ఒక చిన్న వరాన్ని ప్రసాదిస్తే లోకాలకు శుభం జరుగుతుంది అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ‘సకల జీవుల రసనలపై నిలిచి నాట్య మాడే నీవు, ఈ కుంభకర్ణుడి రసనపై ఇప్పుడు నిలిచి, నీ చాతుర్యంతో వ్యర్థ ప్రలాపాలను పలికించి, లోకాలకు హాని కలిగించే వరం ఏదీ అతడు కోరుకోకుండా చేయుము!’ అని సరస్వతీదేవిని ఆదేశించాడు. అలాగేనంది ఆమె.అప్పుడు బ్రహ్మ, తపస్సులో ఉన్న కుంభకర్ణుడి ముందు ప్రత్యక్షమై ‘కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, ఆ క్షణం కుంభ కర్ణుడి చేత ‘ఆరుమాసాలు సుఖనిద్ర, ఒకరోజు భోజనం’ ప్రసాదించమని అడిగించింది. ‘నిజమే, అదే మేలు. నీవు కోరిన ప్రకారమే సుఖ నిద్రలో ఉండు’ అని కుంభకర్ణుడికి వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు వెంటనే నిద్రలోకి జారు కున్నాడు. దేవతలు సంతోషించారు.‘ఉత్తర రామాయణం’ కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఆ కావ్యకర్తయైన కంకంటి పాపరాజు ఇలా వ్యాఖ్యానించాడు: క. పౌరుషంబునకు దైవం/ బారయ ఫలకారి యందు రాదైవంబే/ వైరస్యము వహించిన/ నేరూపున పురుషుడొందు నిష్టార్థంబుల్. మనిషి కోరుకునే కోరికలను, ఆ కోరికలు సఫలం కావాలని చేసే ప్రయత్నాలను దైవం ఫలవంతం చేస్తాడు. అటువంటిది, ఆ దైవమే, చేసే ప్రయత్నాలపట్ల విముఖు డైతే, ఆ వ్యక్తి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. ఆ పరిస్థితి రాకుండా ధర్మయుక్తమైన జీవితం గడుపుతూ, దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం మనిషి చేయవలసిన పని.– భట్టు వెంకటరావుఇవి చదవండి: కుటుంబం: సామాజిక సౌధానికి పునాది -
ఇంద్రపదవి అడిగిన రజి.. దేవతలు చెప్పిన మాటతో కథే మారిపోయింది!
పురూరవుడి కొడుకు ఆయువుకు నహుషుడు, క్షుత్రవృద్ధుడు, రంభుడు తర్వాత మహా బలసంపన్నుడైన రజి అనే కొడుకు కలిగాడు. రజికి ఐదువందల మంది కొడుకులు కలిగారు. రజి తన రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో దేవ దానవుల నడుమ భీకర సంగ్రామం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది పోరు మరింత ఘోరంగా పరిణమిస్తోందే తప్ప, జయాపజయాలు ఎటూ తేలడం లేదు. ఎటూ తోచక ఉభయపక్షాలవారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, ‘బ్రహ్మదేవా! ఈ పోరులో అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో నువ్వే చెప్పాలి’ అని అడిగారు.అప్పుడు బ్రహ్మదేవుడు, ‘నాయనలారా! రజి మహారాజు మీలో ఎవరి పక్షం వహిస్తే, పోరులో విజయం వారినే వరిస్తుంది’ అని చెప్పాడు.వెంటనే మొదట దానవులు రజి మహారాజు వద్దకు వెళ్లారు. రజి వారిని సాదరంగా ఆహ్వానించి, వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు.‘మహారాజా! మాకు, దేవతలకు సంగ్రామం జరుగుతోంది. నువ్వు మా పక్షాన యుద్ధంలో పాల్గొనాలని మా కోరిక’ అని చెప్పారు దానవులు.‘మీ తరఫున యుద్ధం చేయాలంటే, నాదొక్కటే షరతు. యుద్ధం ముగిశాక నాకు ఇంద్రపదవి ఇస్తామని మాట ఇవ్వండి’ అన్నాడు రజి మహారాజు.దానవులు తమలో తాము తర్జన భర్జనలు పడి, ‘రాజా! ఇప్పుడు మాట ఇచ్చి, తర్వాత కాదనడం ధర్మం కాదు. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురమే మంచిది. మా లోకానికి రాజు ప్రహ్లాదుడు. ఆయనకు ఇంద్ర పదవి దక్కాలనే మేమంతా దేవతలతో యుద్ధానికి సిద్ధపడ్డాం. కాబట్టి నీకు ఇంద్రపదవిని ఇవ్వలేము. మరింకేదైనా కోరుకుంటే తప్పక ఇస్తాము’ అని చెప్పారు.‘ఇంద్ర పదవి తప్ప మరేదీ నాకు సమ్మతం కాదు’ తెగేసి చెప్పాడు రజి మహారాజు.చేసేది లేక దానవులు వెళ్లిపోయారు.దానవులు వెళ్లిపోయిన కొద్దసేపటికే దేవతలందరూ రజి మహారాజు వద్దకు వచ్చారు. యుద్ధంలో తమ పక్షాన పాల్గొనాలని అభ్యర్థించారు.దానవులతో చెప్పినట్లే, ‘యుద్ధం ముగిశాక నాకు ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరిస్తేనే మీ తరఫున యుద్ధంలో పాల్గొంటాను’ అని కరాఖండిగా చెప్పాడు.దేవతలు ఎక్కువగా ఆలోచించకుండా, రజి మహారాజు షరతుకు తమ సమ్మతి తెలిపారు.రజి మహారాజు తన సేనలను వెంటబెట్టుకుని దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో వీరవిహారం చేస్తూ, శత్రువులు కని విని ఎరుగని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అనాయాసంగానే అశేష దానవ వాహినిని పరాజితులను చేశాడు. అతడి అస్త్రాల ధాటికి మరణించిన వారు మరణించగా, మిగిలిన దానవులు పలాయనం చిత్తగించారు. రజి మహారాజు సాయంతో దేవతలు విజేతలయ్యారు.యుద్ధం ముగిశాక దేవేంద్రుడు రజి మహారాజు పాదాల ముందు మోకరిల్లి, ‘మహానుభావా! ఆర్తుడనైన నాకు అభయప్రదానం చేసి, స్వర్గలోకాన్ని కాపాడావు. అభయప్రదాతవు గనుక నువ్వు నాకు సాక్షాత్తు పితృసమానుడవు. ముల్లోకాలకూ ఆరాధ్యుడవైన పురుషోత్తముడవు నువ్వు. నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు’ అని ప్రార్థించాడు.దేవేంద్రుడి ప్రణుతి వాక్యాలలోని అంతరార్థాన్ని గ్రహించిన రజి మహారాజు చిరునవ్వు చిందించాడు. ‘శరణు కోరినవాడు పగవాడైనా తిరస్కరించడం వీరధర్మం కాదు. నర్మగర్భంగా, నయంగా మాట్లాడి నువ్వు నా మనసు చూరగొన్నావు. నీ మనోగతం నాకు అవగతమైంది. నీ స్వర్గాన్ని నీకు పునర్దత్తం చేస్తున్నాను’ అని పలికి, తనకు దేవతలు ఇచ్చిన ఇంద్రపదవిని తిరిగి దేవేంద్రుడికే కట్టబెట్టి, నిజ నివాసానికి బయలుదేరాడు.రజి మహారాజు తన నివాసానికి చేరుకునేలోగానే, నారద మహర్షి అతడి ఐదువందల మంది కొడుకులను రెచ్చగొట్టాడు. ‘మీ తండ్రికి ఇంద్రపదవి ఇస్తామని మాట ఇచ్చి, మాయోపాయంతో దేవేంద్రుడు తిరిగి ఆ పదవిని దక్కించుకున్నాడు’ అని నూరిపోశాడు.నారదుడి మాటలతో రెచ్చిపోయిన రజి మహారాజు కొడుకులు మూకుమ్మడిగా స్వర్గంపైకి దండయాత్రకు వెళ్లారు. తమ తండ్రి సాధించిన ఇంద్రపదవి వారసత్వ పరంపరగా తమకే దక్కాలంటూ ఇంద్రుడితో వాదించారు. అతడు కాదనడంతో, అతడిని సింహాసనం పైనుంచి ఈడ్చి పడేసి, స్వర్గం నుంచి తరిమి కొట్టి, స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు.పురావిశేషం..ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ప్రదేశంలో 1844లో నేలను తవ్వుతుండగా, రాతి శివలింగం కనిపించింది. శివలింగాన్ని వెలికి తీసి, పూజలు జరిపిన స్థానికులు ఆలయాన్ని నిర్మించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ ఆలయ ప్రాంగణం సిపాయిల రహస్య సమావేశాలకు వేదికగా ఉండేది. నాటి సిపాయిల దళాన్ని ‘బ్లాక్ ప్లటూన్’గా ‘కాలీ పల్టన్’గా పిలుచుకునేవారు. ఏటా శ్రావణ మాసంలో కావడి యాత్రికులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో ఆలయం కొంత దెబ్బతింటే, 1968లో ఇప్పుడు ఉన్న విధంగా పునర్నిర్మంచారు.- సాంఖ్యాయనఇవి కూడా చదవండి: ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా? -
ప్రేమ, సేవ, సత్యం.. ఆధ్యాత్మిక వికాసానికి ఇవే మెట్లు!
ఆధ్యాత్మిక వికాసం పట్ల ఆకర్షితులైన ఆలోచనపరుల ఆసక్తులు ఉన్నతంగా ఉంటుంటాయి. సకల సృష్టిపట్ల వారు ప్రేమతో వ్యవహరిస్తారు. సద్భక్త్యాసక్తితో తన చుట్టూ ఉన్న సాటివారిని, దూరస్తులైన సామాన్యు లనూ ఒకేలా ప్రేమిస్తారు.సామాజిక సేవ సంబంధిత పరిచర్యలకు తమ విలువైన సమయం కేటాయించడం, సత్క్రియలను చేతలలో చూపడం, మేలైన సాహిత్యం చదవడం, గాత్ర సంగీతం వినడం, సేంద్రియ తోటల పెంపకం, కొత్త భాషలు నేర్చుకోవడం, చిన్న పిల్లలకు తగు శ్రద్ధతో ఓపిక సహనం కలిగి అర్థవంతమైన రీతిలో పాఠాలు బోధించడం, బాధితులను ఓదార్చి వారిలో ధైర్యం నూరిపోయడం, పరిసరాల పరిశుభ్రతకు పూనుకొని పర్యావరణాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేయడం, బృందపని సారథ్య సామార్థ్యం పట్ల అవగాహన పెంచడం వంటి అలవాట్లు, పనులు వీరిలో కనిపిస్తాయి.సత్యాన్ని ప్రేమించే అన్వేషకులు ఆత్మ సంబంధ జీవముతో వర్ధిల్లుతుంటారు. సత్య సంబంధ ఆత్మజ్ఞానం ఆత్మకు ఆహారం. ఇట్టి ఆహారం వలన జీవింపజేసేది, మనిషి ఉనికిని కాపాడుతుండేది ఆత్మే కాబట్టి ఆత్మ అభ్యున్నతి పట్ల శ్రద్ధ అవసరం. తెలిసిన కొద్దిపాటి సత్యంతోనే ఎదగడం ప్రారంభిస్తే, అనగా అట్టి సత్యానికి లోబడి జీవిస్తేనే మరింతగా సత్యములోనికి అడుగులు పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక వికాసం వైపుగా ఒక్కో మెట్టు ఎక్కగలిగితే ఆధ్యాత్మిక భావ దారిద్య్రం నుండి విడిపించబడతాము.– జేతమ్ఇవి చదవండి: ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది? -
శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు?
దైవారాధనకు అన్ని రోజులూ అనువైనవే. కానీ కొన్ని రోజులు మరీ అనువైనవని భావించటం ఆస్తికులకు ఒక ముచ్చట. అందుకే ఇన్ని పండగలు! ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక ప్రమాణాలకూ, ఇంద్రియాలకూ అందదు. దాన్ని మనిషి తన మనసు ద్వారా భావించి, చింతన చేసి, గ్రహించ వలసిందే.ఆ మనసును నియంత్రించే అధిష్ఠాన దేవత చంద్రుడు. అందుకే నిండు పున్నమి దినాలన్నీ మనసును ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి, పున్నమి దినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకూ, సాధనలకూ, కార్యకలాపాలకూ అనుకూలమైన పర్వదినాలుగా పరిగణిస్తారు. అందునా శ్రావణ, కార్తీక పూర్ణిమలు మరీ విశిష్టాలు. శివారాధనకు శ్రావణ పూర్ణిమ ఎంతో ప్రశస్తం.శ్రావణ పూర్ణిమ అనగానే మూడు విశేషాలు మనసుకు వస్తాయి. ఇది ‘రాఖీ’ పూర్ణిమ. రక్షాబంధనాల పూర్ణిమ. సోదరులూ, తత్సమానులైన వారి క్షేమాన్నీ, సర్వతోసమృద్ధినీ ఆకాంక్షిస్తూ, సోదరీమణులూ (తత్సమానురాళ్ళూ) అనురాగంతో, ఆత్మీయతతో వారి చేతికి రక్షాబంధనాలు కట్టే వేడుక అనేక శతాబ్దాలుగా వస్తున్నది.ఈ పూర్ణిమ హయగ్రీవ అవతార తిథి. బ్రహ్మ చేసిన సత్రయాగంలో విష్ణుమూర్తి వేదమయుడైన హయగ్రీవు డిగా అవతరించి, తనఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వేదవాణిని ప్రకటించాడని భాగవతం చెప్తుంది. జ్ఞాన సర్వస్వ మైన వేదాలను వినిపించిన జ్ఞానానందమయుడూ, నిర్మల స్ఫటికాకారుడూ, సకల విద్యలకూ ఆధారమూ అయిన హయగ్రీవుడి అవతార తిథి కాబట్టి శ్రావణ పూర్ణిమ, వేదాధ్యయన ఆరంభానికీ (‘ఉపాకర్మ’), వేద శ్రవణానికీ సముచితమైన ముహూర్తం. అందుకే, వేద విద్యార్థులూ, అధ్యాపకులూ, ఇతరులూ కూడా, శిథిలమై జీర్ణమైన దశలో ఉన్న యజ్ఞోపవీతాలను మార్చుకొనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా ఇదే. ఇప్పటివరకూ వర్షాల వల్ల కుంటు పడిన ‘వానాకాలపు’ చదువులకు చురుకు పెంచి, ఈ పూర్ణిమ నుండి ఇక చదువులో శ్రద్ధనూ, వేగాన్నీ పెంచుకొంటే, అది వేద విద్యార్థులకూ, లౌకిక విద్యల విద్యార్థులకూ అందరికీ ప్రయోజనకరమే.– ఎం. మారుతి శాస్త్రిఇవి కూడా చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత.. -
రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..
అన్నా చెల్లెళ్ల పండుగగా చెప్పే ఈ రక్షాబంధన్ పండుగ వెనుక ఎన్నోపౌరాణిక గాథలు, ఆసక్తికర చరిత్ర దాగుంది. ఇది కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. సర్వమత ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం కూడా. ఈ పండుగ కోసమే దేవతను సైతం సృష్టించాడు ఆ బొజ్జ గణపయ్య. అంతేకాదండోయ్ ఈ రాఖీని కేవలం అన్నా చెల్లి, అక్కా తమ్ముడు మాత్రమే కాదు తమ రక్షణ ఇచ్చే వ్యక్తి ఎవ్వరికైనా కట్టొచ్చట. అలాగే భార్య తన భర్తకి కూడా కట్టొచ్చట రాఖీ. ఇదేంటని అని ఆశ్చర్యపోకండి. దాని వెనుకున్న ఆసక్తికర కథలు గురించి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సవివరంగా తెలుసుకుందామా.!.రాఖీ ఎలా ఉండేదో తెలుసా..!వాస్తవానికి రాఖీలో ఒక తాయెత్తు ఉండేది, ప్రస్తుతం ఆధునిక డిజైన్ల హంగులతో వివిధ రకాలుగా మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అప్పట్లో ఒక సాధారణ దారంకి పసుపు రాసి ముడులు వేసి, దేవుని ముందు ఉంచి.. మంత్రాలతో శక్తిమంతం చేసేవారు. ఆ తర్వాత సోదరీమణులు తమ అపారమైన ప్రేమకు ప్రతిగా సోదరులకు కట్టేవారు. అందుకే దీనిని 'రక్షాబంధన్' అని పిలుస్తున్నారట. చూడటానికి సాధారణ దారమే అయినా..బంధం గొప్పతనం తెలిపేదని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నేపథ్యంలో సోదరుడి కోసం మిఠాయిలు చేసి మరి నోటిని తీపి చేసి..దీర్ఘాయువుతో చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించేవారట సోదరీమణులు. అందుకు ప్రతిగా సోదరులు వారికి బహుమతులు ఇచ్చి మరి రక్షగా ఉంటానని వాగ్దానం చేసేవారట. ఐక్యతకు చిహ్నంగా..అస్సాం, సిల్హెట్ ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించే ముస్లిం జనాభాను, హిందూ మెజారిటీ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాల నుంచి వేరు చేయాలని బ్రిటీష్ వాళ్లు కుట్ర పన్నారు. ఈ ఘటన 1905లో చోటు చేసుకుంది. ఆ విభజన కాస్తా సరిగ్గా రక్షాబంధన్ రోజు కావడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను ఉపయోగించుకుని అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకోసం ఠాగూర్ వారి కుట్రను భగ్నం చేసేలా ఐక్యతకు ప్రతీగా ఒకరికొకరు రాఖీ కట్టకోవాలంటూ వేలాది ప్రజలను గంగానది ఒడ్డుకు ఆహ్వానించారు. ఆ రోజు ఆయన సాధారణ దారాన్ని రెండు వర్గాల మధ్య ఐక్యతకు, సంఘీభావానికి చిహ్నంగా చాలా చాకచక్యంగా ఉపయోగించారు.భార్య.. భర్తకు రాఖీ కట్టే ఆచారం అప్పటి నుంచే..ఒకానొకప్పుడు దేవతులు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. అది చూసి భయంతో బృహస్పతి వద్దకు రాగా, ఆయన తక్షణమే భార్య సచి దేవితో చేతికి ఓ రక్ష లేదా గొలుసులాంటి దాన్ని పౌర్ణమి నాటి రాత్రి కట్టించుకోమని సూచించారు. కట్టుకునే మందుకు శ్రావణ పౌర్ణమి రోజున దేవుడు ముందు ఉంచి మంత్రాలతో శక్తిమంతం చేయాలని కూడా చెప్పారట. దాంతో ఇంద్రుడు గురువు చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణ వచనం. అలా ఆ నాటి నుంచే పురుషులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు భార్యలు వాళ్ల మణికట్టుకు ఈ రక్షను కట్టడం ఆచారంగా మారిందట. ఆ రోజునే సంతోషిమాత..గణేశుడు, అతని సోదరి మానస ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను జరుపుకునేవారట. గణేశుడుకి సిద్ధి (అద్భుతమైన) బుద్ధి (విజయం) అనే భార్యలున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆ ఇద్దరు భార్యల ద్వారా శుభ (పవిత్రమైన), లాభ (లాభం) అనే ఇద్దరు కుమారులు కలిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే గణేశుడు తన సోదరిని ఎల్లప్పుడూ గొప్ప ఆతిథ్యంతో స్వాగతించేవాడు. అలాగే మానస తన ప్రియమైన సోదరుడి వినాయకుడు కోసం ఎల్లప్పుడూ పుష్కలంగా మిఠాయిలు, బహుమతులు తీసుకువచ్చేది. పైగా రాఖీ కట్టే వేడుక అత్యంత వైభవంగా జరిగేది. దాంతో శుభ, లాభ్లు చాలా బాధపడేవారట. వారికి సోదరి లేకపోవడం వల్ల, ఈ వేడుకను జరుపుకోలేకపోతున్నాం అని ఆవేదన చెందేవారట. ఒక రోజు, ఆ బాలురు వినాయకుడి వద్దకు వెళ్లి, తమకు ఒక సోదరిని ప్రసాదించమని కోరారట. సరిగ్గా ఆ సమయానికి నారద మహర్షి కూడా గణేశుడిని దర్శించుకోవడానికి రావడంతో, ఆయన కూడా కుమారుల కోరికను మన్నించమని ఒప్పించారట. చివరికి, అందరి పట్టుదల మేరకు, గణేశుడు తన భార్యల శరీరాల నుంచి వెలువడిన రెండు జ్వాలల ద్వారా ఒక కుమార్తెను సృష్టించాడట. అలా సంతోషిమాత ఆవిర్భావం జరిగిందట. వినాయకుడి కుమార్తె అయిన సంతోషిమాత అందరి కోర్కెలను తీర్చే కల్పవల్లి, సంతృప్తికి అధిష్టాన దేవతగా ప్రకటించాడట. అలా ఈ పండుగ కోసం ఒక దేవత ఆవిర్భావించడమే గాక పండుకు ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని కూడా చాటుతోంది. అంతేగాదు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన ఐక్యతకు, సత్సంబంధాలకు ప్రతీకగా మారి సర్వమత సౌబ్రాతత్వాన్ని చాటే విశిష్టమైన పండుగగా అలరారోతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పండుగలో భాగమయ్యేలా సోదరుడు లేదా మీకు రక్షగా ఉండే వ్యక్తులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోండి మరి..!. View this post on Instagram A post shared by Kidsstoppress | Parenting (@kidsstoppress) (చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
పచ్చని రక్షాబంధన్
నీకు నేను రక్షా.. నాకు నువ్వు రక్షా.. అంటూ అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షాబంధన్. ఈ పండుగనే కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు జార్ఖండ్ ప్రజలు. వారు తమకు జీవనాధారాన్నిస్తున్న వృక్షాలనే తోబుట్టువులుగా భావిస్తూ.. వాటికి ప్రేమతో రాఖీలు కడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఈ సంప్రదాయంలో అక్కడి ప్రజలు వృక్షాలకు రాఖీలు కడుతూ లక్షల వృక్షాలను నరికివేత నుంచి కాపాడుకున్నారంటే .. వారికి ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వృక్షాలకు రాఖీ కట్టి రక్షించుకునే ఈ గొప్ప కార్యక్రమం నిన్నామొన్నా మొదలైంది కాదు. దీని వెనుక 20 ఏళ్ల చరిత్ర ఉంది. 2004లో ధన్ బాద్ జిల్లాలోని లుకయా అనే చిన్న గ్రామంలో అటవీ అధికారి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ ఊరి ప్రజలు చెట్లకు రాఖీలు కడుతూ.. వాటిని సంరక్షిస్తూ నరికివేత నుంచి కాపాడుకుంటున్నారు.నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌లోని 24 జిల్లాలలో విస్తరించి ఉన్న 700కి పైగా గ్రామాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైన మొదటి దశలోనే సుమారు ఒక లక్ష చెట్లకు రాఖీలు కట్టి రక్షించుకున్నారు. ఈ నెల రోజుల ప్రచారంలో మొత్తం 3 లక్షల వృక్షాలకు రాఖీ బంధనం వేసి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వృక్షాల పరిరక్షణ వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఏకంగా 1128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ ‘సేవ్ ట్రీ’ ఉద్యమం నేడు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. -
రక్షానుబంధం
ఆధ్యాత్మికంగానూ, సంప్రదాయకంగానూ చూస్తే శ్రావణ పౌమికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అయితే అందరూ అవేమీ అంతగా పట్టించుకోరు. అందరికీ గుర్తొచ్చేది రాఖీ పౌమి అనే. దీనినే రక్షా బంధన్ లేదా శ్రావణ పూర్ణిమ అని పిలుస్తారు. ఇది కేవలం సోదరుల చేతికి సోదరి ఒక దారం కట్టే వేడుక మాత్రమే కాదు; తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు, రక్షణకు, పరస్పర బాధ్యతకు తీపి గుర్తు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ రాఖీ కడితే, సోదరులు తమ సోదరీ మణులకు అన్నింటా అండగా ఉంటామని బాస చేస్తారు. ఆఫీసులలోనూ, పని చేసే సంస్థలలోనూ... ఇళ్లలో పని చేసే వారు ఇంటి యజమానులను కూడా ‘మేం రాఖీ కట్టేందుకు మా పుట్టింటికి వెళ్లాలి, సెలవు కావాలి’ అని అడిగితే కాదనలేని కాజు. అలాగే ‘మా అక్క లేదా మా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాలి నేను ఊరు వెళుతున్నా సారూ’ అంటే సరేనని తలూపి తీరవలసిన ఒక మంచి రీజను. ఇంతమందిని ఇన్ని విధాలుగా కట్టి పడేస్తున్న ఈ రాఖీ పండగ ఎలా మొదలయ్యిందో తెలుసుకుందాం, పౌరాణికంగా చూస్తే...ఇది కేవలం సోదర వాత్సల్యానికే కాదు... భార్యాభర్తలు, భగవంతుడు–భక్తుడు, విశ్వశాంతి కోసం ఒకరికొకరు రక్షణ కల్పించుకునే పవిత్ర బంధానికి ప్రతీక అని కొన్ని కథల ద్వారా తెలుస్తోంది. ఆ పురాణ గాథలు ఇవే ద్రౌపది – శ్రీ కృష్ణుడి గాథ: ఒకానొక సందర్భంలో కృష్ణుడి కుడిచేతి వేలికి గాయమై రక్తం కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి వంటి వారు రక్తాన్ని ఆపడానికి వస్త్రాల కోసం వెతుకుతుంటారు. కానీ అక్కడ ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా, తను కట్టుకున్న పట్టుచీర కొంగును చింపి, కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. దానికి కృష్ణుడు ఎంతో చలించిపోయి, ‘సమయం వచ్చినప్పుడు ఈ బంధానికి రుణం తీర్చుకుంటాను, నిన్ను ఎల్లవేళలా రక్షిస్తాను సోదరీ’ అని మాట ఇస్తాడు. ఆ తర్వాత కురుసభలో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ఒడిగట్టినప్పుడు, కృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. ద్రౌపది కట్టిన ఆ చీర ముక్కే మొదటి ‘రక్షాబంధనం’ గా నిలిచింది. లక్ష్మీదేవి – బలిచక్రవర్తి గాథ: రాక్షస రాజైన బలిచక్రవర్తి భక్తికి, దానగుణానికి మెచ్చిన విష్ణుమూర్తి, అతనికి ఒక వరం ఇస్తాడు. దానిప్రకారం విష్ణుమూర్తి వైకుంఠాన్ని విడిచి, బలిచక్రవర్తి కోటకే కాపలా దారుడిగా ఉండిపోతాడు. భర్త రప్పించుకోవడం కోసం నారద మహర్షి సూచన మేరకు లక్ష్మీదేవి ఒక పేదమహిళ రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్తుంది. శ్రావణ పౌమి రోజున బలిచక్రవర్తి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కడుతుంది. బలిచక్రవర్తి సంతోషించి ‘నీకు ఏం కావాలో కోరుకో’ అనగానే, లక్ష్మీదేవి తన నిజరూపాన్ని చూపి, తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించమని కోరుతుంది. సోదరి లాంటి లక్ష్మీదేవి కోరికను బలిచక్రవర్తి కాదనలేక, విష్ణుమూర్తిని పంపిస్తాడు.ఇంద్రాణి – ఇంద్రుడి గాథఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రాక్షసరాజు ‘బలి’ చేతిలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంద్రుడి ప్రాణరక్షణ కోసం భయపడిన ఆయన భార్య శచీదేవి శ్రావణ పౌమి నాడు పరమశివుడిని ప్రార్థించి ఒక పవిత్రమైన రక్షా సూత్రానికి పూజ చేస్తుంది. ఆ మంత్రించిన సూత్రాన్ని ఇంద్రుడి కుడిచేతికి కడుతుంది. ఆ రక్షాసూత్రం ఇచ్చిన శక్తితో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి, దేవలోకాన్ని కాపాడుకుంటాడు. అది కూడా రక్షాబంధనమే!యమధర్మరాజు – యమునా దేవి గాథసూర్య భగవానుని సంతానమైన యముడు, యమున అన్నాచెల్లెళ్లు. యముడు తన విధుల్లో నిరంతరం అవిశ్రాంతంగా ఉండటం వల్ల చాలాకాలం పాటు సోదరి యమునను కలవలేకపోతాడు. ఒక శ్రావణ పౌమి రోజున యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి ఆహ్వానించి, నుదుట తిలకం దిద్ది, చేతికి రక్షణ సూత్రం కడుతుంది. ఎంతో రుచికరమైన వంటలు వడ్డించి ఆదరిస్తుంది. సోదరి ప్రేమకు ముగ్ధుడైన యముడు... ‘ఏ సోదరి అయితే శ్రావణ పౌమి నాడు తన సోదరుడికి రాఖీ కట్టి, తిలకం దిద్దుతుందో, ఆ సోదరుడికి అపమృత్యు భయం (అకాల మరణం) లేకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది‘ అని వరం ఇస్తాడు. సాంప్రదాయికంగా ఇలా... సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే తలస్నానం చేసి, దేవుని గదిలో దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి లేదా వెండి పళ్లెంలో రాఖీలు (రక్షా సూత్రాలు) కుంకుమ, పసుపు (తిలకం కోసం) అక్షింతలు, నేతి దీపం లేదా కర్పూరం (హారతి ఇవ్వడానికి) తీపి పదార్థాలు (మిఠాయిలు) అమర్చుకోవాలి. సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చేసి ఒక పీటపై కూర్చోవాలి. సోదరి తూర్పుముఖంగా నిలబడాలి. సోదరి తన కుడిచేతి ఉంగరపు వేలితో సోదరుడి నుదుట కుంకుమ తిలకం దిద్దాలి. ఆ తిలకంపై కొన్ని అక్షింతలు ఉంచాలి. తర్వాత సోదరుని కుడిచేతి మణికట్టుకు మూడు ముడులు వేస్తూ రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల‘ అనే పవిత్రమైన రక్షా మంత్రాన్ని పఠించడం ఎంతో శుభప్రదం:రాఖీ కట్టిన తర్వాత, సోదరి నేతిదీపంతో సోదరుడికి దిష్టి తీస్తూ హారతి ఇవ్వాలి. అనంతరం సోదరుడి నోరు తీపి చేయాలి. సోదరుడు కూడా సోదరికి తీపి తినిపించాలి. సోదరి పెద్దదైతే సోదరుడు ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ సోదరి చిన్నదైతే సోదరుడి పాదాలకు నమస్కరించి దీవెనలు ΄÷ందాలి. సోదరుడు తన ప్రేమకు గుర్తుగా, తోచిన బహుమతిని లేదా దక్షిణను సోదరికి అందించి, జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇవ్వాలి. – డి.వి.ఆర్. -
ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?
నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన భారతీయ యాత్రికుల్లోనూ పలువురి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే..ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పేరొందిన కైలాస్ మానస సరోవర్ యాత్రకు భారత్‌తో పాటు నేపాల్, చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ యాత్రపై భక్తుల్లో ఉన్న విశ్వాసం అసాధారణం.శివుని నివాసంగా..హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస్ పర్వతం పరమశివుడి నివాసంగా భావిస్తారు. మంచుతో కప్పుకున్న ఈ పర్వతాన్ని భక్తులు కేవలం ఓ పర్వతంగా కాకుండా.. దైవ స్వరూపంగా దర్శిస్తారు. శివుడు, పార్వతీదేవి ఇక్కడ నివసిస్తారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కైలాస్ పర్వతం పక్కనే ఉన్న మానస సరోవర్ సరస్సు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.ప్రపంచంలోనే ప్రత్యేకమైన సరస్సుసముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి. ఉదయం సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుందని యాత్రికులు చెబుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలిసే అరుదైన ప్రదేశంగా మానస సరోవర్కు గుర్తింపు ఉంది.ఎందుకు ఈ సమయంలోనే యాత్ర?కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ఓ ప్రత్యేకమైన కాలం ఉంటుంది. సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనుకూల సమయంగా భావిస్తారు. శీతాకాలంలో మంచు తీవ్రత పెరిగి పర్వత మార్గాలు మూసుకుపోవడంతో యాత్ర దాదాపు అసాధ్యంగా మారుతుంది. వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు మంచు కరుగుతుంది.. మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మలమైన వాతావరణంలో కైలాస్ పర్వత దర్శనం, మానస సరోవర్ అందాలను ఆస్వాదించేందుకు వేలాది మంది భక్తులు ఈ కాలంలోనే యాత్రకు బయల్దేరుతారు. అయితే హిమాలయ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అనుకూలమైన సీజన్లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి.కఠినమైన ప్రయాణం.. అయినా తగ్గని భక్తిమానస సరోవర్ యాత్ర సాధారణ ప్రయాణం కాదు. అత్యంత ఎత్తైన పర్వత మార్గాలు, తక్కువ ఆక్సిజన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు యాత్రికులకు సవాళ్లుగా నిలుస్తాయి. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నవారే ఈ యాత్రను పూర్తి చేయగలరు. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ మార్గం, నేపాల్ మార్గాల ద్వారా యాత్రికులు టిబెట్‌లోని కైలాస్ ప్రాంతానికి చేరుకుంటారు.అనేక మతాలకు పవిత్ర స్థలంకైలాస్ పర్వతం కేవలం హిందువులకే కాదు.. జైనులు, బౌద్ధులు, టిబెటన్ సంప్రదాయాలను అనుసరించే వారికి కూడా పవిత్రమైన ప్రాంతం. జైన సంప్రదాయం ప్రకారం తొలి తీర్థంకరుడు రిషభదేవుడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారని విశ్వసిస్తారు. బౌద్ధులు కూడా కైలాస్‌ను పవిత్ర పర్వతంగా గౌరవిస్తారు.ప్రకృతి సవాళ్లు.. పెరుగుతున్న ఆందోళనలుఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. ఆకస్మిక వర్షాలు, మంచు కరుగుదల, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు యాత్రికులకు ప్రమాదంగా మారుతున్నాయి. అయినప్పటికీ.. జీవితంలో ఒక్కసారైనా కైలాస్ మానస సరోవర్‌ను దర్శించాలనే ఆకాంక్షతో భక్తులు ఈ సాహస యాత్రను కొనసాగిస్తున్నారు.కైలాస్ మానస సరోవర్ యాత్ర కేవలం ఓ ప్రయాణం కాదు.. అది భక్తి, నమ్మకం, ప్రకృతి మధ్య జరిగే ఓ ఆధ్యాత్మిక అనుభవం. అందుకే ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ యాత్రకు ప్రత్యేక స్థానం కొనసాగుతోంది. -
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
వేమన ధైర్యాన్ని మనిషి అసలైన ఆభరణంగా చెప్పాడు.పద్యం... ధైర్యమే పురుషునకు భూషణంబురా ధైర్యహీనునకు దైవమైన తోడురాడురా వేమనాఅర్థం: ధైర్యమే మగవాడికి అసలైన అలంకారం. ధైర్యం లేనివాడికి దేవుడే వచ్చినా సహాయం చేయడు.మరొక పద్యంలో... ధైర్యము గలవానికి ధరణిలో సుఖమురా ధైర్యము లేనికి దరిద్రమే గతిరాధైర్యం ఉన్నవాడికి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. ధైర్యం లేనివాడికి దరిద్రమే దిక్కు.భాస్కర శతకంలో..ధైర్యము గలవాడె ధన్యుడీ లోకానధైర్యమున జయమెల్ల దక్కునురాధైర్యమే లేనిచో దైవమే వచ్చిన కార్యము సాగదురా భావం.. ధైర్యం ఉన్నవాడే ఈ లోకంలో ధన్యుడు. ధైర్యంతోనే అన్ని పనుల్లో జయం వస్తుంది. ధైర్యం లేకపోతే దేవుడే వచ్చినా పని జరగదు.సుమతీ శతకం...బద్దెన సుమతీ శతకంలో ధైర్యాన్ని నేరుగా మగతనంతో పోల్చాడు.‘ధైర్యము విడువకుము ధరణిలో నరుడుధైర్యమున జయమెల్ల దక్కునురా సుమతీధైర్యమే మగతనంబురా సుమతీ‘ మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యంతోనే అన్నీ సాధించవచ్చు. ధైర్యమే అసలైన మగతనం.మరొక చోట...ధైర్యము లేనివానికి దైవము తోడుపడడు సుమతీ అని అంటాడు ధీరుని లక్షణాన్ని, గొప్పతనాన్ని ప్రస్తావిస్తాడు, పద్యంలో ధీరులెప్పుడూ న్యాయ మార్గాన్ని వదలరు అని అంటాడు భర్తృహరి.చివరిగా...ధైర్యం అనే అంశాన్ని మంచి పనులకే ముడి పెట్టాలి.. చెడ్డపనులకు చేసే ప్రయత్నం లో చూపిన తెగువ ధైర్యం కాదు. ధర్మం కోసం యుద్ధం చేసినందుకే శ్రీ కష్ణుడు, శ్రీరాముడు, పాండవులు, శివాజీ, ఝాన్సీ భాయి, అల్లూరి సీతారామరాజు... ఎందరో స్వతంత్ర సమర యోధులు ‘దైర్యవంతులు’గా శాశ్వత కీర్తి సంపాదించారు.– డా. కందాళ సత్యనారాయణ మూర్తిఇవి కూడా చదవండి: నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది? -
నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది?
మనలోని నిజమైన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ‘‘నేను ఎలా ఉన్నాను? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తనలో మార్పు అవసరమా? నా కుటుంబం గురించి నేను ఎంత తెలుసుకుంటున్నాను? నా పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటున్నానా?’’ అనే ప్రశ్నలు మనల్ని మనం పరిశీలించుకునేలా చేస్తాయి. అయితే ఇతరుల గురించి తెలుసుకోవడానికి చూపించే ఆసక్తిలో కొంతైనా మన అంతరంగాన్ని తెలుసుకోవడానికి చూపిస్తున్నామా?ఆత్మపరిశీలనకు ఇదే మొదటి మెట్టు. మనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు. శ్రీమతి నిర్మలా దేవి 1988 జూలై 27న చేసిన ఒక ఆధ్యాత్మిక బోధనలో, మనిషి తనను తాను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ప్రశ్నల రూపంలో గుర్తుచేస్తారు. ‘‘మీరు ఎలా ఉన్నారు? మీరు నిజంగా పురోగమిస్తున్నారా? లేక మీ వ్యవహారం, ఇతర విషయాల గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? దేశం గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? ఒకవేళ మీ ఉన్నతి గురించి చింతిస్తుంటే, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు?’’ అనే ఆలోచన మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది.మనల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ప్రపంచంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. విజ్ఞానం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం. సమాజంలో మంచి పేరు సం΄ాదించాలనుకుంటాం. కానీ మనిషి తన మనస్సును అర్థం చేసుకోలేకపోతే, ఈ బాహ్య విజయాలన్నీ సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు. మన కో΄ానికి కారణం ఏమిటి? మనలో అసూయ ఎందుకు కలుగుతోంది? ఎందుకు చిన్న విషయాలకే మనశ్శాంతిని కోల్పోతున్నాం? ఎందుకు ఇతరుల తప్పులను సులభంగా చూస్తాం కానీ మన తప్పులను అంగీకరించడానికి ఇబ్బంది పడతాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు బయట ప్రపంచంలో దొరకవు. మనలోకి మనం చూసినప్పుడే వాటి మూలాలను గుర్తించగలం.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులుమనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు.- శ్రీ మాతాజీ నిర్మలాదేవిఇవి చదవండి: రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా? -
శివుడు శరభుడిగా ఎందుకు మారాడు?
శివపురాణం ప్రకారం పరమశివుని అత్యంత ఉగ్రశక్తిమంతమైన అరుదైన రూపాలలో శరభేశ్వర రూపం ఒకటి. హిరణ్యకశిపుని వధించిన తరువాత శ్రీమహావిష్ణువు నరసింహావతారంలోని ఉగ్రత, క్రోధం తగ్గక పోవడంతో ఆ శక్తి లోకాలకే ముప్పుగా మారుతుందేమోనని దేవతలు భయపడి పరమశివుడిని ప్రార్థించారు. నరసింహుడి ఉగ్రత తగ్గించడానికై శివుడు ముందుగా తన అంశమైన వీరభద్రుడిని పంపాడు. అయినా నరసింహుని ఉగ్రతను శాంతింపజేయడం సాధ్యం కాలేదు అప్పుడు శివుడే స్వయంగా శరభ రూపాన్ని ధరించాడు. ఈ రూపంలో సింహస్వభావం పక్షిశక్తి, మానవాకృతి లక్షణాలు కలిసిపోయినాయి. విశాలమైన రెక్కలు, పదునైన గోర్లు, బలమైన కాళ్లు కలిగిన మహాశక్తిగా శరభేశ్వరుడు ఆవిర్భవించి నరసింహుని ఉగ్రతను అదుపు చేసి లోకాలలో శాంతిని నెలకొల్పాడు.వైష్ణవం ప్రకారం నరసింహుడు శరభుని ఎదుర్కొనేందుకు రెండుతలల మహాబలశాలైన గండభేరుండ రూపాన్ని ధరించాడు. శరభుడు గండభేరుండ మధ్య జరిగిన భీకరపోరాటం తరువాత ఆదిపరాశక్తి జోక్యంతో ఉగ్రశక్తులు శాంతించాయి. ఈ గాథల అంతరార్థం శివుడు విష్ణువు మధ్య పోటీని చెప్పడం కాదు అపరిమితమైన ఉగ్రతకు శాంతి అవసరం. ఎంతటి శక్తికైనా నియంత్రణ అవసరమని, చివరికి సమానత్వమే లోకక్షేమానికి ఆధారమని తెలియజేయడమే ఈ గాధ లక్ష్యం. హరిహరతత్త్వం కూడా శివకేశవుల మధ్య భేదం లేదనే తత్త్వాన్ని బలపరుస్తుంది.శరభేశ్వరుని రూపం దక్షిణ భారత దేవాలయ శిల్పకళలో విశేష స్థానం పొందింది. ముఖ్యంగా తమిళనాడులోని త్రిభువనంలోని కంపహరేశ్వర ఆలయంలో చోళులకాలం నాటి శరభశిల్పం బాగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలోని హోయసలుల దేవాలయ శిల్పాలలో కూడా శరభుడు వంటి ఉగ్ర జీవరూపాలు అద్భుతమైన కళానైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు పురాణకథలను మహిమను మాత్రమే కాకుండా ఆనాటి శిల్పుల అపూర్వ ప్రతిభననూ తెలియజేస్తాయి.శరభేశ్వరుని గాథ భారతీయ సనాతన ధర్మంలోని శక్తి, ఉగ్రత, శాంతి, సమతుల్యత, హరిహర ఏకత్వం వంటి గొప్ప భావాలను తెలియజేసే అరుదైన పురాణ గాథగా నిలిచింది.– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ -
రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?
భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్ గఢ్ మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.నారీపూర్ణిమ:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.హయగ్రీవ జయంతి:ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.ఉపాకర్మఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. – డి.వరలక్ష్మిఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? -
జాగృత శక్తి! ఆరు చక్రాల రహస్యమేంటి?
రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.– రాచమడుగు శ్రీనివాసులు -
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు -
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
మహా భారత యుద్ధంలో పాండవులు, ముఖ్యంగా యుద్ధానికి దిశ, దశ చూపిన శ్రీ కృష్ణ పరమాత్మ తదితరులు ఉపయోగించిన ధనుస్సులు, శంఖాల పేర్లు మీకు తెలుసా...? శ్రీ కృష్ణుని ధనుస్సు పేరు శారంగం...శంఖం పేరు పాంచజన్యంధర్మరాజు ధనుస్సు పేరు మహేంద్ర... శంఖం పేరు అనంత విజయం, భీముని ధనుస్సు పేరు వాయువ్య. అయితే చాలా మంది భీముడు గదతోనే యుద్ధం చేసాడని అనుకుంటారు. ఆ గద పేరు వృకోదర. అంతేకాకుండా భీముడు గొప్ప మల్ల యోధుడు కూడా. కాగా భీముని శంఖం పేరు పౌండ్రం. అర్జునిని ధనుస్సు పేరు గాండీవం. శంఖం పేరు దేవదత్తం. నకులుడి ధనుస్సు పేరు వైష్ణవ శంఖం పేరు సుఘోషం. సహదేవుని ధనుస్సు పేరు అశ్వివ. శంఖం పేరు మణి పుష్పకం. అభిమన్యుని ధనుస్సు పేరు రౌద్ర.ఘటోత్కచుని ధనస్సు పేరు పౌలస్త్రయ.కాగా కురుపితామహుడైన భీష్ముని శంఖం పేరు శైశాంక. ధుర్యోధనుని గద పేరు కౌముది. కర్ణుని ధనుస్సు పేరు విజయ. శంఖం పేరు హిరణ్యగర్భ.– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
దృష్టి కొద్దీ సృష్టి!.
వేదాంత దృష్టిలో చూస్తే, సృష్టికి స్వతహాగా మంచి, చెడు అనేవి లేవు. అది ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే, ప్రపంచం మనకు ఆ రంగులోనే కనిపిస్తుంది. అద్దం మీద దుమ్ము పడితే మన ముఖం అందులో స్పష్టంగా కనిపించదు. అలాగే, మనస్సు అనే అద్దం మీద ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే దుమ్ము చేరినప్పుడు ఈ ప్రపంచంలోని సౌందర్యం, మంచితనం మనకు కనిపించవు.మహాభారతంలో దుర్యోధనుడికి లోకంలో ఒక్క మంచివాడు కూడా కనిపించకపోవడం, ధర్మరాజుకు ఒక్క చెడ్డవాడు కూడా దొరకకపోవడం కేవలం ఒక కథ కాదు. ధర్మరాజు మనస్సు దయ, క్షమ, సత్యం, నిష్కామంతో నిండి ఉంది. అతని చిత్తం స్వచ్ఛంగా ఉంది. అందుకే ఆయనకు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సుగుణం కనిపించింది. చివరకు తనలో ఎక్కడో దాగి ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసుకుని, తనకంటే చెడ్డవారు లేరని అంగీకరించగలిగాడు. జగత్తు అనేది మన మనస్సుకు ప్రతిబింబం మాత్రమే అన్న పరమ సత్యాన్ని ఈ ఘట్టం తేటతెల్లం చేస్తుంది. ఈ ‘ఆత్మ పరిశీలన’ ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. మనకు ఎదుటివారిలో కేవలం లోపాలే కనిపిస్తున్నాయంటే, లోపం వారిలో లేదు, చూసే మన దృష్టిలో ఉందని గ్రహించాలి.మంచిని నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. దానికి వనరులు, సమయం, అధికారం, వ్యవస్థల మద్దతు, చాలా మంది సహకారం కావాలి. ఒక సామాన్యుడు ఒంటరిగా ఒక గొప్ప వ్యవస్థను రాత్రికి రాత్రే నిర్మించలేక పోవచ్చు. చెడును నిరసించడం ఒక తక్షణ బాధ్యత. దీనికి వనరులు అక్కర్లేదు. కేవలం నైతిక బలం, ‘ఇది తప్పు‘ అని చెప్పే ధైర్యం, నిజాయితీ ఉంటే చాలు. ఒకరు ధైర్యంగా గొంతెత్తితే, అది ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఆ చెడుకు అక్కడితో ఒక అడ్డుకట్ట పడుతుంది.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు కర్మయోగి అన్నింటినీ సమానంగా చూస్తాడు. ఎవరైనా తప్పు చేసినా, వారి పరిస్థితులను అర్థం చేసుకుని క్షమించగలగడం ధర్మరాజు లక్షణం. అది అంతర్గత శాంతికి మార్గం. ప్రపంచాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ ప్రపంచాన్ని చూసే మన ‘దృష్టిని‘ మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది. లోపాలను వెతికే దుర్యోధనుడి దృష్టి నుండి, గుణాలను చూసే ధర్మరాజు స్థాయికి మన మనస్సును ఎదిగేలా చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం.– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం
మనిషి జీవితం బయట కనిపించే దానికంటే లోపల జరిగేదే ఎక్కువ. నవ్వుతున్న ముఖాల వెనుక ఎన్నో మౌనవేదనలు దాగి ఉంటాయి. చుట్టూ మనుషులు ఉన్నా, లోపల ఒంటరితనం వెంటాడుతుంటుంది. శరీరం అలసిపోయిందంటే విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనసు అలసిపోతే జీవితం మొత్తమే భారంగా అనిపిస్తుంది. అందుకే మానసిక ప్రశాంతత మనిషి ఆరోగ్యానికి అసలైన పునాది.ఇప్పటి ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఆ పరుగులో మనిషి తన మనసునే వెనక్కి వదిలేస్తున్నాడు. ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచే ఆలోచనల రభస మొదలవుతుంది. ఎంత సంపాదించాలి? ఎలా నిలబడాలి? ఇతరులకంటే ఎలా ముందుండాలి? అనే పోటీ భావన మనిషిని నిరంతరం మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఈ ఆందోళనల మధ్య ప్రశాంతంగా జీవించడం కూడా ఒక కళగా మారిపోయింది. మనసు అనేది విచిత్రమైన ప్రపంచం. ఒక్క క్షణంలో ఆకాశమంత ఆనందంలో విహరిస్తుంది. మరోక్షణంలోనే అగాధమైన నిరాశలోకి జారిపోతుంది. గత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తడిమి చూస్తుంది. జరిగిపోయిన సంఘటనలను వదలలేక బాధపడుతుంది. రానున్న భవిష్యత్తును ఊహిస్తూ భయపడుతుంది. ఈ రెండిటి మధ్య వర్తమానాన్ని ఆస్వాదించడం మరిచిపోతుంది. అందుకే మనిషి జీవితం బయట కంటే మనసులోనే ఎక్కువగా అలసిపోతుంది.మనిషి ఎదుర్కొనే ప్రతి బాధకు కారణం పరిస్థితులే కావు. ఆ పరిస్థితులను మనసు స్వీకరించే విధానం కూడా కారణమే. చిన్న అపజయాన్ని జీవితాంతం మోస్తూ ఉండటం, ఇతరుల మాటలను గుండెల్లో పెట్టుకోవడం, ప్రతి విషయాన్ని మనసుకు భారం చేసుకోవడం ఇవే మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.ఈ కాలంలో మనుషులు మాట్లాడటం తగ్గించి, మనసులో దాచుకోవడం పెంచేశారు. బాధను బయటపెడితేబలహీనులమవుతామనుకుంటున్నారు. కానీ మౌనం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. మనసులో పేరుకుపోయిన వేదన నెమ్మదిగా మనిషిని లోపల కుంగదీస్తుంది. అందుకే మన భావోద్వేగాలను పంచుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మాట్లాడాలి. ఒక చిన్న ఓదార్పు కూడా కొన్నిసార్లు మనిషిని మళ్లీ నిలబెడుతుంది. జీవితంలో డబ్బు, హోదా, విజయాలు అన్నీ అవసరమే. కానీ వాటికంటే ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు. రాత్రి నిద్రపోయేటప్పుడు మనసులో భయం లేకపోవడం, ఉదయం లేచినప్పుడు జీవితం మీద ఆశ ఉండటమే నిజమైన ఆనందాలు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేని జీవితం వెలుగులేని దీపంలాంటిది. అందుకే మనిషి ముందుగా తన మనసును ప్రేమించుకోవాలి. ఆలోచనలకు అదుపు నేర్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడే సహనాన్ని పెంపొందించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే జీవితం అందంగా మారుతుంది. మానసిక ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం. అదే జీవితానికి అసలైన అర్థం. అనవసరమైన పోలికలు కూడా మనిషిని లోపల ఖాళీ చేస్తుంటాయి. ఇతరుల విజయాన్ని చూసి తన జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకునే అలవాటు నెమ్మదిగా ఆత్మన్యూనతాభావంగా మారుతోంది. నిజానికి ప్రశాంతత బయట దొరికేది కాదు. అది మన ఆలోచనలలో పుడుతుంది. మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు, తన పరిమితులను అంగీకరించినప్పుడు, జీవితాన్ని సహజంగా స్వీకరించినప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతతను అందుకుంటుంది. ప్రతిసమస్యను గుండెల్లో మోస్తూ జీవించడం కన్నా, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి చీకటి శాశ్వతం కాదు. ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది.మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనసుకి విశ్రాంతి ఇవ్వాలి. రోజంతా శరీరం పని చేసినట్టే, మనసు కూడా అలసిపోతుంది. అందుకే కొంత సమయం మనతో మనం గడపాలి. ప్రకృతిని ఆస్వాదించాలి. మంచి పుస్తకాలు చదవాలి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినాలి. ధ్యానం, యోగా,ప్రాణాయామం వంటి సాధనలు అలవాటు చేసుకోవాలి. ఇవి కేవలం వ్యాయామాలు కాదు మనసును నిలకడగా ఉంచే మార్గాలు.– ఎన్. లహరి -
పూర్వజన్మ పాపం.. రాజును వెంటాడిన వ్యాధి!
పూర్వం సౌరాష్ట్ర రాజ్యాన్ని సోమకాంతుడు సర్వసుభిక్షంగా పరిపాలించేవాడు. అతడి భార్య సుధర్మ. ఆ దంపతులకు హేమకంఠుడు అనే పుత్రుడు కలిగాడు. హేమకంఠుడు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సకల విద్యలూ అభ్యసించి, యువరాజు అయ్యాడు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సర్వసౌఖ్యాలూ అనుభవిస్తూ, సమస్త వైభోగాలతో తులతూగుతూ ఉన్న సోమకాంతుడు జన్మాంతర పాపఫలితంగా కుష్టువ్యాధి బారిన పడ్డాడు. శరీరమంతా వ్రణాలు ఏర్పడి, నిరంతరం చీము కారుతూ, దుర్గంధభూయిష్టంగా మారింది. వ్యాధి నివారణ కోసం సోమకాంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. చివరకు సోమకాంతుడు వానప్రస్థానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సమస్త పరివారాన్నీ పిలిచి, తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అతడి నిర్ణయానికి అంతఃపుర కాంతలు, అమాత్యులు, భృత్యులు పెద్దపెట్టున రోదించారు. తాము కూడా వానప్రస్థానికి వస్తామని అన్నారు. సోమకాంతుడు వారికి నచ్చజెబుతూ, ‘నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. అతడికి పట్టాభిషేకం చేయండి. మీరంతా నన్ను సేవించుకున్నట్లే, అతడిని సేవించండి’ అని పలికాడు.మహారాణి సుధర్మ ‘భర్తను అనుసరించడమే పతివ్రతా ధర్మం’ అని చెప్పి, సోమకాంతుడితో పాటు తాను కూడా వానప్రస్థానికి సిద్ధపడింది. కొద్దిమంది పరివారం వెంటరాగా రాజ దంపతులు వానప్రస్థానికి బయలుదేరారు. సోమకాంతుడు, సుధర్మ తమ పరివారం వెంటరాగా అడవుల్లో అక్కడక్కడా మజిలీలతో కొన్నాళ్ల ప్రయాణం తర్వాత వారంతా ఒక దుర్గమారణ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక సరోవరం కనిపించింది. రాజ పరివారం ఆ సరోవరంలో స్నానాలు చేసి, అందులోని నీళ్లు తాగి, అక్కడి చెట్ల నుంచి కోసుకున్న పండ్లు ఆరగించి, వాటి నీడలో సేదదీరసాగారు. సోమకాంతుడి కోరికపై అతడి పరివారం అడవిలోని కందమూలాలు, తామరతూళ్లు సేకరించుకుని రావడానికి వెళ్లారు.కొద్దిసేపటికి దివ్యతేజస్సు ఉట్టిపడుతున్న ఒక బాలకుడు కలశం చేతపట్టుకుని సరోవరం వద్దకు వచ్చాడు. సుధర్మ అతడిని చూసి ముచ్చట పడింది. అతడి వద్దకు వెళ్లి, ‘అబ్బాయి! నువ్వు ఎవరివి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని ప్రశ్నించింది.‘అమ్మా! నా పేరు చ్యవనుడు. నా తండ్రి భృగుమహర్షి, తల్లి పులోమ. ఆశ్రమానికి నీళ్లు తీసుకువెళ్లడానికి ఇక్కడకు వచ్చాను. ఇంతకీ మీరెవరు? మీ సేవలు పొందుతున్న ఆ పురుషుడు ఎవరు? ఆయన శరీరమంతా వ్రణాలతో నిండి ఉందేమి?’ అని అడిగాడు.సుధర్మ దుఃఖాశ్రువులతో తమ వృత్తాంతమంతా అతడికి చెప్పింది. చ్యవనుడు సరోవరంలోని నీళ్లు తీసుకుని, ఆశ్రమానికి వెళ్లిపోయాడు. నీటికుండతో ఆశ్రమానికి చేరుకున్న కొడుకు ముఖం దిగులుగా ఉండటం గమనించాడు భృగుమహర్షి.‘కుమారా! ఎందుకలా దిగులుగా ఉన్నావు? కారణమేమిటి?’ అని అడిగాడు.అప్పుడు చ్యవనుడు తండ్రికి రాజదంపతులైన సోమకాంతుడు, సుధర్మల వృత్తాంతం చెప్పాడు.‘రాజదంపతులను, వారి పరివారాన్ని మన ఆశ్రమానికి పిలుచుకునిరా! నేను ఆహ్వానిస్తున్నానని చెప్పు’ అని కొడుకును తిరిగి అడవికి పంపాడు. చ్యవనుడు వచ్చి పిలవడంతో సోమకాంతుడు, సుధర్మ దంపతులు పరివారంతో పాటు భృగు ఆశ్రమానికి చేరుకున్నారు. భృగు మహర్షికి వారంతా నమస్కరించారు. భృగు మహర్షి వారికి షడ్రసోపేతమైన విందుతో ఆతిథ్యమిచ్చి, వారి విశ్రాంతికి తగిన ఏర్పాట్లు చేయించాడు. సోమకాంతుడు భృగుమహర్షి వద్ద తన బాధ చెప్పుకున్నాడు. భృగుమహర్షి దివ్యదృష్టితో చూసి, ‘రాజా! ఇదంతా పూర్వజన్మ పాపం వల్ల సంప్రాప్తించిన బాధ’ అని చెప్పి, అతడి పూర్వజన్మ వృత్తాంతమంతా తెలిపాడు. సోమకాంతుడు అంతా విని కూడా, మనసులో ఒక క్షణం భృగుమహర్షిని సందేహించాడు. వెంటనే అతడి శరీరం నుంచి పక్షులు పుట్టుకొచ్చి, వాడి ముక్కులతో అతడి దేహంపై వ్రణాలను పొడవసాగాయి. ‘మహర్షీ! మీరే నన్ను కాపాడాలి’ అంటూ ఆర్తనాదాలు చేశాడు.‘రాజా! నువ్వు నన్ను సంశయించావు. అందుకు ఫలితమే ఇది’ అంటూ భృగువు ఒక్క హుంకారం చేయడంతో ఆ పక్షులన్నీ మాయమయ్యాయి. ‘నీ వ్యాధినివారణకు తరుణోపాయం చెబుతాను విను. నువ్వు గణేశపురాణ శ్రవణం చేసినట్లయితే, పాప విమోచన జరిగి, వ్యాధి నుంచి బయటపడగలవు’ అని చెప్పాడు. గణేశ స్తోత్రాన్ని పఠించి, మంత్రజలాన్ని సోమకాంతుడిపై ప్రోక్షించాడు. వెంటనే సోమకాంతుడి ముక్కు నుంచి ఒక క్రిమిలాంటి నల్లని పురుషుడు బయటపడ్డాడు. చూస్తుండగానే అతడు పర్వతమంత పెరిగాడు. తనను తాను ‘పాప పురుషుడు’ అని చెప్పుకున్న ఆ భీకరాకారుడిని భృగుమహర్షి తన తపోబలంతో భస్మీపటలం చేశాడు. సోమకాంతుడి ప్రార్థన మేరకు భృగుమహర్షి అతడికి గణేశపురాణం చెప్పి, కొద్దిరోజుల్లోనే అతడికి రోగవిముక్తి కలిగించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణ పూర్ణిమను దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాఖీ పండుగ జరుపుకొంటారు. ఇదేరోజు బలరామ జయంతి కూడా. దేశంలో కొద్దిసంఖ్యలో మాత్రమే ఉన్న బలరామ ఆలయాల్లోను, శ్రీకృష్ణ దేవాలయాల్లోను శ్రావణ పూర్ణిమ రోజున బలరామ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతారు. ఒడిశాలోని ఢంకనాల్, కేంద్రపడా జిల్లాల్లోను, పశ్చిమబెంగాల్లో ని ఖొయిరాసోల్, కోల్కతాలలోను, కేరళలోని నెన్మినిలోను, ఉత్తరప్రదేశ్‌లోని గోవర్ధన్లోను, గుజరాత్‌లోని చిత్రసానిలోను బలరాముడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. -
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్ -
వరాలతల్లి.. కల్పవల్లి
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహితలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసు కదా... అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం రెండు వారాల పాటు చేసుకునే విధంగా రావడం విశేషం. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది. పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి మూడవ శుక్రవారం అయినా ఆ రోజున ఈ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్ఠమని పండితుల అభిప్రాయం. శ్రద్ధ, భక్తి, ఓపిక, వెసులుబాటు ఉండాలే కానీ నెలలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం ఆచరించవచ్చునన్నది పెద్దల మాట. ఎప్పుడు చేసుకున్నా, ప్రాంతీయ భేదానుసారం కొద్దిపాటి మార్పు చేర్పులతో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతవిధానమిది...ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, గడపకు పసుపు, కుంకుమ, అందమైన ముగ్గులతో గృహాలంకరణ చేయాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, నాణేలు, పసుపు, కుంకుమ వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవి గా భావించాలి. అమ్మవారి ముఖరూపాన్ని అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించాలి.తోరాలు: తొమ్మిది నూలు దారపు పోగులతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు రాసి తోరాలు (రక్షా సూత్రాలు) తయారు చేసి పూజలో ఉంచాలి.సంక్షిప్త పూజా విధానంగణపతి పూజ: సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. అందువల్ల పసుపు వినాయకుడిని చేసి, అక్షతలు, పూలతో పూజించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ ఆరాధన: ఆ తర్వాత కలశంలో ఉన్న వరలక్ష్మీ దేవికి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ సుగంధభరితమైన పువ్వులు, కుంకుమతో అర్చన చే యాలి.తోర పూజ: అమ్మవారి మూలమంత్రాలను పఠిస్తూ పూజలో ఉంచిన తోరాలకు పూజ చేసి, ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవడం వ్రతంలో ముఖ్య క్రతువు. నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన నవధాన్యాలు, బూరెలు, గారెలు, పరమాన్నం, కొబ్బరికాయలు వంటి నవకాయ పిండివంటలను, ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వ్రత కథ: పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలోని కుండినం అనే నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానంటూ వ్రతవిధానాన్ని చెప్పింది. చారుమతి తన కలను కుటుంబ సభ్యులకు వివరించి, ఊరిలోని మిగతా స్త్రీలతో కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. పూజ పూర్తి కాగానే, వ్రతం చేసిన స్త్రీలందరి ఇళ్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటినుండి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ప్రతి ఏటా సంప్రదాయంగా చేసుకుంటున్నారు.వాయనం: పూజ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి, వ్రత కథాక్షతలను శిరస్సున ధరించాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి, తాంబూలంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, రవికె గుడ్డ, ప్రసాదాలను వాయనంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.మరికొన్ని విశేషాలు‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.శ్రావణ మాసమంటే ఎందుకని ఇష్టం? శ్రవణం లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పేరు మీదుగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసమంటే అమ్మవారికి ఇష్టం. అలాగే పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతికరం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీ నివాస స్థానాలుమహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, గోమయం, గోపృష్టం, ఆవు కొమ్ముల మధ్యన, పూజామందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార సంపన్నుడైన పండితుడు లేదా గురువు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలి. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం వంటివి కూడా ధనమే. వరలక్ష్మీ వ్రతం పూజా విధానంవరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. అది వరలక్ష్మీవ్రతం. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు...పండ్లు – పిండివంటలు అలంకరణ వస్తువులు ∙పసుపు, కుంకుమ, గంధం ∙అక్షతలు, అగరుబత్తీలు ∙కర్పూరం, నెయ్యి, నూనె ∙దూది వత్తులు, హారతి పళ్ళెం ∙తమలపాకులు (20), వక్కలు ∙నాణేలు ∙కలశం పాత్ర (వెండి/రాగి/ఇత్తడి) ∙ఐదు రకాల పండ్లు (అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ వంటి పండ్లు ∙కొబ్బరికాయలు (కనీసం 3) ∙తోరాలు (9 పోగుల దారాలు) నానబెట్టిన శనగలు ప్రసాదాలు (పరమాన్నం, గారెలు, బూరెలు) ∙అమ్మవారి ముఖరూపం ∙మామిడి ఆకులు, అరటి మొక్కలు ∙పూలమాలలు, విడిపూలు ∙కొత్త రవికల గుడ్డలు (వాయనం కోసం) ∙పీఠం (చెక్క పీట), ఎర్రటి వస్త్రం ∙గాజులు, తాంబూలం వస్తువులు.కలశం ఎందుకు?వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. ఎందుకంటే కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తిస్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.– డి.వి.ఆర్. -
తలకిందుల తామర.. ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ!
అనంతపురం ప్రాంతంలోని కంబదూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తి విశ్వాసాలకు మాత్రమే కాకుండా ప్రాచీన దక్షిణ భారత వాస్తు, శిల్పకళా వైభవానికీ విశిష్టమైన ప్రతీక. ఆలయ నిర్మాణంలో కనిపించే రాతి స్తంభాలు, మండపాలు గర్భగృహం పైభాగం విమాన నిర్మాణం, అద్భుతమైన శిల్పాలు ఆ కాలం నాటి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనాలు.ఈ ఆలయ వాస్తుశైలిలో విమాన నిర్మాణం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. గర్భగృహం పైన నిర్మించిన విమానం దక్షిణ భారత దేవాలయ వాస్తు సంప్రదాయానికి అనుగుణంగా గర్భగృహానికి దైవిక ప్రాధాన్యతను ప్రస్ఫుటం చేస్తుంది. విమానం కేవలం ఆలయ పైకప్పు కాదు. అది గర్భగృహంలోని మూలవిరాట్టుపైన నిలిచే పవిత్ర నిర్మాణం. భూమి నుంచి పైకి ఎదిగే దాని నిర్మాణం దేవాలయ వాస్తులో భౌతిక లోకం నుంచి దైవిక లోకం వైపు ఎదుగుదలకు ప్రతీక.కంబదూరు ఆలయ విమాన నిర్మాణంలో కనిపించే రాతి అమరికలు, అలంకార అంశాలు దక్షిణ భారత మధ్యయుగ దేవాలయ వాస్తు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. గర్భగృహం పైన విమానం, దాని పైభాగంలో శిఖర నిర్మాణం ఉండటం వల్ల ఆలయానికి నిలువైన సౌందర్యం ఏర్పడుతుంది. విమానంలోని ప్రతిస్థాయి, అలంకార భాగం ప్రధాన గర్భగృహాన్ని మరింత గంభీరంగా చూపించే విధంగా రూపొందించబడింది.ఈ ఆలయానికి మరో విశేషం దాని అద్భుతమైన రాతి శిల్పాలు. ఆలయ స్తంభాలు మండపాలు, ఇతర నిర్మాణ భాగాలపై దేవతారూపాలు నర్తకీమణులు యోధులు జంతువులు, పుష్పలతా అలంకరణలు కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు ఆ కాలం నాటి సామాజిక జీవితం వస్త్రధారణ ఆభరణాలు యుద్ధ సంప్రదాయాలు, కళాసంస్కృతికి సంబంధించిన దృశ్యాలను మన కళ్లముందు ఉంచినట్లుగా అనిపిస్తాయి. ముఖమండపం, స్తంభాలపై కనిపించే సూక్ష్మమైన చెక్కడాలు ముఖ్యంగా ఆకట్టుకుంటాయి. గట్టి రాతిలో అంత సున్నితమైన శరీర భంగిమలు ముఖ కవళికలు వస్త్రమడతలు, ఆభరణాలను చెక్కడం శిల్పుల అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కళాఅంశాలలో తలకిందుల తామరపుష్పం ఒకటి. మండపం పైకప్పు మధ్యభాగంలో రాతిలో చెక్కబడిన ఈ తామరపుష్పం పైనుంచి కిందికి వికసించినట్లుగా కనిపిస్తుంది. పుష్పదళాలను పొరలుగానూ, సమచతురంగా చెక్కిన తీరు శిల్పి అపూర్వమైన సౌందర్య దృష్టికి నిదర్శనం. భారతీయ దేవాలయ కళలో తామర పవిత్రత సృష్టిసౌందర్యం దైవత్వానికి ముఖ్యమైన ప్రతీక. ఆలయ పైకప్పు మధ్యలో తలకిందులుగా కనిపించే తామరను వాస్తు అలంకరణలో భాగంగా చూడవచ్చు. దాని నిర్దిష్ట తాత్విక అర్థం గురించి ప్రాచీన శాసన ఆధారం లభించక΄ోతే దానికి ఇచ్చే ఇతర అర్థాలను స్థానిక సంప్రదాయాలు, కళావ్యాఖ్యానాలుగా మాత్రమే పరిగణించాలి.విమానగోపురం గర్భగృహాన్ని దైవిక కేంద్రంగా ప్రకటిస్తే మండపంలోని తలక్రిందుల తామర ఆ నిర్మాణానికి కళాత్మక కిరీటంలా కనిపిస్తుంది. బయట నుంచి ఆకాశాన్ని తాకేలా పైకి ఎదిగే విమానం, లోపల పైకప్పు నుంచి కిందికి వికసించినట్లుగా కనిపించే తామర అనే రెండు రూపాలు ఆలయ వాస్తులో ఒక అద్భుతమైన దృశ్య సమన్వయాన్ని సృష్టిస్తాయి.– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
ఈర్ష్య : పక్కవాడి విజయం ఎందుకు నచ్చదు?
ఈర్ష్య అనేది కోరిక నుండి పుడుతుంది. ఇతరుల సంతోషాన్ని, ఎదుగుదలను చూసి అది ఇంకా పెరుగుతుంది. కానీ సత్పురుషులకు జ్ఞానం, వివేకం వల్ల ఆ ఈర్ష్య నశిస్తుంది. ఈర్ష్య అసూయ.. ఈ రెండు అవలక్షణాల వలన మానవుడు సర్వం కోల్పోతాడు.. శతక కవులు ఇదే విషయాలను ఎంతో స్పష్టంగా సెలవిచ్చారు.వేమన శతకం... ‘ఈర్ష్య గలవాని కెన్నడుసంతోషము లేదు నిజము సుమ్ము కుమారాఈర్ష్య గలవాడు పరులనుఈర్ష్యతో చూచుచుండు నెప్పుడు కుమారా‘అర్థం: ఈర్ష్య ఉన్నవాడికి ఎప్పుడూ సంతోషం ఉండదు. వాడు ఇతరులను ఎప్పుడూ ఈర్ష్యతోనే చూస్తూ ఉంటాడు.మరో పద్యంలో... ‘తనకు లేని దొరులకున్నతన మనసున రోత పుట్టి తనువు కశించున్ఇన లేకున్నను చీకటిపనికొచ్చునా ఈర్ష్య పరుల బాధించురా’అర్థం: తనకు లేనిది ఇతరులకు ఉంటే మనసులో అసూయ పుట్టి, శరీరం కృశించిపోతుంది. సూర్యుడు లేకుండా చీకటి ఎలా పనికిరాదో, ఈర్ష్య కూడా అలాగే ఇతరులను బాధిస్తుంది.ఇక సుమతి శతకంలో బద్దెన ఏమి చెప్పారంటే‘అసూయ గలవాని నెదుటఅసమానపు ధనము కురిసిన నది చూడకఅసహ్యించుకొను వాడుఅసమానుడు గాడె సుమతీ అనవుడు కుమారా‘ ఈర్ష్య గలవాడి ముందు కోట్లు కురిసినా వాడు చూడడు. పైగా అసహ్యించుకుంటాడు. అటువంటివాడు అసమానుడు సుమతీ.దాశరథి శతకం...‘అసూయ చేతను నరుడువసుధను కృశించుచుండు వనరుహనేత్రీఅసూయను వీడిన నరుడువసుధను సుఖియించు చుండు వరముగ కుమారా‘ ఈర్ష్య చేత మనిషి ఈ లోకంలో కృశించిపోతాడు. ఈర్ష్యను వదిలిన మనిషి సుఖంగా ఉంటాడు.పరగుణ పరమాణూనాం పర్వతీకరణం క్షణాత్స్వగుణ మేరుమాత్రాణాం కూపీకరణం క్షణాత్యత్ కుర్వన్తి సతాం సన్తః తదస్మాభిః కిం ఉచ్యతేఅసూయా కలుషాః కేచిత్ నిర్దుష్టం గుణం ఏవ హి తాత్పర్యం: ఈర్ష్యతో నిండిన కొందరు దుష్టులు, ఇతరుల చిన్న లో΄ాన్ని కూడా పర్వతంలా పెద్దది చేసి చూపిస్తారు. అదే సజ్జనులు తమలోని మేరు పర్వతం అంత గొప్ప గుణాన్ని బావి అంత చిన్నదిగా చేసేస్తారు. అంటే ఈర్ష్య ఎంతటి అవగుణమో అర్థం అవుతోంది కదా!– డా. కందాళ సత్య నారాయణ మూర్తినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రపంచాన్నీ ఆకట్టుకున్న ‘నమస్తే’! ఆంతర్యం ఏంటో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తిని కలవగానే ముందుగా చేసే పని ‘నమస్కారం’. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమైన గౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక. గుడిలో భగవంతుడిని దర్శించుకున్నా, ఇంట్లో పెద్దలను కలిసినా రెండు చేతులు జోడించి నమస్కరించడం మన ఆనవాయితీ. అసలు ఇలా రెండు చేతులూ ఎందుకు జోడించాలి..? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..‘నమస్తే’ అనే పదంలో దాగిన ఆంతర్యం..సంస్కృత పదాలైన ‘నమః‘, ‘తే’ కలయికతో ‘నమస్తే’ ఏర్పడింది. ‘నమః’ అంటే నాలోని అహంకారాన్ని వదిలిపెట్టడం, ‘తే‘ అంటే మీకు. అంటే.. ‘నా అహాన్ని విడిచిపెట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను‘ అని అర్థం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తికి నమస్కరించడం ద్వారా, వారిలో కొలువై ఉన్న పరమాత్మను స్మరించుకుంటున్నామని మన శాస్త్రాలు చెబుతున్నాయి.రెండు చేతులు ఎందుకు జోడించాలి..?ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కుడి చేయి సానుకూల సూర్య శక్తికి, ఎడమ చేయి గ్రహించే చంద్ర శక్తికి ప్రతీకలు. ఈ రెండు చేతులను ఏకం చేసినప్పుడు శరీరంలోని నాడులు సమతుల్యమై, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. చేతులు జోడించే భంగిమ ఎదుటివారి పట్ల మనకు ఉన్న వినమ్రతను, శరణాగతి భావాన్ని సూచిస్తుంది. ఇది బంధాల్లో ఆత్మీయతను పెంచుతుంది.నమస్కరించే సరైన విధానం..శాస్త్రాల ప్రకారం, రెండు చేతులను ఛాతీకి దగ్గరగా ఉంచి, తలను కొద్దిగా వంచి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనసులో వినయం ఇనుమడిస్తుంది. దేవుడికి లేదా వయసులో పెద్దవారికి నమస్కరించేటప్పుడు కళ్లు మూసుకుని భక్తి శ్రద్ధలతో ప్రణామం చేయడం అత్యంత మంగళకరం.నమస్కారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు..నమస్కారం చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. రెండు చేతుల వేళ్ల చివర్లు ఒకదానికొకటి తాకినప్పుడు చేతుల్లోని ఒత్తిడి బిందువులు ఉత్తేజితం అవుతాయి. అలా ఆక్యుప్రెషర్.. జరిగి నేరుగా కళ్లు, చెవులు, మెదడుకు అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల నమస్కరించిన వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.నమస్కారంలో ఎలాంటి భౌతిక స్పర్శ ఉండదు కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా నమస్కారానికి ఎంతో గుర్తింపు ఉంది. నేడు యోగాతో పాటు భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణ వల్ల, విదేశీయులు సైతం భౌతిక దూరం పాటిస్తూనే గౌరవాన్ని వ్యక్తం చేసే ఈ ‘నమస్తే’ సంప్రదాయాన్ని ఎంతో ఆసక్తిగా, భక్తితో పాటిస్తున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం..– పసుపులేటి శ్రీలక్ష్మినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
'మిలాద్-ఉన్-నబీ'.. విలువల ఆచరణకు పిలుపు!
ఏడవ శతాబ్దపు అరేబియా ద్వీపకల్పం అనైతికత, అన్యాయం, అజ్ఞానాల చీకట్లలో మగ్గుతున్న కాలమది. బలహీనుడి ఆర్తనాదం అరణ్యరోదనగానే మిగిలి΄ోతున్న రోజుల్లో, ఆడపిల్ల పుట్టడమే మహాపాపంగా భావించి ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టే కిరాతక సంస్కృతి రాజ్యమేలేది. మానవత్వానికి స్థానం లేని ఆ కఠిన పరిస్థితుల్లో, ముహమ్మద్ ప్రవక్త (స) ఒక దయాసముద్రుడిగా, విమోచకుడిగా లోకానికి పరిచయమయ్యారు. ఆయన రాకతో కేవలం ఒక్రపాంతంలోనే కాక, విశ్వవ్యాప్తంగా నూతన మానవతా శకం ఆరంభమైంది.సమతాభావం – సామాజిక విప్లవంప్రవక్త తెచ్చిన మార్పు కేవలం మతపరమైన సరిహద్దులకు పరిమితం కాలేదు. మానవులందరూ ఒక్కటేనని, దేవుని దృష్టిలో అందరూ సమానులేనని ఆయన చాటారు. రంగు, జాతి, వర్గ భేదాలు మనుషుల శ్రేష్ఠతకు కొలమానాలు కావని, కేవలం నైతికత, పవిత్ర హృదయమే శ్రేష్ఠమైనవని స్పష్టం చేశారు. బానిసలను సొంత సోదరులుగా చూడాలని, వారి విముక్తికి కృషి చేయడమే నిజమైన పుణ్యమని బోధించి సమాజంలో సమతాభావాన్ని నింపారు.స్త్రీ గౌరవం – ఆర్థిక న్యాయంస్త్రీల పట్ల ఆయన చూపిన కరుణ సమాజంలో ఒక అపూర్వ విప్లవాన్ని తెచ్చింది. మహిళను భోగవస్తువుగా చూసే కాలంలో ఆమెకు ఆస్తి, వివాహం, గౌరవప్రదమైన జీవిత హక్కులను అందించారు. స్త్రీ స్థానాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చారు. మదీనాలో భిన్న మతాలు, తెగల మధ్య ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికే తొలి సమానత్వ ప్రతిపాదనగా నిలిచింది. బలహీనులను పీల్చి పిప్పిచేసే వడ్డీ వ్యాపారాన్ని నిరసిస్తూ, జకాత్ వంటి దానధర్మాల ద్వారా పేదలకు సంపదలో భాగం కల్పించే సన్మార్గాన్ని చూపారు.క్షమాగుణం – సార్వజనీన హక్కులుఆయన చివరి హజ్ ప్రసంగం మానవ హక్కుల ప్రకటనకు సజీవ సాక్ష్యం. మనుషుల ప్రాణాలు, గౌరవ మర్యాదలు పవిత్రమైనవని, వాటిని భంగపరచే హక్కు ఎవరికీ లేదని చాటిచెప్పారు. హింస కంటే క్షమాగుణమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించారు. శత్రువులను సైతం ప్రేమానురాగాలతో గెలుచుకోవచ్చనే మధురమైన సత్యాన్ని ఆచరణలో చూపించి, ద్వేషం ఉన్నచోట ప్రేమను నాటారు.ఆంతరంగిక పరిపక్వత – ఆత్మజ్ఞానంబాహ్య ప్రపంచంలో సమాజ శ్రేయస్సుకు పునాదులు వేసిన ప్రవక్త బోధనలు, అంతరంగంలో మనిషి తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞాన దిశగా కూడా మార్గం సుగమం చేస్తాయి. మనిషి తన అహంకారాన్ని, స్వార్థాన్ని వీడినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని ఆయన జీవితం చాటిచెప్పింది. బాహ్యంగా ఆడంబర పూజలు చేయడం కంటే హృదయ శుద్ధి కలిగి ఉండటం, ఇతరుల పట్ల దయతో మెలగడమే దైవ సామీ΄్యానికి నిజమైన మార్గమని ఆయన తత్త్వం వెల్లడిస్తుంది. మనోవికారాలను జయించి, ఆత్మనిగ్రహాన్ని సాధించడమే అత్యుత్తమమైన సమరమని బోధించడం ద్వారా మానవ చైతన్యానికి నూతన అర్థాన్ని ఇచ్చారు.నైతిక సత్యం – నిత్యచైతన్యంప్రవక్త ప్రబోధించిన శాంతి కేవలం యుద్ధాలు లేక΄ోవడం మాత్రమే కాదు, అది వ్యక్తి మనస్సు నుండి ప్రారంభమై విశ్వమంతటా విస్తరించే ఒక నిరంతర చైతన్యం. ఏ యుగంలోనైనా నైతికతను కోల్పోయిన నమూనాలు కూలి΄ోక తప్పదని, కేవలం సత్యం, కరుణ ప్రాతిపదికగా నిర్మితమైన సమాజమే శాశ్వతంగా నిలుస్తుందని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. విజ్ఞానం, సాంకేతికత ఎంత పెరిగినా నైతిక పునాదులు లేని నాగరికత వినాశనానికే దారితీస్తుందనే తాత్విక హెచ్చరిక ఆయన సందేశంలో అంతర్లీనంగా ఉంది. ఈ కాలాతీతమైన సత్యాన్ని గ్రహించినప్పుడే మనం అంతర్గత ప్రశాంతతను సాధించగలుగుతాము.నేటి సమాజం... ఆచరణాత్మక మార్గంసాంకేతికంగా ఎంతో ఎదిగినా, మానవీయ విలువల లేమితో అశాంతిని ఎదుర్కొంటున్న నేటి ఆధునిక ప్రపంచానికి ప్రవక్త చూపిన దయ, నైతికత, శాంతి మార్గాలు ఎంతగానో అత్యవసరం. మన హృదయాలలో ఆత్మీయతను పెంచుకుని, తోటి మనుషుల పట్ల కరుణ చూపడమే ఆధ్యాత్మికతకు అసలైన పరమార్థం.మీలాదున్నబీ సందర్భంగా కేవలం సంబరాలకే పరిమితం కాకుండా... ఆయన చూపిన కరుణను, సమతాభావాన్ని, సామాజిక బాధ్యతను మన నిత్య జీవితంలో ఆచరించి చూపడమే ఈ సమాజానికి మనం అందించే అత్యున్నతమైన కానుక. అప్పుడే ప్రవక్త దివ్య సందేశానికి పరిపూర్ణమైన సార్థకత చేకూరుతుంది!– మదీహా అర్జుమంద్నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
తప్పులను మన్నించే పుణ్యోత్సవం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు 2026 ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందు రోజు, అనగా ఆగస్టు 22న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి.ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజలు, అర్చనలు, వివిధ ఉత్సవాల్లో వైష్ణవ ఆగమశాస్త్రాల ప్రకారం భక్తులు, అర్చకులు లేదా సిబ్బంది వల్ల తెలియకుండా ఏవైనా లోపాలు (దోషాలు) జరిగి ఉంటే, వాటి నివారణ కోసం ఈ ’దోష నివారణోత్సవం’ లేదా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ పవిత్రతను కాపాడటం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.చారిత్రక నేపథ్యంతిరుమల ఆలయ శాసనాల ప్రకారం, ఈ పవిత్రోత్సవాలను మొదటిసారిగా క్రీ.శ. 1463లో సాళువ నరసింహరాయల కాలంలో సాళువ మల్లయ్యదేవ రాజా ప్రారంభించారు. కాలక్రమేణా నిలిచిపోయిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ మళ్లీ 1962 నుండి పునరుద్ధరించి ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తోంది. అయితే కొన్ని మార్పు చేర్పులతో... ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి.పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది:ఆగస్టు 22: సహస్రదీపాలంకార సేవ రద్దు.ఆగస్టు 23 నుండి 25 వరకు: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఆగస్టు 25: అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు. ఆగస్టు 26: కల్యాణోత్సవ సేవ రద్దు.మూడు రోజుల కార్యక్రమ వివరాలుఈ మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు స్వామివార్కి ’స్నపన తిరుమంజనం’ (విశేష అభిషేకం) నిర్వహిస్తారు.ఆగస్టు 23 (మొదటి రోజు): పవిత్రాల ప్రతిష్ఠ24 (రెండవ రోజు): పవిత్ర సమర్పణ (అర్చకులు శ్రీ మలయప్పస్వామి వారిని, ఇతర ఉపదేవతలను ఐదు రంగుల పట్టు దారాలతో చేసిన పవిత్రాలతో అలంకరిస్తారు).25 (మూడో రోజు): మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి వీధి ఉత్సవం: ఈ మూడు రోజుల్లోనూ ప్రతి సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు విశేష ఆభరణాలతో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది?ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు.ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్ ఒఫ్ ద హోలీ సెపుల్చెర్’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి.– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు -
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
TTD: నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల
తిరుపతి: నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలఅంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.శ్రీవాణి దర్శన కోటా విడుదలశ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటావయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలతిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు!
పూర్వం పుండరీకుడు అనే మహారాజు ఒకనాడు వేటకు వెళ్లాడు. అడవిలో యథేచ్ఛగా జంతువులను వేటాడుతూ, కపిల మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అప్పటికి మిట్టమధ్యాహ్నమైంది. వేటలో పుండరీకుడు బాగా అలసిపోయాడు. కపిలుడి ఆశ్రమానికి చేరువలో ఒక సరోవరం కనిపించింది.పుండరీకుడు ఆ సరోవరంలో నీళ్లు తాగి, దప్పిక తీర్చుకున్నాడు. ఇంతలోనే ఒక లేడికూన ఆ సమీపంలోనే పరుగుతీస్తూ కనిపించింది. వేట ఉత్సాహం తగ్గని పుండరీకుడు వెంటనే, విల్లంబులు అందుకుని, దానిని గురిచూసి బాణం విడిచాడు. బాణం తగిలిన లేడికూన గాయపడి, ఒక్క పరుగున కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ప్రాణాలు విడిచింది.ఆ దృశ్యం చూసిన కపిలుడు ఉగ్రుడయ్యాడు. ‘ఎవడా మూర్ఖుడు? ఆశ్రమ పరిసరాల్లో ఇంతటి హింసకు పాల్పడినవాడు’ అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో లేడిని తరుముతూ పుండరీకుడు అక్కడకు చేరుకున్నాడు. కపిలుడి ఉగ్రరూపం చూసి, భయంతో గడగడ వణుకుతూ, ‘మునివర్యా! నా అపరాధాన్ని మన్నించండి’ అంటూ కాళ్ల మీద పడ్డాడు.కపిలుడు కొంత శాంతించాడు. పుండరీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.కపిలుడు తీక్షణంగా పుండరీకుని చూశాడు. ‘క్షణభంగురమైన తుచ్ఛ శరీరంపై ఆశలు పెట్టుకుని, ఇంతటి పాపానికి ఒడిగట్టావే, దీనికి కారణమేమిటి? నీ విలాసం కోసం ఒక లేడికూన నిండుప్రాణాన్ని బలిగొనడం ఏమి న్యాయం?’ అని పలికి, పుండరీకుడికి వైరాగ్యబోధ చేశాడు.కపిలుడి మాటలకు పుండరీకుడు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. పాపిష్టి దేహాన్ని ఇక్కడే త్యాగం చేయడం మంచిదని తలచి, తన తల నరుక్కుని, ఆత్మాహుతి చేసుకోవడానికి ఒర నుంచి కత్తి దూశాడు. కపిలుడు అతడి ప్రయత్నాన్ని నివారించాడు. పుండరీకుడికి హితబోధ చేశాడు.‘మోక్షేతి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం’ అని పలికి, ‘రాజా! మానవునకు మోక్షమే పరమావధి. మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదానఫలం వల్ల కలిగే సంపదలు క్షణికమైనవని, పరహింసాపరాయణత్వం పాపహేతువని తెలుసుకుని, గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే తత్త్వాన్ని తెలుసుకుని, ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాలి’ అని బోధించి, రాజధానికి వెళ్లి రమ్మని చెప్పి సాగనంపాడు.రాజధానికి తిరిగి వెళ్లినా, పుండరీకుడి మనసు మనసులో లేదు. తన శరాఘాతంలో మరణించిన లేడికూన, ఆ తర్వాత కపిల మహర్షి చేసిన ఉద్బోధ అతడి మనసులో మెదలసాగాయి. రాజ్యపాలనపై దృష్టిపెట్టడం అతడి దుస్సాధ్యంగా మారింది. వ్యాకులచిత్తుడైన పుండరీకుడు తన రాణికి, మంత్రులకు సైతం చెప్పకుండా, అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కొద్దిరోజుల్లోనే పుండరీకుడు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.కపిలుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అతడికి నమస్కరించాడు.‘మహర్షీ! నా రాజ్యాన్ని, సర్వసంపదలను విడిచిపెట్టి మీ చెంతకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.కపిలుడు అతడిని కన్నెత్తి చూడక, పన్నెత్తి పలుకరించక తృణీకరించాడు.అయినా, పుండరీకుడు అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆశ్రమ ప్రాంగణంలోనే కూర్చుని, ధ్యానం చేయడం ప్రారంభించాడు. పద్నాలుగు రోజులు అలాగే అన్నపానాదులు లేకుండా, ధ్యానంలో ఉన్నాడు. అతడి పరిస్థితి చూసి, కపిలుడి మనసు కరిగింది.శిష్య సమేతంగా పుండరీకుడి వద్దకు వెళ్లి, అతడిని పలకరించాడు.పుండరీకుడు కన్నీళ్లతో కపిలుడికి నమస్కరించాడు. తనను అనుగ్రహించాలని ప్రార్థించాడు.కపిలుడు అతడికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించాడు.పుండరీకుడు కపిలుడినే గురువుగా భావించి, అతడు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, చిరకాలం తపస్సు కొనసాగించాడు.పుండరీకుడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు అతడికి ప్రత్యక్షమయ్యాడు.పుండరీకుడు కోరుకున్నట్లుగానే అతడికి మోక్షాన్ని అనుగ్రహించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇవి చాలామందికి తెలిసిన ఆచారాలే! కొంకణ ప్రాంతంలో శ్రావణమాసంలో ‘చుడీపూజ’ పేరుతో గాజుల పూజ చేస్తారు. తులసికోట వద్ద గాజులు, పువ్వులు, పండ్లు ఉంచి పూజ జరిపి, మహిళలకు ఫలతాంబూలాలతో పాటు గాజులను కూడా పంచిపెడతారు. శ్రావణమాసంలో శుక్రవారం, ఆదివారం రోజుల్లో తులసికోటకు, సూర్యుడిని పూజించి, మహిళలకు గాజులు కానుకగా ఇస్తారు. ఇవే రోజుల్లో కొందరు ‘దేవీసాధన’ పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం!
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, మనిషి అన్వేషణ మాత్రం ఒకటే–శాంతి, ఆనందం, పరిపూర్ణత. ధనం, హోదా, సాంకేతిక విజ్ఞానం, సామాజిక గుర్తింపుం ఇవన్నీ జీవితాన్ని సౌకర్యవంతం చేయగలవేమో గానీ, అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచలేవు. మనసులో కలత, అసంతృప్తి, భయం, అసూయ, కోపం, అహంకారం వంటి భావాలు తొలగినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.ఆ అంతరంగ శాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుభూతికి మూలం పవిత్రత అని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. సహజయోగ వ్యవస్థాపకురాలు పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1985 ఆగస్టు 4న ఇచ్చిన సందేశంలో ఈ సత్యాన్ని అత్యంత సరళంగా వివరించారు. ఆమె మాటల్లో ‘‘పవిత్రత కుండలినిని బలపరుస్తుంది.’’ ఈ ఒక్క వాక్యంలోనే ఆధ్యాత్మిక జీవిత సారాంశం దాగి ఉంది.కుండలిని అంటే ఏమిటి?భారతీయ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో జన్మతః ఒక దివ్యశక్తి నిద్రాణంగా ఉంటుంది. అదే కుండలిని. ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు; ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామ శక్తికి ప్రతీక. ఈ శక్తి జాగృతమైతే మనిషి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆలోచనలు నిర్మలమవుతాయి. కోపం, భయం, ద్వేషం క్రమంగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, క్షమాగుణం సహజంగా వికసిస్తాయి. అయితే ఈ దివ్యశక్తి వికసించడానికి అత్యంత అవసరమైన నేల పవిత్రత. మురికినీటిలో తామర పువ్వు వికసించదు. అలాగే కలుషితమైన మనస్సులో దైవచైతన్యం పూర్తిగా వికసించదు.నేటి సమాజం – పరుగు...ప్రస్తుత కాలంలో వ్యక్తి విలువను అతని వ్యక్తిత్వంతో కాకుండా, అతని బాహ్య రూపం, వస్త్రధారణ, ఆస్తి, సామాజిక మాధ్యమాల్లోని ్రపాచుర్యం ఆధారంగా కొలిచే పరిస్థితి ఏర్పడుతోంది. అందంగా కనిపించడానికి గంటల సమయం వెచ్చిస్తాం. ఇతరుల ప్రశంసలు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆందోళనలోనే జీవితాన్ని గడిపేస్తాం.కానీ ఈ ప్రయాసలన్నీ బాహ్య ప్రపంచానికే పరిమితం. అవి మనసును శాశ్వతంగా తృప్తిపరచవు. అంతేకాదు, అనవసరమైన పోలికలు, అసూయ, అహంకారం, నిరాశలకు కూడా కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మనిషి తనలోని సహజ శక్తిని బయట ప్రపంచం కోసం ఖర్చు చేస్తూ, తన ఆత్మసంపదను కోల్పోతాడు. శ్రీ మాతాజీ అందుకే హెచ్చరిస్తారు–‘‘ఇతరులను ఆకర్షించడానికి మీ శక్తిని వృథా చేయకండి. సాధువులలాగే జీవించండి.’’– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులునిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
క్రీస్తు మరణం.. సువార్తకు కేంద్రబిందువు!
ఘనమైన సువార్త నిర్వచనం ఇలా ఉంది. దీన్నే పౌలు సువార్త నిర్వచనం అంటారు కూడా.‘...నేను ఏ సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’ 1కొరింధీ 15:1–4.క్రీస్తు మరణ సువార్తను మించిన సువార్త లేదన్నది బైబిలు ఉన్నత బోధ. దేవదేవుని గొప్పతనం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఈ సర్వ లోకానికి భిన్నమైన వైవిధ్యమైన ఆశ్చర్యకర తలంపులు దేవునివి. దేవుడు ఏది సువార్త అంటాడో అదే సువార్త. ఎందుకంటే క్రీస్తు మరణం దేవదేవుని స్వకీయ సంకల్పంలో నుండే వెలుగులోకి వచ్చింది.ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించక సువార్తకు జ్ఞానం, స్వస్థత, సాక్ష్యాలు, ఇప్పటి భక్తుల చరిత్రలు, అభిషేకారాధన వంటివి అనేకనేకం కలుపుతూ సువార్త శక్తిని హరిస్తున్నారు. పెద్ద పాలకుండలోని చిక్కనైన పాలలో చిన్నపాటి బిందువు లాంటి విషపు చుక్కవేస్తే రంగు రుచి వాసన కోల్పోతూ ఆ పాలన్నీ విరిగినట్టే. సత్య వాక్యమను రక్షణ సువార్తకు అలా ఏది చేర్చినా అది తన శక్తి ప్రభావ మహిమలను వెనువెంటనే కోల్పోతుంది. సువార్తకు మరింత రుచి, సువాసన అన్న ఆలోచనలు చేసేవాళ్ళు తక్షణమే అవి విడనాడాలి.సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉండగా కొత్తగా సువార్తకు జ్ఞానం అద్దడం దేనికీ? ఆత్మ స్వస్థతకు పాప రోగనివారణకు క్రీస్తు మరణిస్తే భౌతిక భావాలతో సువార్త స్వస్థత మహాసభలు దేనికీ? క్రీస్తు మరణ సువార్తకు ఏదీ కలుప కూడదు అనునదే అపొస్తలుల బోధలసారం.సూచక క్రియలకు మించిన సూచక క్రియ క్రీస్తు ప్రేమకు కేంద్రమైన సిలువ. జ్ఞానానికి మించిన జ్ఞానం సిలువ వేయబడిన క్రీస్తులో కనబడుతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. సర్వ సంపూర్ణత క్రీస్తు బలియాగంలో ఒదిగి నిక్షిప్తమై ఉంది. ఇందు లేనిదంటూ ఏదీ లేదు. అలాగని సువార్తను మరుగు చేసేలా ఇందు ఒదిగిన అంశాల చుట్టూ సువార్త పేర్చడం కాక సువార్తకు ఏది కలుపక యథార్థమైన సువార్తను యధాతథంగానే ప్రకటించబద్దులము.సువార్తకు ఎలాంటి ఆధారం ఏ ఊతం అవసరం లేదు. అది ఒంటరిగానే నిలబడి వ్యవహారం చక్కబెట్టగలదు. పరమ పరిశుద్ధ సువార్తను అంతే çపరిశుద్ధంగా... అంతే స్వచ్ఛంగా వెల్లడి చేయుట ద్వారా దేవుని మెప్పు అధికంగా పొందగలుగుతాం. ప్రకటనార్హమైనదిగా ఉంటూ వెళ్ళు ప్రకటించు అనదగ్గ క్రీస్తు సువార్తను అనుభవపూర్వకంగా రుచి చూస్తే మాత్రం దీనికి వేరే ఏది జతగా కలుపకూడదనేది ఇట్టే అర్థమవుతుంది.మానవాళి ఆత్మలను రక్షించే శక్తిగల సత్యసువార్త గొప్పతనం ఏమంటే నేరుగా అది వచ్చి అపొస్తలుల చేతిలో పడడం. వీరిపై క్రీస్తు ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే వీరు ఆయన సువార్తకు న్యాయం చేసారు. సువార్తకు ఏదీ కలుపక క్రీస్తు మరణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించే విషయమై మనం అపొస్తలులను అభినందించక తప్పదు. ఎట్టి పరిస్థితులలోనూ క్రీస్తు మరణ సువార్తకు ఆయన జన్మను సైతం పౌలు కలుపకపోవడం గమనించదగ్గది. ఇట్టి అపొస్తలుల బోధకు, సువార్తకు విధేయులమై తలవంచుటే రక్షణ భాగ్యం. – జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
మట్టితో మనిషికి విడదీయరాని బంధం..
మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది.మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులుదైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి:‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్‌కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది.సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనంప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్‌లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది.ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు; అది మనిషి తాను పుట్టిన నేలతో ఏర్పరుచుకునే ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధం. రోజువారీ ఫర్జ్ నమాజుల్లోనే కనీసం 34 సార్లు (సున్నత్, నఫిల్, వాజిబ్ లు కాక) తన నుదుటిని నేలకు ఆనించడం ద్వారా విశ్వాసి మాతృభూమి మట్టితో విడదీయరాని ఐక్యతను చాటుకుంటాడు. మట్టి నుండి పుట్టిన మనిషి, నిరంతరం ఆ మట్టికే ప్రణమిల్లడం వల్ల ఆ నేల పట్ల భక్తి, గౌరవం, రక్షణ భావం అతని నరనరాల్లో ఇంకిపోతాయి. మాతృభూమి మట్టిని పదే పదే తాకే ఆ శిరస్సు ఏ పరాయి దాస్యానికీ లొంగదు; ఆ నేల స్వేచ్ఛకోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడదు. చరిత్రే దీనికి సాక్ష్యం.త్యాగానికి మూలమైన ఆధ్యాత్మిక నిరూపణసజ్దాలో దైవానికి లొంగిన ఆత్మ, ప్రపంచంలో మరే శక్తికీ బానిస కాజాలదు. అందుకే, ఏ నేలనైతే రోజువారీ సజ్దాలతో పునీతం చేస్తాడో, ఆ నేల స్వేచ్ఛకు ముప్పు వాటిల్లితే ముస్లిం సమాజం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం యోధులు చిందించిన ప్రతీ రక్తపుబొట్టు వెనుక, దైవప్రవక్త నేర్పిన జన్మభూమి ప్రేమ, నమాజ్‌లో చేసిన ప్రతీ సజ్దా అందించిన ఆత్మబలమే నిలిచి ఉన్నాయి. జన్మభూమిని ప్రేమించడం, దాని స్వేచ్ఛ కోసం పోరాడటం కేవలం రాజకీయ బాధ్యత కాదు; అది విశ్వాసి నైజంలోనే కలిసిపోయిన పరమసత్యం.– మదీహా అర్జుమంద్ ఖాన్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
గౌరవం అంటే?
ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు... గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అసలు గౌరవం అంటే ఏమిటీ, గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం... ఉన్నారుగా మనకు మార్గదర్శులు.. శతక రచయితలు...కులములోన నొకడు గుణవంతుడుండెకులము వెలయు వాని గుణము చేతవెలయు వనములో న మలయజంబున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమఅడవిలో గంధం చెట్టుంటే దాని సువాసన అడవి అంతటికి పాకుతుంది.. అలాగే వంశంలో గుణవంతుడైన కొడుకు ఉంటే ఆ వంశానికి కీర్తి గౌరవం లభిస్తాయి... అంటూ వేమనే పై పద్యానికి వ్యతిరేకం కూడా చె΄్పారు.కులములోన నొకడు గుణహీనుడుండెనాకులము చెడును వాని గుణము వలన చెఱుకుతుద ఎన్ను పుట్టినచెఱుకున తీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ అంటాడు బద్దెన కవి వేమన గౌరవం కులం ధనం వల్ల రాదు అన్నాడుకులము గొప్పది కాదురాకులమున గౌరవమ్ము లేదు కొంపలు కూలన్నడవడి గొప్పది సుమ్మీనడవడి గలవాడు పూజ్యుడగు వేమాఅర్థం: కులం వల్ల గౌరవం రాదు. మంచి నడవడి ఉన్నవాడే లోకంలో పూజ్యుడు.ఎంగిలి మెతుకులు తిన్ననుసంగతి గలవాడు గౌరవమున బ్రతుకునుసంగతి లేని ధనికుడుకంగారు పడును లోకమందు వేమాపేదవాడైనా మంచి నడవడి ఉంటే గౌరవంగా బతుకుతాడు. నడవడి లేని ధనికుడు లోకంలో చులకన అవుతాడు. గౌరవం మాట, మర్యాద, దానం వల్ల వస్తుందన్నాడు బద్దెన.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా బెంగళూరుకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ నంది కొండల పాదభాగాన ఉన్న నంది గ్రామం చరిత్ర కళా వైభవం ప్రకృతి సౌందర్యం మూడింటినీ ఒకే చోట కలిపిన అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోనే కర్ణాటకలో అత్యంత ప్రాచీనమైన శైవ ఆలయ సముదాయాలలో ఒకటైన భోగనందీశ్వర, అరుణాచలేశ్వర జంట దేవాలయాలు ఉన్నాయి.నోలంబవాది ద్రావిడ శిల్పశైలికి తొలి నిదర్శనాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయ సముదాయం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను తనలో దాచుకుంది. నంది కొండల నుండి దిగివచ్చే సహజ జలవాహినులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడం వల్ల ప్రాచీన కాలం నుంచే ఇది పవిత్ర తీర్థక్షేత్రంగా అభివృద్ధి చెందింది.ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దం మొదట్లో ప్రారంభమై దాదాపు వంద సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ ఆలయ సముదాయం నిర్మాణంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. దక్షిణాన ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పరమశివుని బాల్య దశను సూచిస్తే ఉత్తరాన ఉన్న భోగనందీశ్వర ఆలయం యవ్వన దశను సూచిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న చిన్న ఉమా మహేశ్వర ఆలయం శివపార్వతుల దాంపత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూడు ఆలయాలను వరుసగా దర్శించడం ద్వారా శివుని జీవనయాత్రను ప్రతీకాత్మకంగా అనుభవించినట్లవుతుందని స్థానిక విశ్వాసం.రెండు ప్రధాన ఆలయాల గర్భగృహాలు ఎతై ్తన వేదికలపై నిర్మించబడ్డాయి. ప్రతి గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఈ రెండు ఆలయాలకు విడివిడిగా నంది మండపాలు ఉండటం అత్యంత అరుదైన విశేషం. సాధారణంగా శివాలయాలలో ఒకే నంది విగ్రహం ప్రధాన గర్భగృహానికి ఎదురుగా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు నంది విగ్రహాలు తమ తమ గర్భగృహాలకు అనుగుణంగా సరిగ్గా అమర్చబడి ఉండటం ఆలయ నిర్మాణ శైలిలో అసాధారణ లక్షణంగా భావించబడుతుంది.ఈ ఆలయ సముదాయంలోని సభామండపం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి స్తంభంపైనా దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు నర్తకులు యాళులు ఏనుగులు గుర్రాలు హంసలు మకరాలు పూలతీగలు పురాణ దృశ్యాలు అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఒక స్తంభంపై పదితలలు పది జతల చేతులతో కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్న రావణాసురుని శిల్పం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు ముడులు ఆభరణాలు గాజులు వేళ్లగోళ్లు వస్త్ర మడతలు వరకు ఎంతో సూక్ష్మంగా చెక్కిన తీరు అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. మండపంలోని కొన్ని స్తంభాలపై తమిళ శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ఆలయ గోడలు, గవాక్షాలు, ద్వారబంధాలు, పైకప్పు అంచులు అన్నిచోట్లా శిల్పకళ నిండి ఉంటుంది. ప్రధానంగా శైవ క్షేత్రమైనా నరసింహుడు లక్ష్మీదేవి దుర్గాదేవి సూర్యుడు అగ్నిదేవుడు గణపతి సుబ్రహ్మణ్యుడు సప్తమాతృకలు, భైరవుడు చండేశ్వరుడు వంటి అనేక దేవతా రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. శైవ వైష్ణవ శాక్త సంప్రదాయాల సమన్వయాన్ని ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలు గంభీరమైన భంగిమలో నిలిచి సందర్శకులను ఆకట్టుకుంటాయి.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!
మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.శివారాధనకు ఎంతో విశిష్టతశ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.మంగళ గౌరీ వ్రతంశ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..వరలక్ష్మీ వ్రతంశ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.విశిష్టతలుశుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.శుక్ల పక్ష పౌర్ణమిరాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.– పూర్ణిమాస్వాతినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వర్షాకాలంలో తులసి మొక్కను ఇలా పెంచడమే మంచిది..
తులసి మొక్కకు వర్షాకాలం అనుకూలమైన సమయం. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతోపాటు మొక్క వేగంగా కొత్త ఆకులు, కొమ్మలు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే, అధిక వర్షం, నీరు నిలిచిపోవడం, సూర్యరశ్మి తగ్గడంతో తులసి మొక్క బలహీనపడుతుంది. అయితే, ఇంట్లో తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా, దట్టంగా పెంచుకోవాలంటే ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సూచనలు.. జాగ్రత్తలు..తులసి మొక్కను దట్టంగా పెంచడానికి పైభాగంలో పెరుగుతున్న చివరి కొనలను అప్పుడప్పుడు చేతితో స్వల్పంగా తెంచేయాలి. దీంతో కిందివైపు కొత్త కొమ్మలు రావడం ప్రారంభిస్తాయి. మొక్క ఒకే కాడలా పైకి పెరగకుండా గుబురుగా మారుతుంది.తులసి చెట్టు పువ్వులు కాసినప్పుడు వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. ఇలా చేయడంతో కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే విత్తనాలకై కొన్ని పువ్వులను తెంచకుండా ఉంచితే చాలు.వర్షాకాలంలో ఈ చెట్టుకి నీరు ఎక్కువగా అందడం పెద్ద సమస్యగా మారవచ్చు. దీంతో కుండీలో నీరు నిలిచి చెట్టువేర్లకు సరైన ఆక్సిజన్ ఆందక చెట్టు కాడ నల్లగా మారుతుంది. మట్టి తడిగా ఉన్నట్లయితే మళ్లీ నీరు పోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.నీరు పోసే ముందు మట్టిని వేలితో తాకి చూడాలి. పై పొర పొడిగా అనిపిస్తేనే నీరు అందించాలి. అలాగే పోసిన నీరు నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు కుండీ అడుగున చిన్న చిన్న రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. నీరు ఎక్కువసేపు నిలిచిపోతే తులసి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి తగినంత వెలుతురు అవసరం. అలాగే ప్రతిరోజూ కొన్ని గంటలు(4-6) సూర్యరశ్మి తగిలేలా చూడాలి. అయితే వర్షాకాలంలో ఆకాశం నల్లని మబ్బులతో కూడుకుని ఉండటంతో.. సూర్యకిరణాలు నేరుగా అందకపోవచ్చు. వాటికి బదులుగా మొక్కకు వీలైనంత ఎక్కువ సహజ వెలుతురు అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దీంతో ఆకుల రంగు బాగుండటంతోపాటు కొత్త కొమ్మలు, మొక్క పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది.తులసికి కేవలం ఎరువు వేయడమే కాకుండా.. కుండీలోని మట్టి ఎక్కువ నీరును పిల్చేదిగా ఉండకూడదు. అయితే, ఆ మట్టిలో తక్కువగా ఇసుక, కుళ్లిన సేంద్రియ ఎరువును కలపవచ్చు. దీంతో మట్టి మరీ బరువుగా మారకుండా ఉండటంతో వేర్లకు గాలి బాగా అందుతుంది.తులసి మొక్క పెరుగుతున్నప్పుడు పోషకాలు కూడా అవసరం. అప్పుడప్పుడు కొద్దిమొత్తంలో వర్మీకంపోస్(Vermicompost) లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపవచ్చు. ఎరువును ఎక్కువగా వేయడంతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దాంతో మొక్కకు తగిన మోతాదులో ఎరువును వేయడమే మంచిది.వర్షాకాలంలో తేమ పెరగడంతో తులసి ఆకులు, కాండంపై చిన్న చిన్న పురుగులు లేదా ఫంగస్ సమస్యలు తరచూ వస్తూంటాయి. అందుకు వారానికి ఒకటి, రెండుసార్లు ఆకులు, కాండాన్ని పరిశీలించాలి. ఆకులపై పురుగులు కనిపిస్తే వేప నూనె ఆధారిత స్ప్రే వంటి సహజ నియంత్రణ పద్ధతులను ఉపయోగించవచ్చు.తులసికి పూలగుత్తులు రావడం సహజమే. అయితే మొక్కను మరింత దట్టంగా, ఆకులతో నిండుగా పెంచుకోవాలనుకుంటే.. ఎక్కువగా ఉన్న పాత పుష్ప గుత్తులను ఎప్పటికప్పుడు తొలగించడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎండిపోయిన, దెబ్బతిని పసుపు రంగులోకి మారిన ఆకులను కూడా తొలగిస్తూ ఉండాలి.వర్షాకాలంలో తులసి సంరక్షణ అంటే.. కేవలం నీరు, ఎరువు ఇవ్వడమేకాదు, సరైన వెలుతురు, పరిమిత నీరు, మంచి నాణ్యతగల మట్టి(ఎర్రమట్టి), ఎప్పటికప్పుడు పించింగ్, సమతుల్యమైన పోషణ వంటి కీలకమైన జాగ్రత్తలతో మొక్క మరింత ఆరోగ్యంగా, దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది.భారతీయ కుటుంబాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పూజా స్థలంలో, ఇంటి ఆవరణలో పెంచుకునే తులసిని ప్రేమగా సంరక్షించడం ప్రతీ కుటుంబంలో ఒక మంచి సంప్రదాయం. అయితే, వర్షాకాలంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ పేరుతో ఎక్కువ నీరు పోయకుండా ఉండటమే మరో ముఖ్యమైన జాగ్రత్త. -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
పాండవుల పేర్లు చెప్పగానే అందరూ వారు అయిదుగురూ కుంతీపుత్రులే అనుకుంటారు. అయితే పాండురాజు మొదటి భార్య అయిన కుంతికి దూర్వాస మహర్షి చేసిన మంత్రోపదేశ ప్రభావంతో యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మించగా... రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల సహదేవులు జన్మించారు.నకులుడు అంటే చాలా అందగాడు అని అర్థం. అందుకే నకులుడిని అపర మన్మధుడు అని కూడా అంటారు. నకులుడు కత్తియుద్ధంలో గొప్పవీరుడు. గుర్రాలపోషణలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాటరాజు కొలువులో ‘దామగ్రంథి’ అనే పేరుతో గుర్రాల శిక్షకుడిగా పనిచేశాడు.కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యంలోని ఏడు అక్షౌహిణుల సైన్యంలో ఒకదానికి నాయకత్వం వహించి యుద్ధంలో పాల్గొన్నాడు. మొదటిరోజు యుద్ధంలో దుశ్శాసనుడితో తలపడి ఓడించినప్పటికీ అన్న భీమసేనుని ప్రతిజ్ఞ వల్ల చంపకుండా వదిలేసాడు. 11వ రోజు యుద్ధంలో తన మేనమామ శల్యుడి రథాన్ని నాశనం చేసి 14వ రోజున యుద్ధంలో ఓడించాడు.15వ రోజు దుర్యోధనుడితోనూ, 16వ రోజున కర్ణునితోనూ యుద్ధం చేశాడు. 17వ రోజున శకుని కుమారుడు వృకాసురుని, 18వ రోజున కర్ణుని కుమారులైన సుసేనుడు, చిత్రసేనుడు, సత్యసేనులను సంహరించాడు. యుద్ధానంతరం ధర్మరాజు ఉత్తర మధ్రదేశానికి నకులుడిని రాజుగా నియమించాడు. కృష్ణుని అవతారం పరిసమాప్తి కావడంతో, సోదరులతోపాటు రాజ్యాన్ని, సంపదలను పరిత్యజించి హిమాలయాలకు వెళ్లి అక్కడనుండి స్వర్గంవైపు న కులుడు కూడా పయనమయ్యాడు. – సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులుపర్వంచుక్కల అమావాస్య!ఆషాఢ బహుళ అమావాస్యకే ‘చుక్కల అమావాస్య’ అని,‘దీప అమావాస్య’ అనీ పేర్లున్నాయి. ఈ రోజుకున్న విశిష్టతలు, ఆచారాలు... పితృతర్పణాలు: ఈ రోజున పితృలోకంలోని పూర్వీకులు భూలోకానికి వచ్చి, తమకు తర్పణలు ఇచ్చే సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అందువల్ల ఈ రోజు∙పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రోక్తి.గృహిణులు, నూత్న వధువులు పిండిదీపాలు వెలిగించి, గౌరమ్మ ను పూజించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. దీనివల్ల సుమంగళీత్వం, కుటుంబంలో సుఖశాంతులు ్రపాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం ఇళ్లలో, దేవాలయాలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం వల్ల వ్యాధులు, ప్రతికూల శక్తులు, తొలగిపోతాయని ప్రతీతి. ఆషాఢ అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయడం విశేష ఫలప్రదం. (12, బుధవారం చుక్కల అమావాస్య) -
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొంగిపోయింది.ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
బడబానల తీర్థం.. పూర్వం ఒకానొక కాలంలో..
పూర్వం ఒకానొక కాలంలో మహర్షులందరూ నైమిశారణ్యంలో సుదీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో మృత్యువును శమితృ పదవిలో నియోగించారు. ఆ సత్రయాగం కొనసాగుతున్న కాలంలో మృత్యువు యజ్ఞకార్యంలో నియుక్తమై ఉన్నందున మానవులు మృత్యువాత పడకుండా, అమరులుగా మారిపోయారు. భూలోకంలో మరణాలు పూర్తిగా లేకుండా పోయి, జననాలు అంతకంతకు పెరగసాగాయి. మర్త్యుల రాకడ ఆగిపోవడంతో స్వర్గలోకం వెలవెలబోసాగింది.మృత్యువు తన విధి నిర్వర్తించడంలో ఉపేక్ష వహిస్తూ, యజ్ఞకార్యంలో నిమగ్నం కావడం వల్ల దేవతలు దిక్కుతోచనివారయ్యారు. చివరకు దేవతలందరూ కలసి రాక్షసుల వద్దకు వెళ్లి, ‘మీరంతా వెళ్లి మునులు సాగిస్తున్న సత్రయాగాన్ని ధ్వంసం చేయండి’ అని చెప్పారు.‘మునుల యాగాన్ని నిష్కారణంగా ధ్వంసం చేస్తే మాకు ఒరిగేదేమిటి?’ అని అడిగారు రాక్షసులు.‘మీకు యాగార్ధభాగాన్ని ఇస్తాం’ అని చెప్పారు దేవతలు.అప్పుడు మునుల యాగభంగం చేయడానికి రాక్షసులు అంగీకరించారు. మహర్షులకు ఈ సంగతి తెలిసింది. అప్పుడు వారు, ‘ఓ మృత్యువా! రాక్షసులు యాగభంగం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? తరుణోపాయం నువ్వే చెప్పు!’ అని అడిగారు.‘యాగ సామగ్రినంతా ఇక్కడే విడిచిపెట్టి, అగ్నిని మాత్రం తీసుకుని గౌతమీ తీరానికి వెళ్లండి. అక్కడ పరమశివుడిని ప్రార్థించండి’ అని మృత్యువు చెప్పాడు.మహర్షులు యాగసామగ్రిని ఎక్కడివక్కడే విడిచిపెట్టి, కొంత అగ్నిని తీసుకుని గౌతమీ తీరానికి తరలి వెళ్లారు. యాగకార్యంలో నియుక్తమై ఉన్నందున మృత్యువు కూడా వారిని అనుసరించాడు.మహర్షులందరూ పవిత్ర గౌతమీ నదిలో స్నానమాచరించారు. అనంతరం మహాదేవుడైన పరమేశ్వరుని వేనోళ్ల స్తుతిస్తూ ప్రార్థించసాగారు.అప్పుడు మృత్యువు కూడా మహాదేవుని ప్రార్థించింది. ‘పరమేశ్వరా! శంభో శంకరా! నీవు మహాకాయుడవు, మహానలుడవు, మహానీలుడవు. మహేశ్వరా నీవే మమ్ము రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘వరమేమి కావాలో కోరుకోండి’ అన్నాడు పరమశివుడు.అప్పుడు మృత్యువు ‘పరమేశ్వరా! రాక్షసుల వలన మా యాగానికి మహాపద వాటిల్లింది. మహర్షులు తలపెట్టిన ఈ సత్రయాగం సఫలమయ్యేంత వరకు మమ్మల్నందరినీ నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు ‘తథాస్తు!’ అని అనుగ్రహించాడు.పరమశివుడి వరానుగ్రహంతో మృత్యువు సాయంతో మహర్షులు తమ సత్రయాగాన్ని విజయవంతంగా పరిసమాప్తి చేశారు.యాగం పూర్తవుతూనే దేవతలు హవిర్భాగాల కోసం ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.మృత్యువు వారిని చూసి, ‘మా యాగ విధ్వంసానికి మీరు రాక్షసులను ప్రేరేపించారు. హవిర్భాగాహారులైన మీరు అకార్యానికి పాల్పడ్డారు. ఇప్పటి నుంచి మీకు రాక్షసులతో శత్రుత్వం తప్పదు’ అని శపించాడు.మృత్యువు శాప ఫలితంగా దేవతలకు, రాక్షసులకు అప్పటి నుంచి బద్ధవైరం ఏర్పడింది.అప్పుడు మహర్షులు మృత్యువు పట్ల సంప్రీతులయ్యారు. వారు బడబ అనే కృత్యను సృష్టించి, ఆమెతో మృత్యువుకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో బడబకు మంగళస్నానం జరిపించినప్పుడు ప్రవహించిన నీరు అక్కడ బడబానదిగా ప్రవహించింది. వివాహానంతరం మృత్యువు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగం మహానలేశ్వరుడి పేరిట ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఆ తీర్థానికి బడబానల తీర్థమనే పేరు వచ్చింది. మహానలేశ్వరుడు వెలసిన బడబానల తీర్థం భక్తులకు భుక్తి ముక్తిప్రదమైనది. - సాంఖ్యాయనపురావిశేషం..ఈశాన్య రాష్టమైన మేఘాలయలో ఉన్న అరుదైన శివాలయం ఇది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలోని మావ్సిన్రామ్ గ్రామానికి చేరువలో దట్టమైన అడవిలోని ఒక కొండ గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగాన్ని ఇక్కడి ప్రజలు తరతరాలుగా పూజిస్తున్నారు. సున్నపురాతి గుహ పైకప్పు నుంచి రాలిన నీటిబిందువులు గట్టిబడి శివలింగం ఆకారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం దీనిని స్వయంభూ లింగంగానే భావించి, పూజిస్తున్నారు. స్థానిక ఖాసీ ప్రజలు దీనిని ‘మావ్జిన్ బుయి’ శివలింగంగా వ్యవహరిస్తారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. -
శుక్రవారం పవిత్రత వెనుక అసలు కారణం ఇదే!
వారం రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా, జీవన విధానంగా చూస్తే శుక్రవారం (జుమా)ప్రాధాన్యత అత్యంత విశిష్టమైనది. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా అత్యుత్తమమైన దినంగా దీనికి గుర్తింపు ఉంది.ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మానవాళికి, విశ్వానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలు ఈ రోజుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ దినాన్ని ఆరాధనలకు, దైవ కారుణ్యాన్ని పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు.దైవప్రవక్త ప్రబోధించిన హదీసుల ప్రకారం మానవజాతికి మూలపురుషుడైన ఆది మానవుడు (ఆదం సృష్టించబడింది, ఆయనకు అత్యున్నతమైన స్థానం లభించింది ఈ శుక్రవారం రోజే. అంతేకాదు, మానవాళికి సన్మార్గం వైపు దృష్టి సారించడానికి, కయామత్ (ప్రళయ దినం) సంభవించడానికి కూడా ఈ రోజే వేదిక కానుంది. ఈ విశిష్టమైన విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మానవుడు క్రమశిక్షణతో, సత్కార్యాలు చేస్తూ దైవ కారుణ్యాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.ఈ రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు (సున్నత్లు)శుక్రవారం రోజున శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతతకుప్రాధాన్యతనిచ్చేలా కొన్ని ఆచారాలు సూచించబడ్డాయి.ఉదయపుప్రార్థనల్లో ప్రత్యేకతశుక్రవారం ఉదయం చేసే ఫజ్ర్ నమాజులో ప్రవక్త ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.స్నానం (గుస్ల్) పరిమళాలుఈ రోజున ్ర΄ûఢవయస్కులైన ప్రతి ఒక్కరూ శుభ్రంగా స్నానం చేయడం అత్యంత అవసరం. అలాగే మిస్వాక్ (దంతధావనం) ఉపయోగించడం, అందుబాటులో ఉన్న మంచి సుగంధ ద్రవ్యాలను (అత్తర్) ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఇది మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చి, ఆరాధనలో ఏకాగ్రతను పెంచుతుంది.మసీదుకు త్వరగా వెళ్లడంజుమాప్రార్థన కోసం మసీదుకు ముందే చేరుకోవడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఎవరు ఎంత త్వరగా మసీదుకు చేరుకుంటే అంత గొప్ప దానధర్మాలు చేసిన ఫలితం లభిస్తుందని కథనాలు తెలుపుతున్నాయి.ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా వినడంఇమామ్ ప్రసంగిస్తున్న సమయంలో అత్యంత నిశ్శబ్దంగా, శ్రద్ధగా వినాలి. ఆ సమయంలో పక్కవారితో మాట్లాడటం, చివరికి ‘అల్లరి చేయకు’ అని అనడం కూడా ఆ క్షణపు ఏకాగ్రతను పాడుచేస్తుందని హెచ్చరించారు.ఆ ప్రత్యేకమైన ఘడియశుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన స్వల్ప సమయం ఉంటుంది. ఆ సమయంలో దైవాన్ని మనస్ఫూర్తిగా ఏ మంచి కోరిక కోరినా అది నెరవేరుతుందని, అల్లాహ్ తన దాసులప్రార్థనలను స్వీకరిస్తాడని ప్రవక్త తెలిపారు.ప్రవక్తపై దరూద్ పంపడంఈ రోజున దైవప్రవక్తపై అధికంగా దరూద్ షరీఫ్ చదవడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. భక్తులు పంపే ఈ దరూద్ ఆయనకు చేరవేయబడతాయని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం అనేది కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కాదు... మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలి, శారీరకంగా, మానసికంగా దైవానికి దగ్గరయ్యే ఒక పవిత్రమైన సమయం. ప్రశాంతతను, పుణ్యఫలాలను ప్రసాదించే ఈ రోజును ప్రతి ఒక్కరూ సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక మార్గం.– ముహమ్మద్ ముజాహిద్ -
లింగరూపం కాదు... యోగిగా దర్శనమిచ్చే శివక్షేత్రం ఇది!
సాధారణంగా శైవాలయాలలో పరమశివుడు లింగరూపంలో ఆరాధించబడతాడు. అయితే హేమావతి సిద్ధేశ్వర ఆలయంలో మాత్రం పరమశివుడు అత్యంత అరుదుగా దైవరూపంలో సిద్ధయోగిగా ఆసీనుడై దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను కల్పించింది. భారతదేశంలోని అతి కొద్ది శైవాలయాలలో మాత్రమే కనిపించే ఈ రూపం శివుని యోగేశ్వర తత్త్వాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భిక్షాటన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉందో, ఆ శిల్ప విశేషాలేమిటో తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శైవక్షేత్రాలలో ఒకటి. అద్భుతమైన నోళంబ శిల్పకళతో, ఆధ్యాత్మిక మహిమతో, అరుదైన శివస్వరూపంతో ఈ ఆలయం భారతీయ దేవాలయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.హేమావతి ఆలయ సముదాయం ఒక విశాలమైన చారిత్రక దేవాలయ సముదాయం. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయంతో పాటు దొడ్డేశ్వర ఆలయం మల్లేశ్వర ఆలయం విరూపాక్ష ఆలయం జైన బసదులు నందిమండపాలు వీరగల్లులు నాగశిలలు శాసనాలతోపాటుఅనేక శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాలు నోళంబుల రాజకీయచరిత్ర వారి దానధర్మాలు ఆలయ నిర్వహణ సామాజిక జీవన విధానం, ఆ కాలపు సంస్కృతిపై సమాచారాన్ని అందిస్తున్నాయి.ఆలయ నిర్మాణం నోళంబ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. గర్భగుడి అంతరాలయం మహామండపం స్తంభాలు ద్వారబంధాలు మరియు గోపుర భాగాలు అత్యంత సూక్ష్మమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై శివపార్వతి గణపతి కుమారస్వామి నంది భైరవుడు సప్తమాతృకలు యక్ష యక్షిణులు గంధర్వులు అప్సరసలు నర్తకులు సంగీత విద్వాంసులు పురాణ ఘట్టాలు పుష్పలతలు మకరాలు గజసింహాలు యాళులు, ఇతర అలంకార రూపాలు అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు నోళంబ కళాకారుల సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలిచాయి.గర్భగుడిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో పశ్చిమాభిముఖంగా ఆసీనుడై దర్శనమిస్తుంది. చతుర్భుజుడైన స్వామివారి ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో డమరుకం మరొక చేతిలో భిక్షాపాత్ర ఉన్నాయి. తలపై జటాజూటం, నుదుటిపై తృతీయ నేత్రం మెడలో పుర్రెల మాల చెవులలో కుండలాలు, యోగాసన భంగిమ శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిఫలింపజేస్తాయి. ఈ విగ్రహం శివుని యోగేశ్వర స్వరూపాన్ని సిద్ధి వైరాగ్యం జ్ఞానం, లోకక్షేమ భావనలను ఏకకాలంలో ప్రతిబింబించే అపూర్వ కళాఖండంగా నిలిచింది. హేమావతి ఆలయం భారత పురావస్తు సర్వే శాఖ పరిరక్షణలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత గల స్మారక కట్టడంగా గుర్తింపు ΄÷ందింది. ఆలయ ప్రాంగణంలో లభించిన శిల్పాలు శాసనాలు, నంది విగ్రహాలు శిలాఖండాలు, పురాతన అవశేషాలు సంరక్షించబడి చరిత్ర పరిశోధకులకు పురావస్తు శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు విలువైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, కార్తీకమాస ఉత్సవాలు, ఇతర శైవ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యోగసాధనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను అందిస్తుంది.హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది నోళంబుల రాజకీయ వైభవానికి భారతీయ శిల్పకళా సంపదకు శైవ తత్త్వానికి, దక్షిణ భారత చారిత్రక వారసత్వానికి చిరస్థాయి చిహ్నం. లింగరూపానికి భిన్నంగా మానవ రూపంలో సిద్ధయోగిగా పరమశివుడు కొలువై, భారతదేశంలోని విశిష్ట శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శాశ్వత కీర్తిని ΄÷ందిన ఈ అరుదైన క్షేత్రాన్ని సందర్శించి తీరవలసిందే!– జి.బి. విశ్వనాథ, ఎం.ఎ. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ -
క్రీస్తు ఏలుబడి.. రక్షణకు మార్గం ఇదే!
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము చాటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి’ – (యెషయా 52:7)సమాధానపరుస్తూ ఇద్దరి మధ్య శాంతి సమాధానాలకు ఏకీభావానికి కృషి చేసేవారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఉగ్రత భరించుట కష్టమని ఇక తప్పక దేవునితో సమాధానపడమని విధేయంగా లోబడమని చెప్పుటను మించిన సువర్తమాన హెచ్చరికతో కూడిన బోధ వాక్యం మరొకటి ఏముంది? ఇలా రక్షణ సమాచారం అధికారికంగా అందుబాటులో ఉంచడం మేలైన విషయం. సకల యుగాలలో రాజైన అద్వితీయ సత్యదేవుడు ఇప్పుడైతే ఎలా ఏలుచున్నాడో అన్నది ఒక్కింత పరీశీలనగా చూస్తే, దేవుడు క్రీస్తు ద్వారా ఏలుచున్నాడు అన్నది అర్థమవుతూ ఉంది.యెహోవా ఇల్లుగా యెహోవా నామ ఘనత కొరకు సొలొమోను కంటె గొప్పవాడైన క్రీస్తు ఎంతో కష్టపడి ఇష్టంగా తన విలువైన రక్తం వెచ్చించి కట్టిన ఆత్మ సంబంధ మందిరమే క్రీస్తు సంఘం. దేవ దేవుని సంకల్పాన్ని గౌరవిస్తూ దేవుని సంకల్పమైన సంఘాన్ని గుర్తించి గౌరవించుట ద్వారా మనలను మనం గౌరవించుకున్నట్టే. ప్రభువైన క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండి పాలించుటే దేవుని పాలన. ‘సీయోను – నీ దేవుడు ఏలుచున్నాడు’ అనుటలోని అర్థం పరమార్థం ఇదే. ఇప్పుడు సీయోను అనగా క్రీస్తు ప్రభువు వారి ప్రియమైన సంఘం అనగా అద్వితీయ సత్య దేవుని నివాస కేంద్రం. దేవుడు ఏలుబడి లేని చోటు అనేది ఆత్మ సంబంధమైన అనేకనేక కష్ట నష్టాలకు నెలవు కాబట్టే. . . దేవుని దగ్గరకొచ్చి దేవుని ఏలుబడికి తలవంచి ఒదిగి జీవించడం హెచ్చయిన ఘనమైన ఆశీర్వాదాలకు కారణమనేది ఆధ్యాత్మిక పండితుల అనుభవం సారం. గ్రంథ రాజపు విలువైన బోధలకు తలవంచుట మినహా మరో మార్గం లేదు.క్రీస్తు సంఘమా, సర్వ జనాంగమా నిన్ను దేవుని పక్షాన క్రీస్తు ఏలుచున్నాడు అంటూ చెప్పువాని పాదములు సుందరమైనవి. పర్వతముల మీద స్థిర నివాసం, రాజస నడక అత్యున్నత స్థితిని, హోదాను చాటుతుంది. రాజులు, రాజ వంశీయులు, సాహసికులు ఎత్తయిన పర్వతముల మీదనే నివసిస్తూ నడుస్తారు. క్రీస్తు సువార్తను ప్రకటించుటను మించిన సాహసకార్యం మరొకటి లేదు. రాజులమైన భక్తులమైన మేము కాదు, నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడు అన్న సాహసోపేత సువార్త ప్రకటనతోనే వారి పాదములు ఎంతో సుందరములయ్యాయి.ఆత్మ సంబంధంగా చూస్తే యేసు సజీవుడగుసర్వోన్నతుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అను బండ మీద అనగా ఇట్టి విశ్వాసం మీద సంఘం కట్టబడింది. దీన్ని మించిన ఎత్తయిన స్థావరం మరొకటి లేదు. ఈ ఎత్తయిన ఘనమైన చోట నుండి సంఘం అనగా రాజులైన యాజక సమూహం సువార్త ప్రకటిస్తుంటే ఇహ లోక పాప సంబంధమైన మలిన మట్టి వారి పాదాలకు తాకక అంటక ఉన్నందున వారి పాదములు సుందరములు. ఎందుకంటే వారు ఎత్తయిన పర్వతం మీద బండ మీద వేసిన పునాది మీద అనగా యేసు అసాధారణ బోధల మీద వారు వారి జీవితాలను కట్టుకొని హుందాగా ఠీవిగా రాజసంతో నిలబడి ఉన్నారు. సంఘమా నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పగల సంసిద్ధులు, సాహసికులు ఎవరై ఉంటారు? దేవుని ఏలుబడికి ఎప్పుడూ విధేయులై ఉన్నవారే ఇలా చెప్పగలుగుతారు.– జేతమ్ -
నాయకుడు ఎలా ఉండాలంటే..?
రామాయణంలో వాల్మీకి రాజు ఏమి చెయ్యాలో చెప్పాడు.‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞా ప్రజానాం చ హితే హితనాత్మప్రియం హితం రాజ్ఞాప్రజానం తు ప్రియం’... ఎంతో చక్కటి భావన.. రాజు తనకిష్టమైనది కాదు ప్రజలకిష్టమైనది చెయ్యాలి. మహాభారతంలో భీష్ముడు చెప్పిన పది ముఖ్య లక్షణాలు నేటి ఆధునిక పాఠ్య పుస్తకాలలో ప్రధానాంశాలుగా చోటు చేసుకున్నాయంటే అతిశయోక్తి లేదు.నాయకుడు/రాజు ఎలా ఉండాలి అనే విషయంలో మన నీతి కవులు చెప్పిన ముఖ్యమైన పద్యాలు ఇవే:రాజు, నాయకుడి బాధ్యతను, స్థానబలాన్ని నొక్కి చెప్పాడు వేమన.చేకొనుచును తనకు జేరి సాగినంతలోజెడిన ప్రజల రక్షసేయకున్నతనదుసాగుటేమి తనతనువదియేమివిశ్వదాభిరామ వినుర వేమభావం: తనను నమ్మి ఆశ్రయించిన ప్రజలను, చెడిపోయిన సమయంలో రక్షించని నాయకుడి అధికారం, జీవితం వ్యర్థం. ప్రజా రక్షణే నిజమైన నాయకత్వం.మరొకటి – శత్రువు పట్ల కూడా ఔదార్యం ఉండాలి..చంపదగిన యట్టి శత్రువు తన చేతజిక్కెనేని కీడు సేయ రాదుపొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు!విశ్వదాభిరామ వినర వేమభావం: నాయకుడు క్షమాగుణం కలిగి ఉండాలి. చేతిలో చిక్కిన శత్రువును కూడా క్షమించి మేలు చేసి పంపాలి.దీనికి ఒక మంచి ఉదాహరణ.. పురుషోత్తముడనే రాజు యుద్ధం లో అలెగ్జాండర్‌ను క్షమించి వదిలి వేయుట.బద్దెన రాజు/నాయకుడి ధర్మం, ప్రజాపాలన గురించి చాలా స్పష్టంగా చెప్పాడు.రాజు హద్దు దాటితే:నరపతులు మేఱ దప్పిన,దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,గరణము వైదికుడైనను,మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!భావం: రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, విధవ ఇంట పెత్తనం చేసినా, వైదికుడు కరణం చేసినా – అవి ప్రాణాంతకం అవుతాయి తప్ప మంచిది కాదు. నాయకుడు ధర్మం తప్పకూడదు.మంచి రాజు లక్షణం ఏమిటంటేదగ్గర కొండెము సెప్పెడు పెగ్గడ పలుకులకు రాజు ప్రియుడైమరిత నెగ్గు ప్రజ కాచరించు బగ్గులకై కల్పతరువు బోదచుట సుమతీకొండెగాళ్ల మాటలు విని ప్రజలకు అన్యాయం చేసే రాజు, బొగ్గుల కోసం కల్పతరువును నరికినంత తెలివితక్కువవాడు. నాయకుడు నిజానిజాలు పరిశీలించాలి.మాటకు బ్రాణము సత్యముకోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్బోటికి బ్రాణము మానముచీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీఒక రాజ్యం/కోటకు బలమైన సైన్యమే ప్రాణం. నాయకుడు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.ఇక భర్తృహరి ఏమి చెప్పాడంటే... శ్లోకం: విపది ధైర్యమథాభ్యుదయే క్షమాసదసి వాక్పటుతా యుధి విక్రమః ’యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌప్రకృతిసిద్ధమిదం హి మహాత్మానామ్’భావం: ‘కష్టాల్లో ధైర్యంగా ఉండటం, విజయ సమయంలో క్షమ కలిగి ఉండటం, సభలో వాక్పటిమ, యుద్ధంలో పరాక్రమం, కీర్తిపై ఆసక్తి, శాస్త్రశ్రవణంలో వ్యసనం – ఇవన్నీ మహనీయులైన నాయకుల సహజ గుణాలు.మరొక ముఖ్యమైన భావం‘ప్రజలను పశువుల వత్సంలా ప్రేమగా పోషిస్తే, భూమి కల్పలతలా అనేక ఫలితాలను ఇస్తుంది‘. ఇది కేవలం రాజులకే కాదు, నాయకత్వం వహించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.భాస్కర శతకంలో నేరుగా ‘నాయకుడు అనే పద్యం ప్రసిద్ధంగా లభించలేదు. కానీ భాస్కరుడు కూడా నీతి, ధర్మం, వినయం గురించి చెప్పాడు.నాయకుడు అహంకారం లేకుండా, విద్యావంతుడై, దానగుణం కలిగి, ప్రజాహితం కోసం పనిచేయాలి. ‘అధికారం వచ్చినా వినయంగా ఉండాలి‘ అనేది భాస్కరుడి ప్రధాన సందేశం.దేశానికి రాజు కాని, సంస్థకి అధిపతి కాని ఎన్నో సమస్యలను ఎదుర్కొని అడుగు వెయ్యాలి... బాహ్య పరిస్థితి.. లోలోపల పరిస్థితి... అన్నింటిని మించి అనిశ్చిత వాతవరణంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం, బాగోగులు, ఆర్థికంగా నిలబడ్డం... ఇలా ఎన్నో సవాళ్ళు.. ప్రజాఅభిమానాన్ని చూరగోనె ప్రయత్నం.. సత్సంబంధాలు తో బాటు సజావుగా సాఫీగా ఉండాలి పరిపాలన... ఎన్నో మంచి అలవాట్లతో నీతిగా అందించాలి పరిపాలన. అందుకు మంచి నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలతో నడుం కట్టి అడుగు ముందుకెయ్యాలి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
మోక్షాన్ని ప్రసాదించే ముక్తినాథ్
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన. యాత్రలకి వెళ్ళేముందు, ఆయా క్షేత్రాల వెనుకనున్న పురాణగాథల్ని తెలుసుకుని వెళితే, ఆ ప్రదేశాలలోని పవిత్ర స్థలాల ఉనికి,ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా చూడటం చేత, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మ పురాణ, ఇతిహాసాల పట్ల దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించటం అదృష్టం. అటువంటి క్షేత్రాలలో నేపాల్‌లోని ముక్తి క్షేత్రం (ముక్తినాథ్) వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో రాణీ΄ûవా గ్రామంలో సముద్రమట్టానికి సుమారు 3,710 మీటర్ల ఎత్తులో (12,470 అడుగులు) హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య ఈ ఆలయం ఉన్నది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణంలోని హిమవత్ఖండంలో, ముక్తిక్షేత్రం వెనుక ఉన్న వృత్తాంతం అత్యంత రమణీయంగా చెప్పబడింది.పూర్వం రాక్షసరాజు జలంధరుడు బ్రహ్మ మొదలైన వారినుంచి, తపఃఫలంగా వరాలు పొంది, ఆ అహంకారంతో ముల్లోకాలను పీడించాడు. దేవతలు మొరపెట్టుకున్నా అతనినేమీ చేయలేకపోయారు. కారణం, అతని భార్యయైన బృంద (తులసి) నిరుపమానమైన పాతివ్రత్య శక్తి, అతనికి చావు లేకుండా చేసింది. ఆమె పరమ ధార్మికురాలు. లోకకల్యాణం కోసం, పరమశివుడు, జలంధరుడిని వధించేందుకు వీలుగా, శ్రీమహావిష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు వెళ్ళి, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. జలంధరుడి మరణ వార్త విన్న బృంద, తీవ్రమనస్తాపంతో, శ్రీమహావిష్ణువును భూమిపై పాషాణ రూపాన్ని పొందాలని శపిస్తుంది.బృంద ఇచ్చిన శాపాన్ని భగవంతుడు శిరసావహించాడు (శాప ప్రభావం వలన విష్ణువు నేపాల్‌లోని కాళీగండకీ నదీ తీరంలో నల్లని సాలగ్రామ శిలలుగా అవతరించాడు. పెద్ద పెద్ద సాలగ్రామ శిలలు నదీ తీరం వెంబడి ఇప్పటికీ విష్ణుస్వరూపంలో దర్శనమిస్తాయి.రాతి రూపం నుండి, శాప విముక్తి కోసం విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు ముగిశాక స్వామికి ముక్తి లభించింది. భగవంతుడికే ముక్తిని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి ఈ పవిత్ర ప్రదేశానికి ముక్తిక్షేత్రం అనే పేరు వచ్చింది.చతుర్ముఖ (బ్రహ్మ) బృందాదేవికి మోక్షాన్ని ప్రసాదించి, భూమిపై తులసి రూపంలో సేవింపబడుతూ, గండకీ నది ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అంతేగాక, శ్రీమహావిష్ణువు గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలల రూపంలో యుగయుగాలపాటు, భక్తులకు దర్శనమిస్తాడని ప్రకటించారు.ఇక్కడ లభించే సాలగ్రామ శిలలకు మరలప్రాణ ప్రతిష్ఠ అవసరం లేకుండానే పూజించవచ్చని చెబుతారు. సాలగ్రామ ఆరాధన ఇంటికి ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇక ముక్తినాథ్ ఆలయం చిన్నదైనా,ప్రాంగణం చాలా పెద్దది. ఆలయం ముందు పాపకుండం, పుణ్యకుండం అని రెండు కొలనులుంటాయి.ఈ కుండాల్లోని అతిశీతలమైన జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, దేవాలయం వెనుక వలయాకారంలో ఉన్న 108 గోముఖ జలధారల్లో స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామి దర్శనం చేసుకుంటారు. గోముఖాల నుండి వచ్చే హిమాలయ తీర్థం సర్వపాపాల్ని హరిస్తుందని పురాణ కథనం.సనాతన ధర్మానికి చెందిన భక్తులు, ముక్తినాథుని మోక్షప్రదమైన దివ్యక్షేత్రంగా భావిస్తే, బౌద్ధులు దీనిని ‘చుమిగ్ గ్యాత్సా’ (వంద జలధారల స్థలం) గా భావించి అత్యంత పవిత్రమైన తీర్థంగా పూజిస్తారు. ఆవిధంగా ఈ క్షేత్రం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయ సేవా కార్యక్రమాలలో హిందూ అర్చకులతోపాటు, బౌద్ధ సన్యాసినులు సన్యాసులు కూడా పాల్గొనటం విశేషం. భిన్నమైన ఆరాధన పద్ధతులున్నప్పటికీ, ఒకే మూర్తిని, పవిత్రస్థలాన్ని పరస్పర గౌరవ విశ్వాసాలతో ఆరాధించటం ముక్తినాథ్ ప్రత్యేకత.ముక్తినాథ్ ఎలా చేరుకోవాలి?గోరఖ్‌పూర్ నుంచి సునోలి సరిహద్దు దాటి నేపాల్‌లోకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. సునోలి నుండి పోఖ్రా మీదుగా సుమారుగా 300 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించి ‘జోమ్సోమ్’ చేరి, అక్కడి నుండి సుమారుగా 38 కి.మీ. దూరం వెళ్ళి, అక్కడినుంచి మెట్ల మార్గంలో (300 మెట్లు) కానీ, గుర్రాలు, డోలీలలో కానీ ప్రయాణించి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ పర్వతప్రాంతం అధిక ఎత్తులో ఉండటంతో, ఆక్సిజన్ తక్కువగా వుంటుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి.ఈ క్షేత్రానికి సులువుగా, త్వరగా చేరాలనుకుంటే, ఢిల్లీ నుండి ఖాట్మండుకి విమానంలో వెళ్ళి, అక్కడి నుండి జోమ్సోమ్కి విమానంలో చేరుకోవచ్చు.ముక్తినాథ్ క్షేత్రానికి అతిదగ్గరలో ‘జ్వాలామాయి’ ఆలయం శక్తీక్షేత్రం వుంది. బ్రహ్మదేవుడు ముక్తిక్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం నుండి విష్ణుమూర్తి జలరూపంలో 108 ముక్తి ధారలుగానూ, శివుడు అగ్ని రూపంలో, నిరంతరం వెలిగే జ్వాలగా, ఉండిపోయారు. అందుకే జ్వాలామయి ఆలయంలో నీటి బుగ్గపై అగ్నిజ్వాల వెలగడం మనకు కనిపిస్తుంది. ముక్తినాథ్ ఆలయప్రాంగణం, భక్తిని, ప్రకృతిని, పవిత్రతను ఒకేకాలంలో ఆస్వాదించే అపూర్వ క్షేత్రం. ఒకవైపు నీలగిరి, మరొకవైపు ధవళగిరి పర్వతాలు మంచుతో కప్పబడి ఆహ్లాదాన్ని అందిస్తాయి.– దావూలూరి రామకృష్ణ శర్మ, ఆధ్యాత్మిక పర్యాటకులు -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
అతి నుంచి ఆత్మోన్నతికి!
గోపాల్ అనే ఒక శిల్పి చాలా బాగా విగ్రహాలు చెక్కేవాడు. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది అదే ‘అతి ఆలోచన.’ ఒకరోజు అతనికి ఒక పెద్ద దేవాలయం నుంచి అమ్మవారి విగ్రహం చెక్కే అవకాశం వచ్చింది. దానికి చాలా మంచి పారితోషికం కూడా ఇస్తామన్నారు. గోపాల్ ఇంటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘ఈ విగ్రహం చాలా అద్భుతంగా రావాలి... ఒకవేళ చెక్కేటప్పుడు రాయి పగిలిపోతే? ఊరిలో నా పేరు పోతుందేమో! ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో! నేను విజయవంతంగా పూర్తి చేయగలనా?’’ ఇలా ఆలోచనలతోనే రోజులు గడిపాడు. భయం, ఆందోళన పెరిగిపోయాయి. చేతిలో ఉలి పట్టుకోవడానికే భయపడి, రోజు రోజుకీ పనిని వాయిదా వేస్తూ వచ్చాడు.ఒకరోజు ఊరి చివర ఉండే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్లాడు గోపాల్. తన మనసులోని అతి ఆలోచనలను, భయాలను గురువుతో చెప్పుకున్నాడు. గురువు చిరునవ్వు నవ్వి, ఒక ఖాళీ కుండను, కొద్దిగా నీటిని గోపాల్ చేతికి ఇచ్చి, ‘ఈ కుండను నీటితో నింపు’ అన్నారు.గోపాల్ కుండ కింద పడిపోతుందేమో, నీళ్లు ఒలికిపోతాయేమో అని అతిగా ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా, భయపడుతూ మెల్లగా నీళ్లు పోస్తున్నాడు. గురువు వెంటనే,‘గోపాల్, నువ్వు నీళ్లు పోసేటప్పుడు నీ దృష్టి అంతా ‘నీళ్లు ఒలికిపోతాయేమో’ అనే భయం మీద ఉంది. అందుకే నీ చెయ్యి వణుకుతోంది. నీ పని కేవలం కుండలో నీళ్లు పోయడం (అంటే ఆచరణ). నీళ్లు ఒలికినా పరవాలేదు, మళ్లీ పోయవచ్చు. ఫలితాన్ని దేవుడికి వదిలేసి, ప్రస్తుతం నీ చేతిలో ఉన్న ఆ ఒక్క చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టు. దాన్నే భగవద్గీతలో ‘కర్మయోగం’ అంటారు’ అని చె΄్పారు.గోపాల్‌కి జ్ఞానోదయమైంది. తన అతి ఆలోచనలు లౌకికమైన ‘భయం, అహం (పేరు పోతుందేమో అనే భావన)’ నుంచి వస్తున్నాయని గ్రహించాడు. ఆలోచించడం ఆపి, ఆధ్యాత్మిక భావనతో (పనిని దేవుడికి అర్పించే భక్తితో) మరుసటి రోజే ఉలి, సుత్తి చేతపట్టాడు. ఫలితం ఎలా వచ్చినా సరే, నా వంతు కృషి నేను చేస్తాను’ అని మనస్ఫూర్తిగా చెక్కడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతను తన జీవితంలోనే అత్యంత అందమైన విగ్రహాన్ని తయారు చేశాడు. అతి ఆలోచనలు మనల్ని భయానికి గురిచేసి ముందడుగు వేయనివ్వవు. కానీ ఆధ్యాత్మికతతో కూడిన ఆలోచన మనకు ‘స్వీకరణ భావాన్ని’, ఫలితం మీద ఆశ లేని ధైర్యాన్నిస్తుంది. ఆలోచనలకు ఆచరణ తోడైతే విజయం తథ్యం. ఆలోచన ఒక ఆయుధం అయితే, ఆధ్యాత్మికత దానికి సరియైన దిశానిర్దేశం చేస్తుంది. ఆలోచన ఆధ్యాత్మికమైనప్పుడు, పొందే ప్రశాంతత మానసిక ఉన్నతికి, సాధించే విజయం ఆత్మోన్నతికి దారితీస్తాయి.... – తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తితపస్సు అంటే..?అమృత బిందువులు→ తపస్సు అంటే అడవికి పోయి పండ్లు, దుంపలను తింటూ నివసించడం కాదు. తమ భావాలను, ఆలోచనలను నియంత్రించడమే నిజమైన తపస్సు.→ ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించడమే నిజమైన తపస్సు.→ ఆలోచనలు, మాటలు, పనులలో సమానత్వాన్ని సాధించడమే తపస్సు ముఖ్య లక్షణం.→ ఆనందం, దుఃఖం, లాభం నష్టం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి.→ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సమాజానికి సేవ చేయాలి, కోరిక లేని స్థితికి చేరుకోవాలి. అదే నిజమైన తపస్సు. -
అతిథి... అనుబంధాల అక్షయపాత్ర!
ఈ అనంత విశ్వ గమనంలో మానవుడు కేవలం ఒక వ్యక్తి కాదు, అతడొక సామాజిక అనుబంధాల సంగమ స్థానం. భారతీయ జీవన వేదంలో ఆతిథ్యం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక అనురాగ మంత్రం. మన సంస్కృతి విశ్వానికి అందించిన మహోన్నత సందేశం ‘అతిథి దేవో భవ’. అంటే గడప తొక్కిన వ్యక్తిని దైవ స్వరూపంగా దర్శించడం. ఆతిథ్యం, ఉపకారం– ఈ రెండూ ఉన్నతోన్నత సంస్కారానికి నిలువెత్తు తార్కాణాలు. ఒకరికి ఆతిథ్యమిచ్చే అవకాశం రావడం, మరొకరికి ఉపకరించే సందర్భం దొరకడం అనేది మనిషి చేసుకున్న గొప్ప అదృష్టం. పరిచయం లేని వ్యక్తిని కూడా ఆత్మీయంగా అక్కున చేర్చుకోగల ఈ గుణమే సామాన్యుడిని సైతం ‘మనీషి’గా రూపాంతరం చెందిస్తుంది.శ్రీరామచంద్రుని అచంచలమైన ప్రేమను పొందిన నిషాదరాజు గుహుడి గాథ ఇందుకు ఒక అద్భుత నిదర్శనం. రాజభోగాలను వదిలి కారడవుల పాలైన రాముడిని, గంగా తీరంలో గుహుడు సాదరంగా ఆహ్వానించాడు. అది రాజకోటలో దొరికే విందు కాదు, ఒక సామాన్య అడవి బిడ్డ హృదయం నుండి ఉబికిన ఆత్మీయ ఆలింగనం. ఆ కష్టకాలంలో గుహుడు అందించిన నిస్వార్థమైన ఆతిథ్యాన్ని, ఆత్మీయమైన ఉపకారాన్ని రాముడు తన జీవితాంతం మరువలేదు. అందుకే అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలోనూ, గుహుడు నా ‘ఆత్మసఖుడు’ అని పలికి, హనుమంతుడి ద్వారా ప్రత్యేకంగా క్షేమవార్తలు పంపాడు. ఆటవికుడైనా సరే, ఆతిథ్యమనే ఉత్తమ మనస్తత్వం ఉంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని హృదయంలోనే శాశ్వత స్థానం సంపాదించుకోవచ్చని గుహుడు నిరూపించాడు. పదార్థం ఏమున్నదనేది కాదు, పరిమళించే భావం ఏమిటనేదే ఆతిథ్యపు పరమార్థం.‘వసుధైవ కుటుంబకం’ అనేది మన నినాదం మాత్రమే కాదు, అది మన ఆత్మగౌరవం. ఆతిథ్యం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఆత్మీయతను పంచడం. అలసిపోయిన బాటసారికి చెట్టు నీడ ఎంతటి సేదను ఇస్తుందో, ఆపదలో ఉన్న గుండెకు మన ఆత్మీయమైన పలకరింపు అంతటి ప్రాణవాయువును అందిస్తుంది. ఎదుటివారికి ఉపకరించే స్థితిలో మనం ఉన్నామంటే, అది మన శక్తి కాదు.. మనకు లభించిన ఒక దివ్యమైన అవకాశం. వైఫల్యం ఎదురైనప్పుడు మనల్ని రక్షించేది మన సంపద కాదు, మనం సంపాదించుకున్న నమ్మకమైన గుండెలే. చీకటిలో తోడుండే నీడలా, ఎడారిలో దొరికే సెలయేరులా ఆత్మీయ బంధాలు మనిషిని బతికిస్తాయి.ఆత్మీయత లేని విందు ఆత్మ లేని శరీరం వంటిది. మన గడప తొక్కే ప్రతి అతిథిలో ఆ పరమాత్మను దర్శిద్దాం, ప్రతి ఉపకారంలోనూ సార్థకతను వెతుక్కుందాం. మానవత్వమే మార్గంగా, మమకారమే ప్రాణంగా లోకకల్యాణం కోసం అడుగులు వేద్దాం.లోపల అహంకారం లేని ఆత్మీయతే ఈ ప్రపంచాన్ని నడిపే ఇంధనం. గూడు లేని పక్షికి కొమ్మ ఆసరా అయినట్లు, గమ్యం తెలియని ప్రయాణికుడికి మన ఆత్మీయత ఒక వెలుగు బాట కావాలి. సముద్రపు అలలు తీరాన్ని తాకినట్లు, మన ప్రేమ ఎదుటివారి హృదయాన్ని తాకాలి. అపరిచితులను కూడా ఆత్మీయులుగా మార్చుకోగల గుణమే మన భారతీయతకు అసలైన సంతకం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
అశ్వనీకుమారుల శాపవిమోచనం!
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.- సాంఖ్యాయన -
సంకటాలు తొలగించే ‘చతుర్థి’
సంకష్టహర చతుర్థనే సంకట హర చతుర్థి అని కూడా అంటారు. ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినా న్ని సంకష్టహర చతుర్థగా పిలుస్తా రు. ఈరోజున గణపతి పూజలు, నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి లాగానే ప్రతినెలాలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకోవడం వ ల్ల భరించలేని కష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు తొ లగిపోతాయని, సుఖశాంతులు, సిరిసంపదలు పొందుతామని భక్తులకు నమ్మకం. అలాగే మంగళవారం వచ్చే ‘అంగారక చతుర్థి’ విశిష్టమైనదిగా భా విస్తారు. ఈ ఏడాది జనవరి, మే నెలలో మంగళవా రం వచ్చింది. సెపె్టంబర్ 29న మరోసారి మంగళవారం రానుంది. ఈరోజు ఉపవాసం ఉంటే 21 సంకష్ట చతుర్థులు చేసిన ఫలితం వస్తుందని నమ్ము తారు. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో దైవాన్ని పూజిస్తే కుజదోషం పోతుందని పెద్దలు చెబుతారు. తెల్లవారుజామునుంచే.. మహిళలు ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు అలికి, వాకిలికి పసుపు రాసి, గడపకు మామిడాకుల తోరణం కడతారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. మధ్యాహ్నం గణపతి ప్రతిమను అలంకరించి, పూజలు చేస్తారు.‘ఉండ్రాళ్లు’ నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల గారెలు కూడా చేస్తారు. అనంతరం ‘సంకష్టహర గణపతి వ్రత కథ’ చదువుకుంటారు. కథ అయిపోయాక చంద్రుడి దర్శనం చేసుకొని, మహిళలు ఉపవాసం విరమిస్తారు. గణపయ్యే సంకటాలు తొలగిస్తాడు.. మా కుటుంబం కోసం 11 సంకష్టహర చతుర్థి ఉపవాసాలు చేస్తానని మొక్కుకున్నాను. చతుర్థి రోజున చంద్రుడు వచ్చేదాకా పిల్లలతో కథ చెప్పుకుంటూ కూర్చుంటే ఆకలి కూడా తెల్వదు. గణపయ్య అన్ని సంకటాలు తొలగిస్తాడనే ధైర్యం. –కదం సంధ్యారాణి, ఆర్మూర్40 ఏళ్లుగా పూజ చేస్తున్నా.. సంకటహర చతుర్థి పూజలు 40 సంవత్సరాలుగా చేస్తున్నా. భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పూజాఫలం చక్కగా ఉంటుంది. మా ఇంటి చుట్టుపక్కల వారు సాయంత్రం ప్రసాదం కోసం ఇంటికి వస్తారు. పండుగ అంటే అందరిదీ అనే ఫీలింగ్ ఇస్తుంది. –జంగం నాగమణి, ఆర్మూర్ మనసుకు ప్రశాంతత.. చతుర్థి రోజున ఫోన్ పక్క న పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడి పూజ చేసుకుంటా. ఉండ్రాళ్లు చేయడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. ఆ రోజు ఉపవాసం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. –దాసరి అనిత, ఆర్మూర్ -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదువలయమున నొప్ప, దీవి చే వెలయుబాణియురుదయాడ్యుల మేను పరోపకారకలన రాణించు గంధంబు వలనకాదు’.కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..ఇదే కవి మరో పద్యంలో‘కరమున నిత్యదానం, ముఖంబన సూనత వాణి, ఔదలంగురుచరణాభివాదన, ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్వరహదయంబునన్ విశదవర్తన, మంచిత వీనులన్సురుచిరభూషణంబు లివి శూరులకు సిరి లేనియప్పుడున్’....ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటేదానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.పసిడి కుండలములు చెవులకుపసిడి హారములు మెడకు భాసిల్లును గానిమంచి మాటలు లేకున్నపశువుతో సమానమగును పార్థివా వేమాఅర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.మరో పద్యం చూడండిఅంగడి సరుకుల వలెనాఅలంకారములెల్ల కొనగ అందుబాటగునాసంగతి తెలిసిన వానికేసద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమాఅర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.విద్య భూషణము పురుషునకువిద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందునవిద్య లేని మనుజుండుపశువు కంటెను హీనమగును పార్థివా సుమతీఅర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.‘సత్యము భూషణము సతికిసత్యము భూషణము నరునకు సర్వజనులకున్సత్యము లేని నరుండుమత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.‘దానము శీలము సత్యముమానము విద్యయును నీతి మర్యాదయునుమేనికి భూషణములు సుమ్మీమేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.రత్నములు కావు భూషణరత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములురత్నములు లేకపోయినరాజిల్లును సద్గుణముల రమణీయముగన్’దీనికి అర్థం అక్కర్లేదు.వినయము విద్యకు భూషణవినయము లేని విద్య విషముతో సమము సుమ్మీవినయ విద్యలు గల్గినవనరులెల్ల వచ్చు జగతిన.బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి నిర్వహణ: డి.వి.ఆర్. -
ప్రార్థనతో బలపడే విశ్వాసం!
‘దేవుని ఇశ్రాయేలు’గా చెప్పబడే క్రీస్తు ప్రభువు సంఘ సభ్యులు అపొస్తలుల బోధకు లోబడి క్రీస్తునందు క్రీస్తును బట్టి దేవునియందు ఆనందించుటలో సిద్ధహస్తులు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షాన ఏలుబడి చేసే ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్ధం. ఆ రారాజైన క్రీస్తును బట్టే ఆత్మసంబంధ ఇజ్రేలీయులుగా క్రైస్తవులు పిలువబడుతున్నారు. క్రీస్తు సంబంధులు, క్రైౖస్తవులు అనే పదాలకు ఆత్మ సంబంధ ఇజ్రేలీయులు అనేది ఒక గొప్ప పర్యాయపదం. ఆత్మ సంబంధ హృదయ పరిపాలకుడుగా ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఎలా ఆనందించాలో ఎందుకు ఆనందించాలో చూద్దాం.ఇక సాహసించక తప్పదనేలా దేవుని సంకల్పం బహు బలంగా ఉంది. అంతరాయాలకు, అడ్డుకట్టలకు, అభ్యంతరాలకు ఎలాంటి తావులేదు. ఇజ్రేలీయులకు వాగ్దానం చేసిన మెస్సీయాను ఈ భూమి మీద ప్రవేశపెట్టే వేళలలో దుస్సాహసాలకు పాల్పడుతూ దేవుని సంకల్ప చిత్తానికి ఆయన సత్యానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరూ దేవుని శత్రువులుగా ముద్రవేయించుకొని దేవుని ఉగ్రతకు బలై చరిత్రలో కలిసిపోయారు. తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడి చేయుటకు దేవుడు ఎన్నో సాహసకార్యాలకు పూనుకొన్నాడు. అదేవిధంగా మానవాళి అనుభవానికొచ్చి అలరించుటకు క్రీస్తుప్రేమ కూడా అనేకనేక అడ్డు ఆటంకాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారెవరును లేరు.- ''క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు. క్రీస్తు కేంద్రంగానే సర్వంలో సర్వమూ చేయబడింది అనుటకు తగిన మూలాధారం ఇదే. మొత్తం దేవుని సంకల్పంలో కేంద్రకం క్రీస్తుబలి. కారణం చూస్తే యేసును నలగగొట్టడం యెహోవా దేవునికి ఇష్టమైంది. క్రీస్తుబలి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తన స్వకీయ సంకల్ప ప్రకారంగా ఈ బలిని రూపొందించినది ఆ దేవదేవుడే. అంతకంటె ముఖ్య కారణం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం. మానవాళికి తన సొంత కుమారుని అనుగ్రహించుట ద్వారా ఇలా తన కుమారుని బలియాగం ద్వారా తన ప్రేమను వైవిధ్యంగా చేతలలో ఈ లోకానికి చాటి చెప్పాడు.''క్రీస్తునందు ఆనందిస్తూ ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, వంటి ఉపద్రవాలు, శ్రమలు, బాధలకు తలవంచక కేవలం క్రీస్తును బట్టి మాత్రమే ఎదురునిలిస్తే అవి ఏవైనా వినయ వినమ్రతలతో దారి ఇచ్చుకోక తప్పదు. యేసు తన తండ్రియైన దేవదేవుని సంకల్పప్రకారంగా మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మరణించాల్సి వచ్చింది. ఆయన అత్యంత క్రూరంగా ఘోరంగా సిలువలో బలి అయ్యాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ సాహసించి మరీ మరణానికి ఎదురుగా వెళ్ళాడు.ఇందువలననే యేసు తన తండ్రి సంకల్ప చిత్తానికి విధేయంగా తలవంచాడు. మానవాళిని ప్రేమించి ప్రేమతో సాహసించి తన నిండు యవ్వన్రపాయాన్ని బలిగా పెట్టాడు. ఇట్టి యేసు సాహసోపేత ప్రేమను బట్టి ఆనందించండి అనునదే పరిశుద్ధులైన అపొస్తలుల బోధగా సంఘాలలో ఉపదేశక్రమ సత్యారాధనలలో నిత్యమూ చెప్పబడుతూ ఉంటుంది. వారపు ప్రప్రథమదినమను ఆదివారంనాడు సంఘము ఇలా క్రీస్తు సాహసాలను ప్రకటిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. సాహసించి క్రీస్తు సాహసాలను క్రీస్తు సంఘం ప్రకటిస్తూ ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే యెడతెగక ్రపార్థన చేయాలి. ్రపార్ధన చేయుట ద్వారానే క్రీస్తుద్వారా దేవునితో సత్సంబంధ సహవాస బాంధవ్యాలు బలపడి దృఢపడతాయి. అప్పుడే ప్రతి ఒక్కరూ సాహసోపేత దైవిక ప్రేమను బట్టి ఎంతగానో సంతోషించే వీలుంటుంది.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్ -
నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..
సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్ ఆన్ హదీసుల ఆత్మకూడా ఇదే!అత్తరు తావి కావాలి!చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్ అల్–బుఖారీ)చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.సత్యవంతుల సహవాసం‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్ఆన్ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్) అని హెచ్చరించారు.రేపటి పశ్చాత్తాపం వద్దు!తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్ ఆన్ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్ ఆన్ 25:27–28)అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్‌లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.అద్దం లాంటి మిత్రుడుసచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?– ముహమ్మద్ ముజాహిద్నిర్వహణ: డి.వి.ఆర్. -
అంతర్ముఖ చిత్తం.. పరివర్తనకు మార్గం!
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని చేరుకున్నాడు. విజ్ఞానశాస్త్రంలో, సాంకేతిక రంగంలో, వైద్యరంగంలో అనేక అద్భుత విజయాలను సాధించాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది– తనను తాను నిజంగా తెలుసుకున్నాడా?ప్రకృతి పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, జీవరాశులన్నీ తమ అవసరాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని అన్వేషిస్తూ అభివృద్ధి చెందాయి. నీటిలో జీవించిన చేపలు భూమిపై జీవించేందుకు ప్రయత్నించాయి. సర్పాలు చురుకుదనాన్ని పెంపొందించుకున్నాయి. జంతువులు పరిసరాలను బాగా ఎదుర్కొనేందుకు తమ శరీర నిర్మాణాన్ని మార్చుకున్నాయి. ఈ పరిణామమంతా బాహ్య ప్రపంచానికి అనుగుణంగా జరిగిన మార్పులే.మానవుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. ఆహారం కోసం అన్వేషించాడు. నివాసం నిర్మించుకున్నాడు. సంపదను కూడబెట్టాడు. అధికారాన్ని సంపాదించాడు. విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ అన్వేషణ అంతా బాహ్య ప్రపంచం వరకే పరిమితమైంది. భౌతిక ప్రగతి ఎంత జరిగినా, అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించకపోతే జీవితం అసంపూర్ణంగానే మిగులుతుంది.ఇక్కడే ఆధ్యాత్మిక పరిణామం ప్రారంభమవుతుంది. మన దృష్టి బాహ్య ప్రపంచం నుండి అంతరంగం వైపు మళ్లినప్పుడే నిజమైన పరివర్తన సంభవిస్తుంది. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం, మన ఆలోచనలను పరిశీలించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, స్వీయ అవగాహనను పెంపొందించుకోవడంఇవే ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు.ఒక అందమైన ఇంటిని నిర్మించిన తర్వాత దాని వెలుపల నిలబడి చూస్తూ ఉంటే, ఆ ఇంటి సౌకర్యాన్ని అనుభవించలేం. లోపలికి అడుగుపెట్టినప్పుడే ఆ ఇంటి అసలు విలువ తెలుస్తుంది. అలాగే, ఎంతటి బలమైన కోటను నిర్మించినా దాని లోపలికి వెళ్లకపోతే అది రక్షణను ఇవ్వదు. ఇదే సూత్రం మన జీవితానికీ వర్తిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించినా, మన అంతరంగంలోకి ప్రయాణించకపోతే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేం.నేటి సమాజంలో సాంకేతిక సౌకర్యాలు విస్తరించిన కొద్దీ మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి కూడా పెరుగుతున్నాయి. సమాచారం విపరీతంగా పెరిగింది కానీ జ్ఞానం తగ్గుతోంది. పరిచయాలు పెరిగాయి కానీ ఆత్మీయత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మనిషికి అత్యవసరమైనది అంతర్ముఖత. కొద్దిసేపైనా మనతో మనం గడపడం, మౌనాన్ని ఆస్వాదించడం, ధ్యానం ద్వారా మనస్సును పరిశుభ్రం చేసుకోవడం నేటి కాలంలో అత్యంత అవసరం.శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన సహజయోగం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. మనలో సహజంగా ఉన్న ఆత్మచైతన్యాన్ని మేల్కొలిపి, మన చిత్తాన్ని అంతర్ముఖంగా మార్చినప్పుడే నిజమైన శాంతి, సమతుల్యత, ఆనందం లభిస్తాయని ఆమె బోధించారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితమైన మార్గం కాదు; మానవుని అంతరంగ వికాసానికి సంబంధించిన విశ్వజనీన సత్యం.ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనలో మార్పు రావాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే ముందు మన హృదయంలో శాంతి నెలకొనాలి. బాహ్య విజయాల కంటే అంతరంగ విజయం గొప్పది. మన చిత్తం బయట ప్రపంచంలో ఎంత విహరించినా, చివరికి తన అసలు గమ్యం తనలోనే ఉందని గ్రహించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది.అంతర్ముఖత అనేది ప్రపంచాన్ని వదిలేయడం కాదు; ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, సమతుల్యంగా, ప్రేమతో చూడగల స్థితికి చేరుకోవడం. అదే మానవ పరిణామంలో అత్యున్నత దశ.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులునిర్వహణ: డి.వి.ఆర్. -
హనుమ విగ్రహం... రాతిలో చెక్కిన భక్తి తత్వం
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం విజయనగర శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం. ఈ శిల్పం రామాయణంలోని సుందరకాండలో చోటుచేసుకున్న అత్యంత కీలకమైన ఘట్టాన్ని రాతిలో సజీవంగా ఆవిష్కరిస్తుంది. సీతాదేవిని దర్శించి ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని అందజేసిన అనంతరం హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ వార్త రావణునికి చేరడంతో అతడు తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. దేవతలను సైతం జయించిన మహా యోధుడైన ఇంద్రజిత్తు సాధారణ ఆయుధాలతో హనుమంతుడిని జయించలేనని గ్రహించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం శాశ్వతంగా హాని చేయలేకపోయినా బ్రహ్మాస్త్ర మహిమను గౌరవిస్తూ ఆయన కొంతసమయం దానికి లొంగిపోయాడు. తరువాత రాక్షసులు జనపనార తాళ్లు, నాగపాశాలతో ఆయనను అదనంగా బంధించిన వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం దానంతట అదే తొలగిపోయిందని సుందరకాండ వివరించింది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఓడిపోలేదు. వ్యూహాత్మకంగా రావణుని సభలో ప్రవేశించి అతనికి శ్రీరాముని సందేశాన్ని నేరుగా తెలియజేయాలనే సంకల్పంతోనే బంధితుడిగా ఉన్నాడు.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని శిల్పంలో హనుమంతుడు పాముల వంటి బంధనాలతో చుట్టబడి నిలిచిన రూపంలో కనిపిస్తాడు. తన శరీరాన్ని బంధించినప్పటికీ తన మనోధైర్యాన్ని ఎవరూ బంధించలేరనే భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాడు శిల్పి. కండరాలలో కనిపించే ఉద్రిక్తత, ముఖంలో కనిపించే ప్రశాంతత, కళ్లలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం భక్తి, అపార శక్తి ఈ శిల్పానికి అసాధారణమైన జీవం పోశాయి. బాహ్యంగా బంధితుడిగా కనిపిస్తున్న హనుమంతుడు అంతర్గతంగా అజేయుడని ఈ శిల్పం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది శిల్పకళ మాత్రమే కాదు రాతిలో చెక్కిన ఒక తాత్విక సందేశం కూడా.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని ఈ శిల్పం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. కఠినమైన గ్రానైట్ రాయిలో శరీర నిర్మాణం కండరాల బలం పాముల చుట్టుకొలత వస్త్రాల మడతలు ముఖ కవళికలు వంటి సూక్ష్మ అంశాలను సైతం అత్యంత సహజంగా చెక్కడం వారి కళానైపుణ్యానికి నిదర్శనం. విజయనగర శిల్పకళలో శిల్పాలు అలంకారాలు మాత్రమే కాకుండా పురాణాలను ప్రజలకు బోధించే దృశ్య గ్రంథాలుగా కూడా రూపొందించబడ్డాయి. నిరక్షరాస్యులు కూడా ఈ శిల్పాలను చూసి రామాయణం మహాభారతం, పురాణాల్లోని కథలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటిని రూపొందించారు.ఈ హనుమంతుడి శిల్పం భక్తునికి గొప్ప జీవిత సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు బంధనలు అవమానాలు ఎదురైనా ధర్మాన్ని విడువకుండా భక్తిని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుందని ఇది బోధిస్తుంది. బాహ్య బంధనలు ఎంత బలంగా ఉన్నా దైవభక్తి ధైర్యం, జ్ఞానం, సంయమనం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ శాశ్వతంగా బంధించలేరనే శాశ్వత సత్యాన్ని ఈ శిల్పం ప్రతిధ్వనిస్తుంది. అందుకే చింతల వెంకట రమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు భారతీయ ధర్మం భక్తి తత్వం, విజయనగర శిల్పకళా వైభవం కలిసిన ఒక చిరస్మరణీయ వారసత్వ సంపదగా నేటికీ భక్తులను పరిశోధకులను, కళాభిమానులను సమానంగా ఆకర్షిస్తోంది.– జిబి విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అనంతపురంనిర్వహణ: డి.వి.ఆర్. -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా? తరతరాలుగా సమాజంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, పురాణాల వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
యుయుత్సుడు... కౌరవులలో శ్రేష్ఠుడు
మహాభారతంలో కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడితో కలిపి 100 మంది గురించి చెప్తాము. మిగిలిన 98 పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. వారిలో యుయుత్సుడు కూడా ఒకడు. ఇతనిని కౌరవులలో శ్రేష్టుడిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహాభారత యుద్ధానంతరం కౌరవులలో బతికిన ఒకే ఒక్కడు కూడా యుయుత్సుడే.యుయుత్సుని జననం, ధర్మనిరతిధృతరాష్ట్రుని పట్టమహిషి గాంధారి గర్భం దాల్చి రెండు ఏళ్లు గడిచినా సంతానం కలగపోవడంతో గాంధారి చెలికత్తె అయిన వైశ్యకన్య సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడిగా పొందాడు ధృతరాష్ట్ర్రుడు.యుయుత్సుడు కౌరవులలో ఒకడైనప్పటికీ ధర్మనిరతుడు... మహావీరుడు... అతిరథులలో ఒకడు. ఆది నుండి ధర్మం వైపే నిలబడ్డాడు. అలనాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక్క యుయుత్సుడే వ్యతిరేకించాడు. భీముడిని విషపు నీటి ప్రయోగం నుండి కాపాడాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు సహాయం చేశాడు.కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం కావడంతో యుద్ధం ప్రారంభం కాకమునుపే, ధర్మరాజు మాట్లాడుతూ యుద్ధంలో అస్త్ర శస్త్రాలు చేపట్టింది, ధర్మాన్ని రక్షించడానికి... ధర్మం వైపు నిలబడి పోరాడాలనుకునే వారికి స్వాగతం... అని చెప్పడంతో, ధర్మం పాండవుల వైపే ఉందని యుయుత్సుడు గ్రహించి కౌరవుడైనప్పటికీ పాండవుల పక్షాన చేరి కౌరవులపై యుద్ధం సాగించాడు.కౌరవులలో మిగిలిన ఒకే ఒక్కడైన యుయుత్సుని కౌరవ సామ్రాజ్యానికి రాజును చేస్తామని, దీనివల్ల ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలుగుతుందని ధర్మరాజు ప్రకటించడంతో అప్పటి ధర్మవేత్తలు అడ్డుపడి, అభ్యంతరం చెబుతూ క్షత్రియ సంతానానికి చెందని యుయుత్సుడు రాజు కావడానికి అనర్హుడని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ధర్మరాజు యుయుత్సుని పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించి అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్ సంరక్షణ బాధ్యతను కూడా యుయుత్సునికే అప్పగించాడు. అనంతరం పాండవులు స్వర్గం వైపు పయనమయ్యారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
గురవే సర్వలోకానాం..
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుంటే ఈ రోజు ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. మహాభారతం, పద్దెనిమిది పురాణాలు, బ్రహ్మసూత్రాలు రచించిన మహర్షి వేదవ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు ఆయనే. ఆయన జన్మదినమే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అందుకే ఈ రోజును వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటూ, ఆయన ద్వారా మనకు అందిన జ్ఞాన సంపదకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వ్యాసుడే మానవాళికి మొదటి గురువుగా భావిస్తారు. ఆయన నుండి ప్రారంభమైన గురు పరంపర ఈనాటికీ కొనసాగుతోంది. నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరాచార్యుల వరకు సాగిన ఈ పరంపరకు ఈ రోజు నమస్కరిస్తాం.ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని దేవగురువు అంటారు. నవగ్రహాలలో గురువు స్థానం చాలా బలంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీ శుభంగా జరుగుతాయని నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు గురు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చాతుర్మాస దీక్షలకు ఈ రోజే బీజం పడుతుంది. సాధువులు, సన్యాసులు ఈ రోజు నుండే ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించుకుని పాదపూజ చేస్తారు. కొత్త వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, దక్షిణ తాంబూలాలతో గురువును సత్కరిస్తారు. గురు గీత, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతీ దేవితో పాటు హయగ్రీవ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. రాత్రి సమయంలో చంద్రుని కిరణాలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని కూడా ఒక నమ్మకం. గురు పౌర్ణమి అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మనం గురువులకు నమస్కరించడం ద్వారా జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి నమస్కరిస్తున్నాం. గురువు చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకునే రోజు ఇది. గురువుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన గురు పౌర్ణమిని మనం భక్తిశ్రద్ధలతో జరుపుకుని, గురు తత్వాన్ని మన జీవితంలో ఆచరించాలి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరూ గురువే. తల్లిదండ్రులు మొదటి గురువులు. వారు మనకు నడవడం, మాట్లాడడం నేర్పుతారు. ఆ తరువాత బడిలో టీచర్లు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ప్రకృతి కూడా మనకు గురువులే. 29, బుధవారం గురుపౌర్ణమి– కుందా శ్రీ కృష్ణ శాస్త్రి. -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..విష్ణు అనుగ్రహం కలగాలంటే..మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు..ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. తినకూడనవి..ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!) -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్‌ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
విదుర నీతి
విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాలుగా నీతిని బోధించాడని గతవారం చెప్పుకున్నాం కదా... విదురుడు బోధించిన నీతిసూత్రాలు విదురనీతిగా ప్రసిద్ధి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు...→ ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సును కోరుకోవాలి. ఏ ఒక్క వర్గానికీ అపకారం, దుఃఖాన్ని కలిగించాలని కనీసం మనసులో అయినా అనుకోకూడదు. → కష్టాలు, ఆపదలు, ప్రతికూలతల్లో ఉన్న వారిపై శ్రద్ధ పెట్టాలి. మనల్నే నమ్మి ఆధారపడిన వారి నిరంతర బాధలను, అవి చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు.→ సకల ప్రాణుల పట్ల కరుణ చూపాలి. → మేలు చేసే పనులే చేయాలి. → ఎవరి వల్లా వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి, పెరుగుదలకు ఎప్పుడూ ఆటంకం కలిగించరాదు. → భద్రత, రక్షణ కోసం మనపై ఆధారపడిన వారిని కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.→ ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. వారికోసం అంకిత భావంతో అందుబాటులో ఉండాలి. → సద్గుణం ద్వారానే విజయాన్ని సాధించి నిలబెట్టుకోవాలి. → ప్రజల సంక్షేమాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. → అభ్యసనాన్ని, జ్ఞాన ప్రసారాన్ని్రపోత్సహించాలి. → లాభాన్ని, సద్గుణాన్ని ప్రోత్సహించాలి. → శ్రేయస్సు మంచి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి. → దుష్టులతో... పాపాత్ములతో స్నేహాన్ని విడిచిపెట్టాలి. → ఎన్నడూ సంపదను దుర్వినియోగం చేయకూడదు. → కఠినమైన మాటలు మాట్లాడకూడదు, తీవ్రమైన లేదా క్రూరమైన శిక్షలు విధించకూడదు. → సద్గుణ చరిత్ర, స్వభావం, చురుకుదనం కలిగి ఉండాలి. – సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
గ్రామ దేవతలకు భక్తి బోనాలు
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ సందడి ఇప్పటికే ఆరంభం అయింది. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల విశిష్టత, వివిధ ఆలయాల్లో జరిగే ప్రధాన జాతరల వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.‘బోనం’ అనే పదం ‘భోజనం’ అనే ప్రకృతి పదం నుండి వచ్చింది. ఇది తమను అంటువ్యాధులు, రకరకాల ప్రకృతి విపత్తుల బారిన పడకుండా చల్లగా చూస్తున్నందుకు గాను కృతజ్ఞతతో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం. తయారీ విధానం: కొత్త మట్టి కుండలో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో అన్నం (పరమాన్నం లేదా పసుపు అన్నం) వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు. కుండపై వెలిగించిన దీపాన్ని ఉంచి, మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై మోస్తూ మంగళవాద్యాల నడుమ ఆలయానికి తరలివెళ్తారు. ఈ పండుగ వెనుక ఉన్న ఆచారాలు: బోనాల జాతరలో భక్తితో పాటు అద్భుతమైన జానపద కళారూపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. శివసత్తుల పూనకాలు: డోలు సప్పుడు, మైసమ్మ, మహంకాళి పాటల మధ్య శివసత్తులు పూనకంతో ఊగిపోతూ భక్తులకు వేపమండలతో దీవెనలు అందిస్తారు. ఘటోత్సవం – రంగం (భవిష్యవాణి): పండుగలో భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతుంది. జాతర ముగిసే మరుసటి రోజు ఉదయం ‘రంగం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జోగిని పచ్చి మట్టి కుండపై నిలబడి, భవిష్యత్తులో వచ్చే వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి అమ్మవారి సాక్షిగా భవిష్యవాణి చెబుతుంది. ఆరోగ్య రహస్యం: వర్షాకాలం (ఆషాఢం) ప్రారంభంలో మశూచి, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటూ భక్తులు వేపాకులు, పసుపుతో సాకపెట్టడం వల్ల అవి సహజ సిద్ధమైన కిమినాశకాలుగా పనిచేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి.జూలై 16న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢ బోనాల మహోత్సవాలు ఆగస్టు 13, 2026 వరకు నెల రోజుల పాటు ముక్కోటి దేవతల సాక్షిగా సాగుతాయి. బోనాల పండుగ కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజల ఐక్యతకు, ఆచారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక పండగ. కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై అమ్మవారిని కొలిచే ఈ జాతర వైభవం ప్రతి ఒక్కరినీ భకి ్త పారవశ్యంలో ముంచెత్తుతుంది. తెలంగాణ సంస్కృతిలో మమేకమైన ఈ జాతర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన వారిని కూడా ఈ పండగలో భాగస్వాములను చేస్తుంది. పోతురాజుల విన్యాసాలుబోనాల జాతరకు సిసలైన సింగారం బోనాల పండుగ అనగానే మొదట గుర్తొచ్చేది.. ఒళ్లంతా పసుపు, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో వేపమండలు, కొరడాతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా శివాలెత్తిపోయే పోతురాజు. పోతురాజుల విన్యాసాలు లేని బోనాల జాతరను ఊహించుకోలేము. ఈ ఉత్సవాలలో పోతురాజుల పాత్ర అత్యంత కీలకమైనది.ఎవరీ పోతురాజు?జానపద కథల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటివారికి ఏకైక తమ్ముడు. అమ్మవార్ల ప్రతిరూపమైన ఘటాలకు రక్షకుడిగా, ఊరేగింపునకు ముందు నడిచే సైన్యాధిపతిగా పోతురాజును భావిస్తారు. వీర విన్యాసాలు: తీన్మార్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గాల్లోకి ఎగురుతూ, చేతిలోని కొరడాతో నేలను కొడుతూ భీకరంగా నృత్యం చేస్తారు. భక్తి పారవశ్యంతో తమను తాము కొరడాతో కొట్టుకుంటూ విన్యాసాలు చేసే పోతురాజు చేతి కొరదా దెబ్బలు తినడానికి భక్తులు పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, పోతురాజు చేత కొరడా దెబ్బలు తినడం వల్ల దిష్టి పోతుందని, రోగాలు రావని నమ్మకం. ఊరేగింపులో అమ్మవారి ’ఘటం’ ముందుకు కదపాలంటే పోతురాజు నృత్యం చేస్తూ దారి చూపిస్తూ ఉండాలి. ఫలహార బండి ఊరేగింపు: సికింద్రాబాద్, లాల్ దర్వాజా బోనాలలో జరిగే ఫలహార బండ్ల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు పతాక స్థాయికి చేరుకుంటాయి.గావు పట్టడం: జాతర చివరి రోజున అమ్మవారికి బలి ఇచ్చే ఆచారంలో భాగంగా, పోతురాజు కోడిపుంజును నోటితో కొరికి (గావు పట్టి) గుడి బయట విసిరేస్తారు. ఇది జాతరలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. వివిధ ఆలయాల్లో జాతరలు జరిగే తేదీల వివరాలుజూలై 21న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం– దీనిని ‘లష్కర్ బోనాలు‘ అని పిలుస్తారు. దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆగస్టు 3: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం–బోనాల పండుగలో అత్యంత కీలక ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) జరుగుతుంది.ఆగస్టు 9: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడి ఘటాల ఊరేగింపుతో పండుగ ఊపు అందుకుంటుంది. ఉత్సవాల ముగింపు ఆగస్టు 13: నెల రోజుల పాటు సాగిన ఈ బోనాల మహా జాతర ముగుస్తుంది.– డి.వి.ఆర్. -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!
గోల్కొండ: గోల్కొండ జగదాంభిక మహంకాళీ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా గురువారం మొదటి బోనం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు ఉదయం 6 గంటల నుంచే గోల్కొండ కోటకు తరలివచ్చారు. కోట మెయిన్ గేటు వద్ద భారీగా చేరిన భక్తులను అతికష్టం మీద పోలీసులు ఒకొక్కకరిని కోటలోకి పంపారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోట చౌరస్తా వద్ద ఓ వైపు శివసత్తులు, మరో వైపు పోతరాజులు పోటాపోటీగా విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రిసాల బజార్ నుంచి బి.శ్రీకాంత్‌చారి ఆధ్వర్యంలో రోబోటిక్ అంబారీపై అమ్మవారి మూర్తి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేందర్‌రెడ్డి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. జగదాంబకు బంగారు బోనంసప్త మాతృకలకు సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉçత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జోగిని అవిక బోనమెత్తారు. హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో బంగారు పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. లంగర్‌హౌజ్ వద్ద స్వాగత వేదికపై నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు బంగారు బోనానికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, పొటేల్ సదానంద్, రాకేష్ తివారి, జనగామ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్‌కుమార్ గౌడ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, బల్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నగర సీపీ సజ్జనర్ పర్యటించారు. జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో ఆయన ఏసీపీ సయ్యద్ ఫయాజ్, సిబ్బందితో కలిసి అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బోనాలతో వచి్చన మహిళలతో ముచ్చటించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకగా బోనాల పండుగను జరుపుకోవాలని ఆకాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కోటకు బయలెల్లిన అమ్మవారులంగర్హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు అమ్మవారికి తొట్టెల, పట్టు వ్రస్తాలు సమర్పించగా అమ్మవార్ల సోదరుడు పోతరాజులు చెర్నకోలలను జులుపుతు నృత్యాలు చేస్తు ఊరేగింపును కోట వైపు తీసుకువెళ్లారు. చోటాబజార్‌లో పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు శివరాజ్ స్వామి బంగారు పల్లకిని తలపై మోపుకొని ఊరేగింపు కోటపై వెలసిన జగదాంబ ఆలయానికి సాగింది. డీసీపీ రాఘవేందర్ రెడ్డి, ఏసీపీ సయ్యద్ ఫయాజ్, రాజు వస్తాద్, నాగన్న అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. -
జగన్నాథుని రథయాత్ర ఎక్కడిదాక సాగిందంటే..! ఆఖరికి వరుణుడు సైతం..
నీలిమేఘశ్యాముడు నేల మురిసేలా గర్భగుడి వదిలి భక్తుల వద్దకు కదిలి వచ్చాడు. శ్రీమందిరం పరిసరాలను పావనం చేస్తూ చిరు మందహాసుడై రథాన్ని అధిరోహించాడు. ఆకాశాన్ని తాకే జై జగన్నాథ నినాదాలు మార్మోగగా బలభద్రుడు, సుభద్రతో కలిసి గుండిచాకు బయల్దేరాడు. రథాలు ముందుకు కదలడం మొదలవ్వగానే భక్తులు మురిసిపోయారు. దేవ దేవుడిని కనులారా చూసుకొని.. మనసారా మొక్కుకొని పరవశించిపోయారు. భక్తుల వద్దకు దారుబ్రహ్మ నందిఘోష్ రథంపై వస్తున్న దృశ్యాన్ని వరుణుడు సైతం వీక్షించాడు. అనంతరం కొంతదూరం కదిలిన పతితపావనుడు.. మిగతా దూరం మరుసటి రోజు వెళ్దామని భక్తులకు సందేశమిచ్చాడు. శ్రీమందిరం వదిలి భక్తుల వద్దకు బయల్దేరిన జగతినాథుడికి నింగి, నేల స్వాగతించాయి. సుగంధ భరిత పుష్పాదుల మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం దాటి నేలంతా విస్తరించిన ఆశేష భక్తజనం మధ్య ప్రత్యక్షమై జనులకు నల్లనయ్య తొలి దర్శనం అనుగ్రహించాడు. ఈ అపురూప క్షణాల్లో ఆకాశం నుంచి వర్షపాతం శీతల పుష్పాంజలిగా నేల జారింది. అత్యంత భక్తిపూర్వక వాతావరణంలో సేవాయతుల సమూహం గర్భగుడి నుంచి మూలవిరాటులను వరుస క్రమంలో రథాలపైకి తరలించి గొట్టి పొహండి కార్యక్రమం జయప్రదం చేశారు. వరుస క్రమంలో మొదటిగా చక్రరాజ ప్రభువు సుదర్శనుడు దేవదళన్ రథంపైకి తరలివెళ్లాడు. పుష్ప మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం గుండా తాళధ్వజ రథంపైకి బలభద్ర స్వామి చేరిన తర్వాత, దేవీ సుభద్రమూర్తిని దర్ప దళనంపై ఆసీనం చేశారు. చివరగా శ్రీజగన్నాథుడు భక్త జనాన్ని తన్మయం చేస్తూ జై జగన్నాథ్ నినాదాల మధ్య నందిఘోష్ రథానికి చేరాడు. సుదీర్ఘంగా 5 గంటల పాటు నిరవధికంగా కొనసాగిన గొట్టి పొహండిలో చతుర్థామూర్తుల మూల విరాటులు సురక్షితంగా రథాలపైకి చేరాయి. మృదంగ వాద్యాల నడుమ శంఖ ధ్వని, ఘంటానాదాల గంభీర ప్రతిధ్వనులు, మృదంగ వాద్యాల మంగళ నినాదాలు, భక్త జనుల హరిబోల్ నామ సంకీర్తనలు, మహిళల పవిత్ర హుల్హులీ (ఉల్లాలు) ధ్వనులతో దిక్కులన్నీ దివ్యమైనవేళ అఖిలాండ కోటి బ్రహా్మండ నాయకుడు జగత్తుకు నాథుడైన శ్రీజగన్నాథ మహా ప్రభువు తన అగ్రజుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రతో కలిసి గుండిచా మందిరం వైపు మహోన్నత రథయాత్రకు బయల్దేరాడు. ఏటా మాదిరి ఆషాఢ శుక్ల ద్వితీయ పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో ప్రారంభమయ్యే వార్షిక రథయాత్ర వైభవోపేతంగా ఆరంభమైంది. జగన్నాథుని అనేక మానవీయ దివ్యలీలల్లో ఇది అత్యంత అపూర్వమైన, అత్యంత హృద్యమైన ఘట్టంగా భావించబడుతుంది. తొమ్మిది రోజుల ఈ నవ దినాత్మక దివ్య యాత్రలో చిత్ర విచిత్రమైన లీలావిలాసాలతో ఆలయ గర్భ గృహాన్ని విడిచి భక్తుల మధ్యకు విచ్చేసే జగన్నాథుడు జాతి, మత, వర్ణ, భాష భేదాలకు అతీతంగా సమస్త జీవ రాశులకు తన కరుణాకటాక్షాలను ప్రసాదించి వారిని పుణీతులను చేస్తాడు. అందుకే రథయాత్రను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా సర్వజనోద్ధారణకు, సమానత్వానికి, విశ్వబాంధవ్యానికి ప్రతీకగా భక్తజనం భావిస్తారు. బంగారు పిడి చీపురుతో ఊడ్చి శ్రీ మందిరంలో మంగళ హారతి, మైలమ్, ప్రభాత శుద్ధిసేవ, అలంకరణ పూర్తి చేసి సూర్యపూజ, ద్వార పాలకుల పూజ, గోపాల వల్లభ పూజాదులు నిర్వహించారు. ఆలయం వెలుపల దేవతలు యాత్ర చేసే 3 రథాల ప్రతిష్ట ముగించి చతుర్థామూర్తుల మూల విరాటులను ఒక్కోటిగా రథాలపైకి వరుస క్రమంలో తరలించారు. అనంతరం మదన మోహనుడు, రామకృష్ణులు తదితర ఉత్సవమూర్తులను సంబంధిత రథాలపై ఆసీనం చేశారు. రథాలపై దేవుళ్ల అలకంరణ పూర్తి కావడంతో పూరీ గజపతి మహారాజా స్వామి సేవకునిగా 3 రథాలను బంగారు పిడి చీపురుతో ఊడ్చి శుచి కర్మలు శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ తంతు ముగియడంతో రథాలకు కొయ్య గుర్రాలు, ద్వార పాలకులు, రథ సారథులు ఏర్పాటు చేసి చారుమళ్లు (తాత్కాలిక తాటి మట్టల మెట్లు) తొలగించి యాత్రకు సిద్ధం చేశారు. నేడు యాత్ర కొనసాగింపు శుక్రవారం ప్రాతఃకాల సేవాదులు పూర్తి చేసిన తర్వాత రథాలు లాగడం పునరుద్ధరిస్తారు. అంతవరకు ఆగిన చోటే రథాలపై దేవుళ్లకు నిత్య, దైనందిన, యాత్ర సేవాదులు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ నిడివిలో రథాలపై దేవుళ్లని యాత్రికులు, భక్తులు దర్శించుకునే అవకాశం కలిసి వస్తుంది.గమ్యం చేరని రథాలుయాత్ర సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అవాంఛనీయ జాప్యం కారణంగా రథాలు నిర్ధారిత వేళలో గమ్యం చేరలేకపోయాయి. సాయంత్రం 5.10 గంటల నుంచి రథాల కదలిక ఆరంభించి 7.25 గంటల వరకు రథాలు లాగడం కొనసాగించారు. అయితే చీకటిపడడంతో ఆలయ సంస్కారాల ప్రకారం రథాలు లాగడం మర్నాటికి వాయిదా వేశారు. తొలుత బలభద్ర స్వామి రథం కదలగా వెంబడి దేవీ సుభద్ర రథం యాత్ర ప్రారంభమైంది. చివరగా శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం నెమ్మదిగా మొదలైంది. మొదట బయల్దేరిన బలభద్ర స్వామి రథం జనతా సినిమా హాలు సమీపంలో నిలిపివేశారు. దేవీ సుభద్ర రథం దర్పదళనం మారీచ్‌కోట్ వరకు ఆగిపోయింది. చివరగా బయల్దేరిన జగన్నాథుని నందిఘోష్ రథం లాంచనంగా కొద్దిదూరం కదిలిన తర్వాత నిలిపివేశారు. రథ ప్రతిష్ట జగన్నాథుడి రథయాత్ర జయప్రదం అయ్యేందుకు ముందుగా రథ ప్రతిష్టని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆచారం. ఆధ్యాత్మిక వాతావరణంలో మూడు రథాలపై పతాకాలు, కలశాలను ప్రతిష్టించి గురువారం 8.45 గంటలకు రథత్రయం ప్రతిష్ట పూర్తి చేయడంతో, గర్భగుడి నుంచి మూల విరాటులు వరుస క్రమంలో రథాలపైకి వేంచేశారు. వరుణుడి రాక ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలు రథయాత్ర ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. గత 48 గంటల్లో పూరీ నగరంలో 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం పూరీ నగరంలో గంటకు 1 నుంచి 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కొనసాగుతోంది. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు బొడొ దండొకు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న అల్పపీడన వ్యవస్థ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డాహుక డక్కువా రథయాత్రలోని అత్యంత విశిష్టమైన సంప్రదాయాల్లో డాహుక డక్కువా ఒకటి. రథ డాహుకాలు అనే వారు పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో సేవచేసే వంశపారంపర్య సేవాయతుల బృందం. రథయాత్ర సమయంలో వారు దేవతామూర్తులతో పాటు రథాలపై సవారీ చేస్తూ ఈ పవిత్ర యాత్రకు నాంది పలుకుతారు. శతాబ్ధాల నాటి లయబద్ధమైన పద్య గానమైన డాహుక డక్కొ (డాహుక బోలి)ను ప్రదర్శిస్తారు. డాహుక తన లయబద్ధమైన గానంతో ఉద్బోధను ప్రారంభించేంత వరకు రథాలు కదలవని నమ్ముతారు. రథంపై నిలబడి ప్రాచీన శ్లోకాలను పఠిస్తూ, తన చేతిలోని కరత్రో రథాన్ని లాగే ప్రక్రియకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. పరోక్షంగా వీరి నుంచి సంకేతం రథాల కదలికకు సానుకూల పరిస్థితులని నిర్ధారించి సుగమం చేస్తుంది. పుష్ప సోయగం యాత్ర శోభతో శ్రీమందిరం పరిసరాలు పుష్పాల సుగంధంతో గుభాళించాయి. సింహద్వారం నిలువెత్తు పుష్ప సోయగం ఆహ్లాదభరితంగా పలకరించింది. చిత్తాభరణ శోభ యాత్ర ఆద్యంతాలు స్వామి కళకళలాడుతూ భక్త జనులను మురిపిస్తుంటాడు. రథాలపై ఆసీనుడు కావడంతో నుదుట వజ్ర వైడూర్య తదితర రత్న ఖచిత చిత్తాభరణం ధరించి మెరిసిపోయాడు. ప్రత్యేక తిథులు, ఉత్సవాలు సందర్భంగా మూలవిరాటుల నుదుట రత్నాలు పొదిగిన ఈ అమూల్య ఆభరణం అలంకరిస్తారు. (చదవండి: జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..) -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్


