
నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం
విద్యానగర్(కరీంనగర్): శివకేశువుకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే. కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. సూర్యోదయానికి ముందే నదీస్నానం చేసి శివకేశవ పూజలు చేస్తారు. ఈ మాసంలో శివుడికి దీపారాధన చేసి పూజలు చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుందిని.. తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే చాలా మంది శివ భక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
తెల్లవారు జామునే నిద్రలేవడం. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం భోళాశంకురునికి నిత్యం రుద్రాభిషేకం చేయడం. మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం. ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను అచరించడం ఈ మాసం ప్రత్యేకత. కత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్నికి మారుపేరు రుద్రుడు, విష్ణుప్రీతి కోసం ఈనెల రోజులు దీపారాధన చేయాలి. ప్రతీ ఆలయంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులకు ధనం, పురుషులకు గృహæస్తులు, భోగమోక్షాలు లభించడంతో పాటు వానప్రస్థ ఆశ్రమాలలో ఉండే వారికి జ్ఞాన వైరాగ్యత, స్త్రీలకు మోక్షం కలుగుతుంది.
కార్తీక మాసంలో ఫలాలు దానం చేయడం వల్ల అపమృత్యువు నశిస్తుంది. ప్రత్యేకంగా ఉసిరిక ఫలం దానం చేయడం ద్వారా సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది. శివపూజ చేయడం వల్ల నవగ్రహా బాధ నివరణ లభిస్తుంది. గుమ్మడి కాయ దానం చేయడం వల్ల యమదూతలు దూరంగా ఉంటారు. కార్తీక మాసంలో ఆవునెయ్యితో వత్తులు వెలిగించి ఆకుడోప్పల్లో ఉంచి నీటి ప్రవాహంలో వదలడం, కుమార్తెలకు వివాహాలు, కుటుంబ సభ్యులతో వనభోజనాలు, ఉసిరి, తులసి చెట్లకు పూజలు, విష్ణుమూర్తి కల్యాణం, నాగుపాములకు పూజలు, శ్రీసుబ్రహ్మణ్యస్వావిుకి పూజలు, దీపారాధన చేయడం మహా మహిమోపితమైనది. ఇంటి ముందు ముగ్గులు పెట్టి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి గౌరీ పూజలు చేయడం వల్ల ఆర్థిక బాధల నుంచి విముక్తి కలుగుతుంది.