జీవన సమరానికి గీతాఖడ్గం | Importance of bhagavad gita in our life | Sakshi
Sakshi News home page

జీవన సమరానికి గీతాఖడ్గం

Nov 3 2025 2:40 PM | Updated on Nov 3 2025 5:01 PM

Importance of bhagavad gita in our life

జ్ఞానామృతం 

గీత అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కేవలం మేధస్సుతో పొందేదికాదు. భక్తి, ధ్యానం ద్వారానే అది పరిపూర్ణమ వుతుంది. విజయుడు అంటే బయటి శత్రువులను జయించిన వాడు కాదు, తన అంతరంగ శత్రువులైన కోపం, భయం, మోహం, అసూయలను జయించిన వాడే అసలైన విజేత. మనిషి పతనం బయటి పరిస్థితుల వల్ల రాదు. అది అంతరంగ బలహీనతల ఫలితం. అలాగే ఉన్నతి ఎవ్వరూ ప్రసాదించలేరు. అది ఆత్మవిశ్వాసం, ఆత్మజయంతోనే సాధ్యమవుతుంది. 

ఇప్పటి సమాజంలో మానవ జీవనం చాలా సంక్లిష్టం. ఉద్యోగ భారం, కుటుంబ బాధ్యతలు, సామాజిక ΄ోటీలు, భవిష్యత్తు భయాలు ఇవన్నీ మనసును అల్లకల్లోలంగా మార్చుతున్నాయి. మనసు ఒకవైపు ఆకాంక్షలతో పరుగెత్తుతుంటే, మరొకవైపు నిరాశలతో కుంగి΄ోతుంది. ఈ సందిగ్ధంలో గీత బోధించే తాత్పర్యం మనసుకు శాంతి, బుద్ధికి స్పష్టత, ఆత్మకు దిశ చూపిస్తుంది. అర్జునుడు నైరాశ్యంలో ఉన్నప్పుడు కృష్ణుడు జ్ఞానాన్ని బోధించాడు. మనం కూడా నిరాశలో ఉన్న ప్రతి సందర్భంలో గీత మనలోని ఆత్మస్థైర్యాన్ని మేల్కొలు పుతుంది.

ఇదీ చదవండి: నీతా అంబానీకి స్టాఫ్‌ సర్‌ప్రైజ్‌ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూశారా?

గీత బోధించే సమత్వం జీవన గర్భరహస్యం. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవన్నీ జీవనయాత్రలో సహజమైనవి. ఆ ప్రవాహంలో కొట్టుకు΄ోకుండా స్థిరంగా నిలబడగలగడమే గీత వలన మనం పొందే శిక్షణ. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడమే గీతాజ్ఞానం. గీతలోని వైరాగ్య భావం అత్యున్నత విముక్తి. తామరాకుమీద నీటిబిందువులా జీవనం కొనసాగిస్తూ లోకబంధనాలకు అతీతంగా ఉండగలగడం అనాసక్తి. ఇది త్యాగం కాదు, సంసారంలోనే ఉండి కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తించడం.

భగవద్గీత ఒక శాస్త్రగ్రంథం కాదు. కాలాతీత మానసికశాస్త్రం, ఆత్మవికాస శస్త్రం. ఇది యుగాల మార్పులోనూ, నాగరికతల పరివర్తనలోనూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నేడు శాస్త్రవేత్తలు విశ్వరహస్యాలను అన్వేషిస్తుంటే, గీత మనలోని ఆత్మరహస్యాన్ని వెలికితీస్తుంది. శరీరాన్ని సంరక్షించేది వైద్యం అయితే, ఆత్మను కాపాడేది గీత. 

ఇదీ చదవండి: భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనం

మనసును జయించడం ద్వారా మనిషి విశ్వాన్ని జయించగలడు. కో;eన్ని అధిగమించడం ద్వారా భయాన్ని జయించగలడు. అనాసక్తితో విముక్తిని పొందదగలడు. కర్తవ్యాన్ని ఆరాధనగా భావించడం ద్వారా జీవితం పవిత్రమవుతుంది. జ్ఞానం వెలుగుతో ఆత్మజ్యోతి ప్రసరిస్తుంది. ఇదే గీతామాధుర్యం. ఇదే యుగయుగాలకీ తియ్యని జ్ఞానామృతం. 

– సత్యశ్రీ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement