యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, వీడియో వ్లోగర్ అన్వేష్‌కు మరో షాక్ తగిలింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దూషించాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అన్వేష్‌ను దేశ ద్రోహిగా ప్రకటించాలని.. భారత దేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.నా అన్వేషణ అనే చానెల్స్, పేజీలతో అన్వేష్ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే.. అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. దేవుళ్లను దూషించినందుకు సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో అన్వేష్ఫై 352, 79, 299 BNS SEC 67IT ACT నమోదు చేశారు. త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట పోలీసులు అంటున్నారు.మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వరుస వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందూ దేవతలను కించపర్చే విధంగా మాట్లాడటంతో అన్వేష్‌పై అటు హిందూ సంఘాలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు. మరో వైపు, ఈ పరిణామాల తర్వాత అన్వేష్ సోషల్ మీడియా ఖాతా నుంచి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు తప్పుకుంటున్నారు. ‘‘నా అన్వేష్ యూట్యూబ్’ ఛానల్‌ను గత రెండ్రోజులుగా లక్షల మంది అన్ సబ్స్క్రయిబ్ చేశారు. ఆ తర్వాత మరో వీడియోలో తాను చేసిన వ్యాఖ్యలకు అన్వేష్ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు.
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో నత్త కనిపించిన విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రసాదంపై నత్త వచ్చిందని చెప్పిన భక్తులపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడంతో భక్తులపై పోలీసులు కేసు పెట్టారు. భక్తులపై BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రసాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండగా.. విచారణ చేపట్టకుండా.. భక్తులపై కేసు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు.🚨 #SaveSimhachalamFromTDPసింహాచలం ఆలయంలోని ప్రసాదంలో నత్తహిందూ దేవాలయాల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం. దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటకాల అవశేషాలుఇదేనా @ncbn ఆలయాల ప్రక్షాళన అంటే?#SaveDevoteesFromTDP#APisNotinSafeHands… pic.twitter.com/1Hm7YhOK7O— YSR Congress Party (@YSRCParty) December 30, 2025ఇక, దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ కాఫీ షాప్‌కి వెళ్లాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?
సాహసమే చేయ్‌రా డింభకా. అన్నది కదరా పాతాళభైరవి. చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది అన్న పాట పాడుకుంటూ సాహసం చేయాల్సిందే అక్కడ కాఫీ కోసం. హాయిగా ఆస్వాదించే కమ్మటి కాఫీ కోసం అంత కష్టపడటం ఏంటి అనుకోకండి. ఎందకంటే ఇక్కడ కాఫీ షాపు వెళ్లడం అంటే డేరింగ్ టూర్ లాంటిది. నిజానికి ఇక్కడకు కాఫీ కోసం వెళ్తున్నట్లు ఉండదు..ఏదో పర్యాటకానికి వచ్చామా..అన్నట్లు ట్రెక్కింగ్‌లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పోవాలి. అలా అని వాళ్లేమి మనకు టాస్క్‌లు, సరదా గేమ్‌లు పెట్టడం లేదు. ఆ కాఫీ షాపుకు వెళ్లే వే అలా సాహసానికి కేరాఫ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడుందంటే..చైనాలోని యాంగ్షువో కౌంటీలోఈ వింతైన షాపు ఉంది. దీనిని 'ఎర్త్కోర్ ఎక్స్‌ప్లోరేషన్' అని పిలుస్తారు. ఒక గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలా అని అంత ఈజీగా అది మనకు కనిపించదు. సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లాలంటే అడుగడుగున ఓ సాహాసం చేయాలి, కొన్ని క్లిష్టమైన టాస్క్‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్తునప్పుడూ మన కాఫీ కోసం వెళ్తున్నామా..లేక ఏదైనా ట్రెక్కింగ్ లేదా టూర్‌కి వచ్చామా అనే సందేహం కలుగకమానదు. అంతేకాదండోయ్ ఈ గుహ గుండా వెళ్లేటప్పుడూ హెల్మెట్, సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గట్లు, ఇరుకైన మార్గాలు, లోతుగా ఉండే ప్రదేశాలు, కొన్నిచోట్ల తాళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని చోట్ల..నిర్జన చీకటి ప్రదేశం గుండా వెళ్లి..అక్కడ వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. అలా చివరికి కాఫీ కేఫ్‌కి చేరుకుంటాం. అక్కడ సున్నపురాయి నిర్మాణాలు, స్టాలక్టైట్లు(మంచులా కనిపించే కాల్షియం కార్బొనేట్ అవపాతం), పైకప్పులు, చక్కటి లైటింగ్‌తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అరకరడ ఉన్న శ్వేత నేపథ్యానికి తగ్గట్టు ఉండే తెల్టి కుర్చీలు మొత్తం సెటప్ అదరహో అనిపిస్తుంది. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఈ కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా టేస్టీ కాఫీని ఆస్వాదించాల్సి ఉంటుంది మరి. మాములుగా కాఫీ తాగేస్తే మజా ఏం ఉంది..ఇలా డేరింగ్ ఫీట్లు చేస్తూ వెళ్లి కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా..!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Jérôme Poirier (@jerometraveller) (చదవండి: Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..)
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ‘స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేనే పిల్ దాఖలు చేశాను.దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇదిలా ఉంటే, స్కిల్ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు సీఐడీ చర్యలు చేపడతున్నట్లు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సీఐడీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతోంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును ముగిస్తే, పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది.అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా. అంతేకాక అలా కేసును మూసేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సీఐడీ కేసును కొట్టేయాలని కోరుతూ ఆ కేసులో 37వ నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి.’ అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు.
లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
గ్రెగ్ అబెల్ చేతికి బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు
కోడలికి మేడలు లేవని చెబుతాం!
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్!
దానాలతో ఇల్లు గుల్ల.. ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మా!
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి: నవీన్ పొలిశెట్టి
ప్రాణాపాయ స్థితిలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం
ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
ట్రాప్ చేసి సర్వం దోచుకున్న నయవంచకుడు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపార అభివృద్ధి
మెటల్స్.. క్రాష్
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంటే.. ఇంకా ఏమీ చేయడం లేదని అంటారేంటయ్యా!
మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
గ్రెగ్ అబెల్ చేతికి బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు
కోడలికి మేడలు లేవని చెబుతాం!
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్!
దానాలతో ఇల్లు గుల్ల.. ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మా!
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి: నవీన్ పొలిశెట్టి
ప్రాణాపాయ స్థితిలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం
ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
ట్రాప్ చేసి సర్వం దోచుకున్న నయవంచకుడు
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపార అభివృద్ధి
మెటల్స్.. క్రాష్
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంటే.. ఇంకా ఏమీ చేయడం లేదని అంటారేంటయ్యా!
మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
ఫొటోలు
న్యూ ఇయర్ వేళ..రారండోయ్ ముగ్గులు వేద్దాం..!
తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)
హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)
జనాలకు భరోసా కల్పిస్తూ జగన్ ప్రయాణం.. 2025 రౌండప్ చిత్రాలు
‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)
భర్తతో హనీమూన్ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)
రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)
అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)
చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)
సినిమా
అమ్మ ఒడిలో తలపెట్టుకుని బాధ.. ఉద్యోగం చేయాల్సింది!
ఈ ఏడాది బోలెడు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం 2001 సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.అదీ నా పరిస్థితి!ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా రిలీజైనరోజు పడ్డ టెన్షన్ గురించి ఓపెనయ్యాడు. నువ్వు నాకు నచ్చావ్ మొదటిరోజు టాక్ విని భీమవరం వెళ్లిపోయాను. సంతాపసభలో ఉన్నోడిలా ఉంది నా పరిస్థితి!అమ్మ ఒడిలో తలపెట్టుకునిసినిమా చూసి బయటకు వచ్చాక ఎలా ఉందని ఓ వ్యక్తిని రివ్యూ అడిగా.. అతడు రెండు, మూడు వారాలు ఆడుతుందంతే అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికెళ్లి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. ఈ సినిమాలకు నేను పనికిరానేమో.. నువ్వు అన్నట్లుగానే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేదన్నాను. మా అమ్మ బెంబేలెత్తిపోయింది.చెమటతో ఒళ్లు తడిచిందికట్ చేస్తే నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫోన్ చేసి హైదరాబాద్‌కు రమ్మన్నారు. నన్ను శాంతి థియేటర్‌కు తీసుకెళ్లారు. నాకు చెమట్లతో ఒళ్లు తడిచిపోయింది. అక్కడ టికెట్లు తెగుతుంటే అప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని, త్రివిక్రమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 2025లో హీరోలు కనిపించలేదు!
హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
హీరో విజయ్‌కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్ నటుడు కబీన్ దుహాన్ సింగ్ మరో విలన్‌గా యాక్ట్ చేశాడు.జనవరి 2న రిలీజ్అభిషేక్, ఇళంగో కమరవెల్, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్, అశోక్ పాండియన్, జాన్సన్ దివాకర్, వినోద్ సాగర్, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.హీరో లేడుసోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని నటించానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి..ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్‌లో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్ నిర్వహించినట్లు చెప్పింది. విజయ్ సరసన నటిస్తావిజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్ హీరోయిన్గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్ హక్కులను రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది.
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్‌కు ఛాన్స్!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు. సుందర్.సి అవుట్అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్‌కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్‌కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్‌కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్‌కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్తగా ఆయన పేరు తెరపైకి..అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి!
బై బై 2025
2025కి నేటి అర్ధరాత్రితో శుభం కార్డు పడినట్టే. ప్రపంచమంతా 2025కి బై బై చెప్పేసి.. 2026కి వెల్కమ్ చెప్పబోతోంది. చిత్ర పరిశ్రమ కూడా కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతోంది. 2025లో పెద్ద, చిన్న సినిమాలు కలిపి తెలుగులో దాదాపు 250 విడుదలయ్యాయి. అయితే విజయాల శాతం తక్కువే. ఈ ఏడాదిలో రిలీజైన సినిమాలు, హిట్ అయినవి, ప్రేక్షకులను మెప్పించినవి, మెప్పించే ప్రయత్నం చేసిన చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.⇒ జనవరిలో టాలీవుడ్ అంటే సంక్రాంతి సినిమాలను గురించే ప్రధానంగా చర్చించుకుంటారు. 2025 సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదలయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి 2025 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. దర్శక–నిర్మాత సుకుమార్ తనయ సుకృతి వేణి లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఈ మూవీతో సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే జనవరి 24నే విడుదలైన ‘హత్య’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ⇒ ఫిబ్రవరి నెలలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలయ్యాయి. నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చారు. ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచగా, ‘బాపు’, ‘రామం రాఘవం’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశాయి. ⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘కోర్ట్’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ‘మ్యాడ్ 2’ చిత్రం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. నితిన్ ‘రాబిన్ హుడ్’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.⇒ ఏప్రిల్‌లో పదిహేడు సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. తమన్నా ‘ఓదెల 2’, కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’, ఇంద్రరామ్ ‘చౌర్యపాఠం’, ప్రదీప్ మాచి రాజు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. ⇒ మే నెల ఆరంభంలో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ రిలీజై యాక్షన్ ఆడియన్స్ ను అలరించింది. శ్రీవిష్ణు ‘సింగిల్’ సినిమా హిట్‌గా నిలిచింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘భైరవం’ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేసింది. సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’, రాజేంద్ర ప్రసాద్ ‘షష్ఠిపూర్తి’ వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ⇒ జూన్ లో పదికంటే తక్కువ చిత్రాలే విడుదలయ్యాయి. నాగార్జున, ధనుష్‌ల ‘కుబేర’ హిట్‌గా నిలిచింది. అనంతిక సనీల్‌కుమార్ ‘8 వసంతాలు’ సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ⇒ జూలైలో 18 సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో నితిన్ ‘తమ్ముడు’, పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ వంటి సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలయి, ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ ఫిల్మ్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ⇒ ఆగస్టు నెలలో దాదాపు 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘థ్యాంక్యూ డియర్, బకాసుర రెస్టారెంట్, పరదా, యూనివర్శిటీ, సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్’ వంటి సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. ⇒ సెప్టెంబరులో కేవలం ఎనిమిది చిత్రాలు ఆడియన్స్ ముందుకొచ్చినప్పటికీ విజయాల శాతం ఎక్కువగా ఉంది. అనుష్క ‘ఘాటీ’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’, తేజా సజ్జా ‘మిరాయ్’, పవన్ కల్యాణ్ ‘ఓజీ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలు విజయం సొంతం చేసుకున్నాయి . ⇒ అక్టోబరులో దాదాపు డజను సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. వీటిలో అనసూయ, సాయికుమార్ ‘అరి’, రక్షిత్ శెట్టి ‘శశివదనే’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’, కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’ మాత్రం హిట్‌గా నిలిచింది. ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ కూడా ఆడియన్స్‌ని అలరించింది. ⇒ నవంబరులో సుమారుపాతిక చిత్రాల ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో సుధీర్ బాబు ‘జటాధర’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, విక్రాంత్ రెడ్డి ‘సంతాన ప్రాప్తిరస్తు, ‘అల్లరి’ నరేశ్ ‘12 ఎ రైల్వే కాలనీ’, రాజ్ తరుణ్ పాంచ్ మినార్’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, అఖిల్ రాజ్ ‘రాజు వెడ్స్ రాంబాయి’, రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ⇒ 2025లో ఆఖరి నెల అయిన డిసెంబరులో దాదాపు పదిహేను సినిమాలకుపైగా వెండితెరపైకి వచ్చాయి. వాటిలో బాలకృష్ణ ‘అఖండ 2:తాండవం’, రోషన్ కనకాల ‘మోగ్లీ’, నరేశ్ అగస్త్య ‘గుర్రంపాపిరెడ్డి’, హెబ్బా పటేల్ ‘మారియో’, నవదీప్ ‘దండోరా’, త్రిగుణ్, అఖిల్ రాజ్ ‘ఈషా’, ఆది సాయికుమార్ ‘శంబాల’, మోహన్‌లాల్ ‘వృషభ’ వంటి సినిమాలున్నాయి. వీటిలో ‘అఖండ 2: తాండవం’, ‘గుర్రంపాపిరెడ్డి’, ‘దండోరా’, ‘ఈషా’, ‘శంబాల’, ‘వృషభ’ వంటి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.
క్రీడలు
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.వాగ్యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్‌గా లేడని.. అందుకే ఈ టూర్‌కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్‌గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ఇంకా పోటీలోనే ఉన్నాడుఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.కివీస్‌తో సిరీస్‌కు.. వరల్డ్‌కప్‌కూ ఎంపిక కావొచ్చు!అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్‌లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్‌కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.మెరుగైన ప్రదర్శనఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
భారత ఆల్‌రౌండర్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత మహిళా జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో పదిహేను పరుగుల తేడాతో నెగ్గి మరోసారి ఆధిపత్యం కనబరిచింది. సిరీస్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించి 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సాధించింది. శ్రీలంక బ్యాటర్ నీలాక్షిక సిల్వాను లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనక్కి పంపిన ఈ రైటార్మ్ బ్రేక్ స్పిన్నర్.. అంతర్జాతీయ టీ20లలో 152వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.𝗟𝗕𝗪 ☝️🎥 The moment Deepti Sharma became the most successful bowler in women's T20Is 😎Updates ▶️ https://t.co/E8eUdWSQXs#TeamIndia | #INDvSL | @Deepti_Sharma06 | @IDFCFIRSTBank pic.twitter.com/zelk7cRLiw— BCCI Women (@BCCIWomen) December 30, 2025 తద్వారా మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ మేగన్ షట్ (151) పేరిట ఉండేది.హర్మన్, అమన్, అరుంధతి మెరుపులుకాగా లంకతో ఐదో టీ20లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (5), జి.కమలిని (12).. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లిన్ డియోల్ (13) తీవ్రంగా నిరాశపరిచారు.మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68) బాధ్యతాయుతంగా ఆడింది. ఆమెకు తోడుగా అమన్‌జోత్ కౌర్ (18 బంతుల్లో 21), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్) రాణించారు.సమిష్టిగా రాణించిన భారత బౌలర్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 175 పరుగులు స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65), వన్‌డౌన్ బ్యాటర్ ఇమేషా దులాని (50) అర్ధ శతకాలు వృథా అయ్యాయి.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌జోత్ కౌర్.. తలా ఒక వికెట్ తీసి సమిష్టిగా రాణించారు.నంబర్ వన్ ర్యాంకులోనే దీప్తి శర్మఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సమష్టిగా చెలరేగడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్‌లు మెరుగయ్యాయి. 738 రేటింగ్ పాయింట్లతో దీప్తి నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, భారత పేసర్ రేణుకా సింగ్ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుంది.705 పాయింట్లతో రేణుక...ఎంలాబా (దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ (505 ర్యాంకింగ్ పాయింట్లు) తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో షఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు పదో స్థానంలో ఉన్న ఆమె 736 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. ఒక స్థానం కోల్పోయిన జెమీమా రోడ్రిగ్స్ పదో ర్యాంక్‌కు పరిమితం అయింది. చదవండి: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి.. ఇంకో 25 పరుగులే!5⃣ matches5⃣ victories 👏#TeamIndia complete an emphatic series sweep with a 15-run win in Trivandrum 🥳Scorecard ▶️ https://t.co/E8eUdWSQXs#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/tV5VlXq5GB— BCCI Women (@BCCIWomen) December 30, 2025
రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...
లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌లకు గాను ఇచ్చిన మ్యాచ్ ఫీజుపై పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌ల్లో భాగంగా... ఈ నెల అర్జెంటీనాలో పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటికి సంబంధించిన రోజూవారీ భత్యాలు తాజాగా అందించారు. అయితే ముందు చెప్పిన దాంట్లో మూడో వంతు ఫీజులు కూడా ఇవ్వకపోవడంపై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడబోమని వెల్లడించారు. ఇది చాలా అవమానకరం‘అర్జెంటీనాలో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా రోజుకు 30,000 రూపాయలు ఇస్తామని ముందు చెప్పారు. కానీ దానికి బదులు రోజుకు 11,000 చొప్పున ఇచ్చారు. ఇది చాలా అవమానకరం. అంటే డాలర్ల రూపంలో చూసుకుంటే రోజుకు 110 డాలర్లు ఇస్తామని చెప్పి 40 డాలర్లు కూడా ఇవ్వలేదు. చెప్పిన దానికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది’ అని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లకు 30,000 రూపాయలు రోజూవారీ భత్యం చెల్లించాలనేది పాకిస్తాన్ హాకీ సమాఖ్య విధానం. మేము ఏమీ చేయలేంకానీ ప్రొ లీగ్ రెండు దశలకు జట్టు మొత్తం ఖర్చులను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు నిధులు సమకూరుస్తున్నందున ఈ విషయంలో మేము ఏమీ చేయలేం’ అని ఎఫ్ఐహెచ్ కార్యదర్శి రాణా ముజాహిద్ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనా అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైంది.
గుగులోత్ సౌమ్య ‘హ్యాట్రిక్’
కోల్‌కతా: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య... భారత మహిళల లీగ్ (ఐడబ్ల్యూఎల్)లో ‘హ్యాట్రిక్’తో విజృంభించింది. లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్న గుగులోత్ సౌమ్య... మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో... భారత మహిళల లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 9–0 గోల్స్ తేడాతో... సెసా ఫుట్‌బాల్ అకాడమీపై విజయం సాధించింది. సౌమ్య (6వ, 54వ, 86వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో దుమ్ము రేపగా... ఫాజిలా ఇక్వాపుట్ (9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో సత్తా చాటింది. సులాజన రౌల్ (18వ నిమిషంలో), రెస్టీ నాన్జిరి (40వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ ఈస్ట్ బెంగాల్ జట్టు తమ స్థాయిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ 9 పాయింట్లతో... పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్‌బాల్ అకాడమీ 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు ఒక ‘డ్రా’తో 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం నీతా ఫుట్‌బాల్ అకాడమీతో ఈస్ట్ బెంగాల్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకొని ప్రత్యర్థి పోస్ట్‌పై దాడి చేయగా... ప్రత్యర్థి గోల్‌కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే బాక్స్ సమీపంలో బంతిని అందుకున్న తెలంగాణ స్ట్రయికర్ సౌమ్య... గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ చక్కటి గోల్‌తో ఈస్ట్ బెంగాల్ ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత సుష్మిత డీప్ నుంచి ఇచ్చిన పాస్‌ను చక్కగా అందుకున్న షాజిలా మరో గోల్‌తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది. ఇక అక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్ పదేపదే దాడులతో రెచ్చిపోగా... వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టిన ఫాజిలా ‘హ్యాట్రిక్ పూర్తి చేసుకోగా... సులాజన రౌల్, రెస్టీ చెరో గోల్ సాధించారు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఈస్ట్ బెంగాల్ జట్టు 6–0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు గోల్స్ బాదగా... ఫాజిలా మరో గోల్ చేసింది. దీంతో ఈస్ట్‌బెంగాల్ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈస్ట్‌బెంగాల్ జట్టు తరఫున ఆల్‌టైమ్ టాప్ గోల్ స్కోరర్ (11)గా సౌమ్య నిలిచింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
బిజినెస్
న్యూజిలాండ్ ఎఫ్టీఏతో ఎగుమతులకు దన్ను
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఎగుమతుల మార్కెట్లపరంగా వైవిధ్యం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఎఫ్‌టీఏపై డిసెంబర్ 22న చర్చలు ముగియగా, వచ్చే ఏడాదిలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం భారత్‌లోకి న్యూజిలాండ్ నుంచి వచ్చే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానుండగా, ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ ఒప్పందంతో రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తులు మొదలైన వాటి ఎగుమతులు పెరిగేందుకు మరింతగా ఊతం లభిస్తుందని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు. భారత్ నుంచి అన్ని ఎగుమతులపై టారిఫ్‌లను తొలగించడం వల్ల న్యూజిలాండ్ మార్కెట్లో మిగతా ఉత్పత్తులతో దీటుగా మన ఉత్పత్తులు పోటీపడేందుకు వీలవుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఇక వ్యవసాయం, డెయిరీ, మౌలిక సదుపాయాల రంగాల్లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండటం దేశీయంగా సాగు రంగం ఉత్పాదకత పెరగడానికి తోడ్పడుతుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు, హై–టెక్ గేర్స్ చైర్మన్ దీప్ కపూరియా చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు పూర్తి స్థాయిలో బలోపేతం కావడానికి ఎఫ్‌టీఏ దోహదపడుతుందని జీటీఆర్ఐ పేర్కొంది.ఇదీ చదవండి: జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
బ్యాంకుల ఆరోగ్యం ఎంతో మెరుగు
బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఎంతో మెరుగుపడినట్టు ఆర్బీఐ నివేదిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా వసూలు కాని నిరర్థక ఆస్తులు (రుణాలు) 2025 మార్చి చివరికి దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 2.2 శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. బలమైన బ్యాలన్స్ షీటు, స్థిరమైన లాభదాయకత, మెరుగుపడిన ఆస్తుల నాణ్యతతో బ్యాంకింగ్ రంగం 2024–25లో బలంగా నిలిచినట్టు పేర్కొంది. రుణాలు, డిపాజిట్లు డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగాయని, మూలధన, మిగులు నిల్వలు నియంత్రణ పరిమితులకు ఎగువనే ఉన్నట్టు వెల్లడించింది. దీనికి వివేకవంతమైన నియంత్రణలు కలసి స్థిరమైన రుణ వితరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నట్టు తెలిపింది. అన్ని వాణిజ్య బ్యాంకుల లాభం గత ఆర్థిక సంవత్సరంలో 14.8 శాతం పుంజుకుని రూ.4.01 లక్షల కోట్లకు చేరుకుంది. 2023–24లో లాభం ఏకంగా 32.8 శాతం వృద్ధి చెంది రూ.3.5 లక్షల కోట్లకు చేరడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 2023–24తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో లాభాల వృద్ధి జోరు తగ్గనప్పటికీ, మెరుగైన పనితీరు నమోదైనట్టు తెలిపింది. ఆస్తులపై రాబడి (ఆర్వోఏ) 1.4 శాతంగా, మూలధనంపై రాబడి (ఆర్వో) 13.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. పట్టణ సహకార బ్యాంకుల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైనట్టు తెలిపింది. వాటి ఆస్తుల నాణ్యత వరుసగా నాలుగో ఏడాదీ మెరుగుపడినట్టు వెల్లడించింది. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు రుణాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయని, నిధుల నిల్వలు సమృద్ధిగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడినట్టు పేర్కొంది.తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులు విక్రయించొద్దు..కస్టమర్లను తప్పుదోవ పట్టించి ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడాన్ని నిరోధించేందుకు ఆర్బీఐ పూర్తిస్థాయి నిబంధనలను విడుదల చేయనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. తన నియంత్రణలోని ఆర్థిక సంస్థలు (బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు) ఆర్థిక ఉత్పత్తులు, సేవలను ఏదో రకంగా విక్రయించే చర్యలు అటు కస్టమర్లకు, ఇటు ఆర్థిక రంగానికి చేటు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. రుణ వసూలు ఏజెంట్లకు సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించి, ఈ దిశగా సామరస్యపూర్వక నిబంధలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. డిజిటల్, సైబర్ మోసాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు బలమైన అంతర్గత నియంత్రణలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆర్థిక ఆవిష్కరణలు, ప్రజా విశ్వాసం పెరుగుదల మధ్య సమతుల్యం, సుస్థిర అభివృద్ధి అన్నవి ఆర్బీఐ విధానాల్లో ఇక ముందూ ప్రముఖంగా కొనసాగుతాయని పేర్కొంది.తగ్గిన మోసాలు..2024–25లో బ్యాంకులు నివేదించిన సమాచారం ఆధారంగా మొత్తం మీద ఆర్థిక మోసాలు తగ్గినట్టు ఈ నివేదిక వెల్లడించింది. కార్డులు/ఇంటర్నెట్ మోసాలు మొత్తం మోసాల్లో 66.8 శాతంగా ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మోసాల కేసుల్లో 59.3 శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే నమోదయ్యాయి. మోసాల విలువ పరంగా చూస్తే 70.7 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్ పేజీలో పేర్కొంది. యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్ అడ్రెస్‌తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్‌లాంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్‌ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ కింద గూగుల్ అకౌంట్ సెటింగ్స్‌లోని ఈమెయిల్ సెక్షన్లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్‌లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలంటూ గూగుల్ సూచించింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం
నింగిలో విమానాలు నేలమీదే లాభాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ముందస్తు అంచనాలకు మించి ఉండనున్నాయి. గతంలో ఇవి రూ. 9,500–10,500 కోట్లుగా ఉంటాయని పరిశ్రమ భావించినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. విమాన ప్రయాణికుల రద్దీ తగ్గుదలతో పాటు ఇతరత్రా అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఇక దేశీ విమానయాన ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి గతంలో భావించినట్లుగా 4–6 శాతంగా కాకుండా 0–3 శాతం స్థాయికే పరిమితం కావొచ్చని అంచనాలను సవరించింది.ఎయిరిండియా బోయింగ్ 787–8 విమాన దుర్ఘటన, వేల కొద్దీ ఇండిగో విమాన సేవల రద్దుతో విమాన ప్రయాణాలపై సెంటిమెంటు దెబ్బతినడం ఇందుకు కారణమని పేర్కొంది. సీమాంతర ఉద్రిక్తతలతో విమాన సేవల్లో అంతరాయాలు, పలు సర్వీసులు క్యాన్సిల్ కావడంలాంటి అంశాల వల్ల ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ప్యాసింజర్ల రద్దీ, ఊహించిన దాని కన్నా తక్కువగా నమోదైనట్లు ఇక్రా వివరించింది. మరిన్ని విశేషాలు.. డిసెంబర్ 3–8 మధ్య ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాల వల్ల సుమారు 4,500 ఫ్లయిట్లు రద్దయ్యాయి. ఇవి మొత్తం పరిశ్రమ వార్షిక డిపార్చర్లలో 0.4% అయినప్పటికీ, విమాన ప్రయాణాలపై ఈ ఉదంతంతో ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల వృద్ధి 7–9 శాతానికి పరిమితం కావచ్చు. గతంలో ఇది 13–15%గా ఉంటుందని అంచనా వేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల వృద్ధి నెమ్మదించడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ మారకంపరమైన నష్టాలు పెరగడంలాంటి అంశాల వల్ల దేశీ విమానయాన పరిశ్రమ మరింతగా నష్టపోనుంది.2025 నవంబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ 1.54 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఇది 2024 నవంబర్‌లో నమోదైన 1.42 కోట్లతో పోలిస్తే 8.4%, ఈ ఏడాది అక్టోబర్‌లో రిజిస్టరయిన 1.40 కోట్లతో పోలిస్తే 10.1% అధికం. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య వార్షికంగా 2.2 % పెరిగి 10.96 కోట్లకు చేరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీ ఎయిర్‌లైన్స్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారి సంఖ్య వార్షికంగా 8.3 % పెరిగి 29.9 లక్షలకు చేరింది.
ఫ్యామిలీ
మెన్ ఇన్ 2025: వచ్చే ఏడాదైనా...మేల్ ఎంచుదాం!
‘వాడికేం మగాడు’ అనేవారు గతంలో. ‘అయ్యో... మగాడు’ అనేలా ఉన్నాయి రోజులు అనుకుంటున్నారు పురుషులు. 2025 సంవత్సరం పురుషుడిని మరింత ఒంటరిని చేసిందని పరిణామాలు చెబుతున్నాయి. ‘అవతార పురుషుడు’, ‘ఆపద్బాంధవుడి’గా గతంలో చెప్పబడిన పురుషుడు నేడు సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడని నిపుణులు అంటున్నారు. 2025లో పురుషుడి స్థితిగతులపై ఓ నజర్.మగాడి కోసం రెండు ప్రయివేటు బిల్లులు2025 ముగిసి, 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 365 రోజుల జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అని పురుషులని అడిగితే ‘అసలు తరచి చూసే అవకాశం, తీరిక మాకెక్కడిదీ’ అనేది పురుషుల మాట. హడావిడి, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక కష్టనష్టాలు... అన్నీ కలిపి నిమిషం తీరిక లేకుండా చేస్తే ఇక జీవితం ఎలా సాగుతోందో చూసి, అంచనా వేసే అవకాశం ఎలా ఉంటుంది? 2025లో పురుషుల సమస్యల మీద అనేకమంది వైద్య నిపుణులు, సామాజికవేత్తలు గొంతెత్తారు. ఆధునిక జీవనంలో అబ్బాయిల పరిస్థితి అధ్వానంగా మారిందని, సమస్యలు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక వారు అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రీల్స్‌లో ఒక జోక్... నలుగురు మగవారు ‘గోవాకు వెళదాం’ అని ΄్లాన్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడల్లా గోవా ΄్లానే. కాని సంవత్సరాలు గడిచిపోతాయిగానీ గోవాకు మాత్రం వాళ్లు వెళ్లరు. నిజానికి గోవాకు వెళ్లడం పెద్ద విషయం కాదు. తగినన్ని డబ్బులు అందరి దగ్గరా ఉంటున్నాయి. కాని కదల్లేని మెదల్లేని పరిస్థితులు నేడు పురుషుడి కనీస సరదాలను కూడా తీర్చడం లేదు.‘మగాళ్లు పైలాపచ్చీసు’గా తిరుగుతుంటారు అనేది పాతమాట. కనీసం రెండురోజుల లీవ్ దొరకని ఉద్యోగాల్లో వాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటున్నారని ఎవరికి తెలుసు?రైట్ టు డిస్ కనెక్ట్ బిల్మగవారు ఆఫీసులో ఉన్నంత సేపే డ్యూటీ చేసినట్టు కాదు.. ఇంటికొచ్చాక కూడా కాల్స్ అటెండ్ చేస్తూ ఆఫీస్ పని చేస్తూ అదనపు డ్యూటీ చేస్తూనే ఉంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు సర్వసాధారణం. మగవారికే కాదు పురుష/మహిళా ఉద్యోగులందరికీ పని గంటల తర్వాత ఆఫీసుతో డిస్కనెక్ట్ అయ్యే హక్కును ప్రతిపాదిస్తూ ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ను ప్రయివేటు బిల్లుగా 2025లో పార్లమెంట్ మెంబర్ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల్లో ఉంటే తప్ప ప్రతి ఉద్యోగంలో ఇలా డిస్కనెక్ట్ అయ్యే సౌలభ్యం మగవారికి ఉంటే వారు మరింత క్వాలిటీ లైఫ్‌ను అనుభవించగలరు.జాతీయ పురుషుల కమిషన్ పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించే చట్టబద్ధమైన సంస్థను రూ΄÷ందించడానికి ఈ ఏడాది తొలి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 6న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ‘జాతీయ పురుషుల కమిషన్ బిల్లు’ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. పురుషులపై చట్టపరమైన వివక్ష, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ చట్టాలలో పక్షపాతాలు, కొన్ని నేర నిబంధనల దుర్వినియోగాన్ని పరిశీలించడానికి సంస్థాగత యంత్రాంగం కావాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇలాంటి కమిషన్ ఉండాలని ‘భార్యా బాధితులు’ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2025లో కొన్ని భరణం కేసులు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయే విధంగా కోర్టు ముందుకు వచ్చాయి.ఆయుష్షు తక్కువ‘నూరేళ్లు వర్థిల్లు’ అనుకోవడమే గాని పురుషుడి ఆయుష్షును తగ్గించే విషయాల గురించి చింత ఉండటం లేదు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుష్షు నాలుగు సంవత్సరాలు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం దేశంలో సగటు ఆయుర్దాయం ఇప్పుడు 70.3 సంవత్సరాలు. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేరళలో 75.1 సంవత్సరాలతో అత్యధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, పురుషుల ఆయుర్దాయం జమ్మూ కాశ్మీర్లో 73.4 సంవత్సరాలు కాగా, మహిళలకు కేరళలో 78.4గా ఉంది. అత్యంత తక్కువ ఆయుర్దాయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అక్కడ పురుషులకు 62.4 సంవత్సరాలు కాగా, మహిళలకు 67.1 సంవత్సరాలు. పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా హృదయ సంబంధ వ్యాధులే కావడం గమనార్హం.పాపం ఒక్కడుఅవును! ఇంటికి అతను ఒకే ఒక్కడు. ఉమ్మడి కుటుంబాలు పోయి దేశంలో చిన్న కుటుంబాల వ్యవస్థ మొదలైన తర్వాత భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనే సంస్కృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మగవాడు భర్త బాధ్యతనంతా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య అతనికి సహకరిస్తున్నా పని ఒత్తిడి, బాధ్యతలు నిమిషం ఖాళీగా ఉంచడం లేదని నిపుణులు అంటున్నారు. పనులు పంచుకునేవారు లేక, కాసింత విశ్రాంతి దొరకక చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని అంటున్నారు. 2025లో పురుషుల మానసిక సమస్యల గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్యం అతడికే... జరిమానాలు అతడికే...పురుషుడు పని చేయాలంటే కాలు బయట పెట్టాలి. బయట అడుగుపెడితే కాలుష్యం, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.... ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే మన దేశంలో అత్యధిక పురుషులు టూ వీలర్ల మీద తిరుగుతూ కాలుష్యం బారిన పడుతున్నారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం వీరి సమస్య. చూపు మందగించడం, చర్మం ముడతలు పడిపోవడం వంటి సమస్యలకు లెక్కలేదు. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు చిన్నవయసులోనే బీపీ, డయాబెటిస్ బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు పురుషుల్లో సర్వ సాధారణం. ఇక వీరు ట్రాఫిక్ జరిమానాల బారిన పడుతూ అవి కట్టలేక చేసే ఆర్తనాదాలకు అంతు లేదు.బెట్టింగ్ బర్బాదీబెట్టింగ్ యాప్స్ ఎరకు చిక్కుకున్న పురుషుల పెను విషాదాలు 2025లో అత్యధికం చోటు చేసుకున్నాయి. మద్యం, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకున్నవారు కూడా సులభదారుల్లో డబ్బు వస్తుందని బెట్టింగ్ యాప్స్‌కు చిక్కుకుని ్రపాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఎక్కువ ఉంటే సైబర్ మోసగాళ్ల చేత చిక్కి వారు పెట్టమన్న చోట పెట్టుబడులు పెట్టి కోట్లు నష్టపోయిన వారిలో అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉన్నారు. జీవన తాత్త్వికత, జీవన సౌలభ్యాలు తెలుసుకోకుండా అసలు ఎటువంటి వివేచనాపూరిత ఆలోచనలు లేకుండా ఎక్కువ సంఖ్యలో పురుషులు ఉంటూ మూక స్వభావంతో జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. గడ్డం పురుష లక్షణంఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ ఇది పురుష ప్రపంచమే. పురుషులే ఆకర్షక శక్తులుగా నిలిచే ఆనవాయితీ పోలేదు. ఒకప్పుడు పురుషులు శుభ్రంగా గడ్డం గీసుకుని కనిపించేవారు. ఇప్పుడు గడ్డం కలిగి ఉండటం పురుష లక్షణంగా మారింది. 2025లో బారు గడ్డాల సౌందర్యంతో రణబీర్ కపూర్, రణధీర్ కపూర్‌తో మొదలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో సహా విరాట్ కోహ్లీతోపాటుగా హల్చల్ సృష్టించారు. ప్రస్తుతం ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా గడ్డం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తి స్త్రీ కాదు. అమెరికన్ గాయకుడు–గేయరచయిత డేవిడ్ ఆంటోనీ బర్క్ (ఈ4ఠిఛీ). మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ఐదుగురిలో నలుగురు మగవారే కావడం విశేషం. వారిలో తొలిస్థానం యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్రికెటర్లు ప్రియాంశ్ ఆర్య, అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు.ఎవరికీ చెప్పుకోలేక‘మగవాడివి.. నువ్వు ఏడవకూడదు’ అని చిన్ననాటి నుంచి వినే మాటలు, ఇంటా బయటా నూరిపోసే పురుష అహం ఆ సమయానికి బాగున్నా వయసు పెరిగే కొద్ది పురుషులను సతమతం చేస్తున్నాయి. దీంతో ఎంత కష్టం వచ్చినా బయటకి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన అధ్యయనాల్లో అనేకమంది పురుషులు తమ తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చిన్న చిన్నవి బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనో, ఎగతాళి చేస్తారనో లోలోపలే దాచుకొని కుమిలిపోతున్నారని తేలింది. ఉదాహరణకు ఇంట్లో అవమానకరమైన, సూటిపోటి మాటలు ఎదురవుతుంటే ఆ పురుషుల బాధ వర్ణనాతీతంగా ఉంది.ఒక ఉద్యోగం చాలదుఒక ఉద్యోగానికే సమయం సరిపోకపోతే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి స్థలాలు– ఇళ్ల ధరలు, ఇళ్ల అద్దెలు మగవాణ్ణి మరో ఉపాధిని కూడా వెతుక్కునే అగత్యానికి నెడుతున్నాయి. ఏ.ఐ ప్రవేశం తర్వాత ఉద్యోగాలు పోతాయన్న హెచ్చరికలు వారిని అభధ్రతలో నెడుతున్నాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టక తప్పని పరిస్థితో ఈఎంఐలకు చిక్కుకోత తప్పని పరిస్థితో నెలకొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని పురుషులు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగంతోపాటు పార్ట్‌టైం ఉద్యోగాలూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊబర్, ఓలా సర్వీసుల్లో ఇలాంటి మగవారు ఎందరో కనిపిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర కాచి పని చేస్తున్నారు.అనూహ్యమైన ఆమెభార్యాభర్తల అనుబంధం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది. దాని కోసం స్త్రీ, పురుషులిద్దరూ ఎన్నో త్యాగాలకు, సర్దుబాట్లకు సిద్ధమవుతూనే ఉంటారు. అయితే గతంలో గృహహింసలో మగవారి పాత్ర వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు స్త్రీ హింస వార్తలుగా కనిపించడం మగవారికి బెంబేలు పుట్టిస్తోంది. భర్తల ్రపాణాలకు భార్య వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితి రావడం 2025లో ఎక్కువ సంఘటనల వల్ల కనిపించిన సామాజిక విషాదం. ఇంత ప్రమాదం అరుదే అయినా భార్య నుంచి వేధింపులు, ఆమె కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ఇటీవల పెరిగాయని పురుషులు చేస్తున్న ఆరోపణ. నకిలీ వేధింపులు కేసులు, వరకట్న కేసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విడాకుల కోసమో, మరే కారణం చేతనో సూటిపోటి మాటలు అనడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల సంఖ్య పెరిగింది.
ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ ఇవే..
కొత్త సంవత్సర సంబరాలకు ప్రపంచం సిద్ధమవుతోంది. 2026 నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఘనంగా వేడుకలు చేసుకునేందుకు జనమంతా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. 1. నెంబర్ వన్ రియో...ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్–ఎయిర్ నూతన సంవత్సర వేడుకగా కోపకబానా బీచ్ వేడుకలతో రియో బీచ్ నంబర్ 1 స్థానాన్ని పొందింది. బ్రెజిల్ దేశపు ఈ ప్రపంచ ప్రసిద్ధ బీచ్‌కు ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తుతారు. అద్భుతమైన రీతిలో 12–15 నిమిషాల బాణసంచా ప్రదర్శన, ప్రత్యక్ష కచేరీలు, సాంబా ప్రదర్శనలు రియోలో అర్ధరాత్రిని కూడా కాంతులీనేలా చేస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి సముద్ర తీర ఆచారాలు ఇక్కడి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో ఒకటి ఏడు అలలపై దూకే ఆధ్యాత్మిక చర్య, ప్రతి ఒక్కటి రాబోయే సంవత్సరం కోసం ఒక కోరికను సూచిస్తుంది. ఆధ్యాత్మికత, ఆధునికతలను మిళితం చేస్తూ, రియో వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది.2. ట‘పాస్’లతో... సిడ్నీ..ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాణసంచా ప్రదర్శనను వీక్షించడానికి 1.6 మిలియన్లకు పైగా సందర్శకులు హార్బర్ వద్ద బారులు తీరుతారు. నగరంలోని డబుల్ బాణసంచా ప్రదర్శనలు – కుటుంబాల కోసం రాత్రి 9 గంటల ప్రారంభ ప్రదర్శన గ్రాండ్ మిడ్నైట్ బాణసంచా ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. హార్బర్ క్రూయిజ్‌ల నుంచి లూనా పార్క్‌లోని థీమ్–పార్క్ పార్టీల వరకు, సిడ్నీ ప్రపంచ స్థాయి నూతన సంవత్సర వేడుకను అందిస్తుంది.3. వెల్డన్.. లండన్..లండన్ నూతన సంవత్సర వేడుక సమయానికి లండన్ (London) నుంచి బాణసంచా మెరుపుల్ని చూడటానికి థేమ్స్ నది వెంబడి 100,000 మందికి పైగా పోగవుతారు. అర్ధరాత్రి దాటి, వేడుక నది క్రూయిజ్‌లు, రూఫ్‌టాప్ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకారులను కలిగి ఉన్న ఐకానిక్ లండన్ న్యూ ఇయర్ డే పరేడ్‌తో కొనసాగుతుంది.4. హాయ్.. దుబాయ్..ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక నూతన సంవత్సర వేడుకలలో ఒకటిగా దుబాయ్ (Dubai) నాల్గవ స్థానంలో నిలిచింది. సింక్రొనైజ్ చేయబడిన పైరోటెక్నిక్‌లు, లేజర్ ప్రొజెక్షన్లు డ్రోన్ ప్రదర్శనలకు బుర్జ్ ఖలీఫా ఒక పెద్ద వేదికగా మారుతుంది. ఆకర్షణీయమైన రూఫ్‌టాప్ పార్టీల నుంచి లగ్జరీ హోటళ్లలో గ్రాండ్ డైనింగ్ అనుభవాల వరకు, దుబాయ్ అత్యాధునిక వినోదాన్ని సాంస్కృతిక సౌరభాలతో మిళితం చేస్తుంది నూతన సంవత్సరానికి విలాసవంతమైన ప్రారంభాన్ని కోరుకునే పర్యాటకులకు ఇది మొదటి ఎంపికగా మారింది.5. ప్యార్ హుషార్.. పారిస్యూరప్లోని అత్యంత సొగసైన నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటిగా ఫ్రాన్స్‌లోని పారిస్ (Paris) ప్రకాశిస్తూనే ఉంది. లైటింగ్ డిస్ప్లేలు, అద్భుతమైన విందులు నదీతీర ఉత్సవాల్లో పాల్గొనడానికి దాదాపు పది లక్షల మంది సందర్శకులు చాంప్స్–ఎలిసీస్, ఐఫిల్ టవర్ సీన్ చుట్టూ గుమిగూడతారు. ఫ్రెంచ్ సంప్రదాయమైన రెవిల్లాన్ విందులు – షాంపైన్ పొంగులు, క్లాసిక్ ఫ్రెంచ్ విందులు ఇక్కడి వేడుకకు గొప్ప వైభవాన్ని జోడిస్తాయి.6. న్యూయార్క్.. ఓ బెంచ్ మార్క్..ఈ జాబితాలో అమెరికా నగరం న్యూయార్క్ (New York) ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టీవీక్షణ పొందిన నూతన సంవత్సర కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కచేరీలు, ఐకానిక్ వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్ బాల్ అవరోహణ కోసం పది లక్షలకు పైగా సందర్శకులు స్క్వేర్ను చుట్టుముడతారు. సెంట్రల్ పార్క్ న్యూయార్క్ హార్బర్ అంతటా బాణసంచా వేడుకలు సందడి చేస్తాయి, రూఫ్‌టాప్ పార్టీల నుండి జాజ్ క్లబ్‌ల వరకు ప్రతీ ఒక్కరి అభిరుచినీ సంతృప్తి పరిచే ఈవెంట్స్ ఉంటాయి.7. ‘బాత్’ బెస్ట్.. బుడాపెస్ట్..హంగేరీ దేశంలోని ప్రధాన నగరమైన బుడాపెస్ట్‌లో తనకే ప్రత్యేకమైన థర్మల్ బాత్ పార్టీలు ఓ హైలెట్. అలాగే ప్రకాశవంతమైన డానుబే నది క్రూయిజ్‌లు వీధి ఉత్సవాలతో నూతన సంవత్సరపు రోజున ఈ నగరం చరిత్ర, నైట్ లైఫ్, వెల్నెస్ను మిళితం చేస్తుంది. బార్ల నుంచి స్పా రేవ్ల వరకు, బుడాపెస్ట్ ఒక ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన వేడుకను అందిస్తుంది, ఇది పర్యాటకులు తన దగ్గరకు ప్రతి సంవత్సరం తిరిగి వచ్చేలా చేస్తుంది.8. కల్చరల్ మార్గ్.. ఎడిన్ బర్గ్..ఎడిన్‌బర్గ్‌లోని హాగ్మనే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలలో ఒకటి, మండే టార్చ్‌లైట్ ఊరేగింపు, సీలిడ్ నృత్యం, సాంప్రదాయ స్కాటిష్ సంగీతం ఎడిన్బర్గ్ కోటపై అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. సంస్కృతి, శతాబ్దాల నాటి సంప్రదాయాలతో జరిగే ఈ మూడు రోజుల పండుగ మొత్తం నగరాన్ని సందడిగా మారుస్తుంది. ఇక్కడ వారసత్వం, సమాజం పండుగ స్ఫూర్తి ప్రధానంగా కలబోసి ఉంటాయి.9. భళా.. బాలిఇండోనేసియాలోని బాలి ఉష్ణమండల సౌందర్యం విద్యుదీకరణ శక్తిని మేళవిస్తూ నూతన సంవత్సర వేడుకను (New Year Celebration) అందిస్తుంది. బీచ్ పార్టీలు, నియాన్–లైట్ క్లబ్‌లు, ఆధ్యాత్మిక ఆలయ ఆచారాలు తాటి చెట్ల నీడన బాణసంచా కాల్చడం వంటివి ఆకట్టుకుంటాయి. ఉలువాటులోని కొండ అంచున ఉన్న క్లబ్లో నృత్యం చేస్తున్నా లేదా ప్రశాంతమైన వేడుకలో పాల్గొంటున్నా, బాలి మరపురాని రాత్రి జీవితం ప్రపంచవ్యాప్త ఎంపికగా నిలిచింది.10. రొమాంటిక్‌గా ఉన్నా.. వియన్నా..ఆస్ట్రియా దేశంలోని వియన్నా(Vienna) రొమాంటిక్ పర్యాటకులకు చిరునామాగా నిలుస్తుంది. అక్కడ ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలో నగరాన్ని శాస్త్రీయ కచేరీలు, పండుగ మార్కెట్లు, ఉల్లాసమైన డ్యాన్స్ ఫ్లోర్స్, గ్రాండ్ బాల్రూమ్ పార్టీలతో ఈ నగరం జోష్ నింపుతుంది. యూరోపియన్ సంస్కృతి, రొమాన్స్, గ్లామర్ కోరుకునే పర్యాటకుల ఎంపిక ఇది.చదవండి: 2025లో ఎక్కువ మంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!
ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్ హీరోహియిన్ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్నెస్ టిప్స్ షేర్ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారామె. ఈసారి అలానే ఆరోగ్యకరమైన రెసిపీతో ముందుకొచ్చారు. తాను చేసే రెసిపి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరిస్తూ..ఆ కర్రీ తయార చేసే విధానాన్ని తెలియజేశారామె. ఇంతకీ ఏంటా హెల్దీ రెసిపీ అంటే..సమీరా రెడ్డి కడుపుకి మేలు చేసే అరటికాండం పప్పు కూర తయారీ విధానాన్ని పంచుకున్నారు. అందుకోసం ఏమేమి పదార్థాలు కావాలంటే..అరటి కాండం-1(శుభ్రం చేసి, సన్నగా తరిగి నానబెట్టింది)కంది పప్పు లేదా పెసర పప్పు: ¼ కప్పుకరివేపాకు 1పసుపు టీ స్పూన్ఆవాలు టీ స్పూన్తాజా కొబ్బరి పేస్ట్-1కాశ్మీరీ మిరపకాయ-1జీలకర్ర- 1 టీస్పూన్ఉప్పు రుచికి సరిపడాతయారీ విధానం: ముందుగా అరటికాండం, పప్పు, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి. మొత్తం 6 విజల్స్ వచ్చాక కొబ్బరి పచ్చిమిర్చి,జీలకర్ర కలిపిని పేస్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, కాశ్మీరీ మిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. అంతేగాదు దీన్నితినడం వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు. అవేంటంటే..ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలసటను తగ్గించడంలో హెల్ప్ అవుతుందిహార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుందిప్రేగు ఆరోగ్యం, డిటాక్స్ కోసం అద్భుతమైనదికడుపు ఉబ్బరం, నీరు నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుందిబరువు నిర్వహణకు సహాయపడుతుందిరుతుక్రమ ఆరోగ్యానికి మంచిదిరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిజీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే పోస్ట్ చివరలో సమీరా ఉడికించిన తర్వాత ఆ అరటికాండం పోగులను తీసివేయాలని, అవి తినకూడదని, జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుందని హెచ్చిరించారు. అలాగే ఇలాగే ఇలా తొలగించడం వల్ల కూర మృదువుగా, మెత్తగా ఉండి సులభంగా తినేయగలుగుతామని కూడా అన్నారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) (చదవండి: తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! ఆ తర్వాత..)
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా..
అంతర్జాతీయం
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్‌లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్‌కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలను ఆ దేశం పంపిస్తోంది. ఇప్పటికే 2 లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరపడంతో నార్త్ కొరియాలోనే కాదు.. దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతను పెంచుతోంది. డిసెంబర్ 28న పసుపు సముద్రంలో జరిగిన క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ స్వయంగా పరిశీలించడం అనుమానాలను బల పరుస్తోంది. నార్త్ కొరియా చుట్టూ అమెరికా బలగాలతో పాటు సౌత్ కొరియాకు చెందిన బలగాలు ఇప్పటికే మోహరించి ఉండటంతో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2 గంటల పాటు సాగిన క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిశీలించడమే కాకుండా వాటి లక్ష్యాన్ని అవి ఛేదించగలుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు వెల్లడించారు. క్షిపణుల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ జోలికి వస్తే అమెరికాతో కలిసి ఎదురొడ్డుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన కిమ్ మాత్రం... యుద్ధానికోసం కాదని... క్షిపణుల పనితీరును పరిశీలించడం, దేశ ఆత్మరక్షణ నిమిత్తమే ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం గమనార్హం.అయినా అప్రమత్తమైన దక్షిణ కొరియా... కొరియా చుట్టూ మోహరించి ఉండటాన్ని గమనిస్తే ఏ క్షణమైన యుద్ధానికి సై అనే ప్రమాదం లేకపోలేదు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు క్షిపణులు 2 గంటల పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని... ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో క్షిపణి ప్రయోగం నుండి హిట్ టార్గెట్ వరకు వీడియోలను ఈ క్షిపణి పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా క్షిపణి పరీక్షను ధృవీకరించారు.నార్త్ కొరియా చర్యలతో మరో వైపు దక్షిణ కొరియా కూడా తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. గత ఆదివారం ఉదయం 8 గంటలకు ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ ప్రాంతంలో అనేక క్రూయిజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించినట్లు సౌత్ కొరియా అధికారులు గమనించినట్లు చెప్పారు. ఒకవేళ నార్త్ కొరియా తోకాడిస్తై అమెరికాతో కలిసి తాము కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని సైనిక సన్నాహాలు చేశామని తెలిపింది. ఉత్తర కొరియా చేసే ఎలాంటి చర్యనైనా తిప్పి కొడతామని కూడా సౌత్ కొరియా హెచ్చరింది. ఉత్తర కొరియా అణ్వాయుధంతో నడిచే జలాంతర్గామిని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నట్లు కూడా అంతకుముందు వెల్లడించింది.
ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్‌క్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్‌తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.ఖలీదా జియా ప్రస్థానం1945లో అవిభక్త భారత్‌లోని పశ్చిమ బెంగాల్లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్‌తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు) జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. కాగా బీఎన్పీ పార్టీ భారత్‌కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది.
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్లోని స్లోవియన్స్కీలో రష్యా జరిపిన షెల్లింగ్‌లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్‌లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతిజెలెన్స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్కి, మరియు లుహాన్స్కీలను కలిగి ఉన్న డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్స్కీ అన్నారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్‌బాస్‌లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం
జాతీయం
ఇకపై వాదనలకు ‘టైం’ లిమిట్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు గంటల తరబడి వాదనలు వినిపించే సంప్రదాయానికి స్వస్తి పలకనుంది. కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు, సామాన్యుడికి సత్వర న్యాయం అందించే దిశగా సుప్రీంకోర్టు సరికొత్త విధానాన్ని (ఎస్ఓపీ) అమల్లోకి తెచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు కీలక సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం.. ఇకపై న్యాయవాదులు తమ వాదనలను నిర్ణీత సమయంలోపే ముగించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల రోజుకు ఎక్కువ కేసులను విచారించే వీలుంటుందని, తద్వారా పెండింగ్ భారం తగ్గి సత్వర న్యాయం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. కొత్త నిబంధనలు ఇవే.. 1. ముందుగానే టైం చెప్పాలి: కేసు విచారణకు హాజరయ్యే సీనియర్ న్యాయవాదులు తాము వాదనలు వినిపించడానికి ఎంత సమయం తీసుకుంటారో ముందే స్పష్టం చేయాలి. విచారణ తేదీకి కనీసం ఒక రోజు ముందుగా సుప్రీంకోర్టు ఆన్లైన్ అప్పియరెన్స్ పోర్టల్ ద్వారా ఈ వివరాలను నమోదు చేయాలి. 2. ఐదు పేజీల నోట్స్ తప్పనిసరి: కేవలం మౌఖిక వాదనలే కాకుండా.. విచారణకు మూడు రోజుల ముందే న్యాయవాదులు తమ వాదనలకు సంబంధించిన సంక్షిప్త లిఖితపూర్వక నోట్స్ సమర్పించాలి. ఇది ఐదు పేజీలకు మించకూడదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ ద్వారా గానీ, నోడల్ కౌన్సిల్ ద్వారా గానీ వీటిని ఫైల్ చేయాలి. అలాగే ప్రతివాదులకు కూడా ఈ కాపీని అందజేయాలి. 3. గడువులోపే ముగించాలి: తాము ముందుగా నిర్ణయించుకున్న లేదా కోర్టు కేటాయించిన సమయంలోపే లాయర్లు తమ వాదనలను కచి్చతంగా ముగించాలి. అనవసర సాగదీతకు తావివ్వకుండా చూడాలి.
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్‌వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్‌కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్‌సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్‌సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్‌ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్‌లైన్‌లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్‌కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్‌గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్‌లోని వాంగ్‌ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్‌ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్‌లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్‌ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ సిరీస్‌లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్‌బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్‌లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్‌కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్‌ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్‌తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్‌ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్‌కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్‌లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్‌లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్‌నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్‌గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్‌లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్‌ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్‌లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్‌పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్‌లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025
శబరిమల బంగారం మాయం కేసు: మాజీ మంత్రి పాత్రపై విచారణ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది. గత శనివారం కడకంపల్లి సురేంద్రన్ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది. అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. కేసు వివరాలుశబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.ఈ కేసును విచారించేందుకు సిట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది.
ఎన్ఆర్ఐ
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని వైఎస్సార్సీపీ మెల్బోర్న్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగులో పలువురు సీనియర్ పార్టీ నాయకులు సాకే శైలజానాథ్,ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకులు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ప్రోగ్రామ్‌లో సీనియర్ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని అన్నారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతిచ్చి తీర్చుకుంటామని తెలియజేశారు. సాకే శైలజానాథ్, ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు.(చదవండి: అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్)
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు.
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు
క్రైమ్
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హిందువు హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడం ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, మతపరమైన వేధింపులు కలవరపెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హిందువు హత్యకు గురయ్యాడు.మైమెన్సింగ్లోని భలుకాలో బజేంద్ర బిశ్వాస్ (40) అనే అన్సార్ (రక్షణ కమిటీ) సభ్యుడిని సహోద్యోగి కాల్చి చంపాడు.ఈ సంఘటనలో హంతకుడు అన్సార్ సభ్యుడు నోమన్ మియాను అరెస్టు చేశారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. బజేంద్ర బిస్వాస్ ,నోమన్ మియా ఆవరణలో కలిసి కూర్చున్నప్పుడు నోమన్ వద్ద ఉన్న తుపాకీ పేలిందనే కథనాలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడలో దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫ్యాక్టరీ సిబ్బంది బజేంద్ర బిస్వాస్‌ను భాలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్‌కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్చార్జ్ జాహిదుల్ ఇస్లాం ఈ సంఘటనను ధృవీకరించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మైమెన్సింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మార్చురీకి పంపారు.కాగా బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద రాజ్యంగా మారుతోంది. ఈ హత్యాకాండపై సర్వత్రా ఆందోళన వ్యకమవుతోంది. బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది నిదర్శమంటూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి
మనుషులుగా మానవత్వాన్నిమంట గలిపారు. కనీస వృత్తి ధర్మాన్ని పాటించ లేదు. మానవ విలువల్ని మరిచిపోయిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుషం. బాధితుడు 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, రైల్వేస్‌లో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆ చుట్టుపక్కల ఆయనకు మంచి వ్యక్తిగా పేరుంది. 2016లో భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు. దీంతో తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అన్నివిధాలా తోడు నీడగా ఉంటారనే ఉద్దేశంతో రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి అనే భార్యాభర్తల్ని కేర్టేకర్లుగా నియమించుకుని, ఇంట్లోనే చోటిచ్చారు ఓం ప్రకాష్. అయితే వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఈ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి. దీంతో ఆహారం లేక ఓం ప్రకాష్ చిక్కిశల్యమై పోయి ప్రాణాలు విడిచారు.ఓంప్రకాష్ మరణం గురించి కుటుంబానికి సమాచారం అందించడంతో ఈ జంట దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరిన బంధువులు అక్కడి దృశ్యాలను షాక్ అయ్యారు. ఇక కుమార్తె రష్మి చీకటి గదిలో నగ్నంగా, స్పృహ లేకుండా కనిపించింది. దాదాపు చావు అంచులకు చేరిపోయింది. తన అన్న, కుమార్తె రష్మిని గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిమితం చేసి, పైభాగంలో వారు హాయిగా జీవిస్తున్నారని ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ ఆరోపించారు. బంధువులు ఎవరొచ్చినా, కలవడానికి ఇష్టం పడటం లేదంటూ తిప్పి పంపించేవారని తెలిపారు. ఓం ప్రకాష్ మర్యాదస్తుడనీ, చాలా గౌరవప్రద వ్యక్తి అంటూ ఆయన మరణంపై పొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆకలితో రష్మి దేహం శుష్కించిపోయిందనీ, ఒంటిమీద కొంచెం కూడా కండలేక ఎముకల గూడులా ఉందని బంధువు పుష్ప సింగ్ రాథోడ్ తెలిపారు. రష్మి ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది, బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఓంప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్‌మార్టం, ఇతర వైద్య, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
బెంగళూరు : బెంగళూరులోని కుండలహళ్లిలో సోమవారం సాయంత్రం పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగం దుర్మరణం పాలయ్యాడు. ఏడు అంతస్తులు, 43 గదులున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.చనిపోయిన వ్యక్తిని బళ్లారికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. ఇతను ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు సెవెన్ హిల్స్ సాయి కో-లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్ట్‌లో ఉంటున్న అరవింద్. టెర్రస్‌పై ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో పొగను గమనించాడు. ఏం జరిగిందో చూద్దాం అని కిందికి వచ్చిన సమయంలో గ్యాస్ పేలుడు సంబంధించిందని దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్‌ఫీల్డ్) కె పరశురామ్ వెల్లడించారు. పోలీసుల ప్రకారం కమర్షియల్-గ్రేడ్ గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు.సమాచారం అందించిన సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిలో ఒకరు హాస్టల్ పని చేస్తున్నవారు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు. కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సివి గోయెల్ ప్రస్తుతం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం
వీడియోలు
KSR COMMENT : రాజకీయ అవకాశవాది..!
AP: వాట్సాప్ గవర్నెన్స్ కారణంగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
London : సింగపూర్, దుబాయ్ లలో చంద్రబాబు పెట్టుబడులనే విమర్శలు
TTD: సామాన్య భక్తులకు షాక్ కొండకు రాకుండా...!
Simhachalam Prasadam: విచారణ వదిలేసి భక్తులపై కేసు
KSR: మీకు నిజంగా గట్స్ ఉంటే? హోంమంత్రికి ఓపెన్ ఛాలెంజ్
హైదరాబాద్ హై అలర్ట్ న్యూ ఇయర్ నైట్ జర భద్రం!
ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు.. సినీ పెద్దలను ఇరికించే ప్రయత్నం
రాయచోటిలో నిరసన జ్వాలలు.. YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
MLA బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్న చెన్నై పోలీసులు

